Monday, 6 April 2026

Blog

విశాఖపట్నం

గూగుల్ డేటా సెంటర్, అదానీ అంబుజా సిమెంట్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సిపిఐ వినతిపత్రం

గూగుల్ డేటా సంస్థకు భూముల కేటాయింపు మరియు అదానీ అంబుజా సిమెంట్ గ్రేడింగ్ ఫ్యాక్టరీ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా సిపిఐ జిల్లా ప్రతినిధి బృందం సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. ఈ కార్యక్రమంలో సిపిఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ — అమెరికా తర్వాత అతిపెద్ద డేటా సెంటర్‌గా విశాఖలో గూగుల్ సంస్థ అదానీతో కలసి ఏర్పాటు చేయబోతోందని, దీని కోసం సుమారు 480 ఎకరాల భూములు ఆనందపురం, సింహాచలం, రాంబిల్లి, అచ్చుతాపురం మండలాల్లో కేటాయించడం అన్యాయం అని అన్నారు. అనందపురం మండలంలోని తర్లవాడ పంచాయతీ దళితుల అసైన్‌మెంట్ భూములను, అలాగే సింహాచలం అడవివరంలోని 160 ఎకరాలను సంస్థకు కేటాయించడం దుర్మార్గమని, గతంలో 2019లో చంద్రబాబు నాయుడు పాలనలో అదానీకి ఇచ్చిన భూములు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఆ భూములను కొత్తగా గూగుల్ డేటా సెంటర్ కోసం వినియోగించాలనే డిమాండ్ చేశారు. డేటా సెంటర్ వల్ల పర్యావరణ నష్టం, భూగర్భజలాల ఎండిపోవడం, విద్యుత్ కొరత వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారని చెప్పారు. అలాగే పెదగంట్యాడ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై కూడా సిపిఐ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రజలు ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ముక్తకంఠంతో అభిప్రాయం వ్యక్తం చేశారని, గతంలో గంగవరం పోర్టు కారణంగా స్థానికులు ఉద్యోగాలు కోల్పోయి పర్యావరణ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టులను పునరాలోచించి, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.మన్మధరావు, ఆర్.శ్రీనివాసరావు, ఎండి.బేగం, నెయ్యల నాగభూషణరావు, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రైల్వే కోడూరులో నిద్రపోతున్న విద్యాశాఖ.. స్టూడెంట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు లతీఫ్

*రైల్వే కోడూరులో నిద్రపోతున్న విద్యాశాఖ.. స్టూడెంట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు లతీఫ్ అన్నమయ్య జిల్లా నవంబర్ 3 (పున్నమినిస్ ప్రతినిధి ) రైల్వే కోడూరులో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి ఎర్లీ మార్నింగ్ ,నైట్ స్టడీస్,సెకండ్ సాటర్డే,సండే,పండగలు కావచ్చు ప్రభుత్వం నిబంధనలను పూర్తిగా ఉల్లంగించిన నడుపుతున్నారని పలుసార్లు ఎంఈఓ మండలంలో ఉన్నటువంటి తాసిల్దార్కు పలుమార్లు చెప్పడం జరిగింది అయినా గాని అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది సార్ రైల్వే కోడూరు లో ఎలా ఉందంటే ప్రభుత్వం ఉల్లంగిచ్చి నడుపుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు కు బహుశా అధికారులు తొత్తులుగా వివరిస్తున్నారు అని ఉంది కావున నిద్రపోతున్న రైల్వే కోడూరు మండల విద్యాశాఖ అధికారులను నిధులను సక్రంగా చేయలేని అధికారులను నిధులనుంచి తొలగించి తక్షణమే ప్రభుత్వం నిబంధనలను ఉల్లంగించి నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని పేద బడుగు బలహీన వర్గాల చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్లో ఫీజులను నియంత్రించాలని అలానే పిల్లలను స్వేచ్ఛ స్వతంత్రాలు హరించినటువంటి పాఠశాలలో గుర్తింపు రద్దుచేసి వారి మీద క్రిమినల్ కేస్ నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లతీఫ్ విన్నవిస్తున్నాం దయుంచి దయవుంచి విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు

E-పేపర్

దళిత వాడల్లో ఇండ్ల స్థలాలు, స్మశాన వాటికల కేటాయింపులో జాప్యం చేస్తే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం చేపడతాం… సిపిఐ నాయకులు

దళిత వాడల్లో ఇండ్ల స్థలాలు, స్మశాన వాటికల కేటాయింపులో జాప్యం చేస్తే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం చేపడతాం… సిపిఐ నాయకులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 3 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ) నేడు అనగా నవంబర్ 3 సోమవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వేకోడూరు మండల కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు మండల రెవెన్యూ తాసిల్దార్ కార్యాలయం ఎదుట మాధవరం పోడు అరుంధతి వాడ నివాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించి స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ధర్నా కార్యక్రమం చేపట్టి వినతి పత్రం ఇవ్వడం జరిగినది , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండు గోల మణి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో దళిత, గిరిజన కాలనీలకు స్మశాన వాటికలు ఉన్నచోట్ల భూ కబ్జాదారులు, పెత్తందారులు వాటిని ఆక్రమించి వ్యవసాయ భూములుగా మార్చుకొని దర్జాగా అనుభవిస్తున్నారని తక్షణమే భూ కబ్జాదారుల నుండి దళిత గిరిజన గ్రామాల లో ఉన్న స్మశానవాటికలను సర్వే చేసి దళిత గిరిజనులకు అప్పజెప్పాలన్నారు, దళితలు, గిరిజనులు ఇండ్ల స్థలాలు లేక ఒక కుటుంబంలో రెండు, మూడు ఫ్యామిలీలు ఒకే కుటుంబంలో జీవిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు, గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో 33 లక్షల ఇండ్లు కట్టించామని సంకల గుద్దుకొని సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ఎక్కడ ఒక ఇంటిని కూడా పూర్తి చేయలేదని వారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పై మండిపడ్డారు, ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బలపరిచిన తెలుగుదేశం పార్టీ కి చెందిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇండ్ల స్థలాలు లేని నిరుపేదల గోడు పట్టించుకోకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సామెత లాగా దున్నపోతు మీద వర్షం పడినట్లు మొద్దు నిద్రలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో మాధవరం పోడు అరుంధతి వాడ గ్రామ ప్రజలు రేణుక, సుబ్బమ్మ, రవణమ్మ, నారాయణమ్మ తో పాటు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జగదాంబ జంక్షన్ లో సినీ నటుడు కృష్ణ విగ్రహం తొలగింపు*

*జగదాంబ జంక్షన్ లో సినీ నటుడు కృష్ణ విగ్రహం తొలగింపు* *జనసేన జెండా దిమ్మ తొలగించే విగ్రహం ఏర్పాటు చేయటంపై కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు* *వెంటనే స్పందించిన అధికారులు* విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లో సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తొలగించారు. జగదాంబ జంక్షన్ లో ఎనిమిది ఏళ్లుగా ఉన్న జనసేన జెండా దిమ్మ తొలగించి నిబంధనలకు విరుద్ధంగా అక్కడ సినీ నటులు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేయటం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు, నగర పోలీస్ కమిషనర్ శంకుభద్ర బాగ్చి కి,జీవీఎంసీ కమీషనర్ కు లిఖితపూర్వకంగా పి జి ఆర్ ఎస్ లో సోమవారం ఉదయం ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆ విగ్రహాన్ని క్రేన్ సాయంతో తొలగించారు. *విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకం కాదు…మూర్తి యాదవ్* మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ప్రఖ్యాత సినీ నటులు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటుకు ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవని, నిబంధనల మేరకు జీవీఎంసీ ఆమోదంతో బీచ్ రోడ్ లో ఇటువంటి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తన ఫిర్యాదులో మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. అయితే అందుకు విరుద్ధంగా 8 ఏళ్లుగా జగదాంబ జంక్షన్ లో కూటమిలో భాగస్వామ్య పార్టీ అయినా జనసేన పార్టీ జెండా దిమ్మ పార్టీ సిద్ధాంతాల బోర్డు ఉన్న ప్రాంతంలో వాటిని తొలగించి చెరిపివేసి నిబంధనలకు విరుద్ధంగా కృష్ణ విగ్రహాన్ని హడావుడిగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. *పవన్ సభ ఇక్కడే* నగరం నడిబొడ్డున జగదాంబ జంక్షన్ లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి సభ జరిగిన ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న జనసేన జెండా దిమ్మను పూర్తిగా తొలగించడం ,అదే చోట సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేయడం బాధాకరమని,జనసేన నగర అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే జనసేనకు జరిగిన ఘోరమైన అవమానం, అపచారం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ప్రముఖుల విగ్రహాలు బీచ్ రోడ్ లో ఏర్పాటు చేస్తుండగా అందుకు విరుద్ధంగా కృష్ణ విగ్రహాన్ని పెట్టటం, అందుకు మహా విశాఖ నగరపాలక సంస్థ అనుమతి, కౌన్సిల్ ఆమోదం లేకపోవడం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు. *సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం* సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా, చట్టవిరుద్ధంగా అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నేరమని, అసలైన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు ఇలాంటి తప్పుడు చేయరని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారని తెలిపారు.ఈ మేరకు జనసేన సీనియర్ నేత రాష్ట్ర పర్యావరణ విభాగం ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ ద్వారా జండా దిమ్మను పునరుద్ధరించాల్సిందిగా కోరారని గుర్తు చేశారు. జనసేన పార్టీ జెండా దిమ్మ ఉన్న ప్రదేశంలో వెనుక జనసేన సిద్ధాంతాలు గోడపై రాసి ఉండేవని, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జెండాను తొలగించడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలమైందని తెలిపారు . విచిత్రంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా జనసేన పార్టీ శాసనసభ్యుడే ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా జెండా దిమ్మను తొలగించటం అత్యంత దారుణమని పేర్కొన్నారు. జండా దిమ్మను సిద్ధాంతాల బోర్డును తొలగించడమే కాకుండా, అనుమతి లేకుండా విగ్రహాన్ని తీసుకువచ్చి పెట్టడం ఇది పెద్ద కుట్ర పూరితమైన నేరమని, చట్ట విరుద్ధమని, సుప్రీంకోర్టు గతంలో విగ్రహాల ఏర్పాటపై మార్గదర్శక సూత్రాలను జారీ చేసిందని పేర్కొన్నారు . వాటికి విరుద్ధంగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, దీనిపై మరో మారు కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి ఆ విగ్రహాన్ని తొలగించి జనసేన జెండాను పునరుద్ధరించాలని కోరారు. *తొలగించిన విగ్రహాన్ని మరో చోట ఏర్పాటుకు సహకరిస్తాం* జనసేన దిమ్మ స్థానంలో ఏర్పాటుచేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆమోదయోగ్యమైన మరో ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు జనసేన పూర్తిగా సహకరిస్తుందని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. ఇందుకోసం నిబంధనల మేరకు జీవీఎంసీలో కౌన్సిల్ తీర్మానానికి కూడా జనసేన మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

విశాఖపట్నం

పెందుర్తి నియోజకవర్గంలో రూ. 2 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఘనంగా

పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 93వ వార్డులో సుమారు రూ. 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు మరియు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జీవీఎంసీ 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా ఆధ్వర్యంలో జరిగింది. అభివృద్ధి పనుల వివరాలు సాయి మాధవ్ నగర్: వినాయక ఆలయం ఎదురుగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 20 లక్షలు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 19.63 లక్షలు. కృష్ణానగర్: హోమియోపతి ఆసుపత్రి వద్ద రూ. 31.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం. బాలాజీ గార్డెన్స్: రూ. 19.87 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం. ప్రహ్లాదపురం: రూ. 18.50 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం, రూ. 35.20 లక్షలతో ఆరు సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 19.98 లక్షలు. వెంకటాద్రి నగర్: రూ. 34 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం. పోస్టల్ కాలనీ: రూ. 18.43 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం. శ్రీనివాస్ నగర్: రూ. 15.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం. పాత్రికేయ మిత్రులతో పంచకర్ల రమేష్ మాట్లాడుతూ “విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడం ద్వారా ఉత్తరాంధ్రకు విస్తృత ఉపాధి అవకాశాలు సృష్టించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతోంది. పెందుర్తి నియోజకవర్గంలోని ప్రతి వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం నా ప్రథమ కర్తవ్యం,” అని అన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావుతో పాటు, జీవీఎంసీ జోన్-8 జోనల్ కమిషనర్ శంకర్రావు, డి.ఈ. ప్రవీణ్, ఏ.ఈ. కుసుమ, మాజీ కార్పొరేటర్ రాపర్తి శైలజ, వార్డు అధ్యక్షులు తమరాడ ఆది బాబు, కోరుకొండ వరహాలు, ఎర్ర నాగరాజు, సేనాతీ దేవుడు, ఏఎంసీ డైరెక్టర్ లక్కీ గోవింద్, హైమావతి, పిన్నింటి పార్వతి, కంచిపాటి మధు, డి.బి.ఎల్. నాయుడు, మజ్జి సూరిబాబు, ఒబ్బిన శ్రీకాంత్, జగన్మోహన్ పాత్రుడు, జుత్తాడ శ్రీనివాసరావు, మోటూరు చైతన్య, రాపర్తి కిషోర్, తనకాల శ్రీనివాసరావు, కర్రీ శివ తదితరులు పాల్గొన్నారు. సాయి మాధవ్ నగర్, కృష్ణానగర్, బాలాజీ నగర్, ప్రహ్లాదపురం, వెంకటాద్రి నగర్ కాలనీ అసోసియేషన్ పెద్దలు, పెందుర్తి నియోజకవర్గ ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఆంధ్ర వైద్య కళాశాల రేడియాలజీ విద్యార్ధులకు బంగారు పతకాలు

ఆంధ్ర వైద్య కళాశాల రేడియాలజీ విద్యార్ధులకు బంగారు పతకాలు విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- గీతం విశ్వవిద్యాలయం లో నిర్వహించిన రేడియాలజీ రాష్ట్ర స్థాయి సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. ఈ సదస్సు లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు నిర్వహించిన పరిశోధన పత్రాలు మరియు పరిశోధన పత్రికలు ప్రదర్శనలో ఆంధ్ర వైద్య కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులు అద్భుతం గా రాణించారు. రాష్ట్ర స్థాయిలో 180 పరిశోధన పత్రికలు ప్రదర్శనకు అనుమతి లభించగా డా. జి. పుష్పిత, ప్రధమ స్థానం లో నిలిచి ప్రతిష్టాత్మకమైన వైజాగ్ సిటీ సబ్ చాప్టర్ అవార్డు బంగారు పతకం అందుకున్నారు. అలాగే 150 పరిశోధన పత్రాలు ప్రదర్శించగా డా. జయగురు సంబతరాజన్ ద్వితీయ బహుమతిగా డా. రాజారెడ్డి బంగారు పథకం మరియు డా. మేఘన అడిగ ప్రత్యేక ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. అవార్డు లు అందుకున్న విద్యార్ధినీవిద్యార్ధులకు కళాశాల ప్రిన్సిపాల్ డా. సంద్యాదేవి, కింగ్ జార్జ్ ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డా. వాణి, రేడియాలజీ విభాగాధిపతి డా. బుజ్జి బాబు, రేడియాలజీ ఆచార్యులు డా.ఉమా మహేశ్వర రావు, ఫాకల్టీ మరియు తోటి విద్యార్ధులు అభినందనలు తెలిపారు.

అనకాపల్లి

వేచలం గ్రామంలో గైరమ్మ అమ్మవారి ఊరేగింపు ఘనంగా — వేచలపు చిట్టినాయుడు, రెడ్డి శ్రీనివాసరావు ప్రత్యేక ఆకర్షణ

వేచలం గ్రామంలో గైరమ్మ అమ్మవారి వార్షిక ఊరేగింపును శనివారం రాత్రి భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మంగళహారతులు అందించారు. గ్రామ వీధులన్నీ దీపాలంకరణలతో వెలిగిపోయాయి. ఈ సందర్భంగా వేచలపు చిట్టినాయుడు గారు, రెడ్డి శ్రీనివాసరావు గారు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని, అమ్మవారిని భక్తి భావంతో మోస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి ఈ భక్తి, వినయపూర్వక సేవను చూసి ప్రజలు ప్రశంసలు కురిపించారు. గ్రామ యువతులు సాంప్రదాయ నృత్యాలతో పాల్గొని, వేడుకకు ప్రత్యేక అందాన్ని చేకూర్చారు. గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, సేవా సంఘ సభ్యులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. భక్తి వాతావరణంలో సాగిన ఊరేగింపుతో గ్రామం ఉత్సవ కాంతులలో మునిగిపోయింది.

ఆంధ్రప్రదేశ్

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభంలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు

నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు… తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో లబ్ధిదారురాలు ప్రవళిక సురేష్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఈరో్జు గృహ‌ప్ర‌వేశం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట గ్రామంలో తొలి ఇందిరమ్మ ఇల్లును తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరంగా ఉంద‌ని చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. గృహప్రవేశంలో భాగంగా రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి నూతన ఇల్లును ప్రారంభించారు. అనంతరం ప్రవళిక సురేష్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. మినహా లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు ప్రోత్సాహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తుందన్నారు. రూ.5 లక్షలతో నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున దశల వారీగా ఇండ్లు మంజూరు అవుతాయన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించిన పాపాన పోలేదని శ్రీనివాస్ రెడ్డి గారు విమర్శించారు. ఇట్టి కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, తాజామాయి సర్పంచ్ నర్సింలు గౌడ్, దుబ్బాక నియోజకవర్గ కో-ఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), తొగుట మాజీ ఎంపీపీ గంటా రేణుక రవీందర్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ దేవునూరి పోచయ్య, గ్రామ అధ్యక్షులు చీకట్ల స్వామి, మాజీ ఎంపిటిసి కానుగంటి సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్నం భూపాల్ రెడ్డి, కూచ మహిపాల్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, రాంపూర్ రమేష్, కోమటిరెడ్డి పద్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.