Tuesday, 7 April 2026

Blog

E-పేపర్

గ్రీన్ వుడ్ హోటల్ &రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

రైల్వేకోడూరు: తిరుపతి కడప నేషనల్ హైవే ప్రక్కన మాధవరంపోడు ఉప్పరపల్లి మధ్యన ఉన్న నూతన గ్రీన్ వుడ్ హోటల్ &రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన *వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు* ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, ఉప సర్పంచ్ శివ సాయి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నందా బాల,సర్పంచ్లు శివయ్య, శ్రీరామ్ వినోద్, ఈశ్వరయ్య యాదవ్, ఎక్స్ జెడ్పిటిసి రాజేశ్వరమ్మ, తొండం రాజేంద్ర, బాలిశెట్టి హరి, ఇర్ఫాన్ నవాబ్,కోప్పల శంకరయ్య,మస్తాన్,రాజగోపాల్, సిద్దయ్య,శివాజీ,అనిల్ రెడ్డి,గల్లా శ్రీను,అరుణమ్మ,తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

మున్నేరు వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు

ఖమ్మం జిల్లా… మున్నేరు వరద బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఖమ్మం మున్నెరు వరద బాధితులను పరామర్శ తెలంగాణ లో వరంగల్, ఖమ్మం 5రైతులు భాగ నష్టపోయ్యారు రాష్ట్ర ప్రభుత్వం.10 వేలు నష్ట పరిహారం కంటితుడుపు చూపు చర్య ధాన్యం ఏ విధంగా ఉన్న కొంటామని ఎన్నికల.సంధర్మలో చెప్పారు ఖమ్మం మున్నెరు వరధకు లోతట్టు ప్రాంతాలకు కారణం రాష్ట్ర ప్రబుత్వమే కమిషియన్లకు కకృతి.పడీ పార్కులను కట్టారు త్వరిగతిన రిటైనింగ్ వాల్ ను పూర్తి చేయాలి రైతులకు, ఇండ్లలో.నష్ట పోయిన వారికి.పారితోషకం ఇవ్వాలి సతుపల్లిలో.బీసీ రిసేర్వేషన్ కు.మద్దతుగా. బీజేపీ సంగిభావం తెలిపితే.బీజేపీ కార్యకర్తల.మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తే ఇప్పటి వరకు fir చెయ్యలేదు… పోలీసులు వెంటనే బీజేపీ కార్యకర్తల మీద దాడిని చేసిన వారిని అరెస్ట్ చేయాలి తుఫాన్ వల్ల రైతులు నష్ట పోయారు పత్తి మిర్చి బాగా నష్ట పోయారు పది వేలు ఎకరానికి ఇస్తామని అంటున్నారు ఇది కంటి తుడుపు చర్య మాత్రమే వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల గారిని కోరుతున్నాం నష్టపరిహారం పెంచాలి అని డిమాండ్ ఎన్నికల ముందు హామీలు ఇచ్చినట్లు గా హామీ నెరవేర్చుకోవాలి @ కేవలం నిర్లక్ష్యం సుందరీకరణ పేరు మీద గొల్లపాడు చానెల్ మూసివేశారు కమిషన్ లకు కక్కుర్తి పడి పార్క్ ల నిర్మాణం గత ప్రభుత్వం చేపట్టింది సైక్లోన్ వస్తె ఖమ్మం నల్గొండ దెబ్బ తింటున్నాయి గొల్లపాడు చానెల్ ఓపెన్ చేయాలి వర్షం పడ్డప్పుడల్లా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి @ ప్రభుత్వం ప్రజల జీవితాలను వదిలేసింది ఓట్ల కోసమే పని చేస్తుంది కులాన్ని మంత్రి పదవి ఇస్తే ఓట్లు వస్తాయి అన్నట్లుగా ప్రభుత్వానికి ఉంది ఒక్క జిల్లా లో హెలికాప్టర్ వేసుకుని తిరిగితే న్యాయం జరుగదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం ఇళ్ల డ్యామేజ్ కి నష్ట పరిహారం ఇవ్వాలి

తూర్పు గోదావరి

భరత్‌ రామ్‌ అసత్య ప్రచారం చేస్తున్నాడు, చర్యలు తీసుకోండి.

– త్రీ టౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన టీడీపీ ఎస్సీ సెల్‌, లీగల్‌ సెల్‌ సభ్యులు. రాజమహేంద్రవరం : రాజ్యాంగబద్దంగా ప్రజలచే అత్యధిక మెజార్టీతో ఎన్నుకోబడిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ కమిటీ సభ్యులు, లీగల్‌ సెల్‌ విభాగం మరియు వివిధ డివిజన్ల కమిటీల సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షులు చాపల చిన్నరాజు, లీగల్‌ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మీద మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ వ్యక్తిగత ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరాధారణమైన నిందారోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. భరత్‌ రామ్‌ సదరు ఆరోపణలను వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టా గ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ విగ్గు పెట్టుకుని స్టైల్‌ గా కళ్ళజోడు పెట్టుకుని మద్యం సేవించి అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నారంటూ ఆయన మీద లేనిపోని అభాండాలు వేసిన నేపధ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ సమాధానం చెప్తూ జగన్‌ పెగ్గు పోశారని ఒప్పుకుంటే బాలయ్యబాబు మద్యం వేసించారని తాము ఒప్పుకుంటామని మాత్రమే సమాధానం చెప్పారని, అయితే జగన్‌ పోసాడా అనే మాటలను కట్‌ చేసి తాగి వచ్చారు అనే మాటలతో సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా పలుసార్లు ఈవిఎం ఎమ్మెల్యే అని మాటిమాటికి అదే పదాన్ని ఉచ్చరిస్తూ ఆయన్ను అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు ఎవరైనా ఎన్నికల సంఘం ద్వారానే శాసన సభ్యులు కానీ, పార్లమెంట్‌ సభ్యులు గాని ఎన్నుకోబడుతున్నారని, అటువంటి వ్యవస్థను కూడా అపఖ్యాతి పాలు చేస్తూ ఎన్నికల సంఘం వ్యవస్థను కూడా మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అప్రతిష్ట పాలు చేసి రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలని పంపిస్తున్నారని మండిమడ్డారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అధికారిక, వ్యక్తిగత పని మీద ఢల్లీి వెళితే ప్రత్యేక విమానంలో దోచుకున్న సొమ్ముతో వెళ్లి షికారులు చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా ఇటువంటి నిందారోపణలు చేస్తూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా మీద కూడా భరత్‌ రామ్‌ తప్పుడు ప్రచారం చేస్తూ కేంద్ర, రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రెచ్చగొట్టే ధోరణిలో భరత్‌ రామ్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలు, వ్యక్తులపై ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్న మాజీ ఎంపీ భరత్‌ రామ్‌ మీద తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నగర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, ఉపాధ్యక్షులు బూరా రమణ, ఉడమల నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు చెన్నా వెంకటరమణ, కారంగి వీర్రాజు, బత్తిన రవి కుమార్‌, కార్యదర్శులు కొమరం సురేష్‌, పెద్ద, వివిధ డివిజన్‌ ఇన్‌ఛార్జలు దుత్తరపు గంగాధర్‌, కానేటి ప్రభుదాస్‌, లీగల్‌ సెల్‌ నగర అధ్యక్షులు కొమ్మర్తి బాబ్జి, లీగల్‌ సెల్‌ ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పూడి నవీన్‌, సభ్యులు సీహెచ్‌జి కిషోర్‌, ఈ సత్యం, నాయకులు కవులూరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా జరిగిన ఏకతాయాత్రలో పాల్గొన్న బిజెపి నాయకులు గడ్డం చంగల్ రాజు

గౌరవ భారత మాజీ ఉప ప్రధానమంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా జరిగిన ఏకతాయాత్రలో పాల్గొనడం జరిగింది

తూర్పు గోదావరి

వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ.

* టెండర్ల పేరుతో తన బినామీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టబెట్టేందుకు కుట్ర * వైద్య ఆరోగ్య శ్రీ వెంటనే పునరుద్ధరించాలి * పేదల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి ఆలంబిస్తున్న కూటమి ప్రభుత్వం * మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం * మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, వైయస్సార్ కాంగ్రెస్, రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ విమర్శ రాజమహేంద్రవరం : వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ ఎంపీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. శుక్రవారం మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో భాగంగా స్థానిక 48, 44, 43వ వార్డుల, సిటిఆర్‌ఐ సమీపంలోని పనసచెట్టు సెంటర్‌ వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, వైసిపి పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్‌ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో వహించారు. వైసిపి నాయకులు హాజరయ్యారు. మెడికల్‌ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ సేకరించిన సంతకాలను గవర్నర్‌కు అందచేయడంతో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తామని భరత్‌ రామ్ వెల్లడించారు. స్థానిక ప్రజల సమస్యలు వింటుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యం చేయించుకోవాలంటే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఎవరూ పట్టించుకోవడంలేదని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తే లక్షలాది రూపాయలు అడుగుతున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదని ప్రశ్నించారు. పేద ప్రజలు ఎక్కడికి వెళ్లి వైద్య చేయించుకోవాలని ప్రశ్నించారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ఆలంబిస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ కు రూ 400 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, అవి సుమారు 3 నెలల బకాయిలు ఉంటాయని అన్నారు. ఆ బకాయిలను గత ప్రభుత్వంతో పోల్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పే కల్లబొల్లి మాటలు మోసకరమైన మాటలు గమనిస్తున్నారని తగిన సమయంలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్‌ కళాశాలలను ప్రైవేటు పరం చేసి వైద్య విద్యను, వ్యాపారం చేయడానికి చూస్తున్నారని విమర్శించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందకుండా కుట్ర చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, టీడీపీ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపు ఇచ్చారు. చంద్రబాబు మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. అజ్జరపు వాసు కార్పొరేటర్‌గా పోటీచేస్తారని ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల పిల్లలు డాక్టర్లు కావాలంటే కలగాలనే మిగిలిపోయిందని, వారి కలను సాకారం చేసేందుకే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని అన్నారు. ఆయన హాయంలోనే 7 మెడికల్ కాలేజీ లకు శంకుస్థాపన చేసి నిర్మాణం జరిగిందని అన్నారు. 10 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. వైద్యాన్ని వ్యాపారంగా చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయం అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజల ఆస్తిని కాపాడుకోవడానికి యుద్ధం చేయడానికైనా వైసిపి సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గొల్లపల్లి సూర్యారావు గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ

*మోరిపోడు గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం: రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి పిలుపుమేరకు మోరిపోడు గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు గడ్డం సుభాకర్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్ అధ్యక్షతన *”మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం* నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మోరిపోడు గ్రామంలో కోటి సంతకాల ప్రజాఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు గారు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కటకంశెట్టి ఆదిత్య, మోకా సురేష్, గుర్రం జాషువా, పితాని ఏసుబాబు, ఇందుకూరి సత్యనారాయణ రాజు, జిల్లెళ్ళ ఉదయ్ కిరణ్ గార్లు. స్థానిక గ్రామ నాయకులు: చింత సురేష్, పితాని నారాయణ, పెమ్మాడి నాగేశ్వరరావు, కర్రి శ్రీనివాసు, జోగి ఆంజనేయులు, చెంతా శ్రీను, పాకేర్ల బన్ను, ఎల్లమిల్లి యాకోబు గార్లు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు….🙏🏻

ఆంధ్రప్రదేశ్

ప్రజలలో సోలార్ అవగాహన “మీ విద్యుత్ మీరే ఉత్పత్తి చేసుకునే అద్భుత అవకాశం”(నరసన్నపేట, అక్టోబర్ 31 (పున్నమి ప్రతినిధి):

ప్రతి నెలా వచ్చే విద్యుత్ బిల్లులతో విసుగు చెందిన ప్రజల కోసం సరికొత్త పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ‘పీఎం సూర్య ఘర్’ (PM Surya Ghar) పథకం పూర్తి స్థాయిలో ప్రయోజనం అందుకోలేకపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో “Revolution in Renewable Energy” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ‘జీకే సోలార్ ఎమ్పవర్’ (GK Solar Empower) సంస్థ ప్రజల్లో సోలార్ ఎనర్జీపై అవగాహన పెంపొందిస్తోంది.సంస్థ స్థాపకుడు గొండు క్రాంతి కుమార్ గారు వివిధ రాష్ట్రాలలో అనుభవం గల సోలార్ వెండర్లతో అనుసంధానం అయి విజయవంతంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో గృహస్థులు తమ ఇళ్ల పై Rooftop Solar Plants లేదా విద్యుత్ సబ్‌స్టేషన్ 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఖాళీ స్థలాల్లో Solar Power Plants ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారవచ్చని వివరించారు.దీని ద్వారా ప్రతి కుటుంబం నెలవారీ బిల్లులను తగ్గించుకోవడంతో పాటు, అదనంగా విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపి ఆదాయం పొందే అవకాశం ఉందని ఆయన తెలిపారు.PM Surya Ghar పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.78,000 వరకు సబ్సిడీతో పాటు 60 నెలల లోన్ సౌకర్యం అందిస్తున్నదని తెలిపారు. సులభమైన EMI పద్ధతిలో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత విద్యుత్ బిల్లు ‘జీరో’గా మారుతుందని చెప్పారు.ఎన్ఆర్ఈడీక్యాప్ (NREDCAP) రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గొండు తిరుపతి రావు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో 1 కిలోవాట్ నుండి 1 మెగావాట్ వరకు అనేక సోలార్ ప్లాంట్లు విజయవంతంగా ఏర్పాటైనట్లు తెలిపారు. జీకే సోలార్ ఎమ్పవర్ సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా సేవలందించగల నిపుణ టెక్నీషియన్ బృందం ఉన్నట్లు క్రాంతి కుమార్ గారు చెప్పారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు.📞 63099 51519, 92912 28536🏠 గొండు వీధి, వెంకటేశ్వర థియేటర్ పక్కన, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా – 532421 🌱 పర్యావరణాన్ని కాపాడుతూ ఖర్చును తగ్గించండి — మీ భవిష్యత్తు కోసం ఒక స్మార్ట్ నిర్ణయం తీసుకోండి.

తిరుపతి

నారాయణ పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం

శ్రీకాళహస్తి నారాయణ పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సమక్షంలో తాము చదివిన పాఠ్యాంశాలు, ప్రాజెక్టులు,మరియు అకడమిక్ పురోగతిని, స్వయంగా తాము నేర్చుకున్న విషయాలను వివరిస్తూ,ప్రదర్శనల ద్వారా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తమ ప్రతిభను చూపించారు.దీని ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం,కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎ.జి.యం శ్రీనివాసులు మాట్లాడుతూ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులు తమ అభ్యాసంపై బాధ్యత తీసుకోవడం,తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరయ్య,ఆర్.ఓ నీలిమ,ఆర్.ఐ కిరణ్, ఆర్&డి గాయత్రి,వైస్ ప్రిన్సిపాల్ లత మరియు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

దేశ సమైక్యతకు ప్రాణాలర్పించిన ఇందిర.. -బాలేపల్లి ఆధ్వర్యంలో ఘన నివాళులు.

రాజమహేంద్రవరం : దేశ రక్షణ, సమైక్యతకు గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఎల్లప్పుడూ కృషిచేసాయని, ఇందిర, రాజీవ్‌ గాంధీ తమ ప్రాణాలను సైతం అర్పించారని నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌ కొనియాడారు. భారతరత్న, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 41వ వర్థంతి సందర్భంగా స్థానిక జాంపేట వంతెన వద్దనున్న ఆమె విగ్రహానికి బాలేపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు. బ్యాంకుల జాతీయికరణ, రాజాభరణాల రద్దు, 20 సూత్రాల పథకం అమలు వంటివి దేశ చరిత్రలో నిలిచిపోయాయన్నారు. అటువంటి గాంధీ, నెహ్రూ కుటుంబాలను నేడు బీజేపీ ప్రభుత్వం దేశ ద్రోహులుగా చిత్రీకరించేందుకు కుట్రలు చేయడం దారుణమన్నారు. ఉక్కు మహిళగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన ఘనత ఇందిరా గాంధీకే దక్కుతుందన్నారు. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కాంగ్రెస్‌ వాది అని, ఆయన ఉప ప్రధాని పదవిని కూడా నిర్వహించారన్నారు. మొంధా తుఫాన్‌ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, లక్షల ఎకరాల్లో పంట నాశనం అయ్యిందని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసారు. కొత్తరుణాలు, ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ గాంధీ, నెహ్రూ కుటుంబాల కృషి వల్లనే నేడు దేశం ఈ విధంగా ఉందన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక ముస్లింకి మంత్రి పదవి ఇస్తుంటే బీజేపీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మతతత్వ పార్టీగా ముద్రవేసుకున్న బీజేపీ తీరును అందరూ గ్రహించాలన్నారు. సీనియర్‌ నాయకుడు బెజవాడ రంగారావు మాట్లాడుతూ దేశ సేవకు ప్రాణాలర్పించిన ఇందిర గాంధీ త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి సైతం ఇందిరా గాంధీని ప్రశంసించారన్నారు. కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్‌ లూథర్‌, కాంగ్రెస్‌ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, పట్నాల శ్రీనివాస్‌, నల్లా వీర్రాజు, గట్టి నవతారకేష్‌, కాటం రవి, బత్తిన చంద్రబాబు, యిజ్జరౌతు సత్యనారాయణ, యాళ్ల మాచరయ్య, తాడి సూరిబాబు, బర్రే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా మాజీ మేయర్ ఇంటింటి ప్రచారం *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31 : జూబ్లీహిల్స్ నియెజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రచారంలో భాగంగా రెహ్మత్ నగర్ లోని 103వ బూత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.జూబ్లిహిల్స్ అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. అనంతరం మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచ కాల్చి సంబరాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏఐసీసీ విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, సామ భాస్కర్ రెడ్డి, రాకేష్, గిరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.