Friday, 10 April 2026

Blog

విశాఖపట్నం

వర్ష ప్రభావిత ప్రాంతాలలో డాక్టర్ కందుల పర్యటన

వర్ష ప్రభావిత ప్రాంతాలలో డాక్టర్ కందుల పర్యటన *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* ★ వార్డులో ప్రతి ప్రాంతాన్ని కలియ తిరిగిన డాక్టర్ కందుల ★ తారకరామ కాలనీలో పాక్షికంగా కూలిన నాలుగు ఇళ్లు ★ కృష్ణ గార్డెన్స్ లో తాగునీటిలో కలుస్తున్న మురుగునీరు ★ మూడు రోజులు ముందస్తుగా రేషన్ సరుకులు అందజేత వర్ష ప్రభావిత ప్రాంతాలలో విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పర్యటించారు. వార్డులోని ప్రతి ప్రాంతాన్ని పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు, ఈదురు గాలులు నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు, వృద్దులు, గర్భిణీలు ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి రాకూడదని చెప్పారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా చెట్లు, హోర్డింగులు కూలి పాయే అవకాశం ఉందన్న వాటి కింద ఉండవద్దని సూచించారు. అలాగే వార్డులో తారకరామ కాలనీలో పాక్షికంగా కూలిపోయిన నాలుగు ఇళ్లను ఆయన పరిశీలించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి తగిన సహాయం చేయాలని కమిషనర్ కి విన్నవించారు. అలాగే వార్డులో నెలకొన్న సమస్యలను ఎమ్మార్వో దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అదేవిధంగా కృష్ణ గార్డెన్స్ ప్రాంతంలో తాగునీటిలో మురుగునీరు చేరిపోయి వస్తూ ఉండటం పై గమనించి ఈ విషయం అధికారులకు తెలియజేశారు. మూడు రోజులు ముందుగా రేషన్ సరుకులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వార్డులో తారకరామ కాలనీ తో పాటు అలాగే కృష్ణ గార్డెన్స్ అదే విధంగా భీమ్ నగర్, అల్లిపురం, ఏడు గుళ్ళు ప్రాంతం, నేరెళ్ల కోనేరు ప్రాంతాలలో ఆయన పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా తాను ముందు ఉండి ఆ సమస్య పరిష్కారానికి తన పూర్తి సహకారాన్ని అందిస్తానని ఎవరు ఆధ్వర్యంలో డాక్టర్ కందుల నాగరాజు భరోసా ఇచ్చారు. వీఆర్వో తులసి, కే .కృష్ణ, సిపిఐ బుజ్జి, పి. చిన్ని,ఎస్. రాము,బి. అప్పలరాజు,ఎస్. లక్ష్మణరావు, వై .గణేష్, ఎస్ .కృష్ణ, సన్ని బాబు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఉత్తర నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ. విష్ణుకుమార్ రాజు

ఉత్తర నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ. విష్ణుకుమార్ రాజు గారు, మంతా తుఫాన్ కారణంగా చోటుచేసుకున్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* తుఫాన్ ప్రభావంతో ఉత్తర నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో చెట్లు విరిగిపడడం, కొండవాలు ప్రాంతంలో జారిపడడం, మాధవధార వాంబే కాలనీలో ఇళ్లు పెచ్చులు ఊడిపడడం ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతాలను సందర్శించి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ కలెక్టర్ మాధురి గారు, స్థానిక కార్పొరేటర్ లు రేయి వెంకట రమణ, కట్టుమూరి సతీష్ గారు, సారిపల్లి గోవింద్ గారు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ గారు, సురేష్ బాబు గారు, ఉషా కిరణ్ గారు, మండల మరియు వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, చెట్లను త్వరితగతిన తొలగించాలి, ప్రమాదకర ఇళ్లను ఖాళీ చేయించి రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించాలి, గురుద్వార్ సమీపంలో హైవే కుంగిన ప్రాంతంలో ట్రాఫిక్ స్టాపర్ ఏర్పాటు చేసి, వెంటనే రహదారి మరమ్మత్తులు చేపట్టాలని పోలీసు మరియు ట్రాఫిక్ అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే గారు ప్రజల భద్రతే ప్రాధాన్యమని పేర్కొని, ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సహాయక చర్యలు తక్షణమే ప్రారంభించబడతాయని తెలిపారు.

తిరుపతి

యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తిలోని లోతట్టు ప్రాంతమైన భరద్వాజ తీర్థం పక్కన ఉన్న ఎస్టీ కాలనీ నందు తుఫాను కారణంగా నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవభారత్ యువజన సంఘం అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు గారు సభ్యులు న్యాయవాది రాజేశ్వరరావు చిన్నబ్బా, సభ్యులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పునరావస కేంద్రాన్ని సందర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు .

* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాల పాలెం గ్రామంలో మోంధా తుఫాను పునరావాస కేంద్రాలను సందర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు* పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం గ్రామంలో మోంధా తుఫాన్ పునరావస కేంద్రాన్ని సందర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు. తుఫాన్ పునరావాస కేంద్రాంలో మత్స్యకారులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నిత్యం తుఫాన్ పరిస్థితులు మినిట్ టూ మినిట్ మౌనరటింగ్ చేస్తూ అవసరమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు. తుఫాన్ పునరావాస కేంద్రాలకు విచ్చేసిన ప్రజలకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం వసతి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎవరైతే ఇల్లు కోల్పోయిన వారు ఉంటే వాళ్ళు కూడా తుఫాను తగ్గిన అనంతరం ఇంటింటికి వెళ్లి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం తరువాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసిన సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజల కోసం సూచన చేశారు. తుఫాను కారణంగా ముత్యాలమ్మ పాలెం సముద్రతీరాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఈ తుఫాను తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, అదేవిధంగా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి, ఎక్కడ ఆస్తి మరియు ప్రాణనష్టం జరగకుండా చూడడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించి అత్యవసరము అయితే తప్ప దయచేసి బయటకు రాకుండా ఉండాలన్నారు. మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉండడం వలన చెట్లు పడిపోవడం, పిడుగులు పడడం వంటివి జరుగుతాయి కాబట్టి ప్రజలను బయటకు రావద్దన్నారు. తుఫాను బిల్డింగుల్లో తలదాచుకుంటున్న వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని, భోజన వసతి, అనారోగ్యం పాలవకుండా డాక్టర్లను, కరెంటు సమస్య రాకుండా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేసామన్నారు. పాత గోడలు, కరెంటు స్తంభాల సమీపంలోనూ ఉండవద్దని సూచించారు. అన్ని శాఖల అధికారులు చాలా అప్రమత్తంగా పనిచేస్తున్నారని, ముఖ్యంగా పోలీస్ మరియు విద్యుత్ శాఖ అధికారులు రెవిన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, అన్ని శాఖల అధికారులు ఫోన్ నెంబర్లు పనిచేస్తాయని, ఎక్కడ ఏ ఇబ్బంది కలిగిన వెంటనే వారికి సమాచారం తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరవాడ మండల ఎంపీడీవో రమేష్ నాయుడు గారు, మండల రెవెన్యూ అధికారి నాగరాజు గారు,ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు ముత్యాలమ్మ పాలెం సర్పంచ్ రాష్ట్ర మత్స్యకార సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీమతి శ్రీ చింతకాయల సుజాత ముత్యాలు గారు, పంచకర్ల ప్రసాద్ రావు గారు,మాజీ జెడ్పిటిసి సభ్యులు పైల జగన్నాధరావు గారు, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు గారు, పరవాడ మండలం పార్టీ అధ్యక్షులు బోద్దపు శ్రీనివాసులు, వియ్యపు చిన్న గారు, ఉపాధ్యక్షు వెన్నెల నరసింహారావు గారు, సర్పంచులు మోటూరు సన్యాసినాయుడు గారు, కన్నూరి వెంకటరమణ గారు, కొండ్రపు శ్రీరామమూర్తి గారు,జిల్లా కార్యవర్గ సభ్యులు బుగుడి రామ గోవిందరావు గారు,మాజీ కార్పొరేటర్ డల్లా రామనాయుడు గారు, కేఎన్ఆర్ గారు, రాపర్తి కిషోర్ గారు, మోసా రామకృష్ణ గారు,బంటు సురేష్ గారు, సన్ని బాబు గారు,అనిల్ గారు, నాగిరెడ్డి చెన్నారావు గారు, పావని గారు, మొదలగు పరవాడ మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకోటమే నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

ఎమ్మెల్యే అదేశాలతో ముంపు ప్రాంతాలలో పర్యటించిన తెదేపా నాయకులు

శ్రీకాళహస్తి అక్టోబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజిక వర్గ శ్యాసన సభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ముంపు ప్రాంతాలను గుర్తించి వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న బాదితులకు బాసటగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో ఎమ్మెల్యే పిలుపు మేరకు తెదేపా నాయకులు నియోజిక వర్గంలోని ముళ్లపూడి ఎస్టీ కాలనీ, ఈదల కాలువలో మొంథా తుఫాను ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా మండల అధ్యక్షుడు అక్షింతల‌ కిష్ణా యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయనాయుడు, యునిట్ ఇంచార్జ బత్తయ్య, తహశీల్దారు జనార్థన్ రాజు, డి.టి అనిల్, యం.పి.డ.ఓ ఇరిగేషన్ ఎ.ఇ, ప్రభుత్వ అధికారులటో కలసి నీటి సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ మొంథా తుఫాను కారణంగా ఈదుల‌ కాలవులో ప్రవాహం ఎక్కవగా ఉండడంతో సెంటర్ ప్రజల ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా ప్రభుత్వ అధికారులను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అప్రమత్తం చెయ్యడం జరిగిందని, ప్రజలకు తుఫాను కారణంగా ఎమైనా ఇబ్బందులు వస్తే పార్టీ నాయకులకు దృష్టికీ తీసుకు రావాలని తద్వారా అధికారులను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుందని తెదేపా నాయకులు గ్రామస్తులను కోరారు

విశాఖపట్నం

తుపాను ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌రిశీలించిన విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్*

*తుపాను ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్* విశాఖ‌ప‌ట్ట‌ణం, అక్టోబ‌ర్ పున్నమి ప్రతినిధి ః న‌గ‌రంలోని తుపాను ప్ర‌భావిత ప్రాంతాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్రసాద్ ప‌రిశీలించారు. మంగ‌ళ‌వారం ఉద‌యం కైలాస‌పురం, శాంతిన‌గ‌ర్, క‌స్తూరిన‌గ‌ర్, మాధ‌వ‌ధార అంబేద్క‌ర్ కాల‌నీల్లో తుపాను ప‌రిస్థితిని స‌మీక్షించి, అధికారుల‌ను, ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ప్రాంతాల‌ను ప‌రిశీలించి అక్క‌డి ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఇలాంటి స‌మ‌యంలో కొండ‌వాలు ప్రాంతాల్లో ఉండ‌టం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ద‌య‌చేసి స‌మీపంలోని నివాసితులంద‌రూ పున‌రావాస కేంద్రాల‌కు వెళ్లాల‌ని క‌లెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. స్థానిక స‌చివాల‌యంలో సిబ్బంది అందుబాటులో ఉంటార‌ని, ఎలాంటి స‌హాయ‌మైనా అందిస్తార‌ని సూచించారు. పున‌రావాస కేంద్రాల్లో అన్ని ర‌కాల వ‌స‌తులు క‌ల్పించామ‌ని, ప‌రిస్థితులు మారే వ‌ర‌కు అంద‌రూ అక్క‌డ త‌ల‌దాచుకోవాల‌ని చెప్పారు. మాధ‌వ‌ధార అంబేద్కర్ కాల‌నీలోని వాంబే గృహ స‌ముదాయాల‌ను సంద‌ర్శించి అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. పాక్షికంగా దెబ్బ‌తిన్న గోడ‌ను ప‌రిశీలించి అధికారుల‌కు త‌గిన ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌మాద‌క‌ర స్థితిలో ఉన్న ప్ర‌జ‌లంద‌రినీ పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించాల‌ని స్థానిక అధికారుల‌ను, సిబ్బందిని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఆయ‌న వెంట జోన‌ల్ ప్ర‌త్యేకాధికారి మాధ‌వి, రెవెన్యూ, ఇత‌ర అధికారులు ఉన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం

వింజమూరు GBKR ST కాలనీకి చెందిన అల్లూరు వాసు(23) గత రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సర్పంచ్ నల్లగొండ సృజన భర్త రాయుడు మృతుని మట్టి ఖర్చులు నిమిత్తం కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. మృతునికి మూడు నెలల క్రితమే వివాహం కావడంతో కాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి మరింత ఆర్థిక సాయం చేస్తామన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తుఫాన్ కారణంగా తాటిచెట్టు పడి మహిళ మృతి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మాకనపాలెం గ్రామంలో మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. గాలివానలకు తాటిచెట్టు విరిగి (50)ఏళ్ల గూడవల్లి వీరవేణి అనే మహిళపై పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. తుఫాన్‌ ప్రభావం కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

విశాఖపట్నం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో అన్ని విభాగాలు

*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో అన్ని విభాగాలు సమన్వయంతో చర్యలు* *క్షేత్ర స్థాయిలో యువనాయకులు, ఐటీ మంత్రి నారా లోకేష్ చురుకైన సమన్వయం* *తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:* రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు యారాడ ప్రాంతంలో ఇరిగిపోయిన కొండచరియలు, లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉన్న వర్షపు నీరు, డ్రైనేజ్ వాటర్ ఓవర్‌ఫ్లో అవుతున్న ప్రాంతాలను మరియు ఇతర ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి బాధితులను పరామర్శించారు. స్థానిక ప్రజల పరిస్థితిని తెలుసుకొని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. మెంథా’ తుఫాన్ ఉగ్రరూపం దాల్చబోతున్నందున, రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైనవిగా మారాయి. తీరప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, అవసరం లేని బయటకు వెళ్లడాన్ని నివారించాలి,” అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పరిస్థితి చేయజారిపోకముందే నాయకులు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని సిద్ధంగా ఉండాలి. ప్రజల భద్రతే మన ప్రథమ కర్తవ్యం అని ఆయన స్పష్టం చేశారు తీరప్రాంతం, కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఇప్పటికే ప్రభుత్వం సురక్షిత వసతిగృహాలకు తరలించారని తెలిపారు. *తుఫాన్ సహాయక చర్యల్లో టీడీపీ, కూటమి నాయకుల చురుకైన భాగస్వామ్యం* టీడీపీ మరియు కూటమి కార్యకర్తలు ఈ సహాయక చర్యల్లో ముందుండి సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. రాబోయే 48 గంటలపాటు కూడా ఇదే క్రమశిక్షణ, నిబద్ధత కొనసాగించాలి. కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు తోడుగా, అధికారులకు అందుబాటులో ఉండాలి,” అని పల్లా శ్రీనివాసరావు గారు సూచించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, ఆయనే స్వయంగా విభాగాల పనితీరును సమీక్షిస్తూ ప్రాణ, ఆస్తి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారని పల్లా గారు వివరించారు. మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు గత రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్‌లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, ఫీల్డ్ స్థాయి సమస్యలను రియల్ టైమ్‌లో పరిష్కరిస్తున్నారు. ఆయన కృషి, నిబద్ధత అభినందనీయమైనవి అని ఆయన అన్నారు. *వైఎస్సార్సీపీ నేతల తప్పుడు ప్రచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది* ఈ అత్యవసర సమయంలో కూడా వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో పాత తుఫాన్ల (హుద్‌హుద్, టిట్లీ) చిత్రాలు, వీడియోలను ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాన్ని రేకెత్తించడం ఖండనీయమని పల్లా శ్రీనివాసరావు గారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయం చేయలేకపోతే కనీసం ప్రజల్లో భయం సృష్టించకండి. సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వాడండి. మనమందరం ఐక్యంగా ఈ సవాళ్లను ఎదుర్కొని నిలబడతాం అని పల్లా గారు అన్నారు. ఈ కష్టసమయంలో ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వైఎస్సార్సీపీ పాత తుఫాన్ల ఫోటోలు, వీడియోలు ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఇది ప్రజల్లో గందరగోళం, భయాందోళనలు సృష్టించడానికి చేసిన అప్రజాస్వామిక చర్య,” అని పల్లా శ్రీనివాసరావు గారు విమర్శించారు. ఈ విపత్తు సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలి. సహాయం చేయలేకపోయినా, కనీసం అబద్ధపు ప్రచారాలతో భయం వ్యాప్తి చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.

కాకినాడ

ప్రజలకు అండగా ఉంటా – ఎమ్మెల్యే చినరాజప్ప.

పున్నమి న్యూస్, పెద్దాపురం 28/10 ప్రజలందరికీ అండగా ఉంటామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాథ్ తెలిపారు. మంగళవారం సామర్లకోట టిడ్కో ప్రాంతంలో ఇళ్లను ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించి, అక్కడి ప్రజలతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరస్థితిలో పునరాస కేంద్రాలకు తరలిరావాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.