Tuesday, 7 April 2026

Blog

అల్లూరి సీతారామరాజు

మోంథా తుఫాన్ నష్ట పరిహారం అందించాలి,జీ.కే. వీధి మండల టి. ఎన్. ఎస్. ఎఫ్

జి. కె. వీధి పున్నమి ప్రతినిధి అల్లూరి జిల్లా అక్టోబర్ 30: మోంథా తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టి, ప్రజలను ఆదుకోవడంలో కృషి చేసిన జీ.కె. వీధి మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి జీ.కే. వీధి మండల తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టి. ఎన్ ఎస్. ఎఫ్) తరపున జిల్లా టి. ఎన్ ఎస్. ఎఫ్ కార్యదర్శి ముక్కలి కళ్యాణి కృతజ్ఞతలు తెలియజేశారు.తుఫాన్ సమయంలో ప్రజల క్షేమం కోసం పని చేసిన అన్ని శాఖల సిబ్బందికి, ముఖ్యంగా సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన జీ.కే. వీధి మండల పత్రిక విలేకరులకు, సామాజిక సేవా కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.అనంతరం, మండలంలోని 16 పంచాయతీలలో మోంథా తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన మరియు ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు తక్షణమే ప్రభుత్వం తరపున తగిన నష్ట పరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని టి. ఎన్. ఎస్. ఎఫ్ కార్యదర్శి ముక్కలి కళ్యాణి జిల్లా అధికారులను కోరారు.తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పంట నష్టం మరియు ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేసి, బాధితులకు త్వరితగతిన ఆర్థిక సహాయం అందించడానికి చర్యలు తీసుకోవాలని టి. ఎన్. ఎస్. ఎఫ్ కార్యదర్శి ముక్కాలి కళ్యాణి విజ్ఞప్తి చేశారు.

అల్లూరి సీతారామరాజు

గుమ్మిరేవులలో వైసీపీ నూతన పంచాయితీ కమిటీల ఎన్నిక,ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘కోటి సంతకాల సేకరణ’

పున్నమి ప్రతినిధి అల్లూరి జిల్లా అక్టోబర్ 30: అల్లూరి సీతారామ రాజు జిల్లా, జీకే వీధి మండలం గుమ్మిరేవుల పంచాయితీ అన్నవరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నూతన పంచాయితీ కమిటీల ఎన్నిక కార్యక్రమం జరిగింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు, జిల్లా అధ్యక్షులు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.జీకే వీధి వైసీపీ మండల అధ్యక్షులు కంకిపాటి గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో, గుమ్మిరేవుల సర్పంచ్ ముర్ల కమలమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుమ్మిరేవుల పంచాయితీ పార్టీ అధ్యక్షులుగా వంతల రాంచందర్, గుమ్మిరేవుల పంచాయితీ ప్రధాన కార్యదర్శిగా కొర్ర అప్పారావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమిటీ ఎన్నిక అనంతరం, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణకు నిరసనగా వైసీపీ చేపట్టిన “కోటి సంతకాల సేకరణ” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కంకిపాటి గిరి ప్రసాద్, జీకే వీధి ఎంపీపీ బోయిన కుమారి మాట్లాడుతూ, పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి, 2029లో జగన్ మోహన్ రెడ్డి ని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు దృష్టిలో ఉంచి పరిష్కారం చేయిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జీకే వీది వైస్ ఎంపీపీ లోత దేముడు, లక్కవరపు పేట ఎంపీటీసీ మొట్టడం సత్య నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి వంతల చంటి బాబు, మండల ఎస్.టి సెల్ అధ్యక్షులు కంకిపాటి నారాయణ రావు, మండల కార్యవర్గ సభ్యుడు గొల్లోరి మహదేవ్, గుమ్మిరేవుల పంచాయితీ ఉప సర్పంచ్ జోరంగి వెంకట రమణ, పార్టీ సీనియర్ నాయకులు కోడా బొంజి బాబు, చంద్ర బాబు, చిట్టి బాబు తో పాటు కాకనూరు, కనుసు మెట్ట, చింత గుప్ప, మాది మల్లు, నెల జర్త తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మన ఊరు మన భద్యత సర్పంచ్ మట్టా సురేష్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మట్టా.ప్రసన్నా సురేష్ గారి ఆధ్వర్యం లో మొంథా తుపాన్ ప్రభావం తో కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు గ్రామంలో అనేక చోట్ల వర్షం నీటితో నిండిపోవడంతో ప్రజలకు ఏవిధమైన విష జ్వరాలు ప్రభలకుండా అంతా క్షేమము గా వుండాలని బ్లీచింగ్ మరియు క్లోరినేషన్ చెయ్యించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బొక్క రామకృష్ణ,పంచాయితీ సెక్రటరీ కే.రజని ,గ్రేడ్-5 కార్యదర్శి ఏ.రాజేష్ ,నల్లి చిన్న మరియు పంచాయితీ సిబ్బంది,పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ మట్టా.ప్రసన్న సురేష్ సెక్రటరీ.కే రజని వీఆర్వో:సాయిబాబు,సత్తిబాబు మరియు పంచాయితీ సిబ్బంది

ఆంధ్రప్రదేశ్

మన ఊరు మన భద్యత సర్పంచ్ మట్టా సురేష్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మట్టా.ప్రసన్నా సురేష్ గారి ఆధ్వర్యం లో మొంథా తుపాన్ ప్రభావం తో కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు గ్రామంలో అనేక చోట్ల వర్షం నీటితో నిండిపోవడంతో ప్రజలకు ఏవిధమైన విష జ్వరాలు ప్రభలకుండా అంతా క్షేమము గా వుండాలని బ్లీచింగ్ మరియు క్లోరినేషన్ చెయ్యించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బొక్క రామకృష్ణ,పంచాయితీ సెక్రటరీ కే.రజని ,గ్రేడ్-5 కార్యదర్శి ఏ.రాజేష్ ,నల్లి చిన్న మరియు పంచాయితీ సిబ్బంది,పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ మట్టా.ప్రసన్న సురేష్ సెక్రటరీ.కే రజని వీఆర్వో:సాయిబాబు,సత్తిబాబు మరియు పంచాయితీ సిబ్బంది

జనగాం

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలి

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని చట్టం చేసి అమలు చేయాలి ఘన్పూర్ స్టే: తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇప్పగూడెం సముద్రాల అక్కపెల్లిగూడెం, తదితర గ్రామాలలో పంటలను సందర్శించడం జరిగింది. అదేవిధంగా పత్తి పంటల పరిస్థితిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి లింగనబోయిన కుమారస్వామి మాట్లాడుతూ — “రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయాన అకాల వర్షాలు, మెంతా తుఫాను వలన వరి, పత్తి, మొక్కజొన్న పంటలు భారీగా నష్టపోయాయి. కాబట్టి ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలి,” అని డిమాండ్ చేశారు. అలాగే ఆయన అన్నారు — కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా పత్తిని తేమ శాతం కారణంగా తిరస్కరించకుండా, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రూపాయలు 10075 మద్దతు ధరతో కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరికీ ₹500 బోనస్, పత్తికి ₹475 బోనస్ ప్రకటించి వెంటనే చెల్లించాలి. పొలంలోనే కల్లాలు లేదా నీటమునిగిన చేన్లలో పంటలు నాశనమైన రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సర్వే చేసి ఎకరాకు ₹40,000 నష్టపరిహారం, అలాగే పత్తి రైతులకు ఎకరాకు ₹60,000 నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ ప్రభుత్వాలను ఉద్దేశించి చెప్పారు — “రైతును రాజు చేస్తున్నామని గొప్ప మాటలు చెప్పడం కాదు; ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతును ఆదుకోవడం నిజమైన చిత్తశుద్ధి. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు కేటాయించి నష్టపరిహారం చెల్లించాలి. లేకపోతే తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.” ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కమిటీ సభ్యులు మంద మొగిలి పిట్టల శ్రీను ఇప్పగూడెం రైతులు బోయిని కుమార్ కుంట రాజు తోడెన్గల మల్లయ్య. ఉప్పలయ్య అక్కపెళ్లి గూడెం రైతులు మెడిద కుమార్ కూస బుచ్చయ్య అశోక్ యార భోపాల్ వెంకటేష్ మరియు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు. – లింగనబోయిన కుమారస్వామి మండల కార్యదర్శి తెలంగాణ రైతు సంఘం, ఘన్పూర్ స్టే

జనగాం

రైతులను పంట నష్టం ఇప్పించడంలో ఎమ్మెల్యే చొరవ చూపాలి : బీరెల్లి రవివర్మ*

*తేది:30-10-2025* *పాలకుర్తి* *రైతులను పంట నష్టం ఇప్పించడంలో ఎమ్మెల్యే చొరవ చూపాలి బీరెల్లి రవివర్మ పాలకుర్తి మండల BRS పార్టీ మండల సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు గత 24 గంటలగా మంథా తుఫాన్ ప్రభావం తో ఏర్పడిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకి నష్ట పరిహారం అందేలా ఎమ్మెల్యే చొరవ చూపాలని BRS పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము

జనగాం

ఐకేపి సెంటర్ లను పరిశీలించిన వ్యవసాయ కమిటీ చైర్మన్ :బనుక శివరాజ్ యాదవ్

జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఉన్న ఐకెపి సెంటర్లు ను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ——————————————– జనగామ, అక్టోబర్30,పున్నమి న్యూస్: రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం- నిన్నటి రోజున కురిసిన భారీ వర్షానికి జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐకెపి సెంటర్లలో తడిసిన ధన్యం పరిశీలించి ఐకెపి నిర్వాహకులతో మాట్లాడి త్వర త్వరగా వడ్లను లిఫ్టింగ్ చేయాలని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ కోరారు. అదేవిధంగా రైతులకు మళ్లీ వర్షం వస్తే ఏ విధంగా ఉండాలని తగు జాగ్రత్తలు తెలుపుతూ రైతులు ఆధార్యపడొద్దని అన్నారు.రైతులకు మేము అండగా ఉంటాం,ఎక్కడ రైతుకి ఇబ్బంది కలగనియొద్దని అధికారులను కోరారు. వారి వెంట ఏడిఈ అపర్ణ, ఏఎంసి ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్, ఏఈఓ అనిల్, సిసి వెంకటేశ్వర్లు, AMC సూపర్వైజర్ శ్రీనివాస్ , ఐకెపి నిర్వాహకులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ కేబినెట్‌ సమావేశం వాయిదా – నవంబర్‌ 10న నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం

నవంబర్‌ 7న జరగాల్సిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది. ఇప్పుడు ఈ సమావేశాన్ని నవంబర్‌ 10వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ కార్యాలయం అధికారిక నోట్‌ విడుదల చేసింది. కేబినెట్‌ సమావేశానికి సంబంధించిన షెడ్యూల్‌ మార్పులను గమనించి, తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు సూచనలు జారీ చేసింది. ఈ సమావేశంలో పలు కీలక పరిపాలనా, అభివృద్ధి, సంక్షేమ నిర్ణయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

_*- అపోలో హాస్పిటల్ లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం*_

_*- కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ జి.వి.వి. ప్రసాద్ రెడ్డి, డాక్టర్ హరిత*_ ప్రతీ స్త్రీ తన వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతీ రోజూ ఒక్క క్షణం సమయం కేటాయిస్తే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి.వి.వి. ప్రసాద్ రెడ్డి, ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ సూచించారు. ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ ను ముందస్తుగా సులభంగా గుర్తించవచ్చునన్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాస కార్యక్రమంలో భాగంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో మహిళలకు ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి.వి.వి. ప్రసాద్, ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత, యూనిట్ హెడ్ బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జి.వి.వి. ప్రసాద్ రెడ్డి, డాక్టర్ హరిత, డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ ఈ అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుకుంటున్నామని అన్నారు. అందులో భాగంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. ప్రధానంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ” చెక్ – ఓలేట్ ” ( చాక్లెట్ ) పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతీ స్త్రీ తన వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతీ రోజూ ఒక్క క్షణం సమయం కేటాయిస్తే వారి జీవితం చాక్లెట్ కంటే తీయగా ఉంటుందన్న అర్ధంతో ” చెక్ – ఓలేట్ ” కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం భారతీయ మహిళల్లో క్యాన్సర్ సంభవం మరియు మరణాలకు రొమ్ము క్యాన్సర్ ప్రధానంగా ఉందని, ప్రతీ ఏడాది క్యాన్సర్ కేసుల్లో పేరుగుతున్నా, స్క్రీనింగ్ టెస్టుల నిర్వహణ విషయంలో భారతదేశం వెనుకబడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అపోలో హాస్పిటల్స్ సంస్థ క్యాన్సర్ నివారణ చర్యల్లో భాగంగా మహిళలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. మహిళలు చిన్న చిన్న స్వీయ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తించవచ్చునని, వెంటనే వైద్యులను సంప్రదిస్తే దాన్ని త్వరగా నివారించే అవకాశం ఉందన్నారు. 40 ఏళ్లు పై బడ్డ ప్రతీ మహిళా నెలకోసారి రొమ్ములకు చిన్న చిన్న స్వీయ పరీక్షలు చేసుకోవాలని, అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. స్వీయ పరీక్ష చేసుకోలేని వారు కనీసం ఏడాదికి ఓ సారి రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకోవాలని డాక్టర్ జి.వి.వి. ప్రసాద్ రెడ్డి, డాక్టర్ హరిత, డాక్టర్ శ్రీరామ్ సతీష్ మహిళలను కోరారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో రొమ్ము క్యాన్సర్ కు తక్కువ ఫీజుతోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ

*జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి.జి కిషన్ రెడ్డి*

జూబ్లీహిల్స్ అక్టోబర్ 30 (పున్నమి ప్రతినిధి) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇవాళ యూసుఫ్‌గూడలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతా రామచంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పోతుగంటి భరత్ ప్రసాద్ గారు, మరియు బీజేపీ నాయకులు ప్రజలలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి, పారదర్శక పాలనకు బీజేపీనే ఏకైక ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి “వికసిత తెలంగాణ – వికసిత భారత్” దృష్టికోణాన్ని సాధించాలంటే ప్రజలు శ్రీ లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించి, బీజేపీకి మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రచారానికి స్థానిక ప్రజల నుండి ఉత్సాహపూర్వక స్పందన లభించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.