Tuesday, 7 April 2026

Blog

ఖమ్మం

తెలంగాణ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్

*తెలంగాణ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ఖమ్మం పున్నమి అక్టోబర్ 31 మాజీ క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 12:15 గంటలకు ఆయన తో రాజభవన్లో తెలంగాణ గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తోపాటు ఇతర మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అయితే అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయించ డంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఇది ఎన్నికల కోడ్ నిబంధన ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అధికారులు గురువారం నాడే అన్ని ఏర్పాట్లు చేశారు. రాజ్ భవన్ దర్బార్ హాల్‌ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్, తదితర అంశాలపై అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఖమ్మం

*ఖమ్మం జిల్లాలో సీపీఎం నాయకుని దారుణ హత్య

*BREAKING* *ఖమ్మం జిల్లాలో సీపీఎం నాయకుని దారుణ హత్య* సీపీఎం నేత సామినేని రామారావు దారుణ హత్య దిగ్భ్రాంతికి గురైన డిప్యూటీ సీఎం మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీనియర్ సీపీఎం నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తాం.. కలుషిత హింసా రాజకీయాలకు తావు లేదన్న డిప్యూటీ సీఎం.. శాంతిభద్రతలపై ఖమ్మం పోలీస్ అధికారులను సీరియస్ గా హెచ్చరించిన డిప్యూటీ సీఎం.. క్లూస్ టీం, స్నిపర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని మార్గాలను ఉపయోగించి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశం.. సీనియర్ సీపీఎం నేత సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసిన డిప్యూటీ సీఎం.. రామారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, పూర్తిస్థాయిలో ఆదుకుంటానని భరోసా..

విశాఖపట్నం

మొంథా తుఫాన్ ప్రభావితులకు సహాయం – పెందుర్తిలో సహాయక కార్యక్రమం

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం పెందుర్తి నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏపీ ఆయిల్ సీడ్ చైర్మన్ గండి బాబ్జి పాల్గొన్నారు. ఈరోజు (31.10.2025) పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు, మహిళా ప్రగతి కేంద్రం సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాన్ ప్రభావిత ఏకలవ్య కాలనీ పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు మరియు నగదు సహాయం అందజేశారు. ఒక కుటుంబానికి గరిష్టంగా ₹3,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా ఈ సందర్భంలో పంపిణీ చేయబడింది. పత్రికా మిత్రులతో మాట్లాడుతూ పంచకర్ల రమేష్ బాబు తెలిపారు: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా 24×7 మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు సమన్వయంతో పనిచేసినందున తక్కువ నష్టం జరిగిందన్నారు. ముందస్తు జాగ్రత్తల వల్లే ప్రాణనష్టం, ఆస్తి నష్టం తగ్గించగలిగామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢసంకల్పం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నిరంతర సమీక్షల వల్ల భారీ విపత్తును ఎదుర్కోవడం సాధ్యమైందని తెలిపారు. రాష్ట్ర ప్రజల తరఫున మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లకు ధన్యవాదాలు తెలిపారు. నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్లు ముందస్తు చర్యలతో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన అన్ని విభాగాల్లో అంచనాలు జరుగుతున్నాయని, నివేదిక త్వరలో కేంద్రానికి అందజేయనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు, జీవీఎంసీ జోన్ 8 కమిషనర్ శంకరరావు, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జీవీఎంసీ వార్డు కార్పొరేటర్లు రాపర్తి కన్నా, బల్ల శ్రీనివాసరావు, సేనాపతి శంకరరావు, ముమ్మన దేవుడు, బీజేపీ ఇన్‌చార్జ్ గొర్లి రాము నాయుడు, పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ ఐతి సింహాచలం, ఏపీ ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మడక పార్వతి, ఏఎంసీ వైస్ చైర్మన్ గోరపిల్లి సోము నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు, ఉరిటి గోవింద్, సంతోష్, ముమ్మన సతీష్, గొంతిన హైమవతి, ఎంపీటీసీ గొల్లవిల్లి రమణ, మండల పార్టీ అధ్యక్షుడు కొరుపోలు రాము నాయుడు, వార్డు అధ్యక్షులు డిబిఎల్ నాయుడు, కంచిపాటి మధు, రాజేంద్ర ప్రసాద్, పిన్నింటి పార్వతి తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి మండలంలోని ఎన్‌డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ఆమోదం

వింజమూరు ఎంపీపీ మోహన్ రెడ్డిపై ఎంపీటీసీ సభ్యులు తిరుగుబావుట ఎగరవేశారు. శుక్రవారం కావలి ఆర్డిఓ వంశీ ఆధ్వర్యంలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో 12 మందిలో 11 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు కాగా మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 8 మంది అవిశ్వాసానికి మొగ్గు చూపడంతో ఆర్డీవో ఆమోదం పలికారు. ఈ విషయంపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి తదుపరి చర్యలు ఉపక్రమిస్తామని తెలిపారు.

గూడూరు

ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాల రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ

పున్నమి ప్రతినిధి@ గూడూరు స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అధ్యాపకులతో సహా విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశ ఐక్యత, సమగ్రత మరియు జాతీయ సంఘీభావాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ సూచిస్తుందని, దేశ సార్వభౌమత్వం, ఐక్యతను పెంపొందించడానికి సమాజంలో ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలియజేస్తూ విద్యార్థినీ విద్యార్థులు ఉక్కు మనిషిని స్ఫూర్తిగా తీసుకొని ప్రగతి పథo వైపు పయనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. కోటేశ్వరరావు, అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్, డాక్టర్ శైలజ, డాక్టర్ ఝాన్సీ వాణి, కిరణమై, శ్రీధర్ శర్మ, మైమూన్, కృపా కరుణ వాణి, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రూ.లక్ష సాయం చేసిన ఉదయగిరి మాజీ MLA లు

వింజమూరు(M) గోళ్లవారిపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు కర్నూలు బస్సు దుర్ఘటనలో సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మృతుల కుటుంబ సభ్యుల నివాసానికి గురువారం వెళ్లి పరామర్శించారు.అనంతరం రూ.లక్ష ఇచ్చారు. కుటుంబానికి తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

తిరుపతి

మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళ ఇందిరమ్మకు ఘననివాళులు

శ్రీకాళహస్తి అక్టోబర్ 31 , పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్. ఎస్. బతైయ్య నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఉక్కు మహిళా పేరుగాంచిన ఇంద్రమ్మకు నివాళులర్పించారు. మొదటగా ఇందిరాగాంధీకి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, డాక్టర్. ఎస్. బతైయ్య నాయుడు మాట్లాడుతూ.. భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీనేని, అలాగే 1966 నుండి 1977 వరకు వరుసగా మూడు పర్యాయలు, 1980లో నాలుగవ పర్యాయం ప్రధానమంత్రిగా పని చేశారని నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి కార్యదర్శిగా జీతం లేకుండా ఆమె పని చేశారని తదుపరి ఆమె ప్రధానమంత్రి అయిన తరువాత దేశానికి అనేక సేవలు అందించాడమేకాక పేద ,బడుగు, బలహీన వర్గాలకు బ్యాంకు ను జాతీయం చేసిన ఘనత, భూసంస్కరణ చేపట్టిన ఆమెనని, పేదలకు గృహ నిర్మాణం చేసి వారికి నీడను అందించిన ఘనత ఆమెదేనని డాక్టర్. ఎస్. బతైయ్యనాయుడు ఇదిరమ్మ చేసిన సేవలను కొనియాయదారు. ఈ కార్యక్రమంలో; నాగూరయ్య, ప్రకాష్ రావ్, కరీముల్లా, శ్రీనివాసులు, రాజయ్య, వానమ్మ, బాణమ్మ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

రన్ ఫర్ యూనిటీ సర్దార్ @150 నిర్వహించిన: నకిరేకల్ పోలీస్

నకిరేకల్ :అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి ) సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా నేషనల్ యూనిటీ డే గా జరుపుకుంటాము. ఈ సందర్భంగా నకిరేకల్ పోలీసులు యూనిటీ ఫర్ సర్దార్ @150 ని పట్టణంలోని మెయిన్ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మరియు ఇతర అధికారులు పాల్గొని విజయవంతం చేశారు.

ఆంధ్రప్రదేశ్

గాయత్రిలో జాతీయ ఐక్యతా దినోత్సవం (శ్రీకాకుళం రూరల్ – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)

సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ ఐక్యతా దినోత్సవంను గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనజ్ మెంట్ కళాశాలలోని జాతీయ సేవా పధకం రెండు విభాగాలు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రిన్సిపాల్ కె.వి.వి.సత్యన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులలో స్ఫూర్తి కోసం మహాత్ముల చరిత్రలు చదవాలని, సర్దార్ తీసుకున్న నిర్ణయాలతో దేశంలో ఐక్యతకు అడుగులువేశారని, పటేల్ జీవితాన్ని అందరూ తెలుసుకోవాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటే విజయాల శాతం, శతశాతమన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.క్యూ.ఏ.సి సమన్వయకర్త డా. మార్తాoడ కృష్ణ, అప్పలనాయుడు, గోపాలరావు, హరిరామ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కలసి ఉంటే, కలదు సుఖం ..- ఐక్యతతో ప్రతీ సవాలును స్వీలరించగలం – లయన్స్ డా.పైడి.సింధూర (శ్రీకాకుళం – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)

కలసి ఉంటె, కలదు సుఖం, ఐక్యతతో పోరాడితే విజయం తధ్యమని లయన్స్ డా.పైడి.సింధూర అన్నారు. స్థానిక శాంతినగర్ గాంధీ మందిర ప్రాంగణంలో, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ జయంతి వేడుకలను, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ స్వేచ్ఛ కోసం పోరాడిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ గౌరవార్ధం ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవం పేరుతో జరుపుకుంటున్నామని, ఆయన చర్యల ఫలితంగానే హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారత్ లో విలీనమయ్యాయన్నారు. ఈ ఏడాది ‘నా మట్టి.. నా దేశం’ అనే థీమ్‌ను ఎంపిక చేశారని, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య యోధులను గౌరవించడం.. జాతీయ ఐక్యత, రాష్ట్రీయ ఏక్తా స్ఫూర్తిని ప్రచారం చేయడమే దీని ప్రధాన ఉద్దేసమని, మరణానంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదును ఇచ్చి గౌరవించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం .రామ్ గోపాల్, కోశాధికారి బరాటం.కృష్ణ చైతన్య, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ.రవి కుమార్, మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు.చరణ్ , సీనియర్ సభ్యులు గుత్తు.చిన్నా రావు, సభ్యులు చౌదరి .శ్రీనివాస్, బిజెపి మహిళా నాయకురాలు సిరిపురం. త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.