Friday, 10 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలు~అమలాపురం వద్ద తుఫాను తీరం దాటుతుంది: అజయ్ జైన్

ఏపి: మొంథా తుఫాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు లేదా అమలాపురం వద్ద తీరం దాటుతుందని స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ వెల్లడించారు. ఈ రాత్రి 10 లేదా 11 గంటలకు తుఫాను తీరం దాటుతుందని.. ఆ సమయంలో గంటకు 110 KM వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కాకినాడ, కోనసీమ జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని హెచ్చరించారు.

E-పేపర్

సీనియర్ అనస్థీషియా వైద్యులు డాక్టర్ రవి కృష్ణ,డాక్టర్ శేష ఫణి, డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ మాధవి లను సత్కరించిన నంద్యాల ఐఎంఏ వైద్యులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో “మొంథా” తుఫాను కారణంగా నంద్యాల జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలెవరు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా సరాసరి సగటు వర్షపాతం మూడు సెంటీమీటర్లు నమోదయిందని కలెక్టర్ తెలిపారు. అత్యధికంగా రుద్రవరం మండలంలో 5 సెంటీమీటర్లు, నంద్యాల అర్బన్‌లో నాలుగు సెంటీమీటర్లు, సిరివెళ్ల, గోస్పాడు, శ్రీశైలం, నంద్యాల రూరల్, ఆళ్లగడ్డ, మహానంది, కోవెలకుంట్ల, చాగలమర్రి, ఆత్మకూరు మండలాల్లో మూడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయిందన్నారు తుఫాను ప్రభావం కారణంగా వర్షాలు మరో 3 రోజులు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలి అని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు.అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దు విద్యుత్ స్తంభాలు, తెగిన విద్యుత్ తీగలు, వాగులు, వంకలు, చెరువులు, కెనాల్లు వంటి ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లరాదన్నారు. మట్టిమిద్దెలలో నివాసం ఉండకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ సూచించారు. పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించి పశుసంపదను కాపాడుకోవాలన్నారు. తుఫాను, వర్షం సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08514 – 293903 కు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.

Blog

ఐఎంఏ నంద్యాల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ శ్రీనివాసరావు, మహమ్మద్ రఫీ

భారత జాతీయ వైద్య సంఘం అనుబంధంగా నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 500 మంది వైద్యులు సభ్యులు గా ఉన్న నంద్యాల ఐఎమ్ఎ కు రెండు సంవత్సరాల పదవీకాలం కోసం 45 మందితో కూడిన పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఐఎంఏ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ఎన్నికల అధికారిగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ జి.రవికృష్ణ, రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనీల్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, నంద్యాల ఐఎంఏ ప్రస్తుత అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు 2025-26 వ సంవత్సరానికి అధ్యక్షులుగా కర్నూలు వైద్య విధాన పరిషత్ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ కె. శ్రీనివాసరావు, 26 – 27 వ సంవత్సరానికి డాక్టర్ పనిల్ కుమార్ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. మిగిలిన కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది కార్యదర్శిగా డాక్టర్ మహమ్మద్ రఫీ, ఉపాధ్యక్షులుగా డాక్టర్ నాగమణి, డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, డాక్టర్ పెసల అశోక్ ,డాక్టర్ హరిత కోశాధికారిగా, డాక్టర్ షబ్నం, డాక్టర్ ఫ్రాంక్ మోహన్ సంయుక్త కార్యదర్శులుగా, డాక్టర్ కిషోర్, డాక్టర్ ఫణీంద్ర రెడ్డి నిర్వాహక కార్యదర్శులుగా, సహా కోశాధికారిగా డాక్టర్ లలిత లను ఎన్నుకున్నారు. అదేవిధంగా వివిధ విభాగాలకు సమన్వయకర్తలుగా మహిళా విభాగానికి డాక్టర్ కల్పన, మిషన్ పింక్ హెల్త్ విభాగానికి డాక్టర్ అరిఫా బాను, అకాడమిక్ విభాగానికి డాక్టర్ సుసుమ, వైద్య సంక్షేమ విభాగానికి డాక్టర్ రవికాంత్ రెడ్డి, ప్రొఫెషనల్ ఇన్సూరెన్స్ విభాగానికి డాక్టర్ గెలివి సిద్ధార్థ లు బాధ్యతలు నిర్వహిస్తారు. కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ విజయబాబు, డాక్టర్ రాధికా జ్యోతి, డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి ,డాక్టర్ శ్రీనివాస్,డాక్టర్ క్రాంతి చైతన్య, డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ,డాక్టర్ బండి భరత్ కుమార్ రెడ్డి ,డాక్టర్ వి.వి.ఎం. మురళి ,డాక్టర్ మహమూద్,డాక్టర్ మణిదీప్, డాక్టర్ సంపత్ రెడ్డి ,డాక్టర్ అనిత, డాక్టర్ రవితేజ, డాక్టర్ విష్ణుప్రియ లను ఎన్నుకున్నారు. ఐఎంఏ రాష్ట్ర శాఖ లో నాయకులుగా ఉన్న మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ,మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్,రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య,రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి,డాక్టర్ వసుధ,రాష్ట్ర ప్రొఫెషనల్ ఇన్సూరెన్స్ స్కీమ్ వైస్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్,నంద్యాల ఐఎంఏ తక్షణ మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, ఐఎంఏ నంద్యాల కు గతంలో అధ్యక్షులుగా పని చేసిన డాక్టర్ సహదేవుడు,డాక్టర్ ఆదినారాయణ,డాక్టర్ వేణుగోపాల్ గుప్తా,డాక్టర్ వినోద్ కుమార్,డాక్టర్ జఫరుల్లా ప్రత్యేక ఆహ్వానితులుగా కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు ఐ ఎమ్ ఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ ఐఎంఏ ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో, పట్టణ వాడ లలో వైద్య శిబిరాలను నిర్వహించాలని, వైద్యుల పరిజ్ఞానాన్ని నిత్య నూతనంగా అభివృద్ధి చేసుకోవడానికి నిరంతర వైద్య విద్య సదస్సులు నిర్వహించాలని కోరారు నూతన అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 50 సంవత్సరాల చరిత్ర గల నంద్యాల ఐఎంఏ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.కార్యదర్శిగా ఎన్నుకోబడ్డ డాక్టర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 11వ తేదీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహిస్తామని తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తీవ్ర తుఫాను మంథా తీరం దాటేందుకు సిద్ధమవుతోంది.

కన్ను పూర్తిగా భూమిలోకి ప్రవేశించడానికి 6-8 గంటలు పడుతుంది, కాబట్టి రేపు ఉదయం ఈ రాకాసి తుఫాను మధ్య ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి ప్రవేశించి, భారీ వర్షాలు మరియు తీవ్రమైన గాలులతో విలయం సృష్టిస్తుంది. తరువాత 2-3 గంటల్లో, మచిలీపట్నం – బాపట్ల – ఉత్తర ప్రకాశం (ఒంగోలు ప్రాంతం) మరియు కృష్ణా జిల్లాల తీర ప్రాంతాలలో వర్షాలు మరింత పెరుగుతాయి. విజయవాడ నగరం, గుంటూరు నగరంతో పాటు, అక్కడక్కడ వర్షాలను చూడటం ప్రారంభిస్తుంది. శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్నం – కాకినాడ వెంబడి ఉన్న మొత్తం తీర ప్రాంతంలో అప్పుడప్పుడు భారీ స్వల్పకాలిక వర్షాలు కురుస్తాయి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ముంథా తుఫాన్ విజృంభిస్తున్న సమయంలో రెడ్ క్రాస్ సభ్యులు

అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది అక్టోబర్ 28 (పున్నమి ప్రతినిధి) సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం లో పర్యటించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని కోరడమే కాక ఫిషింగ్ హార్బర్ లో సుదూరప్రాంతాల(బాపట్ల, నిజాంపట్నం, కాకినాడ, యలమంచిలి) నుంచి వచ్చిన ఫిషింగ్ బోట్లలోని కార్మికులకు, ముంపు ప్రాంతాల ప్రజలకు రెడ్ క్రాస్ సభ్యులు శ్రీ జంపన బుజ్జిరాజు గారి ఆర్థిక సాయంతో సుమారు 200 మందికి రస్కుపేకెట్లు,పాలు పేకెట్లు అందించడమైనది.. ఈ కార్యక్రమంలో శ్రీ బుజ్జి రాజు, శ్రీ అల్లూరి మధురాజు, శ్రీ పల్లపోతు జైదీప్, బోనం రాజు తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సహాయ చర్యలకు సిద్దo చేసిన అధికారులు

మోంథా తూఫాన్ ప్రభావంతో ఉదయగిరి పట్టణంలోని పలు ప్రంతాల్లో డ్రైనేజీలు నిండి పొంగి పొర్లి నీటి నిల్వలు ఏర్పడ్డాయి విషయం తెలుసుకున్న సర్పంచ్, ఉప సర్పంచ్ పామూలూరు సామ్రాజ్యం , ముత్తుజా హుస్సేన్ జెసీ బీ ఏర్పాటు చేసి నీటి నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని పరిష్కరించారు ఈదురు గాలులతో కూడిన నేల వాలిన చెట్లను తొలగించి రాకపోకలకు అoతరాయం లేకుండా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమoలో పంచాయితీ కార్యదర్శి, కరిమూల్ల పాల్గొన్నారు.

తిరుపతి

అంటువ్యాధులపై ప్రజల అప్రమత్తంగా ఉండాలి.. డాక్టర్ బాలు.

మొంథా తుఫాను వల్ల పట్టణంలోని ప్రజలు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీరామ నగర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలు తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది తో మంగళవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కలుషితమైన నీరు,కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు డయేరియా,టైఫాయిడ్, మలేరియా వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. వేడి చేసిన నీరు తాగాలని,బయట తినుబండారాలు తిన కూడదని తెలియజేసారు. ఇళ్ల చుట్ట పక్కల నీరు నిల్వ ఉండకూడదని అలా నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా వంటి రోగాల బారిన పడతారని తెలియజేశారు.పది నుంచి 15 రోజుల లోపల డెలివరీ అయ్యే గర్భవతులను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి ముందస్తుగా తరలించాలని తెలియజేశారు.

జోగులాంబ గద్వాల

మాన్ దొడ్డి గ్రామానికి బాడీ ఫ్రీజర్ అందజేత.

అలంపూర్ : (పున్నమి ప్రతినిధి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామ ప్రజలకు అవసరమైన బాడీ ఫ్రీజర్‌ను దాతలు అందజేశారు. గ్రామంలో ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు పార్ధివ దేహాన్ని సుదూర ప్రాంతాలనుండి వచ్చే బంధువులు చేరుకునే వరకు సంరక్షించడానికి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను గుర్తించిన దాతలు సుమారు 50 వేల రూపాయల విలువ చేసే బాడీ ఫ్రీజర్‌ను వెంకట్రాముడు, కాకులారం వీరేష్, బాలమని, శేఖర్ దాతలు అందించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు దాతలను అభినందించారు.

ఆంధ్రప్రదేశ్

ఓబులవారిపల్లి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్  అరవ శ్రీధర్ 

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులువారిపల్లి మండలం లొ ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో  ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్  పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలు మరియు పట్టణాలకు కనెక్టింగ్ రోడ్లు సమస్యలపై ప్రజలు పంచాయతీ శాఖకు సమాచారం అందించినట్లయితే, వీలైనంత త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయించే దిశగా చర్యలు  తీసుకుంటామని  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  తెలియజేశారని రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ పేర్కొన్నారు.  గ్రామాల నుంచి వ్యవసాయ భూములకు కనెక్టింగ్ రోడ్డు పెండింగ్ పనులు ఉన్నచో వాటిని గుర్తించి తెలియజేయవలసిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే హార్టికల్చర్ కు సంబంధించిన అంశంలో, గతంలో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  మరియు అచ్చం నాయుడు  మామిడి రైతులకు కిలోకు నాలుగు రూపాయలు చొప్పున గిట్టుబాటు ధరగా ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించినట్లు, ఆ సహాయం అందించడం జరిగిందని తెలిపారు. అన్నదాత సుఖీభవ రెండవ విడత త్వరలోనే ప్రారంభం కాబోతుందని, అలాగే తల్లికి వందనం పథకం అందని అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆరవ శ్రీధర్  తెలిపారు. తదుపరి కార్యక్రమంగా స్త్రీనిధి రుణాలకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖ అధికారులు, కూటమి నేతలు, సర్పంచులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో – దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్

గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో కురిసిన వర్షాలు, నిన్న రాత్రి నుండి మొంథా తుఫాన్ ప్రభావంతో వీచిన ఈదురు గాలులు, భారీ వర్షాలు ప్రజల జీవితాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండటంతో పాటు వాతావరణంలో చలి తీవ్రంగా పెరగడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ప్రజల పట్ల తమ హృదయపూర్వకమైన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రజల బాధను అర్థం చేసుకొని, స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గారు కలిగిరి మండల కేంద్రంలోని టుబాకో బోర్డు ఎస్టీ కాలనీలోని సుమారు 100 కుటుంబాలకు దుప్పట్లు, ఆహార పదార్థాలు, తినుబండారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ – “ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడటం నా బాధ్యత. ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా కూడా అవసరమైన సహాయం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గ ప్రజలందరూ తుఫాను నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సహాయం కొరకు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి ఈ సేవా తపనను, మానవతా దృక్పథాన్ని ప్రశంసిస్తూ స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ – “ప్రతి సందర్భంలో ప్రజల పక్కన నిలబడి, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు నిజమైన ప్రజానాయకుడు” అని అభిప్రాయపడ్డారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.