Friday, 10 April 2026

Blog

విశాఖపట్నం

విశాఖ 29వవార్డులో నెలకొరిగిన భారీ వృక్షం

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* విశాఖ సౌత్ 39 వ వార్డు కోట వీధి నందు తుఫాను ప్రభావం వలన పెద్ద చెట్టు కూలిపోయి రహదారి అడ్డుగా ఉండడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించి తక్షణమే జీవీఎంసీ సిబ్బందికి ఫోను ద్వారా తెలియజేయడమైనది, జీవీఎంసీస్ సిబ్బంది తక్షణమే స్పందించి అడ్డుగా ఉన్న చెట్టును యంత్ర పరికరాలు సహాయంతో తొలగించి రోడ్డు క్లియర్ చేయడం జరిగింది

విశాఖపట్నం

మెంథా’ తుఫాన్ ఉగ్రరూపం దాల్చబోతున్నందున, రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైనవిగా మారాయి

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి • “‘మెంథా’ తుఫాన్ ఉగ్రరూపం దాల్చబోతున్నందున, రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైనవిగా మారాయి. తీరప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, అవసరం లేని బయటకు వెళ్లడాన్ని నివారించాలి,” అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు తెలిపారు. • “పరిస్థితి చేయజారిపోకముందే నాయకులు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని సిద్ధంగా ఉండాలి. ప్రజల భద్రతే మన ప్రథమ కర్తవ్యం,” అని ఆయన స్పష్టం చేశారు. • తీరప్రాంతం, కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఇప్పటికే ప్రభుత్వం సురక్షిత వసతిగృహాలకు తరలించిందని, టీడీపీ మరియు కూటమి కార్యకర్తలు ఈ సహాయక చర్యల్లో ముందుండి సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. • “రాబోయే 48 గంటలపాటు కూడా ఇదే క్రమశిక్షణ, నిబద్ధత కొనసాగించాలి. కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు తోడుగా, అధికారులకు అందుబాటులో ఉండాలి,” అని పల్లా శ్రీనివాసరావు గారు సూచించారు. • టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, ఆయనే స్వయంగా విభాగాల పనితీరును సమీక్షిస్తూ ప్రాణ, ఆస్తి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారని పల్లా గారు వివరించారు. • “మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు గత రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్‌లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, ఫీల్డ్ స్థాయి సమస్యలను రియల్ టైమ్‌లో పరిష్కరిస్తున్నారు. ఆయన కృషి, నిబద్ధత అభినందనీయమైనవి,” అని ఆయన అన్నారు. • ఈ అత్యవసర సమయంలో కూడా వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో పాత తుఫాన్ల (హుద్‌హుద్, టిట్లీ) చిత్రాలు, వీడియోలను ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాన్ని రేకెత్తించడం ఖండనీయమని పల్లా శ్రీనివాసరావు గారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. • “సహాయం చేయలేకపోతే కనీసం ప్రజల్లో భయం సృష్టించకండి. సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వాడండి. మనమందరం ఐక్యంగా ఈ సవాళ్లను ఎదుర్కొని నిలబడతాం,” అని పల్లా గారు అన్నారు. • “చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి పర్యవేక్షణ, ఆంధ్రప్రజల ధైర్యం కలిసి ఈ విపత్తును కూడా జయించగలవు,” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు… (సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం బాధాకరం – పల్లా శ్రీనివాసరావు) “ఈ కష్టసమయంలో ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వైఎస్సార్సీపీ పాత తుఫాన్ల ఫోటోలు, వీడియోలు ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఇది ప్రజల్లో గందరగోళం, భయాందోళనలు సృష్టించడానికి చేసిన అప్రజాస్వామిక చర్య,” అని పల్లా శ్రీనివాసరావు గారు విమర్శించారు. • “ఈ విపత్తు సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలి. సహాయం చేయలేకపోయినా, కనీసం అబద్ధపు ప్రచారాలతో భయం వ్యాప్తి చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలి,” అని ఆయన పిలుపునిచ్చారు…

జోగులాంబ గద్వాల

జమ్ములమ్మ ఆలయంలో చోరీ

అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణంలోని ఊరి చివరలో ఉన్న జమ్ములమ్మ ఆలయంలో చోరీ కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని సామాగ్రిని దోచుకెళ్లడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

E-పేపర్

ఉరుస్ మహోత్సవాలకి ముస్తాబ్ అవుతున్న మగ్ధమ్ షావలి దర్గా నందలూరు

హజరత్ ఖ్వాజా సయ్యద్ షా వల్లీ మగ్దూం మొహమ్మద్ ఉరుస్ మహోత్సవాలకు దర్గా కమిటీ వారు ఉరుసు కు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకులు ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు,ఈ సందర్భంగా దర్గా పెద్ద పీఠాధిపతి మరియు చిన్న పీఠాధిపతి సయ్యద్ హైదర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈనెల 31-10-2025 జరగనున్న ఉరుసు మహోత్సవాలకు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొవాలని పత్రికా ముఖంగా తెలియజేశారు.

E-పేపర్

ఉరుస్ మహోత్సవాలకి ముస్తాబ్ అవుతున్న మగ్ధమ్ షావలి దర్గా నందలూరు

హజరత్ ఖ్వాజా సయ్యద్ షా వల్లీ మగ్దూం మొహమ్మద్ ఉరుస్ మహోత్సవాలకు దర్గా కమిటీ వారు ఉరుసు కు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకులు ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు,ఈ సందర్భంగా దర్గా పెద్ద పీఠాధిపతి మరియు చిన్న పీఠాధిపతి సయ్యద్ హైదర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈనెల 31-10-2025 జరగనున్న ఉరుసు మహోత్సవాలకు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొవాలని పత్రికా ముఖంగా తెలియజేశారు.

E-పేపర్

ఉరుస్ మహోత్సవాలకి ముస్తాబ్ అవుతున్న మగ్ధమ్ షావలి దర్గా నందలూరు

హజరత్ ఖ్వాజా సయ్యద్ షా వల్లీ మగ్దూం మొహమ్మద్ ఉరుస్ మహోత్సవాలకు దర్గా కమిటీ వారు ఉరుసు కు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకులు ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు,ఈ సందర్భంగా దర్గా పెద్ద పీఠాధిపతి మరియు చిన్న పీఠాధిపతి సయ్యద్ హైదర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈనెల 31-10-2025 జరగనున్న ఉరుసు మహోత్సవాలకు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొవాలని పత్రికా ముఖంగా తెలియజేశారు.

జోగులాంబ గద్వాల

కార్డెన్ సర్చ్ నిర్వహించిన – DSP మొగులయ్య.

జోగులాంబ గద్వాల జిల్లా SP శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అయిజ పట్టణం, దుర్గ నగర్ కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. 68 బైకులు 2 ఆటోలు, 3 కార్లు, మొత్తం 73 వెహికల్స్ స్వాధీనం చేసుకొని సరైన ధ్రువపత్రాలు చూపించి తీసుకెళ్లగలరని DSP మొగులయ్య తెలిపారు. ఈకార్యక్రమంలో CI టాటా బాబు, రాజోలు ఎస్ఐ గోకారితోపాటు నలుగురు ఎస్సైలు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గ్రామీణ స్థానిక సంస్థలకు ఊరట – 15వ ఆర్థిక సంఘం నిధులుగా రూ.410 కోట్లు విడుదల

పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ 15వ ఆర్థిక సంఘం కింద గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.410 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అన్‌టైడ్ గ్రాంట్‌గా రూ.365 కోట్లు, అదనపు నిధులుగా మరో రూ.45 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిధులు గ్రామీణ అభివృద్ధి, ప్రాథమిక సదుపాయాల విస్తరణ, మౌలిక వసతుల బలోపేతానికి వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్

ఇద్దరు డిఎస్పీలు ఒక్కటయ్యారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఘనంగా డీఎస్పీ వివాహ మహోత్సవం జరిగింది..గతంలో చందోలు పోలీస్‌ స్టేషన్‌లో ట్రైనింగ్‌ డీఎస్పీగా విధులు నిర్వహించి, ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న విద్యశ్రీ, పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పనిచేస్తున్న జగదీష్ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది.. పోలీసు శాఖలో ఒకే క్యాడర్లో ఉన్న ఇరువురు అధికారులు ప్రేమ వివాహం చేసుకోవడం విశేషంగా మారింది..

ఆంధ్రప్రదేశ్

మంథా మరింత తీవ్ర రూపం దాల్చి తీవ్ర తుఫానుగా మారింది

మంథా మరింత తీవ్ర రూపం దాల్చి తీవ్ర తుఫానుగా మారింది మరియు గోదావరి జిల్లాలకు చేరువగా కదిలే అవకాశం ఉంది. ఇంతకు ముందు సూచించినట్లుగా, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షపాతం పెరగడం మొదలైంది, అదే సమయంలో మొత్తం ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు మధ్య ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మోస్తరు జల్లులు విస్తరిస్తున్నాయి. అలాగే, మొత్తం ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గాలి వేగం కూడా 40-50 కి.మీ./గంటకు పెరిగింది. తుఫాను పైకి కదులుతున్న కొద్దీ, ఆంధ్రప్రదేశ్ వెంబడి వర్షపాతం మరియు గాలులు తీవ్రంగా పెరుగుతాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.