Tuesday, 7 April 2026

Blog

తిరుపతి

ముక్కంటిని దర్శించిన అనకాపల్లి యం.పి సీఎం రమేష్

శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం గురువారం నాడు విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తన కుటుంబ సభ్యుల సమేతంగా బీటెక్ రవితో కలసి ఆలయానికి విచ్చేయగా వీరికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు, బీజేపీ నాయకులు కోలా ఆనంద్, ఆలయ పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి, అలయాధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి వేద పండితులచే ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సబ్యురాలు కోలా విశాలాక్షి, ఆలయ సిబ్బంది పాల్గొన్నరు.

అల్లూరి సీతారామరాజు

మొంథా నష్టపరిహారం,బాధితులకు కూటమి అండ,దివ్యలత హామీ

పున్నమి ప్రతినిధి అల్లూరి జిల్లా అక్టోబర్ 30: ‘మొంథా’ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులు, ఇళ్లు కోల్పోయిన ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత భరోసా ఇచ్చారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జీ. మాడుగుల మండలం, అగం పాడు గ్రామంలో ఆమె గురువారం పర్యటించారు. భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను, కూలిపోయిన ఇళ్లను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా దివ్యలత మాట్లాడుతూ, రైతులు అధైర్య పడకుండా ఉండాలని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. సొంత భూమి రైతులకు, ఇళ్లు ధ్వంసం అయిన ప్రజలకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యను ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు స్పష్టం చేశారు.వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ గండేరీ పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

చంద్రమాంపల్లిలో పంట నష్ట తీవ్రతను అంచనా వేస్తున అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రమోద.

పున్నమి న్యూస్,30/10 తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి లో గురువారం అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రమోదా పరిశీలించి, పంట నష్ట తీవ్రతను అంచనా వేశారు. దీంతోపాటు పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ పర్యటనలో టీడీపీ నాయకులు రేలంగి బుజ్జి, పెద్దాపురం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు

*శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, బీటెక్ రవి గారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి దంపతులు ఈ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ నాయకులు కోలా ఆనంద్ గారు మరియు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టె సాయి గారు* *స్వామివారి దర్శనార్థం విచ్చేసే ముందు ఊరందురు నందు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన అల్పాహారం స్వీకరించిన ఎంపీ సి యం రమేష్ గారి కుటుంబ సభ్యులు మరియు బీటెక్ రవి గారు*

తిరుపతి

జాతీయ స్థాయి కరాటే పోటీలలో పథకం సాధించిన శ్రీ చైతన్య విద్యార్థిని

శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీ చైతన్య పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న ప్రజ్ఞశ్రీ అనే విద్యార్థిని సెకండ్ డ్రీమ్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పుదుచ్చేరిలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలలో పాల్గొని మూడవ స్థానాన్ని గెలుపొంది కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రూపాదేవి మాట్లాడుతూ….నిరాయుధంగా శత్రువుని ఎదురించడంలో కరాటేకి మించిన విద్య లేదని, శారీరక, మానసిక దృఢత్వానికి కరాటే చాలా అవసరమన్నారు. అనంతరం పాఠశాల AGM సురేష్ మాట్లాడుతూ…. విద్యార్థులు చిన్నతనం నుంచి విద్యతోపాటుగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా వారిలో క్రమశిక్షణ పెంపొందుతుందని తెలిపి చిన్న వయసులోనే ఇంతటి గొప్ప విజయాన్ని పొందిన ప్రజ్ఞశ్రీ ని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోనోకార్పస్ చెట్ల వల్ల పర్యావరణం మరియు ఆరోగ్యంపై ప్రభావం

కోనోకార్పస్ చెట్ల వల్ల పర్యావరణం మరియు ఆరోగ్యంపై ప్రభావం ఇటీవలి కాలంలో పట్టణ ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న కోనోకార్పస్ (Conocarpus) చెట్ల నాటకం పర్యావరణ నిపుణుల ఆందోళనకు కారణమైంది. ఈ చెట్లు విదేశీ జాతికి చెందినవిగా గుర్తించబడి, స్థానిక వృక్షజాలం మరియు జంతుజాలంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు తేలింది. కోనోకార్పస్ చెట్ల వలన స్థానిక పక్షులు, తేనెటీగలు, సీతాకోకచిలుకలు వంటి జీవులు తగ్గిపోతున్నాయి. ఈ చెట్ల పూలు పరాగసంపర్కానికి తేనెటీగలను ఆకర్షించవు, దాంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. అలాగే, ఈ చెట్ల వేర్లు చాలా లోతుగా పెరిగి చుట్టుపక్కల ఉన్న నీటి మట్టాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. పంట పొలాలు లేదా బోర్లు ఉన్న ప్రాంతాల్లో ఈ వేర్లు నీటి వనరులను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం, కోనోకార్పస్ చెట్లు గాలిలో Volatile Organic Compounds (VOCs) అనే రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి ఓజోన్ స్థాయిని పెంచి, శ్వాసకోశ సమస్యలు మరియు ఆస్తమా వంటి వ్యాధులకు దారితీయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా, ఈ చెట్ల బలమైన వేర్లు రోడ్ల ఫుట్‌పాత్‌లు, డ్రైనేజ్ లైన్లు, భూగర్భ పైపులు పగలగొట్టే ప్రమాదం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలకు ఇది పెద్ద నష్టం కలిగిస్తోంది. ఆరోగ్య శాఖ నివేదికల ప్రకారం, గుజరాత్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చెట్ల పూల పొడి వాతావరణంలో వ్యాపించి, అలర్జీలు మరియు ఆస్తమా కేసులు పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పర్యావరణ నిపుణులు మరియు ప్రభుత్వ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు — కోనోకార్పస్ చెట్ల నాటకాన్ని నివారించి, స్థానిక పర్యావరణానికి అనుకూలమైన చెట్లను నాటాలి.

E-పేపర్

వరద ఉధృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన యువతీ యువకుడు

పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ : 9640204826 వరద ఉధృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన యువతీ యువకుడు చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడ్డ యువకుడు.. గల్లంతైన యువతి జనగామ జిల్లా తిమ్మంపేట మండలం బోళ్లమత్తిడి వద్ద స్టేషన్ ఘనపూర్–జాఫర్‌ఘడ్ రహదారిపై వరద ప్రవాహానికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన శివకుమార్, శ్రావ్య అనే యువతీ యువకుడు చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడ్డ శివకుమార్, కొట్టుకుపోయిన శ్రావ్య గల్లంతైన యువతి కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

తిరుపతి

తుఫాన్ బాధితుల నష్టపరిహారంపై పార్టీ నాయకులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిశ నిర్దేశం

శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తుఫాన్ కారణంగా కూలిన ఇండ్లుకు నష్టపరిహారం అందిందా, రెవెన్యూ శాఖ అధికారులు సకాలంలో స్పందించారా లేద అని తెలుసుకోవాలని తమ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిశ నిర్దేశం చేశారు. అందులో భాగంగా గురువారం నాడు టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శిభారీ కాసరం రమేష్, తే.దే.పా నాయకులు కార్యకర్తలతో కలసి వర్షాల కారణంగా నష్టపోయి నిర్వాసితుల ఇళ్ల వద్దకు వెళ్ళి వారికి ప్రభుత్వం అధికారులు సకాలంలో స్పందించారా అని అడిగి తెలుసుకోవడం జరిగిందని అనంతరం రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి కూలిపోయిన ఇండ్లకు త్వరతిగతిగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందేలా చేయాలని వారికి తెలిపారు. అదేవిధంగా అక్కడున్నటువంటి నిర్వాసితుల సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చినటువంటి అంశంలలో ఒకటైన కోర్టు ప్రహరీ గోడ మొత్తం కూలి పోయే దుస్థితిలో ఉందని, వృద్దులు, చంటిబిడ్డలు, పాదాచారులు, ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు కనుక రాబోవు రోజులలో ఎలాంటి అసందర్భం జరగకుండా ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం కలగకుండా ఉండే విధంగా ఎమ్మెల్యే చొరవ చూపి చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు తె.దే.పా నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగిందని తే.దే.పా నాయకులు, కార్యకర్తలు శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి విపులంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బాలు ఢిల్లీ, రాకేష్, నవీన్, వివేక్, తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు.

జనగాం

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలి

పున్నమి న్యూస్ రిపోర్టర్ స్టేషన్ ఘన్పూర్ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని చట్టం చేసి అమలు చేయాలి ఘన్పూర్ స్టే: తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రంగరాయ గూడెం, బోయినిగూడెం, కోమటిగూడెం తదితర గ్రామాలలో పంటలను సందర్శించడం జరిగింది. అదేవిధంగా పత్తి పంటల పరిస్థితిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు బోయిన కుమార్ సారి మొలుగురు అనిల్ మాట్లాడుతూ — “రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయాన అకాల వర్షాలు, మెంతా తుఫాను వలన వరి, పత్తి, మొక్కజొన్న పంటలు భారీగా నష్టపోయాయి. కాబట్టి ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలి,” అని డిమాండ్ చేశారు. అలాగే ఆయన అన్నారు — కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా పత్తిని తేమ శాతం కారణంగా తిరస్కరించకుండా, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రూపాయలు 10075 మద్దతు ధరతో కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరికీ ₹500 బోనస్, పత్తికి ₹475 బోనస్ ప్రకటించి వెంటనే చెల్లించాలి. పొలంలోనే కల్లాలు లేదా నీటమునిగిన చేన్లలో పంటలు నాశనమైన రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సర్వే చేసి ఎకరాకు ₹40,000 నష్టపరిహారం, అలాగే పత్తి రైతులకు ఎకరాకు ₹60,000 నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ ప్రభుత్వాలను ఉద్దేశించి చెప్పారు — “రైతును రాజు చేస్తున్నామని గొప్ప మాటలు చెప్పడం కాదు; ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతును ఆదుకోవడం నిజమైన చిత్తశుద్ధి. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు కేటాయించి నష్టపరిహారం చెల్లించాలి. లేకపోతే తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.” ఈ కార్యక్రమంలో బోయిన కుమారస్వామి, ములుగురు అనిల్ రైతులు పాల్గొన్నారు

కామారెడ్డి

సహకార సంఘాల పాలకులకు అవగాహన సదస్సు

కామారెడ్డి, 30 అక్టోబర్‌ (పున్నమి ప్రతినిధి) : జిల్లా సహకార సంఘాల పాలకవర్గ సభ్యుల కోసం తెలంగాణ సహకార యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్యాంక్‌ మీటింగ్‌ హాల్‌లో అవగాహన కార్యక్రమం జరిగింది. వివిధ సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు, రైతు సమితుల ప్రతినిధులు, శాఖాధికారులు పాల్గొన్నారు.ఈ సదస్సులో యాప్‌ 21, స్మార్ట్‌ 10000 యాప్స్‌, స్కిల్‌ ఇండియా కార్యక్రమాలు పరిచయం చేయడంతో పాటు సంఘాల నిర్వహ ణ, ఆర్థిక సముపార్జన, వనరుల వినియోగం, ప్రభు త్వ మద్దతు ఫండ్ల వినియోగ పద్ధతులపై చర్చించా రు. సహకార వ్యవస్థ బలోపేతానికి సమన్వయం, పారదర్శకత అవసరమని వక్తలు సూచించారు. అసిస్టెంట్‌ ప్రిన్సిపల్‌ భూక వెంకన్న, చీఫ్‌ సింటెక్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భూసార్మ శ్రీనివాస్‌, ఉమర్‌ రహమత్‌ ప్రసంగించారు. పిఎసిఎస్‌ అధ్యక్షులు సదాశివరెడ్డి, దేహించల్‌రెడ్డి, సీహర్‌, శివరాములు, లింగంపేట, గాంధారి, భీష్కుల్‌, కిళ్ళ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్‌ రిజిస్టార్లు కె. లక్ష్మీకళ, జె. శ్రీనివాస్‌, బాంత పాషా, సీనియర్‌ ఇన్స్పెక్టర్లు సుశీల, సురేష్‌ తదితరులు హాజరయ్యారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.