Wednesday, 8 April 2026

Blog

E-పేపర్

మొరుసు గంగమ్మ పెద్దకర్మకు హాజరై చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు మండలం అయ్యవారిపల్లి నందు వైస్సార్సీపీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మొరుసు నారాయణమ్మ తల్లి మొరుసు గంగమ్మ పెద్దకర్మకు హాజరై చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళ్లుఅర్పించి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన *వైస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గం ఇంచార్జి మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు షఫీ,తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

తుఫాన్ ప్రభావంతో లోతట్టు ముంపు ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*

* తుఫాన్ ప్రభావంతో లోతట్టు ముంపు ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు* * *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం పినగాడి జంక్షన్ మరియు అక్కిరెడ్డిపాలెం నుండి జుత్తాడా వెళ్ళు రోడ్లలో దెబ్బతిన్న కల్వర్టు పరిశీలన మొంథా తుఫాన్ ప్రభావంతో *పినగాడి జంక్షన్ నుండి కోటపాడు రహదారిపై* తుఫాను కారణంగా భారీ నీరు ప్రవహించడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఈరోజు ఉదయం జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటన నిర్వహించి సత్వరమే ఈ మార్గంలో రాకపోకలు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులు ప్రారంభించాలని తుఫాను కారణంగా దెబ్బతిన్న కల్వర్టులు,రోడ్లు, సాగునీటి చెరువులు, గడ్డలు, వరి పంట నష్టం, పూరిల్లు, కచ్చా ఇండ్లకు, జరగ నష్టాన్ని దొరకదు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని గౌరవ శాసనసభ్యులు అధికారులకు ఆదేశించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు గారు, ఎంపీడీవో అప్పలరాజు గారు,పి ఆర్ డిపార్ట్మెంట్ డిఈ గారు,ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నళిని గారు, ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ బాలరాజు గారు, నేషనల్ హైవే అధికారులు, మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రాము నాయుడు గారు, కరక దేవుడు గారు, సీనియర్ నాయకులు బైలుపూడి హర గోపాల్ గారు, పెందుర్తి pacs చైర్మన్ ఐతి సింహాచలం గారు, నేటిపల్లి మహేష్ గారు, సేనాపతి సోమశేఖర్ గారు, ఉగ్గిన అచ్చిబాబు గారు,డిబిఎల్ నాయుడు గారు ,బడితబోయిన రాము గారు, సదరం భీమేశ్వరావు గారు, రాపర్తి కృష్ణమోహన్ గారు రాపర్తి కిషోర్ గారు, అక్కిరెడ్డి నరసింహమూర్తి గారు,మొదలగు స్థానిక నేతలు ఈ యొక్క పర్యాటన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అమరావతి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్*

*జిల్లా కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్* *అమరావతి* *మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశం* *తుఫాన్ నష్టం అంచనాలను త్వరితగతిన సిద్దం చేయాలని సూచన* *వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి* *టెలీ కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ….* • గత నాలుగైదు రోజుల నుంచి మొంథా తుఫాన్ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించి నష్టనివారణ చర్యలు చేపట్టాం. • సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్‌తో సహా అంతా కలిసి టీమ్ గా పనిచేశాం. • కష్టకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. • మరో రెండు రోజులు ఇదే విధంగా పని చేస్తే… బాధిత ప్రజలకు మరింత ఊరట ఇవ్వగలం. • తుఫాన్ వెలిసింది కాబట్టి… వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా అధికారులు పని చేయాలి. • మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి.. వారికేమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలి. • మొంథా తుఫాను వల్ల వివిధ విభాగాల్లో కలిగిన నష్టాన్ని అంచనా వేయాలి… కేంద్రానికి నివేదిక అందివ్వాలి. • తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు వెంటనే అందించాలి… నిర్వాసితులను ఆదుకోవాలి. • ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల నష్టాన్ని చాలా వరకు నివారించగలిగాం. • సచివాలయాలపై మైక్ అనౌన్స్‌మెంట్ సిస్టంను ఏర్పాటు చేసి కింది స్థాయి వరకూ ప్రభుత్వ ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాం… ఇదొక నూతన విధానం తీసుకొచ్చాం. • తుఫాన్‌ను ఎవరూ నివారించలేరు… కానీ ముందు జాగ్రత్తలతో నష్టాలను నివారించగలుగతాం. • కలెక్టర్లు, అధికారులు కంట్రోల్ రూమ్ లో కూర్చుని రియల్ టైం సమాచారం తెప్పించుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. • ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్‌ సిబ్బంది బాగా పని చేశారు. చెట్లు కూలినా, విద్యుత్ వైర్లు తెగిపడినా యుద్ధప్రాతిపదికన తొలగించారు. • అన్ని మున్సిపాలిటీల్లో డ్రెయిన్లు క్లీన్ చేయడం వల్ల కాలనీలను ముంపుబారిన పడకుండా చేశాం. • దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థను కూడా పునరుద్ధరించేందుకు 10 వేలమందిని అందుబాటులో పెట్టుకున్నాం. నేడు మధ్యాహ్నానికి సాధారణ స్థితి ఏర్పడుతుంది. • తుఫాన్ కారణంగా ఇద్దరు చనిపోయారు. • ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది… మన చర్యలతో ప్రభుత్వంపై భరోసా పెరిగింది.

విశాఖపట్నం

IMS తో సరికొత్త విధానానికి నాంది – ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు*

*IMS తో సరికొత్త విధానానికి నాంది – ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు* *– రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు* *విశాఖపట్నంఅక్టోబర్ పున్నమి ప్రతినిధి, :* ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం, సమన్వయం, పారదర్శకత తీసుకురావడమే సాంకేతికత యొక్క అసలైన అర్థం అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన రియల్ టైమ్ ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IMS) ఆంధ్రప్రదేశ్ పాలనలో కొత్త యుగానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు. *ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో విప్లవాత్మక మార్పు* ప్రజల సమస్యల పరిష్కారంలో కొత్త దిశగా అడుగులు వేస్తూ, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) ను ఆధునికీకరించి IMS రూపంలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని పల్లా గారు తెలిపారు. ప్రజల ఫిర్యాదులు, ఫీల్డ్‌లో తలెత్తే సమస్యలు ఇకపై రియల్ టైమ్‌లో ప్రభుత్వానికి చేరుతాయి. సంబంధిత శాఖలు వెంటనే స్పందించి, సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షిస్తాయి అని ఆయన అన్నారు. *రియల్ టైమ్ స్పందన – వేగవంతమైన పరిష్కారం* రాష్ట్రవ్యాప్తంగా విభిన్న విభాగాల్లో, జిల్లాల్లో తలెత్తే సమస్యలను RTGS ఆధ్వర్యంలో IMS వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ప్రతి ఫిర్యాదు, ప్రతి ఘటనపై సంబంధిత శాఖ మంత్రి, సెక్రటరీ, కలెక్టర్, ఎస్‌పీ వంటి అధికారులను IMS WhatsApp గ్రూప్‌లో చేర్చుతారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆ గ్రూప్ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రజలు తమ ఫిర్యాదు స్థితిని IMS డాష్‌బోర్డ్‌లో రియల్ టైమ్‌గా ట్రాక్‌ చేసుకోవచ్చు. ఇకపై ప్రజా సమస్య – ప్రభుత్వ స్పందన మధ్య ఎలాంటి గ్యాప్ ఉండదు. ఇది ఒక గవర్నెన్స్ రివల్యూషన్ అని పల్లా గారు అన్నారు. *చంద్రబాబు విజన్ – లోకేష్ టెక్‌ లీడర్‌షిప్ ఫలితం* IMS వ్యవస్థ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, మంత్రివర్యులు నారా లోకేష్ గారి సాంకేతిక విజన్ కలయికతో పుట్టిన ఆధునిక పరిపాలన వ్యవస్థ అని పల్లా గారు పేర్కొన్నారు. చంద్రబాబు గారు ఎప్పుడూ సాంకేతికతను ప్రజా సేవలో ఉపయోగిస్తుంటారు. రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి IMS వరకు ఆయన నాయకత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్‌లో దేశానికి ఆదర్శంగా నిలిచింది అని అన్నారు. లోకేష్ గారి సాంకేతిక నాయకత్వం వల్ల ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం అయిందని చెప్పారు. ప్రతి సమస్యకు సమయపరిమితి, బాధ్యత, ఫాలోఅప్ ఇవన్నీ ఒకే వేదికపై కనిపిస్తున్నాయి. ఇదే సుపరిపాలన అని అన్నారు. *డిజిటల్ గవర్నెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ – దేశానికి ఆదర్శం* RTGS, IMS వంటి వ్యవస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొత్త దశలోకి అడుగుపెట్టిందని పల్లా గారు అన్నారు. ప్రజలకు సమయానుకూల సేవలు అందించడమే కాదు, సమస్యలు విస్తరించకముందే పరిష్కరించడమే ఈ వ్యవస్థ ఉద్దేశ్యం. ఇది చంద్రబాబు గారి దూరదృష్టి, లోకేష్ గారి సాంకేతిక నైపుణ్యం కలయికతో సాధ్యమైంది అని పల్లా శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు.

E-పేపర్

యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి పనులు మొదలుపెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి.* మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

*యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి పనులు మొదలుపెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి.* మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు అక్టోబర్ 29 (మనం న్యూస్ ప్రతినిధి): రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండల కేంద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జి ప్రమాదకరపు స్థాయి ఉన్నందున, బ్రిడ్జి ను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు. మేంథా తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా మండల ప్రజలకు రవాణా సౌకర్యంగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి లోకి వర్షపు నీరు చేరి ప్రమాదకర స్థాయిలో ఉండడంతో బ్రిడ్జిని పరిశీలించి తక్షణమే మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తొలగించి, వీలైనంత త్వరగా ప్రజలకు అండర్ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకురావాలని రాబోయే రోజులు కూడా వర్షకాలమే కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలో తలెత్త కుండా చూసుకోవాలని సర్పంచ్ జైపాల్ రెడ్డి కి నుచించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, సీనియర్ నాయకులు దుర్గా నాగేంద్ర, సుబ్రహ్మణ్యం రెడ్డి, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాత్రింబవళ్లు శ్రమించిన విద్యుత్ శాఖ

మొంథా’ తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలలో కూడా మనుబోలు మండలం లోని అన్ని గ్రామాలకు రాత్రులు కూడా శ్రమించి త్వరిత గతిన కరెంటు పునరుద్దరణ చేసిన సందర్భంగా పి. అనిల్ కుమార్ ఎ. ఇ గారిని మరియు జేఈ మరియు సిబ్బందినీ సన్మానిస్తున్న మనుబోలు మండల టీడీపీ నాయకులు

తిరుపతి

మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

మొంథా తుఫాను నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణ పురపాలక సంఘ అధికారులతో పురపాలక పరిధిలో చేపట్టిన తుఫాన్ సహాయక చర్యలపై శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మున్సిపాలిటీ అభివృద్ధి మరియు పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో భారీ వర్షాలు – ఎమ్మెల్యే, చైర్మన్ స్వయంగా వరద ప్రదేశాలు పరిశీలన

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావంతో జగ్గయ్యపేట పట్టణంలో, ముఖ్యంగా ఆర్టీసీ కాలనీ, వేపల వాగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాలు వరద ముంపు ప్రమాదానికి లోనవుతాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీరంగాపురం రాఘవేంద్ర స్వయంగా ప్రభావితం ప్రాంతాలను పరిశీలించారు. *ఎమ్యెల్యే సూచనలు* : వరద ముంపు ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాల (తాత్కాలిక పునరావాస కేంద్రాలు) కు తరలించబడాలి. విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లు దగ్గరగా వెళ్లవద్దు. తాగునీటిని మరిగించి తాగాలి, కలుషిత నీటిని వాడకూడదు. రోడ్లు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయవద్దు; అత్యవసరమైన ప్రయాణమే చేయాలి. పిల్లలు, పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. వార్తలు, వాతావరణ హెచ్చరికల ను తరచుగా గమనించాలి. *చైర్మన్ వ్యాఖ్య* : “ప్రతి ఒక్కరి సురక్షితత్వమే మా మొదటి ప్రాధాన్యత. మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తం గా పనిచేస్తున్నారు. ఏవైనా సమస్యలు ఎదురైన వెంటనే మాకు సమాచారం అందించాలి,” అన్నారు. *ప్రజలకు భరోసా* : జగ్గయ్యపేట మున్సిపాలిటీ అన్ని విధాలా సహాయం అందజేస్తుంది, ప్రజలు ధైర్యంగా ఉండవచ్చు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తుఫాన్ ప్రభావిత తీర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే దేవా

మొంథా తుఫాన్ కారణంగా ప్రభావితమైన అంతర్వేది పల్లిపాలెం, అంతర్వేది దేవస్థానం, అంతర్వేది కర, కేశవదాసుపాలెం గ్రామాలలో గౌరవ శాసన సభ్యులు విస్తృత స్థాయి పర్యటన చేశారు. ప్రజల యొక్క బాగోగులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు తూఫాన్ షెల్టర్ భవనాలను సందర్శించారు. అధికారులను నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో టీడీపీ ఇంచార్జీ గొల్లపల్లి అమూల్య , ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

*బైకు ఢీకొనడంతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి* *మానవత్వం చాటుకున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ శ్రీ*

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని శేష సాయి కళ్యాణ మండపం ఎదురుగా ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ క్యాంపు కార్యాలయం సమీపంలో నేషనల్ హైవే రోడ్డు దాటుతున్న మన్నే ముత్తూరు పంచాయతీ గంపల కండ్రిగ గ్రామానికి చెందిన పల్లికొండ పుల్లయ్య అనే వ్యక్తి హైవేపై నడిచి వెళ్తుండగా నాయుడుపేట వైపు మోటార్ బైకు పై ఇద్దరు వ్యక్తులు అతి వేగంగా వస్తూ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయ శ్రీ వెంటనే స్పందించి రోడ్డుమీద రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని స్వయంగా ఎమ్మెల్యే దగ్గరుండి హాస్పిటల్ కి తరలించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పల్లికొండ పుల్లయ్య మరణించాడు. సమాచారం తెలుసుకున్న సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.