Tuesday, 7 April 2026

Blog

నిర్మల్

నిర్మల్ లో ఎన్ఎస్ఎస్ విద్యార్థుల పారిశుద్ధ్య పనులు ప్రారంభం

పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 25, నిర్మల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ ఎన్సిసి విద్యార్థులు పారిశుద్ధ్య పనులను నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ యూనిట్ 2 సంయుక్త ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని మురికివాడైన శాంతినగర్ను పరిశుభ్రంగా తయారు చేయడానికి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ముందుకు వచ్చారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమం ఈరోజు ప్రారంభించారు దీనికి ముఖ్య అతిథిగా నిర్మల్ ఏఎస్పి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సమాజ సేవ చేయని జీవితం వ్యర్థమని అందులో పొదుపు చేసుకోలేని జీవితం అనర్ధమని పేర్కొన్నారు. తెలివితోనే ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి సమాజాభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అవుతాయని కాబట్టి ఆర్థికంగా ఎదగడానికి ప్రతి ఒక్కరు విద్యార్థి చూడాలని చదువుతున్నప్పటికీ ఈ వయస్సు నుంచే కొలుపు చేసుకోవాలని సూచించారు. ఈ వయస్సులో ప్రేమ పెళ్లి అనకుండా తనకాళ్లపై తాను విద్యార్థిని విద్యార్థులు నిలబడాలని ఒకవేళ నచ్చినా ఒకరికొకరు సమయం తీసుకుని జీవితంలో స్థిరపడిన తర్వాత మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవాలని అప్పుడే ఆర్థిక స్థిరత్వం సమాజంలో గౌరవం లభిస్తాయని ఆయన అన్నారు. మొత్తం ఏడు రోజులు జరిగే ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజుగా డి అర్చన ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రతినిధిగా వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు గంగాధర్, ఏ ఎస్ పి ఉపేందర్ రాంగోపాల్ ఆర్బీఐ ప్రతినిధి రాంగోపాల్ తుకారం మండల విద్యాధికారి రాజేశ్వర్ పుణ్యం జాకీర్, సూర్య సాగర్, సుభాష్, డాక్టర్ హేమలత, పవన్ కుమార్ ఆసబూల్ రెహమాన్ ఎస్ రవీందర్ ఏ నరేందర్ ఏ త్రిపాటి ఆర్ మురహరి డాక్టర్ ఎ రంజిత్ కుమార్ ఎన్సిసి విద్యార్థులు కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

కొట్టేసాయి ప్రసాద్ నీ సత్కరించిన వర్తకుల సంఘం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్ అక్టోబర్ 30; శ్రీకాళహస్తిశ్వర స్వామి దేవస్థాన పాలకమండలి అధ్యక్షులుగా నియమించబడిన కొట్టె సాయి ప్రసాద్ ని శ్రీకాళహస్తి టెక్సటైల్స్ అండ్ రెడీమేడ్ అస్సోసియేషన్ సభ్యులు ఆత్మీయపూర్వకంగా కలిసి ఆయనకు తమ అభినందనలు తెలిపి సత్కరించి కొట్టె సాయిప్రసాద్ మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని సభ్యులందరు కోరుకున్నారు. తనకు అభినందనలు తెలిపినందుకు కొట్టే సాయి ప్రసాద్ బట్టల వ్యాపారస్తులకు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మల్

అటుకెక్కిన కాంగ్రెస్ మేనిపెస్టో : డిగ్రీ అతిథి అధ్యాపకులకు 50000 పెంచని వేతనాలు »» ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తథ్యం

అటుకెక్కిన కాంగ్రెస్ మేనిపెస్టో : డిగ్రీ అతిథి అధ్యాపకులకు 50000 పెంచని వేతనాలు »» ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తథ్యం >> డిగ్రీ అతిథి అధ్యాపకులకు అందని వేతనాలు »నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆరు నెలలుగా అందని వేతనాలు నిర్మల్, అక్టోబరు 30 (న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రములో పని చేస్తున్న 1940 డిగ్రీ అతిథి అధ్యాపకులకు గత ఆరు నెలలుగా వేతనాలు రాక పస్తులుండాల్సి వచ్చింది. అరకొర వేతనాలతో సేవలందిస్తున్న డిగ్రీ అతిథి అధ్యాపకులకు సమయానికి వేతనాలు అందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆరు నెలలకు సంబంధించిన వేతనాలు రాలేదు. ఈరోజు రేపు వస్తాయి అని ఊహల్లో తేలిపోతున్న డిగ్రీ అధ్యాపకులు. నిర్మల్ జిల్లాలో మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం ముప్పై రెండు మంది డిగ్రీ అతిథి అధ్యాపకులు విధులు నిర్వ హిస్తున్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 12 మంది విధులు నిర్వహి స్తుండగా బైంసా గోపాల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 మంది, ముథోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 8 మంది డిగ్రీ అతిథి అధ్యాపకులు పని చేస్తున్నారు. సహాయ అధ్యాపకులతో పాటు వీరు కూడా విధులు నిర్వ హిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేదు. వచ్చే వేతనం కూడా నెల నెల సక్రమంగా రావడం లేదని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబరుతో పాటు అక్టోబరు మాసం కూడా పూర్తవుతుందని ఆయా మాసాలకు చెందిన వేతనాలు అం దడం లేదని అప్పుల ఉబిలో కూరుక పోతున్నారు. విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తారు, సమయానికి వేతనాలు అందడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సేవ చేస్తున్నామనే సంతృప్తి తప్పా కుటుంబ పోషణ భారంగా మారింది, నెల నెల వేతనాలు రాక అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి తమకు ఇవ్వాల్సిన వేతనాలు అందజేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంగ్రెస్ మేనిపెస్టో లో పేర్కొన్న విధంగా డిగ్రీ గెస్టు ప్యాకల్టీ లకు ప్రతినెలా 50000 రూపాయలు ఇవ్వాలి. అదికూడా కన్సల్దేటెడ్ చేయాలి. లేకపోతే గతం లో బి ఆర్ ఎస్ కు పట్టిన గతి మా ద్వారానే జరిగిందని గుర్తుంచుకోవాలి లేదంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం లోకి రాకుండా అడ్డుకుంటామని తెలంగాణ డిగ్రీ గెస్టు ప్యాకల్టీ యూనియన్ ఈ సందర్బంగా హెచ్చరించింది. అంతేకాదు త్వరలో సీఎంఓ ఆఫీస్ ను ముట్టడిస్తామని, ఉద్యమాన్ని తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో సుమారు 1940 కుటుంబాలు పొందుతున్న బాధలను ఉద్యమం గా మార్చి శాంతి యుతంగా ఓటుతో పోటు పొడిచి చూపిస్తామని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు మేనిపెస్టో దాన్ని వెంటనే బే షరతుగా అమలు పర్చండి. డిగ్రీ గెస్టు ప్యాకల్టీ లకు 50000 చెల్లించగలరని ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

నిర్మల్

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛభారత్ సంస్కృతిక కార్యక్రమాలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్, వారి జాతీయ సేవా పథకం యూనిట్ 2 ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం లో భాగంగా గురువారం డిగ్రీ కళాశాలలో స్వచ్ఛభారత్ కార్యాచరణ లో కళాశాలను శుభ్రం చేయడం జరిగిందని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.. ఈ కార్యక్రమం లో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డా. యూ. గంగాధర్, గరిపెల్లి అర్చన, టీ. శ్రీనివాస్, డా. హేమలత జి సుభాష్, అఫ్రీన్, డా. ఉమేష్, అబ్దుల్ రహమాన్, డా మురహరి, నరేందర్, దిలీప్, సనా గజాలా, తహనియత్ ఫాతిమా, నుశ్రత్ జహాన్, మెహరోజ ఖానం, డా రజిత NSS వాలంటీర్లు పాల్గొన్నారు.

నిర్మల్

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛభారత్ సంస్కృతిక కార్యక్రమాలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్, వారి జాతీయ సేవా పథకం యూనిట్ 2 ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం లో భాగంగా గురువారం డిగ్రీ కళాశాలలో స్వచ్ఛభారత్ కార్యాచరణ లో కళాశాలను శుభ్రం చేయడం జరిగిందని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.. ఈ కార్యక్రమం లో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డా. యూ. గంగాధర్, గరిపెల్లి అర్చన, టీ. శ్రీనివాస్, డా. హేమలత జి సుభాష్, అఫ్రీన్, డా. ఉమేష్, అబ్దుల్ రహమాన్, డా మురహరి, నరేందర్, దిలీప్, సనా గజాలా, తహనియత్ ఫాతిమా, నుశ్రత్ జహాన్, మెహరోజ ఖానం, డా రజిత NSS వాలంటీర్లు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

జనసేన నాయకుల పరామర్శ: తుఫాను బాధితులకు అండగా నిలిచిన జనసేన

అల్లూరి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి జి. కె. వీధి అక్టోబరు 30: అల్లూరి జిల్లా జి.కె. వీధి మండలం, రింతాడ పంచాయతీలోని ఈదులబంధ, తీముల బంధ గ్రామాలలో ముంథా తుఫాను నేపథ్యంలో సంభవించిన భారీ వర్షాలు, గాలుల కారణంగా ఇల్లు కోల్పోయి నష్టపోయిన కుటుంబాలను జనసేన నాయకులు పరామర్శించారు. సోషల్ మీడియాలో ఈ సమాచారం వైరల్ కావడంతో, జనసేన నాయకులు గొర్లె వీరవెంకట్ ఆధ్వర్యంలో నష్టం జరిగిన కుటుంబాలైన గమ్మెలి నీలన్న, కొర్ర చిన్నమ్మి, కొర్ర రఘునందన్ నివాసాలకు వెళ్లి, వారి ఇళ్ల పైకప్పులు, గోడలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు.నష్టపోయిన కుటుంబాలకు వారు ధైర్యాన్ని చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కొర్ర చిన్నమ్మి పరిస్థితిని గమనించిన వీరవెంకట్, తక్షణ సహాయంగా ఆమెకు కొన్ని నిత్యవసర సరుకులను అందించారు.మరోవైపు, ఈ విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం కూడా తక్షణమే స్పందించి, అధికారులను సంఘటనా స్థలానికి పంపారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసి, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని, ప్రభుత్వం కచ్చితంగా స్పందించి బాధితులకు న్యాయం చేస్తుందని జనసేన నాయకులు తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ వడేలు పాండురాజు, జనసేన ప్రధాన కార్యదర్శి గబులంగి గణేష్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అనిల్, తాడి రమేష్, పీసా ఉపాధ్యక్షులు గెమ్మెలి కోటిబాబు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వైకాపా నాయకుని కర్మక్రియల్లో పాల్గొన్న బియ్యపు ఆకర్ష్ రెడ్డి

శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి మండలంలోని పుల్లారెడ్డి కండ్రిగ గ్రామానికి చెందిన వైకాపా మండల నాయకుడు పాగాల నాగమోహన్ రెడ్డి ఇటీవల ఆకస్మిక మృతి చెందారు. గురువారం నాడు నాగమోహన్ రెడ్డి కర్మక్రియల కార్యక్రంలో మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి వైకాపా మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి,రవీంద్ర రెడ్డి,యుగంధర్ రెడ్డి, శేఖర్ రెడ్డి,శివ ప్రసాద్,ముని రాఘవ రెడ్డి,సురేష్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి, శశి,రాజా,ముని గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

❗ ❗ *”ముంధా” తుఫాన్ బాధితులకు నష్టపరిహారంపై …….”బొజ్జల సుధీర్ రెడ్డి” గారు ఆరా*❗❗

💥 *పార్టీ నాయకులకు దిశా నిర్దేశం;- “MLA బొజ్జల”*💥 *🙏 తుఫాన్ కారణంగా కూలిన ఇండ్లుకు నష్టపరిహారం అందిందా❓లేదా❓ రెవెన్యూ శాఖ అధికారులు సకాలంలో స్పందించారా❓ లేదా❓ అని గౌరవ శాసనసభ్యులు శ్రీ “బొజ్జల సుధీర్ రెడ్డి” గారు పార్టీ నాయకులను అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది, అందులో భాగంగా ఈ దినం భారీ వర్షాల వల్ల నష్టపోయినటువంటి నిర్వాసితుల ఇళ్ల వద్దకు శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ మరియు తే.దే.పా నాయకులు వెళ్లి వారికి ప్రభుత్వం తరఫున అధికారులు సకాలంలో స్పందించారా అని అడిగి తెలుసుకోవడం జరిగింది, అనంతరం రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి కూలిపోయిన ఇండ్లకు త్వరతిగతిగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందేలా చేయాలని కోరడం జరిగింది, అదేవిధంగా అక్కడున్నటువంటి నిర్వాసితులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చినటువంటి అంశంలో భాగంగా కోర్టు ప్రహరీ గోడ మొత్తం కూలి పోయే దుస్థితిలో ఉంది అని, వృద్దులు, చంటిబిడ్డలు, పధాచ్చారులు, ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు కనుక రాబోవు రోజులలో ఎలాంటి అసందర్భం జరగకుండా ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం కలగకుండా ఉండే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ చూపి చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు తె.దే.పా నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది,పై కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బాలు ఢిల్లీ,రాకేష్, నవీన్,వివేక్, తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు.*🙏

ఆంధ్రప్రదేశ్

తుఫాన్‌ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా

▪️మొంథా తుఫాన్ కారణంగా రూ.5,265 కోట్ల నష్టం. ▪️వ్యవసాయ రంగంలో రూ.829 కోట్ల నష్టం. ▪️హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్ల నష్టం. ▪️సెరికల్చర్ రంగంలో రూ.65 కోట్లు నష్టం. ▪️పశుసంవర్థక శాఖలో రూ.71లక్షలు, 20 పశువులు చనిపోయాయి-చంద్రబాబు ▪️ఆక్వా రంగం నష్టం రూ.1,270 కోట్లు. ▪️మున్సిపల్ శాఖ నష్టం రూ.109కోట్లు-సీఎం చంద్రబాబు.

తిరుపతి

వాయులింగేశ్వరుని సేవలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సి.యం.రమేష్

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యలు,రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సి.యం.రమేష్ కు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తో కలిసి సాదర స్వాగతం పలికారు.వారికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.అనంతరం వారికి వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం మరియు శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యుడు గాదేపాకుల గోపి,దేవస్థానం ఏ.ఈ.ఓ మోహన్,అలాగే ఆలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.