Monday, 6 April 2026

Blog

Blog

బి ఎన్ కండ్రిగ మండలం లో ఘనంగా కోటి సంతకాల✍️✍️✍️ సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం

*బి ఎన్ కండ్రిగ మండలం లో ఘనంగా కోటి సంతకాల✍️✍️✍️ సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం * బి.ఎన్. కండ్రిగ మండలం లో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కె. మణి నాయుడు ఆధ్వర్యంలో, సత్యవేడు ఇన్‌చార్జ్ నూకతోటి రాజేష్ గారి పర్యవేక్షణలో కోటి సంతకాలు మరియు రచ్చబండ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. 📍*బి ఎన్ కండ్రిగ * ఈ కార్యక్రమంలో బి.ఎన్. కండ్రిగ కోటి సంతకాల సేకరణ మరియు రచ్చ బండ కార్యక్రమం ఘనంగా జరిగింది నాయకులు sc సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉగ్గుముడి గురునాధం రైతు విభాగ నాయకుడు జయచంద్ర నాయుడు, వెంకటేశ్వర్లు, నాగూరు అశోక్, ఉగ్గుముడి రాజశేఖర్, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 📍*కాంచనపుత్తూరు * తరువాత బి.ఎన్. కండ్రిగ మండలం లోని కాంచనపూత్తూరు గ్రామంలో రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగాి, ఈ కార్యక్రమం సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ గురవయ్య గ్రామ పార్టీ అధ్యక్షుడు సి చంద్రశేఖర్ గ్రామ సర్పంచ్ స్వప్న ఆధ్వర్యంలో గ్రామ ప్రజల మధ్య కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రీవెన్స్ కార్యదర్శి సాయినాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు వేలూరి రాకేష్, రాష్ట్ర చేనేత విభాగ కార్యదర్శి బొప్పన తిలక్ కుమార్, ప్రచార కార్యదర్శి శివ, దేవదాసు రెడ్డి,సర్పంచ్ ఎట్టి ప్రసాద్, ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాల్, కత్తి సురేష్, శివ,కారణి వెంకటరమణ చెచ్చమ్మ, శివ వంటి నాయకులు పాల్గొన్నారు. అలాగే యువ నాయకులు మిథున్ రెడ్డి ఫాలోవర్ కిరణ్ యాదవ్, వైయస్ ఆనంద్, కారణి వెంకటేష్, కత్తి శివ, సిద్దేశ్వర్, కిక్ వెంకీ,మాడ వెంకటేష్,పి. మణి, బి వెంకటేష్, డి. గురునాధం, డి. సుబ్రహ్మణ్యం, పి రాజేంద్ర ఆచారి, N. తురుపాల్ ఆచారి, డి. భాస్కర్, డి గంగాధరం, మరియు గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ప్రజల సంక్షేమం కోసం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను వివరించి, ప్రజా ఆశీర్వాదం కొనసాగించేందుకు కోటి సంతకాల ఉద్యమం ఎంత ముఖ్యమో తెలియజేశారు

రంగారెడ్డి

*అమీర్ పేట్ ప్రకండ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హుతాత్మ దివాస్ రక్తదాన శిబిరం.*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మన్సాన్ పల్లి ఎక్స్ రోడ్ లొ ఆదివారం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేశ్వరం సి ఐ వెంకటేశ్వర్లు విశ్వహిందూ పరిషత్ మహేశ్వరం జిల్లా కార్యదర్శి మండల రాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా బజరంగ్ దళ్ మహేశ్వరం జిల్లా కన్వీనర్ ఎర్ర రాఘవేందర్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ధ్వంసం చేసి బాబర్ అనే వాడు అక్రమంగా బాబ్రీ మసీదు నిర్మాణాలు చేయడం జరిగింది. ఆ యొక్క అయోధ్య రామ మందిరం ధ్వంసం చేసిన తర్వాత ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు విశ్వహిందూ పరిషత్ ద్వారా నిర్వహించడం జరిగింది దానిలోని భాగంగా 1990వ సంవత్సరంలో జరిగినటువంటి కర సేవలు కొఠారి బ్రదర్స్ వాళ్ళ ప్రాణాలను ఫణంగా పెట్టి అక్కడ ఏవైతే బాబ్రీ మసీద్ నిర్మాణం చేశారు దాని గుమ్మటాల పైకి ఎక్కి అక్కడ కాషాయ జెండాను ఎగరవేయడం జరిగింది ఆనాడు ఏదైతే కరసేవ జరిగిందో ఆ కరసేవకు వ్యతిరేకంగా అక్కడున్న ప్రభుత్వం కరసేవకులపై కాల్పులు జరిపి ఎంతో మంది ప్రాణాలను తీసింది ఎవరైతే కొఠారి బ్రదర్స్ ఉన్నారు వారు గుమ్మటాలని కాషాయ ధ్వజం పెట్టారు అని వాళ్ళు గుండెలపై తుపాకీ తూటాలతో కాల్చి చంపడం జరిగింది. కొఠారి బ్రదర్స్ నీ స్పర్రించుకుంటూ ప్రతి సంవత్సరం వారం రోజులు వారి జ్ఞాపకార్ధంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు దానిలో భాగంగా ఆదివారం మన్సన్ పల్లి ఎక్స రోడ్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎంతోమంది యువకులతో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈయొక్క కార్యక్రమంలో బజరంగ్ దళ్ అమీర్ పేట్ ప్రఖండ కన్వీనర్ కొండూరి వంశీ బజరంగ్దళ్ సహా కన్వీనర్ గఘపురం శివ కుమార్, బజరంగ్దళ్ సహా కన్వీనర్ మండల ఈశ్వర్, జిల్లా ప్రచార ప్రముఖ్ రాంరెడ్డి, బండి రమేష్, అమీర్ పేట్ ప్రకండ అధ్యక్షులు మహేష్, కార్యదర్శి రాఘవేందర్, ఉప అధ్యక్షులు శ్రీనివాస్, ప్రఖండ సంయోజక్ వంశీ, ప్రకండ సహా సంయోజక్ దేవేందర్. మరియు వివిధ గ్రామాల విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

బీజేపీ –కాంగ్రెస్ పార్టీలకు బిఆర్ఎస్ పార్టీ లో చేరికల జోరు

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ, శ్రీరామ కాలనీ కి చెందిన బీజేపీ, కాంగ్రెస్, నాయకులు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. సీనియర్ నాయకులు సూరెడ్డి కృష్ణారెడ్డి సూచన మేరకు ఈ చేరికలు జల్ పల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు ఉస్కెమూరి నిరంజన్ నేత ఆధ్వర్యంలో జరిగాయి.పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గము శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రా రెడ్డి అనంతరం పార్టీ లో చేరిన నాయకులు మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం సబితమ్మ ప్రత్యేక శ్రద్ద వహించి మౌలిక సదుపాయాల కొరకు నిధులు కేటాయించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ,. ఈ విషయమునకు సంబంధించి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా సబితమ్మ కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని అన్నారు,. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సబితమ్మ చేసిన అభివృద్ధి పుణ్యమా అని శ్రీరామరక్షగా జీవించామని,..గత రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేని విధంగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని,.. అందుకే భవిష్యత్తులో అభివృద్ధి కూడా సబితమ్మ తోనే సాధ్యమని గ్రహించి ఆమె వెంట నడుస్తామని ఆదివారం పార్టీలో చేరటం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే పరమావదిగా భావిస్తూ, నా సాయ శక్తుల మీ అందరి సంక్షేమ కొరకు కృషి చేస్తానని,.. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జల్ పల్లి మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షర్ఫుద్దీన్ (హమీద్) భాయ్ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల అర్జున్ మహిళా ఉపాధ్యక్షురాలు కర్నాటి పద్మ నాయకులు సాధిక్, శేఖర్, వాసుబాబు అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కామారెడ్డి

ఆది నాయకుడికీ మంత్రి పదవి ఇవ్వాలి

– మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి కామారెడ్డి, 02నవంబర్, (పున్నమి ప్రతినిధి) : కాంగ్రెస్ ను నిలబెట్టిన నేతలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెసు పార్టీ ఆదర్శాల కోసం అడ్డుబడిన వారిలో షబ్బీర్ అలీ పేరును ముందు గా గుర్తించాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొ న్నారు.పార్టీ తీవ్ర సంక్షోభాల్లో ఉన్నప్పుడు సైతం అధిష్టానం పట్ల పూర్తి విశ్వాసంతో, స్వప్రయోజనా లను పక్కనబెట్టి పార్టీకోసం పని చేసిన నాయకుడి గా ఆయన ప్రజాదరణ పొందారు.పదవులకన్నా సిద్ధాంతమే పెద్దదిబీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఉపముఖ్య మంత్రి పదవి ఆఫర్ వచ్చినా, దానికి లోనుకాక కాంగ్రెసులోనే కొనసాగుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నివసించడంలో ఆయన అంకితభావం స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీకి ఎంతటి కష్ట కాలం వచ్చినా నిబద్ధతతో పోరాడిన నేతలకు, కనీస గౌరవమైన పదవులు ఇవ్వడం పార్టీ ఆరోగ్యానికి ఉపకరిస్తుందని మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి అభిప్రా యపడ్డారు.అంకితభావానికి గౌరవంనాయకుడి సేవలు గుర్తించకపోతే పార్టీ పనితీరుపైన ప్రజల్లో భ్రాంతి కలుగుతుందని, గతంలో శ్రమించిన వారిని గౌరవించడం ద్వారా రాజకీయ వ్యూహాన్ని బల పర్చుకోవచ్చు. పార్టీలో పదవి లేకున్నా, చివరి ఊపిరి వరకూ పనిచేస్తానని చెప్పిన నాయకుడు షబ్బీర్ అలీ అన్ని సమయా ల్లో యథాతథంగా నిలిచారన్న అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.పార్టీ బలానికి ఆస్తివారు.అధికార, ప్రమాణాలపై నిలబడిన వారు, పార్టీ తరపున ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన నేతలకు సక్రమంగా గౌరవం లభించాలి. పదికాలాలపాటు పార్టీ అధికా రంలో ఉండాలంటే ఎప్పటికప్పుడు కష్టసాధకుల ను గుర్తించాల్సిన అవసరాన్ని జిల్లా నాయకులు ప్రస్తావించారు. షబ్బీర్ అలీకి మంత్రి స్థానం ఇవ్వ డం ద్వారా ఈ అధ్యాయానికి మంచి న్యాయం జరగనుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

తిరుపతి

బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరో అరుదైన రికార్డ్ సృష్టించింది. బాహుబలి రాకెట్‌ సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. షార్‌లోని రెండో లాంచ్ పాడ్ నుంచి, LVM 03-M5 రాకెట్‌ని ప్రయోగించారు. ఈ రాకెట్‌ ద్వారా, తొలిసారిగా అత్యంత భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. సాయంత్రం 5.26 గంటలకు షార్‌లోని రెండో లాంచ్‌ పాడ్ నుంచి బాహుబలి రాకెట్ LVM3-M5 ద్వారా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. 4,410 కిలోల బరువున్న సీఎంఎస్‌-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ GTOలోకి ప్రవేశపెట్టారు.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సీఎంఎస్‌-03 ఉపగ్రహం.. కౌంట్ డౌన్ ప్రక్రియ 24గంటల సమయం పాటు నిర్విరామంగా కొనసాగింది.. ఆ తర్వాత సరిగ్గా ఇవాళ సాయంత్రం 5.26 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరింది బాహుబలి రాకెట్‌. ఈ ప్రయోగం విజయవంతంతో ఇస్రో మరో మైలు రాయిని చేరుకుంది.. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్న CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహం పది సంవత్సరాల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది. CMS-03 ఎందుకంత స్పెషల్..? ప్రయోగించిన రాకెట్టూ స్పెషలే.. అందులో ప్రయాణించి కక్ష్యలోకి ఎంట్రీ ఇచ్చిన శాటిలైట్ కూడా స్పెషలే. బాహుబలి1, బాహుబలి2 అని చెప్పుకోవచ్చు. ఇంతకీ CMS-03 ఎందుకంత స్పెషల్..? >>4,400 కేజీలు బరువు కలిగిన CMS-03 భూమి నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇంత బరువైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం ఇదే మొదటిసారి. అందుకే దీన్ని బాహుబలి శాటిలైట్ అంటున్నారు. >>CMS-03.. దీనికి GSAT-7R అని మరో పేరుంది. ఇది పూర్తిగా కమ్యూనికేషన్ రిలేటెడ్ శాటిలైట్. పది సంవత్సరాల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది. >>ఈ శాటిలైట్ ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడ్డంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. >>గతంలో జీశాట్-7 అనే ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానా నుంచి ఇస్రో ప్రయోగించింది. దీని కాలపరిమితి ముగియడంతో సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో GSAT-7R శాటిలైట్‌ను రూపొందించి, నింగికి పంపారు. >>భారత భూ భాగంలోని మారుమూల అటవీ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడంలో ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్‌ ఈ బాహుబలి రాకెట్‌ అండ్‌ బాహుబలి శాటిలైట్‌ ప్రయోగం నేపథ్యంలో, తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్‌ దర్శించుకున్నారు. శాటిలైట్ ప్రయోగం సక్సెస్ కావాలని శ్రీవారికి మొక్కులు చెల్లించారు.

తిరుపతి

కార్తీక మాస వనభోజనాలలో పాల్గొన్న ముక్కంటి ఆలయ ఛైర్మన్ కొట్టేసాయి

శ్రీకాళహస్తి నవంబర్ 02 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు జూలు గంటి మురళి ఏర్పాటుచేసిన సామూహిక వనభోజనాలు కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ పాలకోమండలి అధ్యక్షులు కొట్టేసాయిప్రసాద్ పాల్గొనడం జరిగినది. ముక్కంటి ఆలయ ఛైర్మన్ మొదగా దేవత మూర్తులకు పూలమలలు వేసి నస్కరించుకుని ఆర్యవైశ్యలందరితో కలసి సామూహిక వనభోజనాలలో భోజన చేయడం జరిగినది. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళా దంపతులు అందరికీ శ్రీకాళహస్తి పాలకమండలి అధ్యక్షులు చేతులమీదుగా పసుపు, కుంకుమ జాకెట్లు అందజేయడం జరిగింది.

తిరుపతి

కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టకరం -మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు

శ్రీకాళహస్తి నవంబర్ 02 , పున్నమి న్యూస్ : శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారి దర్శనం సమయంలో భక్తుల రద్దీ ఘటనలో భక్తులు మరణించడం దురదృష్టకరమని శ్రీ కాళహస్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్సీవీ నాయుడు విచారం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి పంపించడంతో పాటు క్యూలైన్లను వెంటనే క్రమబద్ధీకరించి ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయక చర్యలు చేపట్టారని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భారీగా భక్తులు తరలిరావడంతో, తొక్కిసలాట జరిగిందని, వేల మంది భక్తులు రావడం, మొదటి అంతస్తులో గుడి ఉండటం, ఇరుకు ద్వారం గుండా ప్రవేశం కూడా ప్రమాదానికి కారణమని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పేర్కొంటూ మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మృతి చెందిన భక్తుల వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూన్నానని ఆయన తెలిపారు.

E-పేపర్

పాఠశాలలకు సెలవులుల పేరుతో ఆర్టీసీ బస్సులు బంద్

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 పాఠశాలలకు సెలవులుల పేరుతో ఆర్టీసీ బస్సులు బంద్ ఇబ్రహంపట్నం డిపో నుంచి పలు గ్రామాలకు పాఠశాలలకు సెలవుల పేరుతో గత కొద్ది రోజులుగా గ్రామీణ ప్రాంతాలకు బస్సులు బంద్ చేస్తున్నారు. ఇబ్రహింపట్నం డిపో నుంచి మేడిపల్లి తటిపర్తి, తాటిపర్తి ఇబ్రహింపట్నం , ఇబ్రహింపట్నం తాటిపర్తి మరియు తాటిపార్థి నుంచి యాచారం కందుకూరు , ఇబ్రహింపట్నం TO ఆకుతోటపల్లి, ఆకుతోటపల్లి – JBS , JBS – ఆకుతోటపల్లి బస్సులు బంద్ చేయడంతో ప్రజలు రైతులు మహిళలు తదితరులు నానా ఇబ్బందులూ పడుతున్నారు అధికారులు స్పందించి బస్సులు యధావిధిగా నడపాలని ప్రజలు కోరుతున్నారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఉదయం 6:45 AM తాటీపర్తి నుంచి ఉమెన్స్ కాలేజీ ఉన్న బస్సు ఇబ్రహింపట్నం వరకు, 8:45 AM తాటీపర్తి నుంచి సంతోష్ నగర్ వరకు ఉన్న బస్సు యాచారం వరకు నడుపుతున్నారు . 6:30AM నల్లగొండ X రోడ్డు నుంచి తాటీపర్తి వచ్చే బస్సు బంద్ చేసి ,ఇబ్రహింపట్నం తాటీపర్తి గా మార్చారు. ఇబ్రహింపట్నం నుంచి మేడిపల్లి ఉన్న బస్సు పల్లె చెల్క తండా విద్యార్థులు యువకులు చిన్నారులు ఇబ్బందులూ పడుతున్నారు అని మేడిపల్లి ఉన్న బస్సు పల్లె చెల్క తండ వరకు మార్చారు.పల్లె చెల్క తండా వరకు ఉన్న బస్సు. రవాణా శాఖ మంత్రి లెటర్ తీసుక వచ్చిన సరికొండ గ్రామస్తులు సరికొండ వరకు తీసుక పోయారు . దీనితో ముధ్విన్ ఉన్న నైట్ హాల్ట్ బస్సు బంద్ చేశారు. ముధ్విన్ గ్రామస్తులు ఆ బస్సు ముధ్విన్ కి మార్చారు సుమారుగా మూడు నెలల కిందట ముధ్విన్ ఉన్న బస్సు నాగర్ కర్నూల్ MP చెప్పారని ఆకుతోటపల్లి గా మార్చి బస్సు కు డబ్బులు రావడం లేదని కుంటి సాకులతో బడి లేదు అని బస్సు బంద్ చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన బస్సులు బంద్ చేశారు. ముధ్విన్ ఉన్న బస్సు ఆకుతోటపల్లి గా మార్చి MP మా బస్సులను ప్రతిరోజు నడిచే విధంగా చూడండి సార్ అని ప్రజలు కోరుతున్నారు.

ఖమ్మం

ఖమ్మం బిజెపి టూ టౌన్ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా జ్యోతుల యుగంధర్ నాయుడు నియామకం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతి నిధి) భారతీయ జనతా పార్టీ ఖమ్మం టూ టౌన్ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా శ్రీ జ్యోతుల యుగంధర్ నాయుడు గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — బిజెపి సిద్ధాంతం, ఆదర్శాలకు అంకితమై, నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ సహచర కార్యకర్తలు, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని తెలిపారు. ఖమ్మం టూ టౌన్ ప్రజా సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టి, పార్టీని సంస్థాగతంగా బలపరచి అన్ని వర్గాలలో విస్తరించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ఖమ్మం అధ్యక్షులు ధనియకుల వెంకటనారాయణ గారికి, జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారికి, సీనియర్ నాయకులు గెంటేల విద్యాసాగర్, ఒక్కలంక సుబ్రహ్మణ్యం, మేకల నాగేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్ గారికి, ఖమ్మం టూ టౌన్ నాయకులకు, మరియు ఖమ్మం జిల్లా బిజెపి నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ఎర్రన్నా .. నిన్ను మరువలేమన్నా ..! నిమ్మాడలో ఘనంగా దివంగత నేత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 13 వర్థంతి

శ్రీ‌కాకుళం జిల్లా కోట‌బొమ్మాళి మండ‌లం, నిమ్మాడలో గ్రామంలో, దివంగత మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు గారి 13 వర్థంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఎర్రన్నాయుడు గారి ఘాట్ వద్ద కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నివాళులు‌ అర్పించిన రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు గారు, ఎర్ర‌న్నాయుడు గారి సతీమణి విజయలక్ష్మి, కుమారుడు కేంద్ర పౌర‌వ విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు, సోదరులు పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ గారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ ఎస్ డి కింజరాపు ప్రభాకర్ గారు , ఎర్రన్నాయుడు ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలాస మాజీ శాసనసభ్యులు గౌతు శ్యాంసుందర్ శివాజీ, శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్,పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు,మాజీ శాసన మండలి సభ్యులు విశ్వప్రసాద్, కూటమి నాయకులు హాజరై ఎర్రన్నాయుడు గారితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.