Monday, 6 April 2026

Blog

Blog

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: డాక్టర్ రవి కృష్ణ*

ఆంధ్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని కళారాధన కార్యాలయంలో నంద్యాల లయన్స్ క్లబ్, కళారాధన, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కళారాధన ప్రధాన కార్యదర్శి, దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ 1956లో పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరులైన తరువాత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని, దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉండాలని పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయం, భావితరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు అమరావతిలో కూటమి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ. వి. రమణయ్య, కళారాధన కార్యవర్గ సభ్యుడు శివరామిరెడ్డి,నాగలింగేశ్వర రెడ్డి,లయన్స్ క్లబ్ సభ్యులు వాసు, కార్యాలయ కార్యదర్శి మధు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని వినతి పత్రం అందజేశారు

ఉదయగిరి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చూడాలని శనివారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పలువురు విశ్రాo త ఉద్యోగులు డిమాండ్ చేశారు అనంతరం డిప్యూటీ తహశీల్దార్ షాజియాకు వినతి పత్రం అందజేశారు కొన్ని సంత్సరాలుగా వివక్షతకు గురై అభి వృద్ధి లో వెంకబడిందన్నారు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధిలు స్పందించి డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని వినతి పత్రం అందజేశారు

ఉదయగిరి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చూడాలని శనివారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పలువురు విశ్రాo త ఉద్యోగులు డిమాండ్ చేశారు అనంతరం డిప్యూటీ తహశీల్దార్ షాజియాకు వినతి పత్రం అందజేశారు కొన్ని సంత్సరాలుగా వివక్షతకు గురై అభి వృద్ధి లో వెంకబడిందన్నారు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధిలు స్పందించి డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు

అల్లూరి సీతారామరాజు

అరకులోయలో ఘనంగా కార్తిక ఏకాదశి

అరకులోయ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తిక ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం కావడంతో వేంకటేశ్వర స్వామి కి తెల్లవారుఝాము నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతున్నారు. కార్తిక ఏకాదశి విశిష్టతను భక్తులకు ఆలయ ఆర్చకులు బాల గణేష్ తెలియజేశారు. కార్తిక ఏకాదశి శనివారం రావడంతో అరకులోయ పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఏకాదశి పూజలు జరిపించుకున్నారు.

E-పేపర్

ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ నమస్కారం విషయం : కరోనా సమయంలో రద్దు చేసిన బస్సులను పునర్ ప్రారంభం చేయండి

శ్రీయుత గౌరవనీయులైన ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి నమస్కారం విషయం : కరోనా సమయంలో రద్దు చేసిన బస్సులను పునర్ ప్రారంభం చేయండి ఆర్య మేము అనగా నక్కర్త – మేడిపల్లి , నానక్ నగర్ , మల్కిజ్ గూడ, పల్లె చెల్క తండ , సరికొండా, ముద్వీన్, గౌరారం , శెట్టిపల్లి , ఆకుతోటపల్లి , తాడిపర్తి ,పిల్లిపల్లి , గ్రామ ప్రజలం మీతో చేయు మనవి ఏమనగా మా గ్రామాలకు వచ్చే బస్సులను కరోనా నుండి రద్దు చేయడం జరిగింది . ఈ బస్సులను పునర్ ప్రారంభం చేయాలని మీతో పలుమార్లు తెలపడం జరిగింది. అయినా ఈరోజు వరకు కొన్ని బస్సులు ప్రారంభం చేయలేదు. దయచేసి ఇప్పటికైనా స్పందించి బస్సులు పునర్ ప్రారంభం చేయాలని కోరుచున్నాము. 1) తాటిపర్తి నుంచి ఉదయం ఉమెన్స్ కాలేజ్ పోవు బస్సు ఇబ్రహింపట్నం వరకు నడుపుతున్నారు. 2) ఉదయం 6:30 నల్లగొండ X నుంచి తాటిపర్తి వచ్చే బస్సు బంద్ చేశారు. ఇబ్రహింపట్నం నుంచి తాటిపర్తి బస్సు నడుపుతున్నారు. 3) 8:45 AM తాటిపర్తి నుంచి సంతోష్ నగర్ పోవు బస్సు యాచారం వరకు నడుపుతున్నారు. 4) 9:15AM ఉమెన్స్ కాలేజ్ నుండి తాటిపర్తి వచ్చే బస్సు బంద్ చేశారు. 6) 1PM ఇబ్రహింపట్నం TO తాటిపర్తి తాటిపర్తి TO MGBS హైదరాబాద్ బస్సు బంద్ చేశారు. హైదరాబాద్ తాటిపర్తి బస్సు బంద్ చేశారు. తాటిపర్తి ఇబ్రహింపట్నం 7) 2PM ఉమెన్స్ కాలేజ్ మిర్ ఖాన్ పేట బస్సు బంద్ చేశారు. 8) 2PM ఇబ్రహింపట్నం To తాటిపర్తి బస్సు బంద్ చేశారు. 9 ) మహేశ్వరం నుంచి ఇబ్రహింపట్నం, ఇబ్రహింపట్నం నుంచి తాటిపర్తి బస్సు బంద్ చేశారు . తాటిపర్తి నుంచి సంతోష్ నగర్ సంతోష్ నగర్ నుంచి మేడిపల్లి నైట్ హాల్ట్ బస్సు బంద్ చేశారు. మేడిపల్లి నుంచి సికింద్రాబాద్ 277/102 10) JBS నుంచి ముద్విన్ నైట్ హాల్ట్ బస్సు బంద్ చేశారు. 11) ఇబ్రహింపట్నం మాల్ మాల్ నుంచి హైదరాబాద్ వయా మేడిపల్లి తాటిపర్తి మిర్ ఖాన్ పేట, యాచారం, ఇబ్రహింపట్నం , హైదరాబాద్ అత్తంపేట నైట్ హాల్ట్ ఉదయం మాల్ నుంచి మేడిపల్లి మిర్ ఖాన్ పేట ఇబ్రహింపట్నం , ఇబ్రహింపట్నం తాటిపర్తి మాల్ బస్సు బంద్ చేశారు. 13) ఇబ్రహింపట్నం నుంచి మేడిపల్లి ఆమనగల్ , ఆమనగల్ నుంచి మేడిపల్లి హైదరాబాద్ బస్సులు బంద్ చేశారు. NOte యాచారం బస్సు స్టాండ్ లో బస్సుల టైమ్ టేబుల్ బోర్డు ఏర్పాటు చేయండి , బస్సు స్టాండ్ లో పార్కింగ్ సౌకర్యం కల్పించండి

కర్నూలు

🏅 పెదనేలటూరులో రాష్ట్ర అవతరణ దినోత్సవం – లయన్ దామోదర్ గారి చేతులమీదుగా బహుమతుల ప్రదానం.

పెదనేలటూరూ గ్రామంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా లయన్ దామోదర్ గారిచే విద్యార్థులకు బహుమతుల అందజేత కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలం, పెదనేలటూరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని స్థానిక ZP హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని Lions Club of Kurnool మరియు Impact International సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్ దామోదర్ గారు విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం అందించారు. ఆయన మాట్లాడుతూ — > “విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని, క్రమశిక్షణతో కృషి చేస్తే విజయాన్ని సాధించగలరు. రాష్ట్రం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి,” అని అన్నారు. తదనంతరం విద్యార్థుల ప్రతిభను గుర్తించి విజేతలకు బహుమతులను అందజేశారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో Impact International శిక్షణకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 📍 స్థలం: ZP High School, పెదనేలటూరూ, గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా 🎯 ఆర్గనైజేషన్: Lions Club of Kurnool & Impact International 🎖️ ప్రత్యేక అతిథి: లయన్ దామోదర్ గారు 🗓️ కార్యక్రమం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం & వ్యక్తిత్వ వికాస తరగతులు

తెలంగాణ

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించెందుకు చర్యలు తీసుకోవాలన్న: జిల్లా కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) సెట్విన్ ఆధ్వర్యంలో చదువుకున్న యువత, విద్యార్థులకు వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం ఆమె ఈ విషయంపై సెట్విన్ ప్రతినిధులు, జిల్లా అధికారులతో తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. సెట్విన్ ప్రతినిధి రేణుక మాట్లాడుతూ సెట్విన్ ద్వారా సుమారు 30 కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, తమ శిక్షణ కాలం కేవలం 3 నుండి 6 నెలలు మాత్రమే ఉంటుందని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డిప్లమా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు.

విశాఖపట్నం

మొంథా తుఫాను బాధిత మత్స్యకారులకు భరోసా కిట్లు పంపిణీ 1200 కుటుంబాలకు సహాయం చేసిన రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

గాజువాక: నవంబర్ (పున్నమి ప్రతినిధి) మొంథా తుఫాను వల్ల తీవ్ర నష్టపోయిన సుమారు 1200 మత్స్యకార కుటుంబాలకు భరోసా కిట్లు అందజేశారు రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “జాతీయ విపత్తుల సమయంలో ప్రజలను కాపాడటంలో ఎప్పుడూ ముందుండే నాయకత్వం చూపిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ప్రజల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని తెలిపారు. గాజువాక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద మత్స్యకార భరోసా కిట్ల పంపిణీ, తుఫాను బాధితులకు రేషన్ సరఫరా కార్యక్రమాన్ని పల్లా శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. దిబ్బపాలెం మరియు గంగవరం ప్రాంతాల నుండి తుఫానుతో నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో గాజువాక మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, పౌర సరఫరాల అధికారి రవి, ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్, జిల్లా లీగల్ సెల్ నాయకులు వెన్నెల ఈశ్వరరావు, నియోజకవర్గ నాయకులు అక్కిన లక్ష్మణరావు, బైపిల్లి గాంధీ, గోమాడ వాసు, బలగా బాలు నాయుడు, పోతిన వెంకటేశ్వరరావు, వియ్యపు నరేష్, ఆఫీజ్, దాట్ల శ్రీనివాసరాజు, దువ్వి శ్రీను, లక్కోజు దేవి, యజ్ఞప్రియ, వనజ, కత్తి తిలక్, రోయ విశ్వనాథం, శ్రీనివాస్ రెడ్డి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

పండుగ వాతావరణంలో జరిగిన బాలోత్సవం*

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను విద్య పట్ల ఒత్తిడికి గురి చేయవద్దు అదనపు పాఠ్య కార్యక్రమాలలో పాల్గొనడం కూడా చాలా ముఖ్యం : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్* తిరుపతి, పున్నమి ప్రతినిధి (రోసిరెడ్డి) నవంబర్ 1 :విద్యార్థులకు చదువుతోపాటు అదనపు పాఠ్య కార్యకలాపాలలో పాల్గొనడం కూడా చాలా ముఖ్యం అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం స్థానిక SGS ఆర్ట్స్ కళాశాల మైదానంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగవ బాలోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్..జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బాలోత్సవo కార్యక్రమం పండగ వాతావరణంలో ఉందని ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు అదనపు పాఠ్య కార్యకలాపాలలో పాల్గొనడం కూడా చాలా అవసరమని, వీటి వలన పిల్లలలో సృజనాత్మక శక్తి మెరుగుపడుతుందని తెలిపారు. ఎక్కువ శాతం మంది పిల్లలను క్లాస్ రూమ్ గదులుకే పరిమితం చేయడం జరుగుతుందనీ అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఒకటవ తరగతి నుంచే విద్యార్థులు డాక్టరు, ఇంజనీర్ కావాలని లక్ష్యంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు, ఇతర అవసరాలు దృష్ట్యా ఇంగ్లిష్ భాష పైన ఎక్కువ దృష్టి పెట్టడం, కళాశాలల్లో , పాఠశాలల్లో ఇంగ్లిష్ భాష లో మాట్లాడాలని నిబందన పెట్టడం వలన విద్యార్థులు తెలుగు బాష పై పట్టు కోల్పోతున్నారని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించడం వలన పిల్లలలో నమ్మకం, ప్రేరణ కలిగి ఆదర్శ విద్యార్థులుగా ఎదుగుతారని తెలిపారు. విద్యార్థులు ఈ మద్య కాలంలో చెడు వ్యసనాలకు గురవుతున్నారని ఇలాంటి కార్యక్రమాలను జరపడం వలన చెడు వ్యసనాల వైపు దృష్టి వెళ్ళకుండా చేయగలగవచ్చన్నారు. ఇలాంటి కార్యక్రమాలను జిల్లాల్లో మరిన్ని జరపాలని ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా జిల్లా యంత్రాంగం అందిస్తుందని ఇక్కడి వచ్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అని తెలిపారు. జిల్లా విద్యాశాఖాదికారి మాట్లాడుతూ… బాలోత్సవo కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుందని ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచే కాకుండా చుట్టుప్రక్కల కాకుండా ప్రాంతాల పాఠశాలల విద్యార్థులు కూడా హాజరవడం జరుగుతుందని తెలిపారు. . ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి కే.వి.ఎన్ కుమార్, బాలోత్సవo కమిటీ చైర్మన్ టెంకాయల దామోదరం, కస్తూరిబా గాంధీ ట్రస్టు చైర్మన్ పి.సి. రాయలు, రోటరీ క్లబ్ అద్యక్షలు రాజేంద్ర శెట్టి, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ నాథ్ లింగుంట్ల, క్రియా పిల్లల పండుగ సెక్రెటరీ కాకినాడ జగన్నాథ రావు, ఎస్.జి.ఎస్. కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బొమ్మరాజుచెరువులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ – లబ్ధిదారులకు పింఛన్లు స్వయంగా అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కలిగిరి నవంబర్ 1న కలిగిరి మండలంలోని నాగసముద్రం పంచాయతీ పరిధిలోని బొమ్మరాజుచెరువు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ గారు పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు, మరియు స్పోజ్ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు స్వహస్తాలతో పింఛన్లు అందజేశారు. ఆయన ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, “ప్రతినెలా మీకు పింఛన్ సమయానికి అందుతుందా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?” అని ఆరా తీశారు. లబ్ధిదారులు తమకు ప్రతి నెలా మొదటి తేదీన పింఛన్ సమయానికి అందుతున్నదని తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ — “గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం అనేక సంస్కరణలను అమలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది ఎన్టీఆర్ భరోసా పథకం. ఈ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు వంటి అనేక వర్గాలకు గౌరవప్రదమైన జీవనం అందించే విధంగా ప్రతినెలా మొదటి తేదీన పింఛన్ అందించే విధానం ప్రారంభమైంది. ఇది ప్రభుత్వ ప్రజా సంక్షేమ నిబద్ధతకు నిదర్శనం” అని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సమయానికి, పారదర్శకంగా పింఛన్ అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.