Saturday, 11 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తుఫాను పయనమిలా… కాకినాడ వైపు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 720 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 790 కిలోమీటర్లు, కాకినాడకి 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వచ్చే 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడనుంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారి, అదే రోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.

E-పేపర్

సోక సముద్రంలో శ్రీరంగపట్నం

తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి పున్నమి న్యూస్ ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం వాస్తవ్యులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవీ ఉపాసకులు శ్రీ శ్రీ శ్రీ లట్టాల శివరామకృష్ణ గారు ఉదయం 5 గంటలకు స్వర్గస్తులైనారు వారి ఆత్మకు శాంతి కలగాలని శాశ్వత స్వర్గలోకి నివాసం కలగాలని గ్రామస్తులు నివాళులర్పించారు శ్రీరంగపట్నం గ్రామం లో విషాద వాతావరణం నెలకొంది End

తిరుపతి

నాదెండ్ల మనోహర్ కి వీడ్కోలు పలికిన అంజూరు చక్రధర్

తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి,జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని,ఆదివారం జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు మర్యాదపూర్వకంగా కలిసి వీడ్కోలు పలకడం జరిగింది.

తిరుపతి

మాజీ సర్పంచ్ కుమారుడి మృతికి సంతాపం తెలిపిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

తొట్టంబేడు మండలం,కొనతనేరి గ్రామానికి చెందిన ఎక్స్ సర్పంచ్ గంగయ్య కుమారుడు వెంకటేష్ యాక్సిడెంట్లో మృతి చెందారు.విషయం తెలుసుకుని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యంగా ఉండాలని తెలిపడం జరిగింది.నివాళులర్పించిన వారిలో రమణయ్య నాయుడు,తిరుపాలు,శీను,మణి,ముకుందం, వెంకటసుబ్బయ్య,సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైన బూటకపు వ్యవసాయ ప్రణాళికను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలీ.

అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐ కె ఎం ఎస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు టీ.ప్రకాష్ అధ్యక్షతన 2025 అక్టోబర్ 25,26 తేదీలలో రెండు రోజులపాటు రాజమహేంద్రవరంలో స్థానిక కా.మావో భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏ ఐ కె ఎం ఎస్ జాతీయ అధ్యక్షులు పి.టాన్యా మాట్లాడుతూ కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం రైతాంగ, కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా అమలు చేస్తోందని, అంబానీ, అదానీ వంటి కార్పోరేట్ శక్తుల ప్రయోజనాలే పరమావధిగా మారాయని విమర్శించారు. కార్మిక రంగం, వ్యవసాయ రంగంలో నేటి వరకు అమలు జరుగుతున్న 36 కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల పథకాలను రద్దు చేసి ఒకే ఒక ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన పేరుతో బూటకపు వ్యవసాయ ప్రణాళికను తీసుకు రావడం రైతాంగానికి నష్టకరమని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమనీ అన్నారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలతో వ్యవసాయ,పౌల్ట్రీ,పాడి, ఆక్వా రంగాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయని అన్నారు. ట్రంప్ బెదిరింపులకు మోదీ సర్కార్ లొంగి పోవడం సిగ్గు చేటని విమర్శించారు. ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ వనరులను,ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఆపరేషన్ కగార్ ను తీసుకు వచ్చి లక్షలాది మంది పారా మిలటరీ బలగాలతో మావోయిస్టులపై దాడులు చేస్తుందని దుయ్య బట్టారు. సుమారు 500 మందిని బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్య గావించి, నరమేధం సాగిస్తుందని అన్నారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపి వేసి, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని టాన్యా డిమాండ్ చేశారు. ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు టీ. ప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు వేలాది ఎకరాల భూములను కారుచౌకగా కట్టబెట్టడు తుందని ఆరోపించారు. విశాఖ జిల్లా పెద్ద గంట్యాడలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి, శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం, మసానా పుట్టిలో 32 వేల మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం,పశ్చిమ గోదావరి జిల్లా జీలుగు మండలం వంకావారి గూడెంలో 1160 ఎకరాల భూములను ఇండియన్ నేవీ, అణ్వాయుధాల ఫ్యాక్టరీ నిర్మాణానికి బలవంతంగా భూసేకరణ చేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని అన్నారు. పర్యావరణాన్ని, ప్రజల జీవితాలను ధ్వంసం చేసే రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాలు, తుపాన్లు కారణంగా పంటలు నష్టపోయిన రైతులను, కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అధిక వర్షాలు, తుపాన్లు కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని, వరి, ప్రత్తి, మొక్కజొన్న, మిర్చి, పొగాకు తదితర పంటలకు మద్దతు ధరలు కల్పించి కొనుగోలు చేయాలని, కౌలు రైతులు అందరికీ గుర్తింపు కార్డులు, రుణాలు, అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5 నుంచి 12 వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. దూలయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. కూర్మారావు, కోశాధికారి వి.చిట్టిబాబు రాష్ట్ర నాయకులు కె. బాలు దొర, బాల్ రెడ్డి, ఎన్. పోతురాజు, బాల సుందరం తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

బొజ్జల సుధీర్ రెడ్డి కి మంత్రి నాదెండ్ల ప్రశంసలు

శ్రీకాళహస్తిలో టిడిపి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కూటమిలోని టిడిపి,బిజెపి,జనసేన, నాయకులను, కార్యకర్తలను,అటు పాలన పరంగాను ఇటు పదవుల పంపిణీ లోను అందరి నీ ఏకతాటిపై నడిపిస్తూ,ముందుకెళుతున్న సందర్భంగా ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే బొజ్జల పై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వివిధ ఆలయాలకు ధర్మకర్తలి మండలి నియమించిన సందర్భం గా భాగంగా ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గా నియమితులైన టిడిపి,బిజెపి, జనసేన సభ్యుల ప్రమాణ స్వీకారానికి అన్నీ తానై నడిపించి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ అభివృద్ధి కూటమితో నే సాధ్యమన్న పవన్ కళ్యాణ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ,ఆదర్శంగా నిలిచిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్

ఈ నెల 28 న అమలాపురంలో విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభం

రోజురోజుకే పెరుగుతున్న ఆర్థిక అంతరాలు తగ్గింపునకు సహకార వ్యవస్థ బలోపేతమే పరిష్కార మార్గమని ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ చైర్మన్ జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ముస్లిం వీధి, శ్రీదేవి మార్కెట్, జైశ్రీరామ్ జంక్షన్ నందు బ్యాంకు 58వ నూతన శాఖను ఈనెల 28 వ తేదీన ప్రారంభించనున్న సందర్భంగా బ్యాంకు ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సమాజంలో కోటీశ్వరులు జాబితా పెరుగుతుంటే మరోవైపు సామాన్యుల ఆర్థిక స్థితిగతులు రోజురోజుకు దిగజారడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ దేశంలో పేద మధ్యతరగతి వర్గ ప్రజల హార్దిక అవసరాలకు సహకార, అర్బన్ బ్యాంకులు బాసటగా నిలుస్తున్నాయన్నారు. విశాఖ నగరంలో 1916 ఫిబ్రవరి 5వ తేదీన కార్యకలాపాలు ప్రారంభించిన ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ నేడు తెలుగు రాష్ట్రాల్లో 57 బ్రాంచ్ ల ద్వారా బహుళ రాష్ట్రాల అర్బన్ బ్యాంకుగా ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. భారతదేశ సహకార చిత్రపటంలో నాన్ షెడ్యూల్డ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో అతిపెద్దదిగా, సహకార సూత్రాలను శ్రీకరణ శుద్ధిగా పాటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. డిపాజిటర్లను సభ్యులుగా చేర్చడం ద్వారా బ్యాంకు పాలకవర్గం నిర్ణయాల్లో వారిని కూడా భాగస్వాములను చేస్తూ నూతన ఒరవడి తో ముందుకు సాగుతుందన్నారు. వాణిజ్య బ్యాంకుల నుంచి ఎటువంటి తోడ్పాటు పొందలేని ప్రజలకు విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రత్యామ్నాయ బ్యాంకుగా గుర్తింపు సాధించింది అన్నారు.58వ బ్రాంచ్ గా అమలాపురం శాఖను ప్రారంభించుకోవడంతో పాటు త్వరలో హైదరాబాదు, విశాఖపట్నం లలో నూతన శాఖలను ప్రారంభించడం ద్వారా బ్రాంచ్ ల సంఖ్య 60 కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెవి సత్యనారాయణమూర్తి తెలిపారు. అమలాపురం ప్రాంతంలో సహకార ఉద్యమ పునాదులను ప్రతిష్టపరిచే ఉద్దేశంతో బ్యాంకు అమలాపురం బ్రాంచ్ ద్వారా రానున్న ఐదేళ్లలో రూ.110 కోట్లు ఆర్థిక కార్యకలాపాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అమలాపురం ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదల, ఈ ప్రాంత అభివృద్ధిలో ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు తన వంతు పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.రామకృష్ణమూర్తి, డైరెక్టర్ సి.కృష్ణ మోహన్ రావు, సీఈవో వి.వి.బి.వరలక్ష్మి, జోనల్ మేనేజర్ ఠాగూర్, మేనేజర్ ఎ.శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముందస్తు పుట్టిన రోజు వేడుకలు.

– యాళ్ళ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ యాళ్ళ ప్రదీప్ ఆధ్వర్యంలో… – 2వేల మందికి 5 కిలోల వంతున బియ్యం బ్యాగులు పంపిణి – భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే. ఆదిరెడ్డి శ్రీనివాస్ – ఈవీఎం ఎమ్మెల్యే కాదు ఎవ్రీ టైమ్ రాజమండ్రిసిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు: డాక్టర్ యాళ్ళ ప్రదీప్ – మరో 20 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది… ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా ఉంటారు : నాయకులు రాజమహేద్రవరం : రాష్ట్రంలో ఏగాలి వీచినా రాజమండ్రిలో టీడీపీ జెండా ఎగరవేస్తున్న, మహిళలకు ప్రజలకు పాదాభివందనలు చేస్తున్నానని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) వినయంగా చెప్పారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తూ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. యాళ్ళ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ యాళ్ళ ప్రదీప్ సుకుమార్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నటరాజ్ థియేటర్ వద్ద ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2 వేలమందికి 5 కేజీల వంతున బియ్యం బ్యాగులను, మొక్కలను పంపిణి చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భారీ కేకు కట్ చేశారు. ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ బుడ్డిగ రవి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రిని టీడీపీకి కంచుకోటగా మార్చి వరుస విజయాలు అందిస్తున్న నగర ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తమను కుటుంబ సభ్యులుగా ఆదరిస్తున్న ప్రజల మధ్యకు రావడం గొప్ప అనుభూతిని ఇస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.16 సంవత్సరాలుగా తమ కుటుంబంలో తన తల్లిని మేయరుగా, తండ్రిని ఎమ్మెల్సీగా, తన సతీమణిని ఎమ్మెల్యేగా, ఇప్పుడు తనను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. నాయకత్వ లక్షణాలు పెంచేందుకు అందరికీ పదవులు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. అనవసర విమర్శలు,అసత్య ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు తన మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. తాను కన్నెర్ర చేస్తే అన్ని ప్రాంతాల్లో ఉన్న తన అభిమానుల ఆగ్రహాన్ని ప్రత్యర్థులు తట్టుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ వాతావరణ బాగుండాలని, నగరం, మహిళలు సురక్షితంగా ఉండాలని తాను కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ముందస్తు పుట్టిన రోజు వేడుకల నిర్వాహకుడు యాళ్ళ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ యాళ్ళ ప్రదీప్ సుకుమార్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నయ్య ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన అక్కసుతో, అసుయతో వాసు అన్నయ్యను ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నారని, కాని రాజమండ్రి సిటీలో ఎవ్రీ టైమ్ ఆయనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అని, రానున్న రోజుల్లో మంత్రిగా పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటారని ఆయన ఆకాంక్షించారు. ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి మంచిచెడ్డలు చూసే యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిజమైన ప్రజా నాయకుడని 43 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వాసు‌మరో 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలని ఆశీస్సులు అందచేశారు. నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకి రామయ్య, రాచపల్లి ప్రసాద్, కూటమి నాయకుడు దొండపాటి సత్యం బాబు, యెనుముల రంగబాబు, నగర తెలుగు మహిళ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు.

అలంపూర్ ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గా నగర్‌కు చెందిన చాకలి వెంకట్రాముడు తీవ్రగాయాల పాలయ్యాడు. ఉదయం సుమారు 7:50 గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఆయనను గద్వాల్ రోడ్డువైపు నుంచి వస్తున్న స్వరాజ్ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతని కాలు విరిగినట్లు స్థానిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంట్రాముడిని సమీప ఆసుపత్రికి తరలించారు.

జోగులాంబ గద్వాల

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వినతి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.

అలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని శనివారం హైదరాబాదులోని సీఎం రేవంత్ రెడ్డి ఓ ఎస్ డి వేముల శ్రీనివాస్ కి, విపత్తుల నిర్వహణ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే విజయుడు. అలంపూర్ నియోజకవర్గంలో ఐజ మండలం భూంపురం,రాజోలి మండలం ముండ్ల దీన్నే వివిధ గ్రామాలలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన నలుగురు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయల పరిహారం అందించి వారికి ఇతర ప్రభుత్వ పథకాలను అందజేయాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.