Saturday, 11 April 2026

Blog

జోగులాంబ గద్వాల

మహిళకు న్యూడ్ కాల్స్ వేధింపులు.

జోగులాంబ గద్వాల జిల్లా ఉమ్మడి ఇటిక్యాల మండలంలో ఘటన. మహిళా బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఘటనలో అలంపూర్ మండలానికి చెందిన ముగ్గురు యువకుల పాత్ర, యువకులు ఓ ప్రధాన పార్టీకి చెందినట్టు సమాచారం. విషయాన్ని గుట్టుగా ఉంచి విచారణ చేపట్టిన పోలీసులు…పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జోగులాంబ గద్వాల

100 పడక ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించండి.

అలంపూర్ (పున్నమి ప్రతినిధి) :- హైదరాబాదులోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ని శనివారం కలిసి అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్ చౌరస్తా వంద పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిచాలని సిబ్బందిని నియమించాలని వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంద పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని ఆస్పత్రిలో సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిబ్బందిని వసతులు కల్పించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు.

కాకినాడ

కాండ్రకోట గ్రామంలో ఏలేరు రెగ్యులేటర్ వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న తహశీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి.

పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10 పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఏలేరు రెగ్యులేటర్ వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తాసిల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి కాండ్రకోట గ్రామంలో ఏలేరు రెగ్యులేటర్ పరిశీలించి వరద ఉధృతి ఏ మేరకు ఉందో ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. గంట గంటకు నీటి ప్రవాహం పెరగడంతో కాండ్రకోట గ్రామం నుంచి కట్టమూరు , జె.తిమ్మాపురం తో పాటు రైతులు పొలాల కెళ్లే పాత రన్ వే పై నుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న నీరు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు తీసుకున్నామని చెప్పారు, రైతులు పశువుల విషయం లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె వెల్లడించారు.తహాశీల్దార్ వెంట ఇరిగేషన్ ఏఈ నిమ్మకాయల శ్రీనివాసరావు ఉన్నారు.

కాకినాడ

మొంథా తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టిన పెద్దాపురం తహాశీల్దార్ వెంకటలక్ష్మి.

పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10 మొంథా తుపాను నేపథ్యంలో పెద్దాపురం పట్టణ, మండలం పరిధిలోని రెవెన్యూ శాఖ ముందస్తు చర్యలు చేపట్టినట్లు తహాశీల్దార్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజల భద్రతే ద్యేయంగా రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మొంథా తుపాను కారణంగా ఏర్పడే ప్రమాదాలు, నష్టాలపై టాంటాం వేయించడం జరిగిందని తెలిపారు.ముందస్తుగా ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామంలో పాఠశాల భవనాలను ఆధీనం లోనికి తీసుకున్నట్లు తహాశీల్దార్ వెంకట లక్ష్మీ చెప్పారు.

జనగాం

ఇక నుంచి బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు

స్టేషన్గన్పూర్ ( పున్నమి ప్రతినిధి) ▪️ *నవంబర్ 1 నుంచి అమలు* బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్న వారికి ఇప్పటిదాకా ఒక్కరినే నామినీగా పేర్కొనే అవకాశం ఉండేది. కానీ, ఇకపై నలుగురిని నామినీగా ఉంచే వీలుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు నవంబరు 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. మన దేశంలోని బ్యాంకుల్లో దాదాపు రూ.67,000 కోట్లకు పైగా డబ్బు ఎవరూ వెనక్కి తీసుకోకుండా అలా ఉండిపోయింది. ఖాతాదారుడు మరణించిన తర్వాత, ఉన్న ఒక్క నామినీ అందుబాటులో లేకపోవడం, లేదా క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగు తోంది. దీంతో కుటుంబ సభ్యులు, డబ్బులు వెనక్కి తీసుకోవడం కోసం పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇవి బ్యాంకు పొదుపు ఖాతా, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్ ఖాతాలతో పాటు, లాకర్లకూ వర్తిస్తాయి. *ఒకేసారి నలుగురి నామినేషన్:* మీరు మీ ఖాతాకు ఒకేసారి నలుగురిని నామినీలుగా పేర్కొన వచ్చు. అంతేకాదు, ఎవరికి ఎంత వాటా (శాతం) వెళ్లాలి అన్నదీ మీరే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు జీవిత భాగస్వామికి 50 శాతం, మిగతాది పిల్లలకు అన్నట్లు పంపకాలు చేయొచ్చు. *ఒకరి తర్వాత మరొకరు:* నలుగురు నామినీలను వరుస క్రమంలోనూ ఏర్పాటు చేయొచ్చు. అంటే, మొదటి నామినీ అందుబాటులో లేకపోతే, రెండో నామినీకి అర్హత వస్తుంది. వారూ లేకపోతే మూడో వారికి…ఇలా ఒకరి తర్వాత మరొకరికి అవకాశం ఉంటుంది. డిపాజిట్ ఖాతాలకు పైన చెప్పిన రెండు పద్ధతుల్లో మీకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. *నామినీ పేర్లను నమోదు చేసేటప్పుడు, వారి ఫోన్ నంబరు, ఇ-మెయిల్ ఐడీ వంటి వివరాలూ ఇవ్వాలి. దీనివల్ల అవసరమైన సందర్భంలో బ్యాంకు వారిని సులభంగా సంప్రదించగలదు.*

జనగాం

ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహణ*

జై వాసవి జై జై వాసవి జై ఆర్యవైశ్య జై జై ఆర్యవైశ్య స్టేషన్గన్పూర్ (పున్నమి ప్రతినిధి) జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఈరోజు (26-10-2025, ఆదివారం) జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ద్వితీయ కార్యవర్గ సమావేశం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ — నేను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం కావస్తున్న సందర్భంగా, మా మహాసభ పునఃజీవితమై జిల్లా వ్యాప్తంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో విశేష కార్యకలాపాలు చేపట్టడం గర్వకారణ అని తెలిపారు. *గతంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 900 సభ్యత్వాలను 2500 సభ్యత్వాలుగా పెంచడమే కాకుండా, వినాయక చవితి సందర్భంగా 1500 మట్టి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం,* *బతుకమ్మ పండుగను జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో 200 మందితో ఘనంగా నిర్వహించడం*, *మరియు జిల్లా వ్యాప్తంగా 60 మంది ఉత్తమ ఆర్యవైశ్య ఉపాధ్యాయులను సన్మానించడం వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని వివరించారు.* అదేవిధంగా ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన OC JAC సమావేశంలో జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ఐక్యతను ప్రతిబింబించే విధంగా పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను వివరించారు — *రాబోయే రోజుల్లో పేద ఆర్యవైశ్య బంధువులకు పుస్తెమట్టలు, విద్య, వైద్యం వంటి రంగాల్లో సహాయం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం*. *ఈ కార్తీకమాసంలో జిల్లా స్థాయి వనభోజనాలు నిర్వహించి, బంధుత్వ బంధాలను మరింత బలపరచాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు.* ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి మండల అధ్యక్షులు తుమ్మలపల్లి సోమేశ్వర్ గారు, జిల్లా మరియు మండల స్థాయి కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగం ప్రతినిధులు, యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అమరావతి

తుపాన్’ సమయంలో వ్యాధుల నియంత్రణకు మూడు అంచెల వ్యూహం!

‘తుపాన్’ సమయంలో వ్యాధుల నియంత్రణకు మూడు అంచెల వ్యూహం! *సంసిద్ధత, ప్రతిస్పందన, ఇతర చర్యలపై కొత్త విధానాలు మంత్రి శ్రీ సత్యకుమార్ అదేశాల మేరకు రూపొందించిన వైద్య ఆరోగ్య శాఖ తుపాన్ వంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొత్తగా ప్రామాణిక నిర్వహణ విధానాలు (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్) రూపొందించింది. తుపాన్ రాకముందు వైద్య సేవలు అందించేందుకు ఆసునతులవారీగా సంసిద్ధత ఎలా ఉండాలి? వచ్చినప్పుడు వైద్యులు ఎలా స్పందించాలి? అనంతరం వ్యాధులు ప్రజలకుండా, పునరావాస, ఇతర చర్యలు జిల్లా స్దాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తీసుకోవాలన్న దాని గురించి 7 పేజీల్లో వైద్య శాఖ వివరించింది. రాష్ట్రానికి మొంథా’ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్వ ఉత్తర్వులను సమీక్షించి, డిజాస్టర్ మేనేజ్మెంటు (వివత్తు నిర్వహణ), వాతావరణ కేంద్రం అధికారులతో సంప్రదించి రూపొందించిన ప్రామాణిక నిర్వహణ విదానాల్లో.. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ, జిల్లా, భోదనాసుపత్రుల వరకు సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలు వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. మంత్రి శ్రీ సత్యకుమార్ ఆమోదం మేరకు చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ వీటిని జిల్లాలకు వైద్య ఆరోగ్య శాఖ పంపింది. వీటిని తప్పకుండా అనుసరించాలని జిల్లా అధికారులకు మంత్రి సత్యకుమార్ స్పష్టంచేశారు. పీహెచ్సీల్లో యాంటీ స్నేక్ వీనమ్, ర్యాబిస్ వ్యాక్సిన్లు సిద్ధంగా ఉండాలి ఆసుపత్రుల్లో అవసరాలకు సరిపడా యాంటీ బయాటిక్ మందులు, యాంటి స్నేక్ వీనమ్, 100 యాంటీ ర్యాబిస్ డోన్ లు నిల్వ ఉంచుకోవాలని తెలిపింది. ముఖ్యoగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ స్నేక్ వీనమ్ 30 వయల్స్ కనీసం 500 మందికి సరిపడా యాంటీ బయాటిక్ మందులు, ఓఆర్ఎస్ ఫ్లూయడ్స్ 500 ప్యాకెట్లు/200 బాటిల్స్ చొప్పున ఉండాలని స్పష్టంచేసింది. అనుపత్రుల సామర్థ్యానికి తగ్గట్లు అనుసరించాల్సిన విధానాల గురించి కొత్త ఎస్ఓపీలో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అలాగే… బాధిత ప్రాంతాల్లో వైద్య శిబిరాల నిర్వహణ, అంటు వ్యాధులు ప్రబలకుండా, నీరు కలుషితం కాకుండా, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఆయా శాఖలతో సమన్వయం ఎలా ఉండాలన్న దానిపై కూడా ప్రామాణిక విధివిధానాల్లో వివరించింది. రాష్ట్ర నోడల్ ఆఫీసర్ గా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై పర్యవేక్షణ, సమన్వయ అధికారిగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి వ్యవహరిస్తారు. రాష్ట్ర సర్వైలెన్స్ ఆఫీసర్ అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎపిడమిక్ సెల్ 24 గంటలపాటు పనిచేయాలి. తుపాన్ సమయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విపత్తు నిర్వహణ శాఖ, ఇతర శాఖల అధికారులతో రాష్ట్ర సెల్ లో ఉన్న సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి తెలుసుకుంటూ సదరు శాఖలతో సమన్వయంచేస్తూ బాధితులకు వైద్యసేవలను చేరువ వేయాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ తో ‘డిస్ట్రిక్ట్ ఎపిడమిక్ కంట్రోల్ రూం అనుసంధానం జరగాలి. భారతీయ వాతావరణ శాఖ నుంచి వచ్చే తుపాన్ హెచ్చరికలకు అనుగుణంగా ఎపిడమిక్ కేంద్రాల్లో ఉండే వారు తమ పరిధిలోని వారితో సంప్రదిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలి. వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి అసుపత్రుల్లో వైద్యులు, ఇతర పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఆయా ప్రాంతాల్లోని గర్భిణులు, వృద్దులు, అంగవైకల్యం, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కలిగిన వారి వివరాలు సిద్ధం చేసుకోవాలి. తుపాన్ కు, ప్రసవ అంచనా తేదీకి మధ్య 15రోజుల వ్యవధి కలిగిన గర్భిణుల వివరాలు సిద్ధంచేసుకోవాలి. తుపాన్ హెచ్చరికలకు అనుగుణంగా కనీసం 2 రోజుల ముందు దగ్గర్లోని ఆసుపత్రులకు వీరిని తరలించేలా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకోవాలి. ప్రతి 50వేల జనాభాకు ఒక ఐడీఎస్పీ (సర్వైలెన్స్) అధికారిని అందుబాబులో ఉంచాలి అనుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు, పారా మెడికల్, అంబులెన్సుల సిబ్బందిని సమన్వయం చేసుకునేలా వాట్సన్ గ్రూపులు ఏర్పాట్లు చేసుకోవాలి. సీహెచ్ఓలు, ఆశా వర్కర్లు, ఎ.ఎన్.ఎం.లు ప్రజల్లో ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. మంచినీరు, పారిశుధ్యం, ప్రాథమిక చికిత్సల గురించి వివరించాలి ‘సైక్లోన్ షెల్టర్లలో ఏర్పాటుచేసే వైద్య శిబిరాల్లో ఒక వైద్యుడు, సీనియర్ నర్సు, కనీసం ఇద్దరు సారా మెడికల్ సిబ్బంది ఉండాలి. 108, 104, 102 అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇంధన సమస్య తలెత్తకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. తుపాన్ బాధిత ప్రాంతాల్లోని వారిని అవసరాలకు తగ్గట్లు సమీపంలోని సీహెచ్సీ వంటి ఆసుపత్రులకు తరలించేందుకు వీటిని రెడీ చేయాలి. వైద్య సేవలు వెంటనే అందించేలా సిద్ధంగా ఉండాలి తుపాన్ సమయంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలి. బాధిత ప్రాంతాలను గుర్తించి రోగులకు వైద్య సేవలు అందించాలి. సైక్లోన్ షెల్టర్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలి. ప్రతి 6 గంటలకు క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చిన వివరాలకు అనుగుణంగా వైద్య సేవలు కొనసాగాలి. వరదలు సంభవించే ప్రాంతాల్లో బోటు క్లినిక్కులను సైతం సిద్ధంచేయాలి. మత్స్య శాఖ వారితో సంప్రదించి ఇందుకు సంబంధించిన ఏర్పాటు చేసుకోవాలి. తుఫాన్ కారణంగా నీరు కలుషితమయ్యే అవకాశాలున్నందున క్లోరిన్ మాత్రలు, జీచింగ్ పౌడరును స్థానికులకు అందించాలి. పంచాయతీ, గ్రామీణ నీటి పారుదల శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియ జరగాలి.. విద్యుత్తు సరఫరాకు అవరోధం ఏర్పడితే వెంటనే ఆసుపత్రుల్లో జనరేటర్ వినియోగించేలా ముందస్తు చర్యలు ఉండాలి. కనీసం 3 రోజుల పాటు జనరేటర్ వినియోగానికి తగ్గట్లు ఇంధనం నిల్వలో ఉండాలి. ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (ప్రతి స్పందన)లు సిద్ధంగా ఉండాలి. జిల్లా కేంద్రం మంచి వచ్చే అదేశాలకు అనుగుణంగా అవసరమైన ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ టీంలు వెళ్లాలి. డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తిచెందకుండా తగిన చర్యలు తీసుకోవాలి.

విశాఖపట్నం

గోవాడ సుగర్స్ రైతులు, కార్మికులను నమ్మించి నట్టేట ముంచిన కూటమి సర్కారు …. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

గోవాడ సుగర్స్ రైతులు, కార్మికులను నమ్మించి నట్టేట ముంచిన కూటమి సర్కారు …. – క్రషింగ్ పై చేతులెత్తేసిన పాలకులు … ఫ్యాక్టరీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు – గోవాడ సుగర్స్ పరిరక్షణకు కార్యాచరణ … – మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ … చోడవరం : అక్టోబర్ 26, సహకార రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న ది.చోడవరం కో ఆపరేటివ్ (గోవాడ) సుగర్స్ ను అగ్రప్రధాన నడుపుతామంటూ రైతాంగాన్ని, కార్మికులను నమ్మించిన కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి గుడివాడ మాట్లాడుతూ ఈ ఏడాది చెరకు గానుగాట జరపలేమంటూ చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం కర్షకులు, కార్మికుల బకాయిలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. సుమారు 60 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన గోవాడ చక్కెర కర్మాగారాన్ని అగ్రగామిగా నిలిపిన చెరకు రైతు బతుకు…. నేడు అధికారులు, పాలకుల దుశ్చర్యలతో చేదెక్కిందన్నారు. కర్షకులు, కార్మికులకు సుమారు 35 కోట్లు రూపాయలు బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో గోవాడ సుగర్స్ పరిధిలో లక్షలాది కార్మిక, కర్షక కుటుంబాలను కూటమి సర్కార్ మోసం చేసిందన్నారు. బకాయిలు చెల్లించని కూటమి పాలకులు చర్యలతో చెరుకు రైతులు, కార్మికుల బతుకులు మరింత భారం అయ్యయని ఆవేదన చెందుతున్నారు. అనకాపల్లి ఎంపీ, జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, బండారు లు షుగర్ ఫ్యాక్టరీకు పూర్వవైభవం తీసుకువచ్చి లాభాల బాట తీసుకొస్తామని, హామీలు ఇచ్చి, నేడు గోవాడ సుగర్స్ ను మరింత అధోగతి పాలు చేసారన్నారు. గోవాడ సుగర్స్ పరిరక్షణకు ఆఖ అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 2019-24 లో తమ ప్రభుత్వ హయాంలో గోవాడ సుగర్స్ కార్మికులు, కర్షకులను ఆదుకునేందుకు రూ. 89 కోట్లు గ్రాంట్ గా చెల్లించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన పై ఒంటెద్దు పోకడలా వుందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రస్తుతం జరుగుతున్న పి.పి.పి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతి చోట శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి, సంబంధిత అధికారులకు …. జరుగుతున్న అన్యాయాలపై, ప్రస్తుత వాతావరణ ప్రతికూలతల దృష్ట్యా వినతిపత్రాన్ని ఈ నెల 28న అందజేసేందుకు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ గాడి కాశమ్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏడువాక సత్యారావు, సీనియర్ నాయకులు వెంపలి ఆనంద్, పినబోయిన అప్పారావు యదవ్, వైఎస్ఆర్సిపి టౌన్ అధ్యక్షులు దేవరపల్లి వీర వెంకట సత్యనారాయణ (సత్య), జిల్లా యూత్ ప్రెసిడెంట్ పుల్లేటి వెంకటేష్, మండల యూత్ ప్రెసిడెంట్ పల్లా ధనాజీ, పల్లా నర్సింగరావు, బొడ్డేటి సూర్యనారాయణ, టౌన్ యూత్ ప్రెసిడెంట్ గూనూరు రాజు, మాజీ శివాలయం చైర్మన్ సత్యనారాయణ గునూరు, జంగం కార్పొరేషన్ డైరెక్టర్ అత్తిలి జగన్, బొడ్డు శ్రీరామమూర్తి, చిటికెల నాగేష్ వార్డ్ నెంబర్, దండిన వెంకట్రావు గారు మాజీ కోపరేటివ్ సొసైటీ చైర్మన్, వర్జుల ప్రకాష్ రావు, అన్నపూర్ణ, వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు అల్లాడ భవాని, బొగ్గు శ్యామలమ్మ, బొగ్గు చందు, సూర్య ప్రకాష్ ఎస్ పేట, కోటి వార్డు, సిహెచ్ బాబురావు, బొంతు రామకృష్ణ, అప్పారావు, నరసింహమూర్తి, ఓరుగంటి నెహ్రూ, గూనూరు రామచంద్ర నాయుడు, మూడెడ్ల శంకర్రావు, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, విశాఖపట్నం పున్నమి ప్రతినిధి+ ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో కదిలిన తీవ్రవాయుగుండం మరో 12 గంటల్లో నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుంది మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ప్రస్తుతానికి చెన్నైకి 770 కి.మీ, విశాఖపట్నంకి 820 కి.మీ, కాకినాడకి 810 కి.మీ దూరంలో కేంద్రీకృతం రేపు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, తూర్పు గోదావరి భారీ నుంచి అతిభారీ వర్షాలు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు బలమైన ఈదురుగాలులు వీస్తాయి ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

విశాఖపట్నం

అంత: రాష్ట్ర నిందితులు- దొంగిలించిన ఆస్తి స్వాధీనం

విశాఖపట్నం సిటీ పోలీస్ గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: గాజువాకలో ట్రక్ డ్రైవర్ హత్య నగదు, సెల్ ఫోన్ దొంగలించి పరారైన అంత: రాష్ట్ర నిందితులు- దొంగిలించిన ఆస్తి స్వాధీనం తేది:15.10.2025 న గాజువాక పోలీస్ స్టేషన్లో ఒక అసహజ మరణం కేసు నమోదు చేయబడింది. ఫిర్యాదుదారుడు నజీబ్ హుస్సేన్ తన సోదరుడు మిరాజ్ హుస్సేన్ (వయస్సు 35సం.లు), ట్రక్ డ్రైవర్, ఎస్.కె రోడ్ వేస్ సంస్థకు చెందినవాడు, బూకెల్ గ్రామం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నివాసి, తన ట్రక్ లోనే మృతి చెందినట్లు తెలిపాడు. ఆ ట్రక్ నంబరు CG-06HA-7988, ఆటోనగర్ రోడ్, రామా ఎంటర్ప్రైజెస్ ఎదురు, గాజువాక, విశాఖపట్నం వద్ద నిలిపివుండగా మృతదేహం గుర్తించబడింది. ఈ ఘటన 11.10.2025 నుండి 14.10.2025 మధ్య కాలంలో జరిగివుండవచ్చు అని, 15.10.2025 ఉదయం 11:00 గంటలకు పోలీసులకు నివేదించబడింది. ఫిర్యాదుదారుడు ఇచ్చిన పిర్యాదు మేరకు గాజువాక పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్:461/2025 సెక్షన్ ఆఫ్ లా 194 BNSS అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేయబడింది. అనంతరం దర్యాప్తు అధికారి అయిన ఎస్.ఐ. చి. హరికృష్ణ గారు సంఘటనా స్థలాన్ని సందర్శించి, సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించి, రక్తపు మరకలు కలిగిన షర్టు, క్లాత్ పీస్, విరిగిపోయిన పిడి గల ఇనుప రాడ్ వంటి సాక్ష్యాలు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం కింగ్ జార్జ్ హాస్పిటల్ మార్చురీ కి తరలించి, పోస్ట్మార్టం చేయించబడింది. దర్యాప్తులో భాగంగా మృతుని ఉపయోగించిన మొబైల్ ఫోన్ మరియు అతని కాల్ వివరాలు (CDR) పరిశీలించగా, ఆ మొబైల్ ఫోన్ సరైపాలి గ్రామం, మహాసముంద్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రాంతంలో ఉపయోగిస్తునట్లు గుర్తించబడింది. స్థానిక పోలీస్ సహాయంతో అనుమానితులు A1 ఇండ్రపాల్ @ ఇంద్ర సింగ్ రాజ్పుత్ (27 సం.లు), లారీ డ్రైవర్ మరియు A2 రతీ నాయక్ (25 సం.), లారీ క్లీనర్/పెంటర్ పని చేసే వ్యక్తి, ఇద్దరూ సరైపాలి నివాసులని నిర్ధారించబడింది. తేదీ 25.10.2025 న వీరిని సరైపాలి వద్ద అదుపులోకి తీసుకొని, విచారించిగా ఇద్దరు. నిందితులు ఇంద్రపాల్ మరియు రతీ నాయక్, మద్యం సేవించి లాభం కోసం ట్రక్ డ్రైవర్ మిరాజ్ను 13.10.2025 న హత్య చేసినట్లు అంగీకరించారు. అనంతరం చోరీ కాబడిన మృతుని యొక్క మొబైల్ ఫోన్ (Realme C67 5G) నిందితుడు A1 వద్ద నుండి తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. తేదీ 11.10.2025 న ఒడిశా రాష్ట్రంలోని రాయగడ బ్రిడ్జ్ వద్ద మిరాజ్ను కలుసుకుని, అతని ట్రక్ కేరడా చెక్ పోస్ట్ వద్ద ఎక్కారు. 13.10.2025 న గాజువాక ఆటోనగరికి చేరిన తరువాత ముగ్గురూ మద్యం సేవించారు. అనంతరం మిరాజ్ హుస్సైన్ దగ్గర కొంత నగదు వున్నట్లు గుర్తించి, ఆనగదు, మరియు మొబైలు ఫోన్ ని దొంగలించలనే వుద్దేశ్యంతో, వాటిని దొంగలించే క్రమంలో మృతిని తలపై ఇనుప రాడ్తో బలంగా కొట్టగా, మిరాజ్ హుస్సైన్ ఆక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత నిందితులు మృతిని దగ్గర వున్న ₹7,000 నగదు, ఒక రిస్టు వాచ్, మొబైల్ ఫోన్ తీసుకొని, ఆయుధాన్ని సమీపంలోని స్క్రాప్ యార్డ్లో దాచిపెట్టి, దువ్వాడ రైల్వే స్టేషన్ కి వెళ్ళి, ట్రైన్ లో పరారయ్యారు. విచారణలో A1 ఇంద్రపాల్, 10.10.2025 న ఒడిశా రాష్ట్రం సబలపూర్లో మరో వృద్ధుడిని హత్య చేసి ? 5,000 మరియు మొబైల్ దోచుకున్నట్లు కూడా అంగీకరించాడు. ఇద్దరు నిందితులకు సరైపాలి పోలీస్ స్టేషన్లో పూర్వ చరిత్రలు ఉన్నాయి: 1. Cr.No. 271/2022-U/s 397, 392 r/w 34 IPC ( ) 2. Cr.No. 142/2022-U/s 294, 323, 506 IPC ఇద్దరు నిందితులను 25.10.2025 రాత్రి 21:00 గంటలకు గాజువాక పోలీస్ స్టేషన్ వారు అరెస్ట్ చేసి, గౌరవకోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచి, రిమాండ్కు పంపించబడింది. నిందితులు వద్దస్వాధీనం చేసిన చోరీ సొత్తు మరియు హత్య కి ఉపయోగించిన ఆయుధాలు: మృతుడికి చెందిన Realme C67 5G మొబైల్ ఫోన్, ఇనుప రాడ్ (సంఘటన స్థలంలో స్వాధీనం). ఈ హత్య కేసును 10 రోజుల్లోనే ఛేదించినందుకు ఎస్.ఐ.చి. హరికృష్ణ గారు, PCs 1554, 3975, 1562, అలాగే CLUES మరియు RFSL బృందాలు చేసిన కృషి ప్రశంసనీయం. నిందితులను అరెస్ట్ చేసి విశాఖపట్నానికి తరలించే సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో స్థానిక పరిస్థితులు, పరిపాలనా ఇబ్బందులు ఎదురైన సందర్భంలో, శ్రీ శంకబ్రత బాగ్బీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం సిటీ, ఈ కేసు ను ఒక సవాలుగా స్వీకరించి, రెండు రాష్ట్రాల పోలీస్ విభాగాల మధ్య సమన్వయం, మార్గదర్శకత్వం, మరియు అద్భుతమైన మద్దతు అందించడం వలనే నిందితులను విజయవంతంగా విశాఖపట్నంకు రప్పించగలిగారు. ఈ కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం శ్రీ కె. శ్రీనివాసరావు గారికి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సౌత్ క్రైమ్) కి నియమించదమైనది. శ్రీ శ్రీ శంకబ్రత బాగ్బీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం సిటీ, ఈ అనుమానాస్పద మరణాన్ని “మర్డర్ ఫర్ గైన్” ను ఛేదించిన గాజువాక పోలీస్ బృందం పై ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే శ్రీ కె. పార్తసారథి గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గాజువాక, మరియు ఆయన బృందం చేసిన పరిశోధన ఫలితంగా, గాజువాక హత్య కేసుతో పాటు ఒడిశా రాష్ట్రం అట్టబారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గుర్తించలేని హత్య కేసు ను కూడా ఛేదించడ మైనది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.