Friday, 10 April 2026

Blog

విశాఖపట్నం

తుఫాన్ నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గం లో వివిధ వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ *

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* తుఫాన్ నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గం లో వివిధ వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు పలు వార్డుల్లో కూటమి శ్రేణులతో పర్యటించిన ఎమ్మెల్యే* *పునరావాస కేంద్రాలను మరియు క్షేత్రస్థాయిలో జరిగే ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే* *తీర ప్రాంతం తో పాటు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో స్వయంగా పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే* *30, 31 ,35 ,36, 37 ,38, 39 వార్డుల్లో స్థానిక ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే* *ప్రజల రక్షణే ప్రథమ లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు కూటమి శ్రేణులకు పిలుపు* *అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ఎమ్మెల్యే* *జోరు వానలో నియోజకవర్గ పర్యటనపై ఎమ్మెల్యే పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్న ప్రజలు* ఈరోజు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు దక్షిణ నియోజకవర్గం నియోజవర్గ స్థాయిలో ఉన్న పలు వార్డుల్లో పర్యటించారు. ఆయా వార్డులు పర్యటనలో భాగంగా కూటమి శ్రేణులతో , స్థానిక ప్రజలను కలిసి తుఫాను ప్రభావం పై ఆరా తీశారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలను మరియు నిరాశ్రయులకు కల్పించే ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పలుచోట్ల నీరు నిల్వ ఉండడాన్ని గమనించి, సంబంధిత అధికారులను పిలిపించి, క్లియర్ అయ్యేవిధంగా స్వయంగా పర్యవేక్షించారు. జోనల్ కమిషనర్ శ్రీ మల్లయ్య నాయుడు మరియు ఎమ్మార్వో శ్రీ పాత్రుడు గారు మరి ఇతర అధికారులతో మాట్లాడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలియజేశారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్నట్లయితే తీసుకోవాల్సిన చర్యలు పై కూడా అధికారులకు వివరించారు. 35వ వార్డు స్టేడియం దగ్గర్లో నీరు నిల్వ ఉండడాన్ని గమనించి వెంటనే క్లియర్ అయ్యేవిధంగా చూడాలని అధికారులకు తెలిపారు. 36వ వార్డులో ఎవెన్ కాలేజ్ కాలేజీ వద్ద గోడ కూలిన నేపథ్యంలో ఆటో పూర్తిగా ధ్వంసమై కుటుంబంతో మాట్లాడి, సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. నావెల్ క్యాంటీన్ వద్ద స్థానిక మత్స్యకారులు కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎలాంటి సహకారం కావాలన్నా తాను సిద్ధంగా ఉన్నానని వివరించారు. 39 వ వార్డు 31 వ వార్డు మరి ఇతర వార్డుల్లో ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్ తో పాటు వివిధ హోదాలలో ఉన్న టిడిపి, జనసేన ,బిజెపి శ్రేణులు స్థానిక వార్డు సిబ్బంది , జీవీఎంసీ సిబ్బంది ,సచివాలయం సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బందితో పాటు విభాగాల అధికారులు పాల్గొన్నారు..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం

మొంథా తుఫాన్ ప్రభావంతో వింజమూరు మండల పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. వింజమూరు చెరువులోకి నీరు చేరాయి. వివిధ సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు, ప్రజలు వర్షం ప్రభావంతో కొంత అసౌకర్యానికి గురయ్యారు

విశాఖపట్నం

విశాఖ మెఘాద్రిగడ్డ రిజర్వాయర్‌ నాలుగు గేట్లు ఎత్తి వేత

*విశాఖపట్నంఅక్టోబర్ పున్నమి ప్రతినిధి* గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో విశాఖ మెఘాద్రిగడ్డ రిజర్వాయర్‌లో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఫలితంగా రిజర్వాయర్‌ పూర్తిస్థాయికి చేరువ కావడంతో అధికారులు మంగళవారం జాగ్రత్త చర్యగా నాలుగు గేట్లను ఎత్తివేశారు. దీంతో రిజర్వాయర్‌ దిగువ ప్రాంతాలకు భారీగా నీరు విడుదల అవుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మెఘాద్రిగడ్డ రిజర్వాయర్‌లో ప్రస్తుతం సుమారు 5,500 క్యూసెక్కుల నీరు నిల్వగా ఉండగా, మొత్తం సామర్థ్యం 6,600 క్యూసెక్కులు. నీటి మట్టం మరింత పెరగకుండా ముందస్తు చర్యగా అధికారులు గేట్లను ఎత్తివేసినట్లు తెలిపారు. వర్షాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని గేట్లు ఎత్తివేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఆర్యవైశ్య సంఘం – ఉచిత అంబులెన్స్ సర్వీస్

నందిగామ పట్టణానికి సమీపం లో ఉన్న చందాపురం గ్రామానికి చెందిన పాపట్ల పవన్ – కావేరి దంపతుల 12 నెలల చంటి బిడ్డ ఆరోగ్యం బాగోలేకపోవడంతో, స్థానిక పూజిత హాస్పటల్ నుండి విజయవాడ ప్రభుత్వ హాస్పటల్‌కు ఆక్సిజన్ సదుపాయంతో అత్యవసరంగా తరలించాల్సి వచ్చింది. ఈ సందర్భంలో పవన్ సోదరుడు నరేష్ నందిగామ ఆర్యవైశ్య సంఘానికి ఉచిత అంబులెన్స్ సేవ కోరగా, సంఘం వారు పెట్రోలు మరియు డ్రైవర్ బేటా చెల్లించి వెంటనే అంబులెన్స్ పంపించారు. *ప్రత్యేక కృతజ్ఞతలు* : నందిగామ ఆర్యవైశ్య సంఘానికి ₹4 లక్షల వ్యయంతో ఉచిత అంబులెన్స్ అందజేసిన మారాజు కపిలవాయి గంగాధర్ (గంగ) కు – UK నుండి హృదయపూర్వకధన్యవాదాలు. ఉచిత అంబులెన్స్ కావాల్సిన వారు సంప్రదించవలసిన నంబర్: 98 490 48 238.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కన్నీరు పెట్టని కళ్ళు లేవు.. ఊరంతా విషాదమే బస్సు దహనం దుర్ఘటనలోమృతుల అంత్యక్రియలు

కర్నూల్ వద్ద జరిగిన బస్సు దహనం దుర్ఘటనలో మరణించి నలుగురు కుటుంబ సభ్యుల అంత్యక్రియలు సోమవారం ఉదయం జరిగాయి. వింజమూరు మండలం గోళ్ళవారిపల్లికి చెందిన రమేష్, అతడి భార్య , ఇద్దరు పిల్లలు బస్సులోనే సజీవ దహనం అయ్యారు. ఉదయం వారి అవశేషాలకు , ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ఈ సందర్భంగా ఊరు మొత్తం కన్నీరు పెట్టింది. బెంగుళూరు నుంచి మృతుల స్నేహితులు కూడా వచ్చారు.

ఆంధ్రప్రదేశ్

తీవ్రమైన తుఫాను మంథాను

తీవ్రమైన తుఫాను మంథాను ఒకసారి చూడండి. ఈ తుఫాను ఉత్తర ప్రాంతాలకు విస్తరించినందున, కాకినాడ – అమలాపురం – నర్సాపురం ప్రాంతాలలో ప్రస్తుతానికి ఎండగా ఉంది. అయితే, దీనికి దక్షిణంగా ఉన్న పసుపు మరియు ఎరుపు రంగు ప్రాంతాలు బలంగా కనిపిస్తున్నాయి.ఈ రోజు రాత్రి తుఫాను తీరం దాటే ప్రక్రియ మొదలవగానే, ఈ పట్టీలు (bands) కృష్ణా మరియు బాపట్ల జిల్లాలపై తీవ్రంగా దాడి చేస్తాయి. ఆ తర్వాత రేపు ఉదయం ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ ప్రాంతం) – అమరావతి – గుంటూరు మరియు ఏలూరు – పశ్చిమ గోదావరి జిల్లాలలోని కొన్ని భాగాలపై ప్రభావం చూపుతాయి.2023లో వచ్చిన మిచౌంగ్ తుఫాను తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను తాకబోతున్న శక్తివంతమైన తుఫానులా ఇది కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ దీనికి సిద్ధంగా ఉండాలి.

అనకాపల్లి

రెండవ రోజు కొనసాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ రిలే నిరాహార దీక్ష

చోడవరం, అక్టోబర్ 28: చోడవరంలోని MRO ఆఫీసు వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. వెంకన్నపాలెం–చోడవరం–మాడుగుల–రోలుగుంట–పాడేరు మార్గాల పునర్నిర్మాణం కోసం పార్టీ నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. గోతులుగా మారిన రోడ్లు చెరువుల్లా మారిపోయి, పాఠశాల బస్సులు, ఆర్టీసీ వాహనాలు, ఆటోలు, మోటార్ సైకిళ్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు పనులు పూర్తి అయ్యే వరకు క్వారీ లారీలు నడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే విజయరామరాజుపేట బ్రిడ్జి మరమ్మతులు, వడ్డాది బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని, టెండర్లు పిలవాలని కోరింది. ఈ నిరాహార దీక్షలో జిల్లా కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు, నియోజకవర్గ కన్వీనర్ వేగి మహాలక్ష్మి నాయుడు, కార్యకర్తలు కే. త్రినాథ్ రావు, కాంగ్రెస్ పార్టీ నేతలు పడాల కొండలరావు, రాము తదితరులు పాల్గొన్నారు. శిబిరాన్ని పూలమాలలతో ప్రారంభించిన పసుమర్తి సతీష్ కు పార్టీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కోనసీమలో విషాదం.. చెట్టు కూలి మహిళ మృతి

అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్టోబర్ 28 (పున్నమి ప్రతినిధి) తుఫాను ప్రభావంతో కోనసీమలో ఈదురు గాలుల తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో మామిడికుదురు మండలంలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాకనపాలెంలోని ఓ ఇంటి ఆవరణలో తాటిచెట్టు పడిపోవడంతో గూడపల్లి వీరవేణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

విశాఖపట్నం

తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో రహదారులపై ఆంక్షలు

తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థపై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాలను ఈ రోజు రాత్రి 7 గంటల నుంచే నిలుపుదల చేయాలని సూచించింది. వాహనదారులు ముందుగానే సురక్షితమైన లే-బై ప్రాంతాల్లో నిలిపి ఉంచాలని, ప్రమాదకర మార్గాల్లో ప్రయాణం చేయవద్దని సంస్థ హెచ్చరించింది. అదేవిధంగా ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే ఉండాలని, వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ స్థానిక అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేసింది.

తిరుపతి

తుఫాన్ పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి:బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తుఫాను పరిస్థితుల ను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూటమి నాయకులు,అధికారుల తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ పట్ల ప్రజల ను అప్రమత్తం చేయాలని దిశా నిర్దేశం చేశారు.ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ లో పాల్గొంటూ,తుఫాన్ ప్రభావం తో నియోజకవర్గం లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ, వెంటనే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు.ప్రజలకి ఎవరి కైనా అత్యవసర సహాయం కావాల్సి వస్తే శ్రీకాళహస్తి ఆర్డిఓ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 8555003504 నెంబర్ కు కాల్ చేయాలని ప్రజలకు తెలియజేయమని కూటమి నాయకులకు అధికారులకు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.