Wednesday, 8 April 2026

Blog

తెలంగాణ

దేవరకొండ డివిజన్లో భారీ వర్షాలతో ప్రజల ఇక్కట్లు !

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) దేవరకొండ డివిజన్లో భారీ వర్షాలు ఎక్కువగా ఉండడం, డివిజన్ మొత్తంలో 12 సెంటీమీటర్ల వర్షం కురవడం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ డివిజన్ లో పర్యటించారు. కొండమల్లేపల్లి మండలం గిరిజనగర్ తండా వద్ద పై నుండి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తూ ప్రధాన రహదారిపై నిలిచిపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గమనించి తక్షణమే వర్షపు నీటిని మళ్లించి, ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాజ్ వేలు, రహదారుల బ్రిడ్జ్ లపై ప్రయాణించవద్దని సూచించారు. అలాగే వర్షం వల్ల తడిసి పడిపోయేందుకు అవకాశం ఉన్న ఇళ్లలో ఉండవద్దని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటా దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి,తాహసిల్దార్, ఎంపీడీవో,తదితరులు ఉన్నారు.

జనగాం

లీడ్ ఇండియా ఫౌండేషన్ మిషన్ 2047 ఆప్ బడో దేశ్ కో బడావో విశ్వగురువు

లీడ్ ఇండియా ఫౌండేషన్ మిషన్ 2047 ఆప్ బడో దేశ్ కో బడావో విశ్వ గురువు నినాదాంతో భారత దేశం అభివృద్ధియే ఏకైక లక్ష్య సాధన కై నిరంతరంగా ,అవిశ్రాంతంగా, అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్ ఎన్.బి.సుదర్శన్ ఆచార్య లీడ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు & చేర్మన్ మాట్లాడుతూ డాక్టర్ ఏ.పి.జె అబ్దుల్‌ కలాం భారత మాజీ రాష్ట్రపతి స్పూర్తితో,ఆశయాలతో 2004 లో ఏర్పడి నడుస్తున్న సంస్థ.ఇప్పటి వరకు 20 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని,2025 నుండి 2047 వరకు 144 కోట్ల భారతీయులు గర్వ పడే విధంగా మరోక జాతీయ ఉద్యమం ప్రారంభమైంది. స్వాతంత్ర్య సాధనకై జాతీయ ఉద్యమం ఎలా జరిగిందో అదే తరహాలో ఈ ఆప్ బడో దేశ్ కో‌నడావో విశ్వగురువు ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. ప్రతి భారతీయుడు కులాలకతీతంగా,మతాలకతీతంగా,ప్రాంతాలకతీతంగా స్వామి వివేకానంద ఆశయ సాధనకై మేమంతా భారత తీయులం,ప్రపంచమంతా మన సంస్కృతి, సాంప్రదాయం, ఆర్థిక,సాంకేతిక అభివృద్ధి అభివృద్ధిని చూసి ఆశ్చర్య పడేలా ఉంటుందని తెలిపారు.అలాగే లీడ్ ఇండియా ఫౌండేషన్,ఆప్ బడో దేశ్ కో బడావో,లీడ్ ఇండియా, ఐ లీడ్ ఇండియా అనే నినాదం తో రానున్న 5,10,22 సంవత్సరాల వరకు రేపటి బాలబాలికల చేతిలోకి వస్తుంది మన భారత దేశం,విద్యార్థులకు నైతిక మానవ విలువలు గల విద్య బోధన లతో తీర్చి దిద్దడం జరుగుతుందని ఇప్పటికీ రెండు బ్యాచ్ లు టిఓటి శిక్షణ కార్యక్రమాలు పూర్తి కావటం జరిగిందని,ఈ బ్యాచ్ మూడవదని,ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్పిలు కొండల్ పులి,నరసింహ సాయి, వనమాలి,జ్యోతి,సరళ,లీలా మన్నవ,పెద్దిరాజు వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు,రాష్ట్ర నలుమూలలనుండి శిక్షణ పొందడానికి పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వకులభరణం కృష్ణ మోహన్ బిసి కమీషన్ మాజీ చేర్మన్, అతిధులుగా సిహెచ్ హనుమంతరావు చేర్మన్ వివేకానంద స్వామి సేవా సమితి,డాక్టర్ రవి చంద్ర రావు,ప్రొఫెసర్ హరి నారాయణ, డాక్టర్ నవీన్ కుమార్,ఎస్ ఎన్ రెడ్డి, యాదగిరి, మధుసుధన్,నర్సింహ రెడ్డి, శివరామ కృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు

నారాయణపేట

ప్రారంభమైన శ్రీ బనధ ఎల్లమ్మ దేవి నూతన మందిరం నిర్మాణ పనులు,ముఖ్య అతిథి గా హాజరైన ఆదిత్య పరాశ్రీ స్వామి

క్రిష్ణ మండల కున్సి గ్రామంలో ఉదయం 11 గంటలకు శ్రీ బనద ఎల్లమ్మ దేవి నూతన శిలా మందిర నిర్మాణానికి అంకురార్పణ(శిలాపూజ) డా “ఆదిత్య పరాశ్రీ స్వామి బిజ్వార్ వారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది.భవ్యమైన మందిర నిర్మాణం కోసం,కృష్ణ శిలాల తో 18 స్థంభాల తో దేవాలయ నిర్మాణం ప్రారంభించడం జరిగింది.దేవాలయ నిర్మాణానికి పూజారి శరనప్ప ఆధ్వర్యంలో భక్తులందరూ తను,మన,ధన,సహాయంతో గ్రామ పురప్రముఖలతో కలిసి కన్సల్టెన్సీ ఉడిపి వారికి ఇచ్చినందున ఈ రోజు నుండి దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు,యువకులు,రాజకీయ నాయకులు,మహిళలు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జనగాం

బిజెపి జఫర్ గడ్ నాయకులకు బూత్ అధ్యక్షులకు జిల్లా నాయకులకు సూచన…*

ఈ తుఫాన్ తీవ్రంగా మారి వర్ష సూచన ఎక్కువగా ఉన్నందున ప్రజలకు అనారోగ్యం తో ఉన్నవారికి మన సహాయం కోరిన వారికి అందుబాటులో ఉండాలి అని జఫర్ గడ్ మండలం లోని రోడ్లు ధ్వంసం అయ్యాయి కావున ప్రయాణికులు చూసుకొని వెళ్ళాలి అని తెలియ చేయాలి అని కోరుతున్నాను ఒకవేళ మీ మీ గ్రామాల లో వయస్సు పైబడిన దంపతులు వాళ్ల ఇంట్లో ఉంటే ఫోన్ లలో పలకరించి మెడిసిన్ లాంటివి కావాల అని అడిగి అవసరం ఉంటే ప్రభుత్వ హాస్పటల్ కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు..

అమరావతి

మొంథా’ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

‘మొంథా’ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* ప్రభావిత జిల్లాల కలెక్టర్ల నుంచి వివరాల సేకరణ విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశం పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి వసతి, ఆహారం కొనసాగించాలని సూచన నదుల ఉద్ధృతిపై ప్రజలను అప్రమత్తం చేయాలన్న ప‌వ‌న్‌ వర్షాల తర్వాత పారిశుద్ధ్యం, తాగునీటిపై దృష్టి పెట్టాలని ఆదేశాలు మొంథా తుపాను ఏపీని వణికిస్తోంది. తుపాను తీరం దాటినప్పటికీ, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రజలకు అండగా నిలవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను పరిస్థితులపై పవన్ తన కార్యాలయ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు మాట్లాడారు. ఈదురు గాలులు, కుండపోత వర్షాల కారణంగా జరిగిన నష్టంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి విద్యుత్ తీగలపై పడటం, స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్, విద్యుత్ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. తుపాను బలహీనపడినా భారీ వర్షాలు కొనసాగుతున్నందున, ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోనే ఉంచాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని ఈ రోజు కూడా అక్కడే ఉంచి, వారికి ఆహారం, వసతి కల్పించాలని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, నెల్లూరు జిల్లాలో పెన్నా నదితో పాటు పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని, ఆయా ప్రాంతాల్లో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని పవన్ సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని, ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

తిరుపతి

ప్రజలను తప్పుదోవ పట్టించేపని వైకాపా నాయకులదే…ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి అక్టోబర్ 29, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం నాడు స్థానిక శ్యాసన సభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సమక్షంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జలసుధీర్ రెడ్డి మాట్లాడుతూ…గతనాలుగు రోజులకు పడుతున్న వర్షాలతో ప్రజలు కొద్దిపాటి ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించే దిశగా అధికారులతో కార్యాచరణ చేపట్టామని ఇక వైకాపా నాయకులు వారి స్వార్థాల కోసం అసత్యపు ప్రచారాలు చేస్తు ప్రజలను తప్పుదోవ పట్టించేపనికి పూనుకున్నారని శ్రీకాళహస్తిలో కుంభ వర్షం పడడంతో వర్షం పడేటప్పుడు కావాలనే వైకాపా వారు ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయడం మానుకోవాలని వైకాపా నాయకులకు ఆయన హితు పలికారు. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పట్టణంలోని మురుగు కాలువల్లో పూడికలు తీయించి అదేవిధంగా వర్షపాతం అధికంగా పడితే ప్రజలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా కొన్ని కార్యక్రమాలు చేపట్టామన్నారు. తద్వారా శ్రీకాళహస్తిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలు సుఖంగా ఉన్నారని అయితే వైకాపా నాయకులు తాము సోషల్ మీడియాలో, పేపర్లో రావాలని జిజ్ఞాసతో అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని వైకాపా నాయకులకు తెలియజేశారు. ఎవరు ఎన్ని చెప్పినా తాను నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో తాను చేస్తున్నానని, ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత నాలుగు రోజులుగా పడుతున్న వర్షాలకు తనకు ఈ వర్షాలలో ప్రజల వద్ద నుంచి సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. అయితే వీటిని వైకాపా నాయకులు తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారాలు చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాలు ప్రజలు నమ్మరని వర్షపాతం వల్ల రైతులకు ఎటువంటి నష్టం జరిగిందో అధికారులతో సమగ్ర విచారణ చేస్తున్నామన్నారు. అధికారులు ఇచ్చిన నివేదికను సంబంధిత మంత్రిత్వశాఖ అధికారులతో మాట్లాడి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని అదే విధంగా రైతులకు యూరియా కార్డులుపంపిణీ చేసి ప్రభుత్వం ఇస్తున్న యూరియాను, క్రిమిసంహారక మందులను అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని రైతులకు వారికి కావలసినంత యూరియా ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి, కంటా రమేష్, కాసరo రమేష్, చెంచయ్య నాయుడు కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

తుఫాన్- ముందు జాగ్రత్తలు జనగామ మార్కెట్ సిబ్బంది అలర్ట్

మొంథా తుఫాను ప్రభావంతో రైతులను మరియు సిబ్బందిని అలెర్ట్ చేశాము –జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ———————————————- జనగామ, అక్టోబర్29, పున్నమి న్యూస్: ఈ రోజు జనగామ జిల్లా లో మొంథా తుఫాను ప్రభావం వల్ల కురుస్తున భారీ వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ కోరుతున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు నందు మరియు ఇతర ప్రాంతాల్లో ఐకెపి మరియు PACS సెంటర్లు) లలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం.అదేవిధంగా సంబంధిత అధికారులు రైతులకు ఎల్లవేళల అందుబాటులో ఉండాలని అధికారులను కోరారు.రైతుల కోసం మార్కెట్ యార్డు లో టర్పాలిన్లు అందుబాటు ఉన్నాయి కావున రైతులు వడ్ల రాసులు మరియు వడ్ల బ్యాగులు వర్షం కి తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు మరియు ఇప్పటికే ఏఎంసీ లో సిబ్బంది ని కూడా అలెర్ట్ చేశాము అని అన్నారు. ఏఎంసీ లో ఉదయం నుంచి సిబ్బంది తో కలిసి ప్రత్యక్షంగా యార్డులో వడ్ల కుప్పలను పరిశీలించడం జరిగిందని అన్నారు

జనగాం

జలమయంగా మారిన తానేదార్ పల్లి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లి గ్రామంలో కాలనీలో జలమయమయ్యాయి. లింగసాని కుంట మత్తడి పోయడంతో, ఆ నీరు గ్రామంలోనీ ఇళ్లలోకి చేరుతుంది. గతంలో ఈ కుంట నిండి, బుడుగుల కుంటలోకి చేరేది. కొందరి మొండి వైఖరి తో కట్టు కాలువ వెయ్యడం వల్లే ఈ రోజు గ్రామానికి ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్థులు మండిపడుతున్నారు. కట్టు కాలువ వేయొద్దని రైతులు చెప్పిన వినకుండా వేయడంతో ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వర్షం ఇలాగే కొనసాగితే నీరు ఇండ్లలోకి చేరుతుందని, పిల్లలు ,వృద్ధులు బయటకు రావద్దని సూచిస్తున్నారు.

తిరుపతి

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో మాజీ MLA పర్యటన

మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవరంలోని అబ్బాభట్లపల్లి అరుంధతి వాడా,ముళ్ళపూడి ఎస్టి కాలనీ,పోలి ఎస్టి కాలనీలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి పర్యటించి గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి వర్షం కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.మొంథా తుఫాన్ కారణంగా పంటను నష్టపోయిన రైతులకు అలాగే ఇల్లు పోగొట్టుకున్న వారికి తక్షణమే ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.విద్యుత్ అధికారులు స్పందించి కరెంటు నిలిచిపోయిన చోట విద్యుత్ ను పునరిద్దరించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాని కూటమి ప్రభుత్వం ….మాజీ ఎంపీ చింతామోహన్

శ్రీకాళహస్తి అక్టోబర్ 29, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మాజీ ఎంపీ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం నాడు పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చింతా మోహన్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారని ఎద్దేవా చేశారు…… శ్రీకాళహస్తి దేవస్థానం అవినీతి మయంగా మారిందని, సెల్ఫోన్ కౌంటర్ నందు, చెప్పుల కౌంటర్ నందు, కార్ పార్కింగ్ లలో భక్తులను నిలువు దోపిడీ చేస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం ప్రజా ప్రతినిధులు వాటిపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా కాంట్రాక్ట్ దారులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వైనాన్ని ఆలయ అధికారులు దృష్టి సారించి వాటిని అరికట్టాలన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎక్కడ న్యాయం జరగడంలేదని, తుఫాన్ ప్రభావంతో భారీగా పడిన వర్షలతో రైతులు వారి పంటలు ముంపుకు గురై వారు అప్పుల పాలపై, ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇకకైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతన్నలను ఆదుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు రైతులకు ఎంత సబ్సిడీ ఇచ్చాయో తెలియజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశ్రమలు తీసుకువస్తానని దేశవిదేశాలు తిరుగుతున్నాడు. కానీ ఇప్పటివరకు ఏ వక్క పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ కు తీసుకున్న రాలేదని ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు తీసుకుని వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. అదేవిధంగా రైతులని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ బత్తెయ్య నాయుడు, నరేంద్ర నాయుడు, కూలి రవి, సమీవుల్లా, జనార్దన్ రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.