Saturday, 11 April 2026

Blog

అమరావతి

అనకాపల్లి, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు మరియు ఎస్పీలతో హోం మంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్

అమరావతి అనకాపల్లి, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు మరియు ఎస్పీలతో హోం మంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండటంతో ప్రత్యేక దృష్టి పెట్టాలి 100 కిమీ వేగంతో బలమైనగాలుల ప్రభావంతో చెట్లు,పోల్స్ పడి విద్యుత్ సరఫరా అంతరాయం కలగవొచ్చు పునరుద్దరణకు ముందుగానే ట్రాన్స్ఫర్మర్స్, పోల్స్ సిద్ధంగా ఉంచాలి జేసీబీలు, జనరేటర్స్ రెడీగా ఉంచాలి భారీ హార్డింగ్స్ వెంటనే తొలగించాలి డెలివరీ దగ్గరలో ఉన్న గర్భిణీల కుటుంబాలతో మాట్లాడుతూ ఉండాలి మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్సులు ఏర్పాటు చేయాలి కాకినాడ జిల్లాల్లో 6 మండలాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం కాకినాడ జిల్లాలో ఎక్కువ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశం రోడ్డు బ్లాక్ అయితే డైవర్షన్స్ ముందే మ్యాప్ చేసుకోవాలి జిల్లా, మండల కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలి పునరావాస కేంద్రాల్లో పరిశుభ్రమైన ఆహారం అందించాలి నిత్యవసర వస్తువులు, మెడిసిన్, శానిటేషన్ మెటీరియల్ వంటివి అందుబాటులో ఉంచాలి అవసరం అయితే తరలింపుకు ట్రాక్టర్, జేసీబీ, బస్సు, ఇతర వాహనాల వివరాలు సిద్ధంగా ఉంచాలి సముద్ర తీరప్రాంత గ్రామాల వారిని ముందుగానే ఒప్పించి రిలీఫ్ కేంద్రాలకు తరలించాలి

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుఫాను హెచ్చరిక _కలెక్టర్ ఆదేశాలు_డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో

మూడు రోజులు పాఠశాలలకు సెలవులు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో “మంథా” తుఫాను ప్రభావం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్య పాఠశాలలకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి అన్ని ఉపవిద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఆర్డీడబ్ల్యూయూ, మోడల్, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేశారు. తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థుల భద్రత కోసం 27.10.2025 (సోమవారం), 28.10.2025 (మంగళవారం), 29.10.2025 (బుధవారం) తేదీలలో జిల్లాలోని అన్ని పాఠశాలలు మూసివేయాలని ఆదేశించారు. ఈ కాలంలో వాతావరణ శాఖ హెచ్చరికలను పర్యవేక్షిస్తూ, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు. తుఫాను ప్రభావం తగ్గిన తరువాత, పాఠశాలల తిరిగి ప్రారంభంపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయనుంది. విద్యార్థుల ప్రాణ భద్రతను ప్రాధాన్యతగా తీసుకుంటూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. — జిల్లా విద్యాశాఖాధికారి, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా.

కాకినాడ

పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు

పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10. మొంథా తుపాను నేపథ్యంలో పెద్దాపురం పురపాలక సంఘం పరిధిలో ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.పట్టణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తక్షణమే వారిని ఆదుకునేందుకు మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.ప్రజలకు అత్యవసర పనులకు విఘాతం కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.వాటర్ సప్లయి, కరెంట్, విషయంలో సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.తుపాను వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు పురపాలక సంఘం సన్నద్ధత చేసినట్లు, మొంతా తుఫాన్ ప్రభావం ఉన్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దాపురం పురపాలక సంఘ కార్యాలయము నందు *24*7* పని చేసే విధంగా No. *08852242100* తో call center ఏర్పాటు చేయడమైనది. ఏదేని తుఫాను అత్యవసరము ఉన్నచో ఈ నంబర్ కు సంప్రదించలన్నారు

E-పేపర్

బీజేపీ పార్టీకి రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యదర్శి, చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి రాజీనామా నవంబర్ 2న కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం

పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 బిజేపీ పార్టీకి రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యదర్శి, చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి రాజీనామా నవంబర్ 2న కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం

వరంగల్

దయనీయ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు పసి పిల్లలకు రోడ్డు మీద ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన సిబ్బంది

పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 దయనీయ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు పసి పిల్లలకు రోడ్డు మీద ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన సిబ్బంది వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్‌ను ఉపయోగిస్తున్న వైద్యులు పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో, పరీక్షలకు తరలించేందుకు కేర్ టేకర్లు లేక ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు పిల్లలను కూడా స్వయంగా తామే తరలిస్తున్న కుటుంబ సభ్యులు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మొంత కారణం గా రేపు సెలవు

నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 26: *పత్రికా ప్రకటన* *నేడు పాఠశాలలకు, జానియర్ కళాశాలకు సెలవు* : *జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా* నెల్లూరు, అక్టోబర్ 26 : బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ‘మోంతా’ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున *ఈ నెల 27న (సోమవారం)* అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, *జానియర్ కళాశాలకు* సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలలు, జానియర్ కళాశాలల యాజమాన్యాలు విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.

తిరుపతి

నూతన ధర్మకర్తల మండలికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యం లో ఆదివారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్,సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొని వారిచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.ఈ సందర్భంగా నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసీ.ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.అదేవిధంగా భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించే విధంగా చూడాలన్నారు.

హైదరాబాద్

“డిజిటల్ టెక్నాలజీ అన్ని సమస్యలకు పరిష్కారం కాదు” – కేర‌ళా డీజీపీ

– ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని Veeravasaram వూరుని, చెరిపించక్కని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. – ప్రభుత్వ పాఠశాలలలో ప్రాథమిక విద్య, తరువాత ఇంటర్మీడియేట్ అభ్యసించారు. – ఆ తర్వాత బాపట్లలోని వ్యవసాయ కళాశాల్-లో బి.ఎస్‌సి కొనసాగించారు, అనంతరం హైదరాబాద్‌లో ఎమ్‌.ఎస్‌సి చేశారు; ఇది ఆయనకు “గేమ్-చేంజర్” అని ఆయన్ పేర్కొన్నారు. – 1991లో Indian Police Serviceలో (IPS) ఎంపికయ్యారు. ఆసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)గా Thalasseryలో మొదలు పెట్టి, తరువాత Wayanad, Malappuram, Ernakulam, Palakkad లాంటి జిల్లాల్లో SPగా పనిచేశారు. – తరువాత DIGగా Thrissur, Kochi ప్రాంతాల్లో విధులు చేపట్టారు, అలాగే Thiruvananthapuram పోలీస్ కమిషనరుగా కూడా పనిచేశారు. – ఆయనకు “ప్రెసిడెంట్ అవార్డ్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్” లాంటి గౌరవాలు లభించాయి. – 2025లో ఆయనకు Kerala దర్శనం ఇచ్చి ఆయన అక్కడ డీజీపీ (DGP)గా నియమితుడయ్యారు. – యువతకు ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు: “డిజిటల్ టెక్నాలజీ అన్ని సమస్యలకు పరిష్కారం కాదు” – అని, సమాజంతో కనెక్ట్ అవుతారా, పుస్తకాలు చదవాలి, వాస్తవ అనుభవాలపై దృష్టి పెట్టాలి అని అన్నారు. – ఆయన చెప్పడం ప్రకారం, కేర‌ళా ప్రజల హక్కులపై అవగాహన గలవారు, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం విషయంలో రాష్ట్రం ముందుంది. శరత్ చంద్ర (జర్నలిస్ట్)

E-పేపర్

ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ , లబ్ధిదారుల పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ , లబ్ధిదారుల పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ :– ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అందరు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండలం సాలైగూడ(74), రాం గూడ (56), ధర్మాజీపేట (31), కొలాం గూడాలను (36), పర్యటించారు. ఆయా గ్రామాల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి పెద్దలకు ఇందిరమ్మ ఇళ్ల అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,75,000 కేంద్ర ప్రభుత్వం లక్ష 25వేలు రూపాయలు నిధులు మాత్రమే మంజూరు చేసిందని మొత్తం మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇండ్లు నిర్మించిన వారికి దశలవారీగా నిధులు మీ ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. పనులు నిర్మాణాలు నాణ్యవంతంగా సకాలంలో పూర్తి చేసుకోవాలని కోరారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మీకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో ,జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

త్వరలో ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరీకరణ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

పున్నమి అక్టోబర్ 26 రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి వెల్లడించారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరీకరణ పనులపై పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే హైదరాబాద్లోని ఆర్ &బీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో ఇబ్రహీంపట్నం చెరువు కట్ట రూపు రేకలు మారుతాయని ఎమ్మెల్యే తెలిపారు. చెరువు కట్టపై జరిగే ప్రమాదాల నివారణకు అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.