Tuesday, 7 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కార్తీకమాస అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాతలుగా సింధు డ్రెస్సెస్ అధినేత గంగిశెట్టి సుధాకర్ రావు వారి కుటుంబసభ్యులు

కార్తీకమాస అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాతలుగా సింధు డ్రెస్సెస్ అధినేత గంగిశెట్టి సుధాకర్ రావు వారి ధర్మపత్ని ధనలక్ష్మి కుమారుడు కృష్ణ చైతన్య కుమార్తె రామ ప్రత్యూష వ్యవహరించారు. ముందుగా దేవస్థానం నందు అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు గావించి కార్తీకమాస విశిష్టతను గురించి దేవస్థాన ప్రధానార్చకులు తెలియజేశారు. ఈ కార్తీక మాసంలో అన్నదానం చేస్తే వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యములతో అష్ట ఐశ్వర్యముల అవుతారు అని దేవస్థాన గురుస్వాములు చేబ్రోలు వసంతరావు ACDC ప్రసాద్ స్వామి బొక్కల మస్తాన్ రెడ్డి తెలియజేశారు. పై అన్నదాన కార్యక్రమమును దేవస్థానం చైర్మన్ కరకల మాలకొండ రెడ్డి మరియు ట్రెజరర్ కొంకల శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో స్వాములకు విశేషంగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని అందించారు.

తిరుపతి

ముస్లిం యువత రూపొందించిన యాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి యువతకు ప్రోత్సహిస్తున్న తీరు పై నమ్మకంతో ఎమ్మెల్యేని కలిసి వారు ముస్లిం యువత తాము రూపొందించిన చేసిన యాప్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో ముస్లిం యువత విద్యకు దూరంగా ఉంటూ బలాదూర్ గా తిరుగుతూ తల్లి తండ్రులకు భారంగా ఉంటూ వచ్చిన ముస్లిం యువత ఇప్పుడు సమయాన్ని వృధా చేయకుండా కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సాఫ్టవేర్ సంబంధించి విశాఖపట్నం నగరంలో ఆసియా లోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అది చూసి ముస్లిం యువత భవిష్యతు పై ఆశలు చిగురింఛాయాని సాఫ్ట్వేర్, వెబ్సైట్ క్రియేట్ పరంగా యువతకు ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తాను ముందు ఉంటానని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారికి హామీ ఇవ్వడం జరిగింది.

ఎన్ టి ఆర్ జిల్లా

“మొంథా తుఫాను ప్రభావితులకు ఆర్యవైశ్య సంఘం బియ్యం సహాయం”

గురువారం నందిగామ, NTR జిల్లా: మొంథా తుఫాను కారణంగా నందిగామ గ్రామ పరిసరాలు వరద నీటితో నిండిపోయి, వృద్ధులు, చంటి పిల్లలు, ఒంటరి మహిళలు మరియు నిరుపేద కుటుంబాలు దారుణ పరిస్థితుల్లో ఉండిపోయాయి. ఆర్యవైశ్య సంఘం – నందిగామ ప్రాతినిధ్యంలోని పారేపల్లి సాయిబాబు ఆధ్వర్యంలో, ఉమా కాలనీ పక్కన గుంట క్వారీ రోడ్డు ప్రాంతంలో 21 నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 కేజీలు సాంబా మసూరి బియ్యం పంపిణీ చేయబడింది. *సహకారం అందించిన వారు* : పోలిశెట్టి కుటుంబ సభ్యులు: స్వర్గీయ పోలిశెట్టి సుధాకర్ భార్య పద్మావతి, కుమారులు పోలిశెట్టి వెంకటరావు, ఉపేంద్ర, సురేష్ *ఇతర ప్రముఖులు* : పబ్బతి జనార్దనరావు, ఈదావెంకటరెడ్డి, ఏడకొండలు, బలుసుపాటి నాగరాజు, మనోజ్ భోజనం, బండి డ్రైవర్ శివాజీ ప్రజలకు సాయం అందిస్తూ, సంఘం నిరుపేదలకు తక్షణ సహాయం అందించడం ద్వారా ఒక మంచి సామాజిక దృష్టాంతం నెలకొల్పింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కేతినేని వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో కేతినేని వారి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. కేతినేని సాంబశివరావు – శ్రీమతి సుగుణ దంపతుల కుమార్తె తేజస్వి వివాహ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన గంధపు నలుగు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు వధువు తేజస్వి ని స్వయంగా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వధువుకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు నిండాలని, దాంపత్య జీవితం సుఖశాంతులతో నిండిపోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలు, స్నేహితులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

తూర్పు గోదావరి

వెంకటాయపాలెం గ్రామంలోని మునిగిన పొలాలను ఆర్డీవో రాణి సుస్మిత ఆర్డిఓ రాణి సుస్మిత పరిశీలన

గోపాలపురం, తేదీ: 30.10.2025 వెంకటాయపాలెం గ్రామంలోని మునిగిన పొలాలను ఆర్డీవో రాణి సుస్మిత పరిశీలన గురువారం సాయంత్రం కొవ్వూరు ఆర్డీవో శ రాణి సుస్మిత గోపాలపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో తుఫాను కారణంగా మునిగిన వ్యవసాయ పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పంట నష్టాలను అంచనా వేయడం జరుగుతోందని ఆర్డీవో తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపరిహారం కోసం అవసరమైన నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించబడతాయని పేర్కొన్నారు. సందర్శనలో వ్యవసాయ శాఖ అధికారులు, తహసిల్దార్, సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అరటి రైతు అతలాకుతలం, తక్షణం రైతులను ఆదుకోవాలి.

పెరవలి : నేలకొరిగిన అరటి తోట సందర్శించి రైతులను పరామర్శించిన పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నిడదవోలు మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస నాయుడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో అరటి పంటకు అపార నష్టం వాటిల్లింది. మరో నెల రోజుల్లో చేతికందే అరటి మట్టి కొట్టుకుపోయింది. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జి శ్రీనివాస్ నాయుడు గురువారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కామల తదితర గ్రామాల్లో తుపాన్ కు నష్టపోయిన అరటి తోటలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా గూడూరి శ్రీనివాస్, శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టాన్ని సత్వరం అంచనాలు వేసి రైతులను ఆదుకోవాలన్నారు. రైతుల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రైతు భరోసా.. క్రాఫ్ ఇన్సూరెన్స్.. ఇన్ఫిట్ సబ్సిడీ.. సకాలంలో ఎరువులు పంపిణీ వంటి సర్వీస్ లన్నీ కూడా చేయడం జరిగిందన్నారు. చేతి కందే పంట అంతా నష్టపోవడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సిపి రైతుల వెంట ఉంటుందన్నారు. అనంతరం ఉపాధి కోల్పోయిన పేదలకు బియ్యం, నగదు సాయం అందించారు.

జనగాం

మొందా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి*

*మొందా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి* ———–_————— *సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్* ________________ (స్టే)ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను సిపిఎం బృందం పరిశీలించింది అనంతరం మండల కార్యదర్శి మునిగెల రమేష్ మాట్లాడుతూ నిన్నటి తుఫాన్ తో నోటి కాడికి వచ్చిన పంట నీట మునిగడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారని అన్నారు భారీ వర్షం 24 గంటల పాటు విపరీతంగా వర్షం పడటంతో పంటలు తీవ్రంగా నష్టపోయాయని వరి ధాన్యం పూర్తిగా నీట మునిగిందని అన్నారు ఇప్పుడే పత్తులు ఏరే క్రమం ఉండడంతో వర్షం పడడంతో పూర్తిగా పత్తి మొక్కజొన్న పంటలు కరాబైన పరిస్థితి ఉందన్నారు అలాగే మిగతా పంటలు మొత్తము నీటిలో మునిగిపోయాయని అన్నారు రైతులు ఎన్నో ఇబ్బందులు పడి పెట్టుబడికి డబ్బులు లేక అప్పులు తీసుకొచ్చి పంటలు వేసుకుని పంటలు చేతికొచ్చిన తరుణంలో తుఫాన్ వల్ల పంటలను నష్టపోయాయని అన్నారు ఐకెపి సెంటర్ల దగ్గర పోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయాయని ఏ షరతులు లేకుండా ఐకెపి సెంటర్లో ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నష్టపోయిన *ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టంపై అంచనా వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో* *సిపిఎం మండల కమిటీ సభ్యులు కత్తుల రాజు తోడంగల ఐలయ్య మంద మహేందర్ శాఖ కార్యదర్శి నాయకులు రైతులు వంగపండ్ల సోమయ్య దైద కుమార్ లింగనబోయిన రాజు మంద మొగిలి వారాల లింగయ్య ఆరుట్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

మా మీద కొంచెం దయతలచండి సార్ వీధిలైట్లు లేక తీవ్ర ఇబ్బందులు

పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ 9640204826: పాములు వచ్చిన కనపడని పరిస్థితి నక్కర్త ఆలంపల్లి కాలనీ మరియు నక్కర్త వాటర్ ట్యాంక్ దగ్గర వీధిలైట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు వీధిలైట్లు వేయించాలని ఎన్నిసార్లు గ్రామ సెక్రెటరీ కారోబార్ కి మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదంటే ప్రజలు

కడప

ప్లాస్టిక్ నిర్మూలన నివారణ సాధ్య మేన

ప్లాస్టిక్ నిర్మూలన ఎవరితో సాధ్యం కేవలం రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులను టార్గెట్ చేసి ప్రభుత్వ మునిసిపల్ అధికారులు వేధించడం ఎంతవరకు న్యాయం అని చిరు వ్యాపారస్తులు మండి పడుతున్నారు వివరాల్లోకెలితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్లాస్టిక్ నివారించే దిశగా అడుగులు వేస్తున్న తరణంలో చిరు వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారి ఆగ్రహానికి కారణం వారిమాటల్లోనే చూద్దాం కేవలం బయటినుండి ఇంటికి వెళ్లే వ్యక్తులు మాత్రమే హ్యాండిల్ కవర్ లపై శ్రద్ధ వహిస్తారని అదికూడా వస్తువులు క్యారీ చేయడానికి ఏమి అందుబాటులో లేని సమయంలో మాత్రమే హ్యాండిల్ కవర్స్ పై ఆధార పడవలసి ఉంటుందనేది వారి వాదన ఇక అసలు విషయానికి వస్తే ఏ కొత్త ప్రభుత్వం వచ్చిన కేవలం ప్లాస్టిక్ కవర్ లపై ప్లాస్టిక్ గ్లాసులపై మాత్రమే ద్రుష్టి సారించి చిరు వ్యాపారులపై వీరి ప్రతాపం చూపడమే కానీ ఏ రోజైన ఏ ఏ వస్తువులు ప్లాస్టిక్ కవర్ లలో వస్తున్నాయి అవి ఎక్కువగా ఎక్కడ విక్రయాలు జరుగుతున్నాయి వారిపై చర్యలు తీసుకోవడానికి వీరికి ధైర్యం సరిపోతుందా అని చిరు వ్యాపారస్తులు మండి పడుతున్నారు అదేంటని పున్నమి రిపోర్టర్ ప్రశ్నించగా వారి సమాధానం ఆలోచనకు గురి చేస్తోంది పాలు, పెరుగు, నెయ్యి (ఘీ), వెన్న, మినప్పప్పు,కందిపప్పు,మషాలాలు, వంట నూనె.ఇలా చెప్పుకుంటూ పొతే ప్రభుత్వం ప్రతి నెలా రేషన్ షాప్ లో ఇచ్చే చెక్కర కందిపప్పు ప్లాస్టిక్ కవర్ లోనే గా అంటూ సమాధానం చెప్పు కొచ్చారు మన జీవిత దినచర్యలో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి వస్తువు ప్లాస్టిక్ కవర్లలోనే విక్రస్తుంటే అధికారులు నాయకులు ఎంతసేపు హ్యాండిల్ కవర్లు ప్లాస్టిక్ గ్లాసుల పైనే దృష్టి పెడుతున్నారని చెప్పుకొచ్చారు ఇక వారి మాటల్లోనే వాటి జోలికి అధికారులు కానీ ప్రజా నాయకులు కానీ ఎందుకు వెళ్లరు అని పున్నమి రిపోర్టర్ వారిని ప్రశ్నించగా అవి కార్పొరేట్ సంస్థలు వాటి జోలికి వెళ్లే ధైర్యం ఏ ప్రభుత్వ అధికారికి గాని ప్రజా నాయకుడికి కానీ లేదన్నారు చిరు వ్యాపారులను బెదిరించి భయపెట్టి చలాన్లు విధిస్తున్నారే గాని ఏరోజైనా కార్పొరేట్ వ్యాపారస్తుల జోలికి వెళ్లిన పాపానా పోలేదని వాపోతున్నారు ఒకవేళ కార్పొరేట్ వ్యాపారస్తుల జోలికి వెళితే రాష్ట్ర ప్రభుత్వాలకు తీరని ఆర్ధిక లోటు ఏర్పడుతుందనే భయంతో వాటి జోలికి వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు అంతెందుకు మన రైలు ప్రయాణం లో విక్రయించే రెయిల్ నీల్ ప్లాస్టిక్ బాటిల్ కాదా విమాణ ప్రయానాల్లో ఇచ్చే నీళ్లు ప్లాస్టిక్ బాటిల్ లో కాదా ప్రభుత్వాలు ప్లాస్టిక్ నివారణ చేయాలంటే ముందు కార్పొరేట్ వ్యాపారస్తులను కట్టడి చేస్తే ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యం అవుతుందేమో కానీ ఇలా ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ గ్లాసులపై పడితే ప్రజలకు ఇబ్బందులు తప్పా ప్రభుత్వాలకు ఎటువంటి లాభం చేకూరక పోగా ఇంకా నష్టమే ఎక్కువ అని చెప్పుకొచ్చారు ఇక ఎవరు ప్లాస్టిక్ ని నిర్మూలించేది మనభారత ప్రధానియా అలాచేస్తే రైలు లో విక్రయించే రెయిల్ నీల్ అమ్మకాలు సాధ్యమేనా ఫ్లైట్ లో ఇచ్చే నీరు సరఫరా సాధ్యమేనా అలాగే రాష్ట్ర ముఖ్య మంత్రులు, మంత్రులు రాష్టంలో నిత్యావసర సరుకుల విక్రయాలు సాధ్యమేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే విస్తు పోవడం పున్నమి రిపోర్టర్ వంతయింది ఇక ప్రజలే ఈ విషయం పై సమాధానం ఇవ్వాలని చిరు వ్యాపారస్తులు చెప్పుకొచ్చారు ఇక ప్లాస్టిక్ భూతానికి అడ్డు కట్ట వేయలేమా నివారణ చర్యలు చేపట్టేది సాధ్యమేనా అనేది ప్రశ్నర్థకంగా మారింది. రచయిత షేక్. టప్పా. షాకీర్ హుస్సేన్ ప్రొద్దుటూరు వైస్సార్ కడప జిల్లా

నిర్మల్

నిర్మల్ లో ఎన్ఎస్ఎస్ విద్యార్థుల పారిశుద్ధ్య పనులు ప్రారంభం

పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 25, నిర్మల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ ఎన్సిసి విద్యార్థులు పారిశుద్ధ్య పనులను నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ యూనిట్ 2 సంయుక్త ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని మురికివాడైన శాంతినగర్ను పరిశుభ్రంగా తయారు చేయడానికి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ముందుకు వచ్చారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమం ఈరోజు ప్రారంభించారు దీనికి ముఖ్య అతిథిగా నిర్మల్ ఏఎస్పి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సమాజ సేవ చేయని జీవితం వ్యర్థమని అందులో పొదుపు చేసుకోలేని జీవితం అనర్ధమని పేర్కొన్నారు. తెలివితోనే ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి సమాజాభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అవుతాయని కాబట్టి ఆర్థికంగా ఎదగడానికి ప్రతి ఒక్కరు విద్యార్థి చూడాలని చదువుతున్నప్పటికీ ఈ వయస్సు నుంచే కొలుపు చేసుకోవాలని సూచించారు. ఈ వయస్సులో ప్రేమ పెళ్లి అనకుండా తనకాళ్లపై తాను విద్యార్థిని విద్యార్థులు నిలబడాలని ఒకవేళ నచ్చినా ఒకరికొకరు సమయం తీసుకుని జీవితంలో స్థిరపడిన తర్వాత మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవాలని అప్పుడే ఆర్థిక స్థిరత్వం సమాజంలో గౌరవం లభిస్తాయని ఆయన అన్నారు. మొత్తం ఏడు రోజులు జరిగే ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజుగా డి అర్చన ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రతినిధిగా వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు గంగాధర్, ఏ ఎస్ పి ఉపేందర్ రాంగోపాల్ ఆర్బీఐ ప్రతినిధి రాంగోపాల్ తుకారం మండల విద్యాధికారి రాజేశ్వర్ పుణ్యం జాకీర్, సూర్య సాగర్, సుభాష్, డాక్టర్ హేమలత, పవన్ కుమార్ ఆసబూల్ రెహమాన్ ఎస్ రవీందర్ ఏ నరేందర్ ఏ త్రిపాటి ఆర్ మురహరి డాక్టర్ ఎ రంజిత్ కుమార్ ఎన్సిసి విద్యార్థులు కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.