Tuesday, 7 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో సీఎం చంద్రబాబు – బాధితులకు భరోసా, రైతులకు సహాయ హామీ

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలోని మొంథా తుఫాన్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తక్షణ సాయంగా నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25 కిలోల బియ్యం మరియు ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిందని బాధితులు వివరించారు. తరువాత సీఎం చంద్రబాబు అరగట్లపాలెం మరియు బెండమూరులంక గ్రామాలకు వెళ్లి వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తించి, వీలైనంత త్వరగా పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల ఆపదలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత, పంటల పునరుద్ధరణ, మరియు సాధారణ జీవన స్థితిని త్వరగా సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

తెలంగాణ

రైస్ మిల్లర్లు ఎలాంటి జాప్యం లేకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దించుకోవాలన్నా : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ఈ ఖరీఫ్ లో రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ తెలిపారు. రైస్ మిల్లర్లు ఎలాంటి జాప్యం లేకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దించుకోవాలని కోరారు. గురువారం ఆమె మిర్యాలగూడ మండలం గూడూరులోని రామకృష్ణ రైస్ మిల్లు ను తనిఖీ చేసి, మిల్లింగ్ కెపాసిటీ, బ్యాంకు గ్యారంటీ, బాయిల్డ్ రైస్ ప్రక్రియ, తదితర అంశాలపై రైసుమిల్లుల యజమానులతో మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో భాగంగా ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో 1,75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం 290 కొనుగోలు కేంద్రాలకు వచ్చిందని,దేవరకొండ ప్రాంతాల్లో మరికొన్ని కేంద్రాలను ప్రారంభించాల్సి ఉందని, అయితే అక్కడ పంట కొంత ఆలస్యంగా వస్తుందని సాధ్యమైనంత త్వరగా అక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

అల్లూరి సీతారామరాజు

అండగా ఉంటామని అమరుడైన కానిస్టేబుల్ కుటుంబానికి సీఐ భరోసా

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో బాగంగా అరకు సీఐ హిమగిరి, అరకులోయ ఎస్ఐ గోపాలరావు లు ఎన్కౌంటర్ లో అమరుడైన కానిస్టేబుల్ మొర్ధాన్ కృష్ణుడు సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు గురువారం అరకులోయ లోని కృష్ణుడు ఇంటికి వెళ్ళి అతని కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకున్నారు. ఎటువంటి అవసరం ఉన్న పోలీసు వారి నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆ కుటుంబానికి సీఐ , ఎస్ఐ లు భరోసా ఇచ్చారు.

అల్లూరి సీతారామరాజు

మాడగడలో దొన్నుదొర పర్యటన కొండ నుంచి ఇళ్లల్లోకి ఊరుతున్న నీరు శాశ్వత పరిష్కారం చూపాలని కోరిన గ్రామస్తులు వేరే ప్రాంతానికి తరలించి విముక్తి కల్పించాలని వినతి

అరకులోయ(పున్నమి ప్రతినిధి ), అక్టోబర్:30 మొంథా తుఫాను ప్రభావంతో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అరకులోయ మండలం మాడగడలో కొండవాలు నుంచి వస్తున్న ఊటనీరు ఇళ్లల్లోకి చేరుతుంది. సుమారుగా 40 ఇళ్లకు పైబడి కొండ ఊట నీటితో ఇల్లు ముద్దవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న టిడిపి అరకు ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర గురువారం ఆ గ్రామంలో పర్యటించారు. ఊటనీరు రావడంతో కొన్ని నివాస గృహాల గోడలు కూలిపోవడాన్ని పరిశీలించారు. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం పై అధికారులను ఆయన ప్రశ్నించారు. ఎందుకు ఇప్పటివరకు పరిష్కారం చూపలేదని నిలదీశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. వర్షాలు పడే ప్రతి సారి తమ గ్రామంలో ఉన్న ఇళ్ల లోకి ఊటనీరు వచ్చేస్తుందని తమకు శాశ్వత పరిష్కారం చూపాలని సందర్భంగా వారంతా కోరారు. తమను వేరే ప్రాంతానికి తరలించి ఈ సమస్య నుంచి విముక్తి కల్పించాలని విన్నవించారు. గ్రామంలో కూడా ఎక్కడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని వచ్చిన నీరు బయటకు పోయేందుకు మార్గం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దొన్నుదొర స్పందిస్తూ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వంతో చర్చిస్తామని భరోసా ఇచ్చారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చూసేలా పరిష్కారం వెతుకుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లోకోయి మహదేవ్, ప్రధాన కార్యదర్శి పాంగి రాజు, నాయకులు రామచందర్ కిరణ్, సుబ్బారావు, భీమన్న, జగన్, బాలరాజు, ఆనంద్, సోన్ను,శంకర్ రావు, అరకు అసెంబ్లీ మీడియా కో ఆర్డినేటర్ బాలు దొర, శేఖర్, కొర్ర బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Blog

కుల వివక్ష అవివేకం – అధికారి పై తక్షణ చర్యలు చేపట్టాలి నల్ల బ్యాడ్జీలతో రెండవ రోజు నంద్యాల వాణిజ్య పన్నుల కార్యాలయంలో నిరసన

చిత్తూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సబ్‌డివిజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి కుల వివక్షతో ఉద్యోగులను అవమానించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ఇచ్చిన మూడు రోజులు నిరసన కార్యక్రమాల పిలుపు మేరకు రెండవ రోజు ప్రభుత్వ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బుధవారం భోజన విరామ సమయంలో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె. నాగేంద్రప్ప, కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ – రవీంద్రనాథ్‌రెడ్డి తన వద్ద పనిచేసే సబ్‌ఆర్డినేట్లు ఏ. లవ్‌కుమార్‌, కే. భరత్‌లను కులం పేరుతో దూషించడం, చెప్పులు బయట పెట్టి లోపలికి రావాలని ఆదేశించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆగ్రహించారు. ఇలాంటి అవమానకర ప్రవర్తన చేసిన అధికారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ – ఉన్నతాధికార హోదాలో కూర్చున్న వ్యక్తి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి కానీ ఇలా పెద్ద హోదాలో ఉండి ఉద్యోగులను కించపరచడం, కులాలను ఎత్తి చూపడం సభ్య సమాజం లో ఇటువంటివి సరియైనవి కాదని, ఇటువంటి అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం తప్ప ప్రజలకు సేవ చేయడంలో విఫలం అవుతారని, ఉన్నత హోదాలో ఉండి ఇలా కుల వివక్ష చూపించడం సిగ్గుచేటు చర్య అని, ప్రభుత్వం విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళన కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షురాలు రిజ్వానా పర్వీన్, నగర కోశాధికారి వెంకట చక్రధర్‌, సంయుక్త కార్యదర్శి ఆర్. ప్రభావతి, ఏపీ సిటీ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి, ఏపీ సిటీ ఎన్‌జిఓ అధ్యక్షుడు కమలాకర్‌, ఎస్‌సి, ఎస్టి ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు నిర్మల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామీణ నీటి పారుదల శాఖ ఉద్యోగులు బుల్లెట్ భాష, నిర్మల, సుబ్బరత్నమ్మ, సురేంద్ర, పుల్లయ్య, మోహన్‌, ఉదయ్‌, సుమన్‌, దీప‌, బల్వీర్‌, రాఘవేంద్ర‌, బాలరాజు‌, యశోద‌, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

ముంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలి – ఎమ్మెల్యే చినరాజప్ప.

పున్నమి న్యూస్ పెద్దాపురం 30/10 ముంథా తుఫాన్ కారణంగా పెద్దాపురంలో నియోజకవర్గంలో జరిగిన నష్టం పై ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గురువారం సమీక్ష నిర్వహించారు పంట పొలాల నష్టం పై రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూడాలన్నారు, తుఫాను నష్టం పై వెంటనే ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన సూచించారు ఈ సమీక్షలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఆర్టీవో శ్రీ రమణి, రామారావు, శ్రీరాములు, ఎమ్మార్వో వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఇద్దరు చనిపోయినా.. దాచారు: దాడిశెట్టి

తుఫాను వల్ల కాకినాడలో ఇద్దరు చనిపోయారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. ఆ మరణాలను ప్రభుత్వం దాచేసిందని ధ్వజమెత్తారు. జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని YCP చీఫ్ జగన్తో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో వివరించారు. అటు వరద బాధితులకు అందుబాటులో ఉంటున్నామని ఆ పార్టీ సీనియర్ నేత కన్నబాబు తెలిపారు. రైతుల తర్వాత తమ ప్రాంతంలో మత్స్యకారులే తీవ్రంగా నష్టపోయారని జగన్కు వివరించారు.

తెలంగాణ

ధాన్యం తడవకుండా చూడాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ ఛార్జ్ లను ఆదేశించిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ ఛార్జ్ లను ఆదేశించారు. గురువారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి, నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం చిరుమర్తి గ్రామం లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోందా తుఫాను కారణంగా గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఐకెపి కేంద్రంలోని ధాన్యం తడిసి రంగు మారిపోగా, ధాన్యం కొనుగోలు విషయంలో చిరుమర్తి కొనుగోలు కేంద్రానికి అనుసంధానం చేసిన రైస్ మిల్లుతో సమన్వయం చేసుకొని, ధాన్యం దించుకునేలా చూడాలని డిఆర్డిఓ శేఖర్ రెడ్డికి సూచించారు. ఎక్కువ రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉండవద్దని వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని చెప్పారు. అయితే ఈ కేంద్రంలో కేవలం నలుగురు రైతులకు చెందిన ధాన్యం మాత్రమే వర్షానికి తడిసిపోయి రంగు మారిపోయినట్లు డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు వివరించారు.

E-పేపర్

మోంథా తుఫాన్ బాధితులకు ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ ఆధ్వర్యంలో 400కు పైగా ఆహారం ప్యాకెట్లు,వాటర్ పాకిట్లు దాదాపు150 కుటుంబాలకు పంపిణీ.

నంద్యాల పట్టణంలోని 26,27వ వార్డులలో మోంత తుఫాన్ తీవ్రత వల్ల వరద ముంపు ప్రాంత ప్రజలు పలుచోట్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కాబట్టి నంద్యాల వాస్తవ్యులై ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ నంద్యాల ప్రాంతంలో వరద మంపు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు గురవుతున్న విషయం తెలుసుకొని వెంటనే తాను నమ్మే సిద్ధాంతం ప్రార్థించే పెదవుల కన్నా.. సహాయం చేసే చేతులు మిన్న. అనే నినాదంతోనే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించే మనసున్న వ్యక్తిగా ఆయన ఒక మంచి పేరు అందులో భాగంగా ఈ రోజు పట్టణంలోని స్థానిక 26,27వ వార్డు దేవనగర్,శ్యామ్ నగర్ లో వరద ముంపు వల్ల తీవ్ర ఇబ్బంది గురవుతున్నటువంటి కుటుంబాలను గుర్తించి వారికి అన్నదాన వితరణ చేయాలని అటువంటి ముఖ్య ఉద్దేశం తోటి ఈరోజు దాదాపు 400కు పైగా దాదాపు 150 కుటుంబాలకు ఆహార ప్యాకెట్లను మరియు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఇంత మంచి కార్యక్రమంలో నంద్యాల జనసేన పార్టీ యువ నాయకులు చందు,సుందర్, రాంబాబులు తో పాటు 26,27 వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అయిన మల్లెల భాస్కర్ లు ముఖ్యఅతిథులుగా పాల్గొని వార్డులలోని వరదల వల్ల ఇబ్బందుల గురైనటువంటి కుటుంబాలను గుర్తించి ప్రతి ఇంటికి దాదాపు 150 కుటుంబాలకు ఆహార ప్యాకెట్లను చేర్చాలని తమ వార్డు లోని వరద ముంపుకు గురైన ప్రతి ఒక్క కుటుంబానికి సహాయం అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో వారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో వరదల వల్ల తీవ్ర ఇబ్బందికి గురైన కొన్ని కుటుంబాల వారు మాట్లాడుతూ ఈ విధంగా తమకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆహార ప్యాకెట్లను,నీటిని మా ఇంటి వద్దకు వచ్చి అందించడం వల్ల చాలా సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు సుందర్ రాంబాబులు మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితులలో రాజకీయ, కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు వరద బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరి బాథ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ తమ వంతు సహాయంగా నేడు 26, 27 వ వార్డు వరద ముంపుకు గురైన బాథిత ప్రజలకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు.గోళ్ల రాజేష్ వారు వ్యాపార రిత్యా అందుబాటులో లేకపోయినప్పట్టికి నంద్యాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడంపై గోళ్ల రాజేష్ ను జనసేన పార్టీ నాయకులు అభినందించారు. అదేవిధంగా గతంలో నుంచి కూడా నేటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తున్నారని భవిష్యత్తులో ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు సహాయం అందించే సేవా కార్యక్రమాలు చేసిన వారికి ఎప్పుడు తాము తోడుగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో మీడియా సోదరులు రిపోర్టర్ నూర్ భాషా మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నంద్యాల జనసేన పార్టీ యువ నాయకులు చందు,సుందర్, రాంబాబు లకు మరియు 26, 27వ వార్డులు దేవ నగర్, శ్యాంనగర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భాస్కర్ కు కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలిపారు. తమ వార్డులో ఈ విధంగా ఆహార పంపిణీ కార్యక్రమం ఉందని అందుకు మీరు రావాలని పిలవగానే తమకు ఎన్నో కార్యక్రమాలు,పనులు ఉన్నప్పటికీ పిలవగానే ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు,సుందర్, రాంబాబులకు,తెలుగుదేశం పార్టీ 26,27వ వార్డు ఇన్చార్జి తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కార్ కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా నూర్ బాష మాట్లాడుతూ గతంలో నుంచి కూడా ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ వారు కొన్ని వ్యాపార కారణాలవల్ల ఇక్కడికి రాలేకపోయారని అయినా కూడా నంద్యాల వాసి అయిన గోళ్ల రాజేష్ నంద్యాల పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలలో తీవ్ర ఇబ్బంది గురవుతున్న ప్రజలకు తనవంతు సహాయంగా అన్నదాన వితరన కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావించి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు తన ద్వారా చేయించడంపై నూర్ భాషా సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భగవంతుడు గొళ్ల రాజేష్ కి అన్ని విధాల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని అందుకు ఎల్లప్పుడూ తన వంతు బాధ్యతగా ఆయన వెంట ఉంటామని మీడియా మిత్రులు రిపోర్టర్ నూర్ భాషా తెలిపారు ఈ కార్యక్రమంలో సవారి,చిన్న,రవి, సంజీవరాయుడు,శివశంకర్,విజయ్,షాలీ,అల్తాఫ్, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.