Friday, 10 April 2026

Blog

విశాఖపట్నం

విశాఖ విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ అప్పలరాజు ఆకస్మిక మరణం… అశ్రు నివాళులర్పించిన బంధువులు, స్నేహితులు , విశాలాంధ్ర, అరసం, సిపిఐ శ్రేణులు

విశాలాంధ్ర విశాఖ బుక్ హౌస్ మేనేజర్ పోలవరపు అప్పలరాజు మంగళవారం ఉదయం గుండెపోటు తో ఆకస్మిక మరణం పొందారు. బంధువులు, స్నేహితులు హుటాహుటిన కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారించడంతో విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు పరుగు పరుగున ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరై విలపించారు. పోలవరపు అప్పారావు , అప్పల నరసమ్మ దంపతులకు ఏకైక పుత్రుడు గా 1979 ఏప్రిల్ 20 లో పుట్టిన అప్పలరాజు కు భార్య కనకరత్నం, కుమారుడు వెంకట్ నీరజ్, ఐదుగురు అక్క చెల్లెలు వున్నారు. విశాఖ నగరంలో వన్ టౌన్, లక్ష్మీ టాకీస్ పద్మా నగర్ లో జన్మించిన రాజు , దినపత్రిక పేపర్ బోయగా చేరిన తర్వాత కాలంలో 1996 లో విశాలాంధ్ర బుక్ హౌస్ లో ప్యాకర్ గా చేరారు. యోగి మేనేజర్ ఉన్న గా కాలంలో రాజు బుక్ హౌస్ ఉద్యోగిగా చేరిన అంచంచలుగా ఎదుగుతూ శ్రీకాకుళం బ్రాంచ్ మేనేజర్ గా , తర్వాత విశాఖపట్నం మేనేజర్ గానే కొనసాగారు. అరసం, సిపిఐ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అప్పలరాజు పార్థివ దేహానికి సిపిఐ నేతలు ఎర్రజెండాను కప్పి నివాళులర్పించారు. విశాలాంధ్ర తరపున విశాఖపట్నం బ్యూరో పి. రామక్రిష్ణ , ఎడిషన్ మేనేజర్ సనపల నరసింహులు, సర్కులేషన్ బాధ్యులు కిరణ్ తదితరులు ఘన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అత్తిలి విమల, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.చంద్రశేఖర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం.మన్మధరావు, సిఎన్ క్షేత్రపాలరెడ్డి, ఎం.డి బేగం, జిల్లా సమితి సభ్యులు జె. అన్వేషి ఏఐఎస్ఎఫ్ నాయకులు ఫణీంద్ర, నాగభూషణం, నాగరాజు ,అభిషేక్ , డిహెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్, విజయనగరం బుక్ హౌస్ మేనేజర్ ఇబ్రహీం, శ్రీకాకుళం బుక్ హౌస్ మేనేజర్ రవి, స్టాఫ్ నజీర్, మూర్తి, 39 వార్డు జనసేన అధ్యక్షులు, కనకమహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ కొల్లి సింహాచలం తో పాటు వివిధ పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులు, అధిక సంఖ్యలో మిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని జోహార్ రాజు అంటూ ఘన నివాళులర్పించారు. అరసంవిశాఖ సంతాప సందేశం… అరసం విశాఖజిల్లాశాఖ కార్యవర్గసభ్యుడు విశాలాంధ్రమేనేజర్ పిఏరాజు హటాన్శరణం దిగ్బ్రాంతినికలిగించింది. రాజు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా, అభ్యుదయ భావజాలంతో క్రమశిక్షణగలకార్యకర్తగా అరసంకార్యక్రమాలలో ఎంతోచురుగ్గా పాల్గొనే గొప్పసభ్యుణ్ణికోల్పోవడం తీరనిలోటు గా భావిస్తున్నామని తెలియజేశారు. విశాఖలో పుస్తకప్రదర్శనలు ఏర్పాటుచేసినపుడు ప్రతిరోజూ అరసం -ఇతరసాహిత్యసంస్థలను సమన్వయపరచి మంచిసాహితీసభలనునిర్వహించి విశాఖలోని సాహితీవేత్తలందరినీ ఓచోటచేరేలాచేయడంలో రాజు చురుగ్గా వ్యవహరించి రచయితలనూ – పాఠకులనూమఒప్పించిమెప్పించేవాడు నిజంగా అరసంవిశాఖకు బలమైనకార్యకర్తనుకోల్పోయినట్లైంది. రాజు మరణానికి రాజుమరణంపట్ల నగరంలోని రచయితలు డా.డివిసూర్యారావు, అడపారాక్రిష్ణ, పతివాడనాస్తిక్ , సిహెచ్ చినసూర్యనారాయణ, డా.బండిసత్యనారాయణ, డా మాటూరిశ్రీనివాస్ ,రాంప్రభు,ప్రజ్ఞానంద్ తమసంతాపాన్నితెలియజేసారు హైదరాబాద్ నుంచి మాజీయుపిఎస్సీ సభ్యులు ప్రొఫెసర్ కెఎస్ చలం , గుంటూరునుంచి అరసం రాష్ట ప్రధాన కార్యదర్శి వల్లూరుశివప్రసాద్ , మీడియాకార్యదర్శి ఏఎమ్ ఆర్ ఆనంద్ , జాతీయ అరసంఅధ్యక్షులు పెనుగొండలక్ష్శీనారాయణ , అనంతపురంనించి అరసం రాష్ట్ర అధ్యక్షులు రాచపాళెంచంద్ర శేఖర్ తమసంతాపాన్నితెలియజేసారు. అరసం విశాఖశాఖ ఉపాధ్యక్షుడు ఎస్ హనుమంతరావు, ప్రధానకార్యదర్శి ఉప్పల అప్పలరాజు, కార్యవర్గం పి శ్యామసుందర్, బసుపోతన, కెవిఎస్ మూర్తి, బొట్టఅప్పారావు, పల్లాజగదీశ్ , దితరులందరూ తమప్రగాఢసంతాపంప్రకటించారు రాజు కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు.

జోగులాంబ గద్వాల

ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు.

అలంపూర్ : పున్నమి ప్రతినిధి జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతాంగం మళ్లీతే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని జిల్లా అధికారి అక్బర్ అన్నారు. మంగళవారం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో రైతువేదిక లో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి నిర్వహించారు. పంటలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిచారించాయన్నారు. ఈ పంట సాగు వల్ల క్రిమిసంహారక మందుల వినియోగం 90 శాతం పైనే తగ్గిపోతుందని, దాంతో వాతావరణ కాలుష్యం భూసారం తగ్గిపోవడం వంటి అనేక అవరోధాలు తొలగిపోతాయన్నారు. జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో పామ్ ఆయిల్ దిగుమతి కోసం ఏటా 70 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ప్రభుత్వం వెచ్చిస్తుందని, ఆ ఖర్చును ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు పెద్ద ఎత్తున రైతులకు సబ్సిడీ అందిస్తే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో రైతులను ఆ దిశగా కార్యోన్ముఖులను చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ శివనాగిరెడ్డి ఆర్టికల్చర్ ఆఫీసర్లు మహేష్,రాజశేఖర్ మండల అధికారి జనార్ధన్, ఫీల్డ్ ఆఫీసర్లు అశోక్ రెడ్డి, మంజునాథ్, మేఘ రెడ్డి, శివకుమార్,శశిధర్ సింగిల్ విండో కార్యదర్శి మల్లేష్, సిబ్బంది జీవన్, శ్రీనివాస్,మహేష్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

వాంబే కాలనీలో బిల్డింగ్ పెచ్చులు కూలిన ఘటన – కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శ

విశాఖపట్నం, అక్టోబర్ 28: మొంథా తుఫాన్ కారణంగా విశాఖ నగరంలోని 51వ వార్డు పరిధిలోని వాంబే కాలనీలో కురిసిన భారీ వర్షాల వలన ఓ భవనం పెచ్చులు కూలిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా బాధిత ప్రాంతాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హరేంద్ర ప్రసాద్, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పెనుమత్స విష్ణు కుమార్ రాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మరియు 51వ వార్డు కార్పొరేటర్ రయ్యి వెంకటరమణ సందర్శించి ప్రజలను పరామర్శించారు. కలెక్టర్ మరియు ఎమ్మెల్యే సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను వెంటనే పంపించి, భవనం పరిస్థితిపై ఎస్టిమేషన్ చేయించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మాధురి, డిప్యూటీ తహసీల్దార్ సువర్ణ, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ కోమలి, విఆర్వోలు, పోలీస్ శాఖ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు రామారావు, ఎర్నిబాబు, సింహాచలం, సంతోష్, అప్పారావు, సంబంధిత సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

చిట్వేల్ పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన అధికార బృందం

చిట్వేల్, అక్టోబర్ 28: పున్నమి ప్రతినిధి మోన్ధా తుఫాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు.మండల తహసీల్దార్ స్పందన రెడ్డి తన సిబ్బందితో కలిసి పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను సమీక్షించారు. ప్రజలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు, ఆహారం, నీరు, విద్యుత్, మరియు వైద్య సదుపాయాల లభ్యతను పరిశీలించారు.ఆరోగ్య శాఖ తరఫున హెల్త్ సూపర్వైజర్ ఇస్మాయిల్ తన సిబ్బందితో కలిసి వివిధ రకాల సాధారణ ఆరోగ్య సమస్యలకు అవసరమైన మందులతో హాజరయ్యారు.మండల విద్యాశాఖ అధికారులు ఖాజా హుస్సేన్, ఈశ్వరయ్యలు కూడా ఏర్పాట్లను పరిశీలించి, విద్యార్థులు మరియు ప్రజలకు సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా సూచనలు ఇచ్చారు.అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటకృష్ణ తన బృందంతో కలిసి పునరావాస కేంద్రంలోని తాగునీటి నాణ్యతను పరిశీలించారు.తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని, అవసరమైతే కంట్రోల్ రూమ్ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు.ఈ పరిశీలనలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఎన్సీసీ అధికారి పసుపుల రాజశేఖర్, ఉపాధ్యాయులు హరినాథ్, చెన్నయ్య, కాలేశా, సుహాసిని, సతీష్, ప్రసన్న, కిరణ్ తదితరులు, విద్యాశాఖ, రెవెన్యూ, సచివాలయ మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తుఫాన్ హెచ్చరిక

కృష్ణాజిల్లా, గుడివాడ అక్టోబర్ 28: మొంథా తుఫాన్ కారణంగా గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో కదిలిన తుపాన్ మచిలీపట్నంకి 110 కిమీ, కాకినాడకి 190 కిమీ, విశాఖపట్నంకి 280 కిమీ దూరంలో కేంద్రీకృతం ఈరోజు రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి ~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

క్రేన్ సహాయంతో చెట్లు తొలగింపు

[28/10/25తుఫాన్ కారణంగా వీచే గాలులకి భారీ వృక్షం నేలకూలి విద్యుత్ తీగలపై పడుతుందన్న ఉద్దేశంతో ముందస్తుగా మనుబోలు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు క్రేన్ సహాయంతో భారీ వృక్షాన్ని కొంచెం కొంచెంగా తొలగించి విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఏఈ అనిల్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు

నాగర్‌కర్నూల్

స్కాలర్షిప్లు ప్రభుత్వ బిక్ష కాదు – విద్యార్థుల హక్కు*

అక్టోబర్28 పున్నమి ప్రతినిధి: *అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో కల్వకుర్తి కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది* *విద్యార్థుల స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకై ఎమ్మెల్యే గారు స్పందించాలి:- నగర కార్యదర్శి అక్కి వంశీ గౌడ్* మంగళవారం ఈ సందర్భంగా నగర కార్యదర్శి అక్కి వంశీ గౌడ్ మాట్లాడుతూ “విద్యారంగంలో మంచి మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవతితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సర బడ్జెట్ లో కేవలం 7% నిధులే కేటాయించిందని వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12-13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రం లో 90% మంది విద్యార్థులుSC,ST,BC బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులేనని,వారందరూ కూడా ఫీజ్ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ మీద ఆధారపడి విద్యను అభ్యశిస్తున్నారన్నారు.కానీ ఈ ప్రభుత్వం సుమారు 8600 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టి పేద వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల దగ్గర నుండే యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఆ ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారని,విద్యను పూర్తి చేసిన విద్యార్థులు సైతం సర్టిఫికెట్లు కూడా పొందలేక పోతున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛంద బందుకు పిలపునిచ్చాయని, అనేక ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ ఈ స్కాలర్షిప్ విషయంలో స్పందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటికొండ ప్రశాంత్ యాదవ్ నగర సంయుక్త కార్యదర్శి హరి కృష్ణ, శివరాం శ్రీకాంత్ మోహన్ కార్యకర్తలు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

తెలంగాణ

జూబ్లీహిల్స్ ప్రచార హోరు.. కాంగ్రెస్ జోరు.!

జూబ్లీహిల్స్ ప్రచార హోరు.. కాంగ్రెస్ జోరు.! కల్వకుర్తి అక్టోబర్ 28 పున్నమి న్యూస్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మొన్న మంత్రి పొన్నం ఆటోలో ప్రయాణిస్తూ, మంత్రి సీతక్క ఆటోలో ప్రయాణిస్తూ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళ వారం బట్టలు ఇస్త్రీ చేస్తూ ప్రచారంలో అందరినీ ఆకర్షించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత నాలుగు రోజుల నుండి ప్రచారంలో పాల్గొంటూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

అల్లూరి సీతారామరాజు

మొంథా తుఫాన్ కంట్రోల్ రూమ్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యత

మొoథా తుఫాన్ దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నీ సందర్శించారు. ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పల్లపు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలలో ఆహారం త్రాగునీరు మందులు మరియు ఇతర నిత్యవసరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. తుఫాను పరిస్థితి పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సకాలంలో సమాచారా అందించాలని తెలిపారు. అత్యవసర సహాయం కోసం ఫిషింగ్ బోట్లను జెసిబిలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అధికారులందరూ మరియు కంట్రోల్ రూమ్ సిబ్బంది 24X7 అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఊహాగానాలు లేదా పుకార్లు నమ్మవద్దని కోరారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఎమర్జెన్సీ కోసం టార్చ్ లైట్లు కొవ్వొత్తులు మరియు బ్యాటరీలను సిద్ధంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ పి అమిత్ బర్దర్, ఆర్డిఓ లోకేశ్వరరావు, డిఆర్ఓ కే పద్మలత పల్లి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.