Saturday, 11 April 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామానికి చెందిన దుస్సా మాధవి, అమరబోయిన శిరీష, యలమందల నాగమణి, చిన్నపొంగు రాణిలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మొత్తం ₹1,39,614 ఆర్థిక సాయం మంజూరైంది. వైద్య చికిత్సల కోసం ఈ నిధులు అవసరమని స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దృష్టికి తీసుకువచ్చారు.ఆయన సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దుస్సా మాధవికి ₹75,000, అమరబోయిన శిరీషకు ₹20,000,యలమందల నాగమణికి ₹27,114, చిన్నపొంగు రాణికి ₹17,500 మంజూరయ్యాయి. ఎమ్మెల్యే స్వయంగా తన నివాసంలో చెక్కులను బాధితు లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డోగుపర్తి విష్ణు, యలమందల కవి, వడ్డేంపూడి సీతారాములు, కారుపాటి డేవిడ్, మల్లెల కొండయ్య, నాయిని రజిని, పల్లెబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

అధికారులు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

ముంచుకొస్తున్న ముంథా తుఫాను నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గం లోని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సూచించారు. సోమవారం జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తుఫాను తీరం దాటే సమయం లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయా లని ఆదేశించారు. తక్కువ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూ — డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు, ఆరోగ్యం వంటి విభాగాలు అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

తిరుపతి

నిత్యాన్నదాన పథకానికి విరాళంగా

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారి చే నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి తిరుపతి జిల్లా చంద్రగిరి వాస్తవ్యులు V.మనోహర్ వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు సరోజమ్మ & రామ కృష్ణయ్య జ్ఞాపకార్థం రూ.50,116/- విరాళంగా ఇవ్వడం జరిగింది.ఆలయ అధికారులు వారికి అంతరాలయ దర్శనం ఏర్పాటు చేసి,అనంతరం. వేద పండితుల ఆశీర్వచనం,స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను ఇవ్వడం జరిగింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

“మొంథా” తుఫాన్ ప్రభావంతో రైళ్లు రద్దు!

తుఫాన్ మొంథా కారణంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే రైళ్లు రద్దు చేసింది. రద్దు తేదీలు: అక్టోబర్ 27, 28 & 29, అక్టోబర్ 2025 రద్దయిన రైళ్లు జాబితా: 0️⃣1️⃣ 18515 విశాఖపట్నం–కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ (27.10) 0️⃣2️⃣ 18516 కిరండూల్–విశాఖ నైట్ ఎక్స్‌ప్రెస్ (28.10) 0️⃣3️⃣ 58501 విశాఖ–కిరండూల్ ప్యాసింజర్ (28.10) 0️⃣4️⃣ 58502 కిరండూల్–విశాఖ ప్యాసింజర్ (28.10) 0️⃣5️⃣ 58538 విశాఖ–కొరాపుట్ ప్యాసింజర్ (28.10) 0️⃣6️⃣ 58537 కొరాపుట్–విశాఖ ప్యాసింజర్ (28.10) 0️⃣7️⃣ 18512 విశాఖ–కొరాపుట్ ఎక్స్‌ప్రెస్ (27.10) 0️⃣8️⃣ 18511 కొరాపుట్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10) 0️⃣9️⃣ 67285 రాజమండ్రి–విశాఖ MEMU (28.10) 1️⃣0️⃣ 67286 విశాఖ–రాజమండ్రి MEMU (28.10) 1️⃣1️⃣ 17268 విశాఖ–కాకినాడ ఎక్స్‌ప్రెస్ (28.10) 1️⃣2️⃣ 17267 కాకినాడ–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10) 1️⃣3️⃣ 08583 విశాఖ–తిరుపతి స్పెషల్ (27.10) 1️⃣4️⃣ 08584 తిరుపతి–విశాఖ స్పెషల్ (28.10) 1️⃣5️⃣ 22875 విశాఖ–గుంటూరు డబుల్ డెక్కర్ (28.10) 1️⃣6️⃣ 22876 గుంటూరు–విశాఖ డబుల్ డెక్కర్ (28.10) 1️⃣7️⃣ 22707 విశాఖ–తిరుపతి డబుల్ డెక్కర్ (27.10) 1️⃣8️⃣ 18526 విశాఖ–బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (27.10) 1️⃣9️⃣ 18525 బ్రహ్మపూర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10) 2️⃣0️⃣ 17243 గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్ (27.10) 2️⃣1️⃣ 17244 రాయగడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్ (27.10) 2️⃣2️⃣ 67289 విశాఖ–పాలసా MEMU (28.10) 2️⃣3️⃣ 67290 పాలసా–విశాఖ MEMU (28.10) 2️⃣4️⃣ 67287 విశాఖ–విజయనగరం MEMU (27.10) 2️⃣5️⃣ 67288 విజయనగరం–విశాఖ MEMU (28.10) 2️⃣6️⃣ 68433 కటక్–గునుపూర్ MEMU (28.10) 2️⃣7️⃣ 68434 గునుపూర్–కటక్ MEMU (29.10) 2️⃣8️⃣ 58531 బ్రహ్మపూర్–విశాఖ ప్యాసింజర్ (28.10) 2️⃣9️⃣ 58532 విశాఖ–బ్రహ్మపూర్ ప్యాసింజర్ (28.10) 3️⃣0️⃣ 58506 విశాఖ–గునుపూర్ ప్యాసింజర్ (28.10) 3️⃣1️⃣ 58505 గునుపూర్–విశాఖ ప్యాసింజర్ (28.10) 3️⃣2️⃣ 17220 విశాఖ–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (27.10) 3️⃣3️⃣ 12727 విశాఖ–హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ (27.10) 3️⃣4️⃣ 12861 విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (27.10) 3️⃣5️⃣ 12862 మహబూబ్‌నగర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10) 3️⃣6️⃣ 22869 విశాఖ–చెన్నై సెంట్రల్ వీక్లీ (27.10) 3️⃣7️⃣ 22870 చెన్నై సెంట్రల్–విశాఖ వీక్లీ (28.10) 3️⃣8️⃣ 12739 విశాఖ–సికింద్రాబాద్ గరిబ్‌రత్ (27.10) 3️⃣9️⃣ 20805 విశాఖ–న్యూఢిల్లీ ఏపీ సూపర్‌ఫాస్ట్ (27.10) 4️⃣0️⃣ 20806 న్యూఢిల్లీ–విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్ (29.10) 4️⃣1️⃣ 22707 విశాఖ–తిరుపతి డబుల్ డెక్కర్ (27.10) 4️⃣2️⃣ 18519 విశాఖ–ఎల్‌టి‌టి ఎక్స్‌ప్రెస్ (27.10) 4️⃣3️⃣ 18520 ఎల్‌టి‌టి–విశాఖ ఎక్స్‌ప్రెస్ (29.10) ప్రయాణికులు అధికారిక రైల్వే వెబ్‌సైట్ లేదా సమీప విచారణ కేంద్రంలో రైలు స్థితి తనిఖీ చేయాలి. అసౌకర్యానికి చింతిస్తున్నాము — ఈస్ట్ కోస్ట్ రైల్వే

అన్నమయ్య

చిట్వేలిలో కార్తీక శోభ: సోమేశ్వర స్వామికి రుద్రాభిషేకం. :- అమ్మవారికి పసుపు-కుంకుమ అలంకరణ – వేద స్వస్తితో ముగిసిన పూజలు

పవిత్ర కార్తీక మాసం ఆరంభమై, తొలి సోమవారం సందర్భంగా చిట్వేలిలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్తీక సోమవారం ప్రాధాన్యత దృష్ట్యా, సోమేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏక వార రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం పంచామృతాలతో శివలింగానికి అభిషేకం జరిపారు. అదేవిధంగా, ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామి వారికి మహా మంగళ హారతి ఇచ్చారు. చివరగా, ఆలయ అర్చకులు పవన్ శర్మ, సురేంద్ర శర్మ వేద మంత్రాలను పఠిస్తూ వేద స్వస్తి నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ విశేష పూజల్లో పాల్గొన్న భక్తులందరూ శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.

అన్నమయ్య

మొంథా తుఫాన్ ప్రభావితులకు చిట్వేల్‌లో పునరావాస కేంద్రం సిద్ధం :-భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారుల ఆదేశాలపై ఏర్పాట్లు పూర్తి – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిట్వేల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజల సురక్షితార్థం అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దుర్గరాజు మాట్లాడుతూ మొంథా తుఫాన్‌పై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరాదని, ప్రభుత్వ అధికారుల ద్వారా విడుదలయ్యే అధికారిక సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ పరిస్థితులు చక్కబడే వరకు ప్రజలు తమ ఇళ్లలో లేదా సురక్షిత స్థలాల్లోనే ఉండాలని, అత్యవసర పనులకే బయటకు రావాలని సూచించారు. పాఠశాల ఎన్‌సి‌సి అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ చిట్వేల్ మండల ప్రజలు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు కూడా ఉపాధ్యాయులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు, వాచ్‌మెన్‌లు తరగతి గదులు, మరుగుదొడ్లు శుభ్రపరచగా, పునరావాస బాధితుల కోసం మంచినీటి సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది చెన్నయ్య, సుహాసిని, కిరణ్ కుమార్ రాజు, వాచ్‌మెన్ వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గోళ్ల రమేష్, అనూష, శశాంత్, మన్విత్, ఏ లోకంలో ఉన్న వాళ్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

వింజమూరు అక్టోబర్ 27 పున్నమి పత్రిక ప్రతినిధి కర్నూలు బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వింజమూరు మండలం గోళ్ల వారి పల్లి గ్రామానికి చెందిన,గోళ్ల రమేష్ అనూష శశాంత్ మన్విత్ అంతిమయాత్రలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ కాలినడకన పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. సోమవారం జరిగిన అంత్యక్రియలకు ముందు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, గోళ్ల రమేష్, అనూష, శశాంత్, మన్విత్, పార్ధువ మృతదేహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ప్రమాదం జరిగిన రోజు గోళ్ల వారిపల్లె గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, ఆరోజు రాత్రి వరకు అక్కడే ఉన్నారు. ప్రమాద ఘటన తెలుసుకుంటూ, మృతదేహాలను తీసుకొచ్చేందుకు కృషి చేశారు. మూడు రోజులపాటు, అన్ని తానై ఎమ్మెల్యే చూసుకున్నారు. ఆదివారం రాత్రి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా వచ్చిన మృతదేహాలకు, ఐస్ బాక్స్ లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు నుండి చివరి వరకు అన్నీ ఖర్చులు ఎమ్మెల్యే భరించారు. శోకసముద్రంలో ఉన్న కుటుంబానికి ధైర్యాన్ని చెపుతూ, ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామస్తులు, బంధుమిత్రులను, సమాయత్తపరిచి ఘనంగా అంత్యక్రియల్లో కాకర్ల పాల్గొన్నారు. కష్టకాలంలో ఉన్న కుటుంబానికి ఆపద్బాంధవుడు, ఆత్మబంధువుగా నిలిచారు. గోళ్ల రమేష్ కుటుంబానికి కడసారి కన్నీటి వీడ్కోలు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదని, కష్టకాలంలో వారి కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గోళ్ల మాలకొండయ్య, కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా అందించడం జరిగిందన్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వారి నివాసానికి కుటుంబ సభ్యులను పరామర్శించి,విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షలు, శ్రీ కాకర్ల చారి ట్రబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఒక మూడు లక్షలు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, వారి కుటుంబాన్ని పరామర్శించి శ్రీ స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు అందించడం జరిగిందన్నారు. ఇవి కాకుండా బస్సు ఇన్సూరెన్స్, వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని, అవి కూడా తొందరలోనే అందుతాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల్లో ఎక్స్గ్రేషియా అందించడం జరుగుతుందన్నారు. ఆర్థికపరంగా, భరోసా ఉన్నప్పటికీ, వారిని అన్ని విధాల ఆదుకునే బాధ్యత ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ తీసుకుంటున్నట్లు తెలిపారు. మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ప్రత్యేకంగా పోలీస్ వారికి మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు, అంతిమయాత్రలో మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, ఎంపీపీ ఇనగనూరి మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్ల యాదవ్, పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాస్ యాదవ్, మాజీ సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు,కే శ్రీనివాసులు నాయుడు, జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ,స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

గుండాల కోనలో శోభాయమానంగా కార్తీక తొలి సోమవారం వేడుకలు ఘనంగా – శివలింగాలకు విశేష అభిషేకాలు, భక్తులతో కిటకిటలాడిన శ్రీ కర్కటేశ్వర స్వామి దేవాలయం

పవిత్ర కార్తీక మాసం ఆరంభమైన తొలి సోమవారం సందర్భంగా, రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం పెద్దూరు గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రమైన గుండాల కోనలోని శ్రీ కర్కటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ తొలి సోమవారం పురస్కరించుకొని ఆలయంలో శివలింగాలకు విశేష అభిషేకాలు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక సోమవారానికి ఉన్న విశేష ప్రాధాన్యత దృష్ట్యా, ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శివలింగాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా, నేటి తొలి సోమవారం రోజున కందుల శివప్రసాద్ ( పండు) ధర్మపత్ని కందుల పూజిత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వారు శివలింగాలకు అభిషేకంలో పాల్గొని, తమ కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, పుష్పాలతో అలంకరణ చేసి, దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మార్మోగింది. కార్తీక మాసంలో శివాలయాలను దర్శించడం, అభిషేకాలు నిర్వహించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి, శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ కమిటీ వారు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు.

భక్తి

శ్రీ స్వర్ణ లింగేశ్వరుడి లో కార్తీక దీపోశ్చవం

నెల్లూరు రూరల్ ( పున్నమి ప్రతినిధి ) నెల్లూరు రూరల్ మండలం పరిధిలో వెలసిన శ్రీ స్వర్ణ లింగేశ్వర స్వామి గణేష్ ఘాట్ లో వెలసియున్న స్వామి వారికి కార్తీక సోమవారం సందర్బంగా కార్తీక దీపాల వెలుగుతో అత్యంత వైభవం గా సాయంత్రం 6 గంటలకు ప్రధాన అర్చకులు యస్వంత్ శర్మ గారి ఆధ్వర్యంలో కార్తీక దీపము వేలింగించి పూజ కార్యక్రమం లు అత్యంత వైభవం గా జరిగింది. ఇందులో మహిళ లు, భక్తులు భారీగా పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది.

భక్తి

శ్రీ స్వర్ణ లింగేశ్వరుడి లో కార్తీక దీపోశ్చవం

నెల్లూరు రూరల్ ( పున్నమి ప్రతినిధి ) నెల్లూరు రూరల్ మండలం పరిధిలో వెలసిన శ్రీ స్వర్ణ లింగేశ్వర స్వామి గణేష్ ఘాట్ లో వెలసియున్న స్వామి వారికి కార్తీక సోమవారం సందర్బంగా కార్తీక దీపాల వెలుగుతో అత్యంత వైభవం గా సాయంత్రం 6 గంటలకు ప్రధాన అర్చకులు yeswa🌹శర్మ గారి ఆధ్వర్యంలో కార్తీక దీపము వేలింగించి పూజ కార్యక్రమం లు అత్యంత వైభవం గా జరిగింది. ఇందులో మహిళ లు, భక్తులు భారీగా పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.