Sunday, 5 April 2026

Blog

వరంగల్

చిన్నపాటి వర్షం నీకే రోడ్ల పై నిలిచిన నీరు

నమస్కారం! నేను కోడెపాక, జితేందర్ , పున్నమి రిపోటర్ వరంగల్ లోని కాశీబుగ్గ లోని ఇందిరానగర్ లో మెన్ రోడ్ చిన్న వర్షం పడినా నగరంలోని రోడ్లపై నీరు నిలిచి పోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రతి సారి వర్షం పడినప్పుడు ఇదే పరిస్థితి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నీరు పారక రోడ్లపై పెద్ద ఎత్తున నిలిచి పోతోంది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “చిన్న వర్షానికే ఇంత స్థాయి నీటిమునిగిపోతే, పెద్ద వర్షం పడితే పరిస్థితి ఏంటి?” అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రోడ్లపై నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

రంగారెడ్డి

అవినీతి అక్రమాలకు అడ్డాగా బడంగ్పేట్ కార్పొరేషన్ —-రంగారెడ్డి జిల్లా ఎంఆర్పిఎస్ నేత బొర్ర రవిమాదిగ

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ కార్పొరేషన్లో కొనసాగుతున్న అవినీతి, అక్రమాలను కళ్లు ఉండి కూడా చూడలేని స్థితిలో కమీషనర్ సరస్వతి ఉన్నారని, ఏదో ఒక సాకుతో అక్రమార్కులకు కొమ్ముకాయడమే ఆమెకు పరిపాటిగా మారిపోయిందని రంగారెడ్డి జిల్లా ఎంఆర్పిఎస్ మాజీ అధికార ప్రతినిధి, బాలాపూర్ ఇన్ఛార్జ్ బొర్ర రవిమాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే.నెం:272,273, 275,276,277,278,281లలో పాత తేదీల్లో అప్పటి గ్రామ పంచాయితీ మాజీ సర్పంచ్ సంతకాలతో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న అక్రమ వెంచర్పై చర్యలు తీసుకోవాల్సిం దిగా కమీషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి 4 నెలలు గడుస్తున్నా కమీషనర్ పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. వెంచర్లో కనీసం క్షేత్రస్థాయి పరిశీలన సైతం నిర్వహించకుండా ఇక్కడి బిల్డర్లు గతంలోనే వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పట్లో 10 శాతం భూమిని బిల్డర్లు గ్రామపంచాయితీకి మార్ట్యూగేట్ చేయడం జరిగిందని స్వయంగా కమీషనర్ చెప్తుండడాన్ని చూస్తుంటే బిల్డర్లతో ఆమె కుమ్మక్కైనట్లు స్పష్టం అవుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా కమీషనర్ స్పందించి ఈ అక్రమ వెంచర్పై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేనిపక్ష్యంలో ఆమెపై జిల్లా స్థాయి ఉన్నతాధికారు లకు ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో రవిమాదిగ హెచ్చరించారు

వరంగల్

*అంధకారంలో అంగన్వాడీ..!* గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ రామేశ్వర టెంపుల్ అంగన్వాడీలో గత వారం రోజులుగా కరెంట్ లేక అవస్థలు.. విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం శూన్యం..! చీకట్లో చిన్నారులకు విద్య..

*అంధకారంలో అంగన్వాడీ..!* గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ రామేశ్వర టెంపుల్ అంగన్వాడీలో గత వారం రోజులుగా కరెంట్ లేక అవస్థలు.. విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం శూన్యం..! చీకట్లో చిన్నారులకు విద్య..

రంగారెడ్డి

* బీసీ బిల్లు తోమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలి —బిసిఐఎఫ్ కో ఆర్డినేటర్ బొల్లంపల్లి ఆంజనేయులు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని, అందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తగిన చొరవ తీసుకోవాలని బిసిఐఎఫ్ రంగా రెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లంపల్లి ఆంజనేయులు డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ల సాధన సమితి పిలుపు మేరకు.. సోమవారం రంగా రెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొల్లంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణతో కూడిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. తొమ్మిదవ షెడ్యూల్ తోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయన్నారు. ఐదు శాతం కూడా లేని అగ్రకుల పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగం గానీ, ఏ చట్టాలు గానీ అడ్డు రాలేదు. జనాభాలో సగంకు పైగా ఉన్న బీసీ, ఏం బీసీ కులాల రిజర్వేషన్లకు మాత్రం అడ్డువస్తున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పై చిత్తశుద్ధి లేదని, అందుకు ఉదాహరణ బీసీ బిల్లు ప్రవేశ పెట్టిన విధానమే సరిగా లేదన్నారు. బీసీ లకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోర్టు అడిగితే, సరైన కారణాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవేమీ లేకుండా కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు పెట్టడం జరిగిందన్నారు. బీసీ కులాలు దాదాపు 130 వరకు ఉండగా, ఇప్పటికి వందకు పైగా కులాలు కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదన్నారు. ఈ వెనుకుబాటును కోర్టులకు చూపించి, వర్గీకరణతో కూడిన రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చూపిస్తే, కొంత న్యాయం జరిగేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ద్వంద నీతిని పక్కనబెట్టి బీసీ రిజర్వేషన్లు అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో భవిష్యత్తులో అన్ని పార్టీలు బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు అనంతుల శ్రీనివాస్, జయంత్, ఏంహెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లంపల్లి రాంబాబు, శివ, తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.*

*బట్టేలంక గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం: రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి పిలుపుమేరకు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు గుర్రం జాషువా ఆధ్వర్యంలో, బట్టేలంక గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు కందికట్ల రత్నబాబు అధ్యక్షతన *”మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం* నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బట్టేలంక గ్రామంలో కోటి సంతకాల ప్రజాఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు గారు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్, నేతల నాని బాబు, మోకా సురేష్, చింతా ప్రసాద్, జిల్లెళ్ళ ఉదయ్ కిరణ్, నల్లి శరత్ గార్లు. స్థానిక గ్రామ నాయకులు: మాజీ గ్రామశాఖ అధ్యక్షులు కడలి శ్రీనివాస్, కందికట్ల విజయకుమార్, మంద ప్రభుదాస్, నల్లి పెద్దిరాజు, తోట నానాజీ, బోనం సురేష్ గార్లు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

హైదరాబాద్

తెలంగాణలో వాతావరణ సూచనలు

తెలంగాణలో వాతావరణ సూచనలు.. తెలంగాణలో కూడా పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావారణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌ సహా.. పలు జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయఇ.. అలాగే రాష్ట్రంలోని కొన్ని పశ్చిమ జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Blog

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని కందుకూరు మాజీ శాసనసభ్యులు దివి శివరాం మరియు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాలలోని మంత్రి గారి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వారు మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో రాష్ట్రంలోని పలు కీలక రాజకీయ అంశాలపై చర్చించారు.

E-పేపర్

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈరోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ వేదిక ద్వారా పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మంత్రివర్యులు ఫరూక్ స్వయంగా అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఆయన తక్షణమే ఆయా సమస్యలకు సంబంధించిన శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రూ.2000 నోట్లలో 98.37% తిరిగి రావాలి !రూ.5817 కోట్లు ఇంకా చలామణిలో – RBI

న్యూ ఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, అక్టోబర్ 31 నాటికి దేశంలో ఇంకా రూ.5,817 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలోనే ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం నోట్లలో 98.37 శాతం నోట్లు తిరిగి వచ్చాయని పేర్కొంది. ఇక మిగిలిన నోట్లను ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో లేదా ఇండియా పోస్ట్ సేవల ద్వారా మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. రూ.2,000 నోట్లు చెల్లుబాటు కానివిగా ప్రకటించిన తర్వాత కూడా కొంత మొత్తం ఇంకా బ్యాంకులకు చేరలేదని వెల్లడించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.