Saturday, 11 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలులో పునరావాస కేంద్రాల పరిశీలన

తుఫాన్ నేపథ్యంలో రాజోలులోని పునరావాస కేంద్రాలను అధికారులు సోమవారం పరిశీలించారు.పునరావాస కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. డీఎల్పీఓ బొజ్జిరాజు, వీఆర్వో కృష్ణమూర్తితో కలిసి తహశీల్దార్ భాస్కర్, పోలీసులు ఈ కేంద్రాలను పరిశీలించారు. అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలులో పునరావాస కేంద్రాల పరిశీలన

తుఫాన్ నేపథ్యంలో రాజోలులోని పునరావాస కేంద్రాలను అధికారులు సోమవారం పరిశీలించారు.పునరావాస కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. డీఎల్పీఓ బొజ్జిరాజు, వీఆర్వో కృష్ణమూర్తితో కలిసి తహశీల్దార్ భాస్కర్, పోలీసులు ఈ కేంద్రాలను పరిశీలించారు. అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

విశాఖపట్నం

జనసేన నాయకుడు శ్రవణ్ కుమార్ కృషి ఫలించింది – వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న నాగేశ్వరరావుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60,000 మంజూరు

విశాఖపట్నం, అక్టోబర్ 27: విశాఖ నార్త్ నియోజకవర్గం 48వ వార్డ్ బర్మా క్యాంపు నివాసి మొల్లేటి నాగేశ్వరరావు వెన్నుపూస సమస్యతో బాధపడుతుండటంతో, ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 60,000 ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ సహాయం జనసేన పార్టీ 48వ వార్డ్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఉప్పులూరి నిరంతర కృషి, చొరవ ఫలితంగా సాధ్యమైంది. ఆయన ఆధ్వర్యంలో బాధితుని పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, తక్షణ స్పందనతో నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులను సోమవారం విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, జనసేన నార్త్ ఇంచార్జ్ పసుపులేటి ఉషా కిరణ్, శ్రవణ్ కుమార్ ఉప్పులూరి చేతుల మీదుగా బాధితునికి అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు నాగేశ్వరరావు తన కుటుంబం తరఫున సహాయం అందించిన జనసేన నాయకత్వానికి, ముఖ్యంగా శ్రవణ్ కుమార్ కృషికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని, ప్రజల సమస్యల పరిష్కారంలో పార్టీ కార్యకర్తలు చొరవ చూపడం గర్వకారణమని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బైసన్” సినిమా తప్పనిసరిగా చూడండి ! పి. గన్నవరం బీఎస్పీ అధ్యక్షుడు తాడి రాంబాబు విజ్ఞప్తి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం, పి. గన్నవరం బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ) అధ్యక్షుడు తాడి రాంబాబు గారు ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ, “బైసన్” సినిమా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాలని కోరారు. ఈ చిత్రం సామాజిక చైతన్యాన్ని, సమానత్వం, న్యాయం, స్వాభిమానం అనే విలువలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. “మన సమాజం ఎదగాలంటే అవగాహన అవసరం. “బైసన్” సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు — ఇది మన హక్కుల గురించి, మన గౌరవం గురించి, మన పోరాట చరిత్ర గురించి చెప్పే శక్తివంతమైన సందేశం” అని తాడి రాంబాబు గారు తెలిపారు. యువత, విద్యార్థులు, మహిళలు అందరూ ఈ చిత్రాన్ని వీక్షించి, అందులోని సందేశాన్ని ఆచరణలో పెట్టాలని తాడి రాంబాబు పిలుపునిచ్చారు. ఇలాంటి చిత్రాలు సమాజంలో మార్పుకు దారితీయగలవని, అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంపొందించగలవని తాడి రాంబాబు గారు విశ్వాసం వ్యక్తం చేశారు. “బైసన్ సినిమా చూడండి – ఆలోచించండి – మార్పు వైపు నడవండి” అనే నినాదంతో ప్రజలను తాడి రాంబాబు ప్రేరేపించారు.

విశాఖపట్నం

విశాఖలో భారతదేశపు అతి పెద్ద AI హబ్ నిర్మాణం

విశాఖలో భారతదేశపు అతి పెద్ద AI హబ్ నిర్మాణం గూగుల్, ఆదాని, ఎయిర్‌టెల్ సంయుక్తంగా ₹1.25 లక్షల కోట్లు పెట్టుబడి పున్నమి స్టాప్ రిపోర్టర్ : యామల రామమూర్తి ; భారతదేశ సాంకేతిక భవిష్యత్తుకు విశాఖపట్నం మరో మైలురాయిగా నిలవబోతోంది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, పరిశ్రమ రంగంలో అగ్రగామి ఆదాని గ్రూప్, మరియు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కలిసి, దేశంలోనే అతి పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్ మరియు డేటా సెంటర్ క్యాంపస్‌‌ను విశాఖపట్నంలో నిర్మించబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 15 బిలియన్ డాలర్ల (దాదాపు ₹1.25 లక్షల కోట్లు) పెట్టుబడి ఉండనుంది. క్యాంపస్‌ శుద్ధ శక్తి (క్లీన్ ఎనర్జీ) ఆధారంగా నడుస్తుంది — దీని వల్ల పర్యావరణ అనుకూల టెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధికి దోహదం అవుతుంది. దేశానికి కొత్త టెక్ యుగానికి శ్రీకారం ఈ “గిగావాట్ స్కేల్ క్యాంపస్” ద్వారా లక్షల కొద్దీ ఉద్యోగాలు సృష్టించబడతాయి. అంతేకాదు, భారతదేశం యొక్క డిజిటల్ బ్యాక్‌బోన్‌ను బలపరుస్తూ, దేశాన్ని గ్లోబల్ AI నాయకత్వం వైపు నడిపించనుంది. గూగుల్, ఆదాని, ఎయిర్‌టెల్ భాగస్వామ్యం దేశంలోని AI పరిశోధన, డేటా ప్రాసెసింగ్, మరియు టెక్ ఇన్నోవేషన్ రంగాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. విశాఖ – భారత టెక్ మ్యాప్‌పై గ్లోబల్ గుర్తింపు ఈ ప్రాజెక్ట్‌తో విశాఖపట్నం ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపును పొందనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పెట్టుబడిని స్వాగతిస్తూ, అవసరమైన భూమి, విద్యుత్, మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సదుపాయాలను అందించనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయిన తర్వాత, విశాఖపట్నం కేవలం తూర్పు తీరంలోని ఒక నగరమే కాకుండా — భారతదేశ AI విప్లవానికి హృదయంగా మారనుంది.

సినిమా

త్వరలో జరగబోయే బుస్సా విజేత అవార్డ్స్ కు ప్రముఖుల శుభాకాంక్షలు

హైదరాబాద్ : బుస్సా ఫిల్మి ఫోకస్ డిజిటల్ పత్రిక ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక సంపాదకుడు బుస్సా బాలరాజు నవంబర్ లో నిర్వహించబోయే “బుస్సా విజేత అవార్డ్స్”కు ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలిపారు. వారిలో తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థకు చెందిన సమాచార్ భవన్ లో సంస్థ మనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక, సంస్థ ఎక్సిక్యూటివ్ డైరక్టర్ కిషోర్ బాబు, తెలుగు టెలివిజన్ వర్కర్స్, టెక్నీషియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్, టివి మరియు సినీ నటీనటులు అశోక్ కుమార్, జె.యల్.శ్రీనివాస్, లహరి, మధు ప్రియ, మాణిక్, నటి సూర్యకళ, దర్శకులు-రచయిత సంఘం అధ్యక్షుడు ప్రేంరాజ్, నరేంద్ర, తెలుగు తెలంగాణా సినీ టివి నటినటుల సంఘం అధ్యక్షుడు రాజ్ శేఖర్, గోపాల కృష్ణ, యం.ఎస్.ప్రసాద్, చిత్తరంజన్ దాస్, సినీ, టివి గేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు, సత్యం యాబి మాస్టారు, అక్కినేని శ్రీధర్ లక్ష్మి, డాక్టర్ శ్రీరాందత్తి, శ్రీరామోజు లక్ష్మి నారాయణ, భాస్కర్ల వాసు, నరేందర్ రెడ్డి, ఆర్.డి.ఎస్.ప్రకాష్ మరి కొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా బుస్సా ఫిల్మి ఫోకస్ డిజిటల్ పత్రిక ఛైర్మన్ & ఎడిటర్ బుస్సా బాలరాజు మాట్లాడుతూ సినిమా, షార్ట్ ఫిల్మ్, ఫోక్ సాంగ్, వ్యాపారం, రాజకీయం, ఆరోగ్యం, కళారంగం, సేవా రంగం, విద్య, ఉపాధ్యాయ, పత్రికా, పలు రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న ప్రతీ ఒక్కరినీ బుస్సా విజేత అవార్డ్స్ తో ఘనంగా సత్కరిచరిచడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే అవార్డ్స్ కార్యక్రమం యొక్క పూర్తి వివరాలు తెలియజేస్తానని, మరిన్ని వివరాలకు 9908780059 నెంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు.

తిరుపతి

ఇళ్లలోకి చేరిన మురికి నీరు

శ్రీకాళహస్తి ప్రాజెక్ట్ వీధిలో గంగమ్మ మరియు రామాలయం గుడి దగ్గర చిన్న పాటి వర్షానికే రోడ్లు కాలువలు నిండి ఇళ్లలోకి కాలువ లోని మురికి నీరు చేరి దుర్గందం ఏర్పడుతుంది.దీని వలన పిల్లలకు,పెద్దలకు విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది.ఈ విషయం గా ఎన్నో సార్లు మున్సిపల్ అధికారుల కు ప్రజా ప్రతినిధులకు విన్న వించుకున్న ఫలితం మాత్రం కనపడటం లేదు.కావున స్థానిక శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దీని మీద దృష్టి సారించి అధికారులకు ఆదేశించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

E-పేపర్

కోటగుండ్ల స్నేహ&సంగీత్ ల వివాహ రిసెప్షన్ కు హాజరైన మాజీ ఎమ్మెల్యే

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు: ఈరోజు సాయంత్రం రాజ్ కన్వెన్షన్ నందు ఉర్లగట్టుకోడు సర్పంచ్ కోటగుండ్ల గోపి గారి కుమార్తె కోటగుండ్ల స్నేహ&సంగీత్ ల వివాహ రిసెప్షన్ కు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు* ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, సర్పంచ్ రామకృష్ణ, హరికృష్ణ రెడ్డి,సుబ్రహ్మణ్యం రాజు,వైయస్సార్ సిపి అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు,ఎంపీటీసీలు మహేష్ రెడ్డి,జనార్ధన రాజు, బండారు మల్లికార్జున, పుష్పలత,ఎక్స్ జెడ్పిటిసి రాజేశ్వరమ్మ, ఓబుల్ రెడ్డి,సిద్దు రాయల్,సిద్దయ్య,రమణ రెడ్డి,అరుణమ్మ, రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

కోటగుండ్ల స్నేహ&సంగీత్ ల వివాహ రిసెప్షన్ కాదురైన మాజీ ఎమ్మెల్యే

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు: ఈరోజు సాయంత్రం రాజ్ కన్వెన్షన్ నందు ఉర్లగట్టుకోడు సర్పంచ్ కోటగుండ్ల గోపి గారి కుమార్తె కోటగుండ్ల స్నేహ&సంగీత్ ల వివాహ రిసెప్షన్ కు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు* ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, సర్పంచ్ రామకృష్ణ, హరికృష్ణ రెడ్డి,సుబ్రహ్మణ్యం రాజు,వైయస్సార్ సిపి అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు,ఎంపీటీసీలు మహేష్ రెడ్డి,జనార్ధన రాజు, బండారు మల్లికార్జున, పుష్పలత,ఎక్స్ జెడ్పిటిసి రాజేశ్వరమ్మ, ఓబుల్ రెడ్డి,సిద్దు రాయల్,సిద్దయ్య,రమణ రెడ్డి,అరుణమ్మ, రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మృతికి నివాళులర్పించిన బియ్యపు మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి బిపి అగ్రహారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుదూరు లక్ష్మణ్ రెడ్డి అనారోగ్యంతో మరణించారు.వారి పార్థివ దేహానికి శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. వారితో పాటు వైసిపి నాయకులు రత్నం రెడ్డి, ఆర్కాట్ శంకర్, ఆర్కార్డు ముత్తు,అడ్వకేట్ లక్ష్మీపతి, సోమిరెడ్డి భరత్ రెడ్డి, కంట ఉదయ్ కుమార్, సాధన మున్నా రాయల్,కంచి గురవయ్య, బాల గౌడ్,జీవీకే రెడ్డి తదితరులు సంతాపం తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.