Sunday, 5 April 2026

Blog

E-పేపర్

శివాలయంలో అల్పహార విందు ఏర్పాటు చేయనున్న షంషీర్ భాష

శివాలయంలో అల్పహార విందు ఏర్పాటు చేయనున్న షంషీర్ భాష రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా కోడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బిస్మిల్లా బిర్యానీ సెంటర్ అధినేత షంషీర్ భాష గత పది సంవత్సరాలుగా కుల మతాలు అతీతంగా శివాలయంలో అల్పాహార విందు ఏర్పాటు చేస్తున్నారు రేపు శివాలయంలో 1500 మందికి అల్పాహార విందు ఏర్పాటు చేయనున్నట్టు షంషేర్ భాష తెలిపారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు

నవంబర్ 7, 2025 ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా “వందేమాతరం” సమూహ గానం “వందేమాతరం” గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా ప్రదేశాల్లో వందేమాతర గీతాన్ని సమూహంగా ఆలపించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాలలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, వైద్యులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు తదితరులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

E-పేపర్

*మొoథా తుఫాన్ తో నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 50 వేల నష్టపరిహార ఇవ్వాలాని

*మొoథా తుఫాన్ తో నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 50 వేల నష్టపరిహార ఇవ్వాలాని* *బ్యాంక్ లో రుణాలు తీసుకున్న రైతులందరికి బ్యాంక్ ఇన్సూరెన్స్ కంపిణీ నష్టపరిహారం ఇవ్వాలి* *చిల్పూర్ సిపిఎం పార్టీ మండల కమీటి ఆధ్వర్యంలో సీనియర్ అస్టెంట్ గారికి వినతిపత్రం* *చిల్పూర్* సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సాదం రమేష్ మాట్లాడుతూ మొన్న కురిసిన మొంథా తుపాన్ తో మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు చాలావరకు నష్టపోయారు, రైతులు ఆరు నెలలుగా కస్టపడి విత్తనాలు వేసి వేలాది పెట్టుబడులు పెట్టి చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చి పొలాలలో ఇసుకమెట్టలు వచ్చి వరి చేనులు కోయరాకుండా బురదలో మునిగిపోయాయి. మొక్కజొన్నలు తడిసి మొలకలు వచ్చి నల్లబారి పోయాయి, పత్తి చేను మీదనే కింద బడి నల్లబారీ మొలకెత్తిన పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, వర్షకాలం ముందు వివిధ బ్యాంక్ లలో పట్టాదారు పసుపుస్తకాలు పెట్టుకొని పంటల ఋణం తీసుకునే ముందు బ్యాంక్ వారు పంటలకు ఇన్సూరెన్స్ క్రింద డబ్బులు కట్ చేసుకొని మీగిలిన డబ్బులు రైతులకు ఇచ్చారు అట్టి రైతులకు బ్యాంక్ ద్వారా వెంటనే ఇన్సూరెన్స్ ఇవ్వాలని అన్నారు. మండలంలో ఉన్న అన్ని గ్రామలలో రోడ్లు తెగినవి కొన్ని చోట్ల పెద్ద పెద్ద గుంతలు పడినవి రోడ్ల వెంట పోయే రైతులకు, మరియు ప్రయాణం చేసే వారికీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కావున వెంటనే స్పందించి రోడ్లు మరమ్మతులు చేయాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉరడి లింగయ్య, ముడిక బీమయ్య,నారబోయన బిక్షపతి,ఊరడి బుచ్చిరాజ్ లు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యార్థులతో సమీక్ష సమావేశం!

*విద్యార్థులతో సమీక్ష సమావేశం!* ▪️ఎంఈఓ శోభనాద్రి. *మన పొదలకూరు:* మండలంలోని తాటిపర్తి వైకెకె హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులతో మండల విద్యాశాఖధికారి-2 ఎం శోభనాద్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సిలబస్ కు సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడారు. విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్ నాగమోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఖమ్మం

పైసలు కొట్టు రేషన్ కార్డు పట్టు

*ఖమ్మం జిల్లాలో మితిమీరిన రేషన్ కార్డు దందా* *అర్హత లేని వారికి కూడా రేషన్ కార్డు జారీ చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయం గండి* *బోగస్ రేషన్ కార్డు లను వెంటనే తొలగించాలి* *ఏడాదికి కోట్లల్లో టర్నోవర్ వ్యాపారస్తులకు కూడా రేషన్ కార్డు జారీ* *దళారుల చేతుల్లో ప్రభుత్వ రెవెన్యూ అధికారులు క్షణాల్లో అర్హత లేని వారికి కూడా రేషన్ కార్డు జారీ* *అర్హత ఉండి పైసలు ఇచ్చుకోలేని లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిందే అయినా రేషన్ కార్డు వస్తుందా లేదా అనేది నమ్మకం లేదు* ఖమ్మం జిల్లాలో విచ్చలవిడిగా రేషన్ కార్డు దందా నడుస్తున్న పట్టించుకోని జిల్లా యంత్రాంగం మరి ఇందులో జిల్లా యంత్రాంగం అధికారుల యొక్క పాత్ర ఏమైనా ఉందా అని లబ్ధిదారుల గుసగుసలు దళారులు అంతా మేము చూసుకుంటాం నీకెందుకు టెన్షన్ 5000 ఇవ్వండి అంతా మేమే చూసుకుంటాము జిల్లాలో ఉన్నటువంటి మండలాల ఎమ్మార్వో కార్యాలయాల్లో డబ్బులకు రేషన్ కార్డులను ఇప్పిస్తున్న దళారులు నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్న అక్రమార్కులు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలకు అర్హత కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి దీన్నే ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు అక్రమార్కులు రేషన్ కార్డు దందాకు ఆయువు పోశారు *బోగస్ రేషన్ కార్డులను వెంటనే తొలగించాలి* ప్రతి ఏడాది ఖమ్మం జిల్లా లో ఉన్నటువంటి వ్యాపారస్తులు లక్షలు సంపాదించే వ్యాపారాలు ఉన్నవారు అలాగే సొంత భవనాలు భూములు ఉండి నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్న వారు ఖరీదైన కారు ఉన్నవారు కూడా రేషన్ కార్డు పొందారు అంగట్లో సర్కుల రేషన్ కార్డు దందా అక్రమార్కులు ధరలు నిర్ణయించడంతో ధనవంతులు కూడా రేషన్ కార్డు పొంది ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటున్నారు కొన్నిచోట్ల మీసేవ కేంద్రాల నిర్వహకులు చేతివాటం చూపించారు మరికొన్ని చోట్ల తాసిల్దార్ తాసిల్దార్ కార్యాలయంలోని కిందిస్థాయి సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్లు ఈ అక్రమార్కుల అవతారం ఎత్తి లక్షల్లో ఆదాయం సంపాదించుకున్నారు ఆదాయం ఎక్కువ ఉన్న వారికి కూడా తక్కువ ఆదాయం చూపించి అంతా మేమే చూసుకుంటామని చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు అర్హత లేని వారికి రేషన్ కార్డులు జారీ చేశారు ఖమ్మం జిల్లాలో ఇంత పెద్ద తరహాలో రేషన్ కార్డు దందా నడుస్తున్న మరి జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగా అధికారులు డి సి ఎస్ ఓ మరియు ఉన్నత అధికారులు సమాచారం తెలుసుకుంటున్నారా తెలిసి కూడా మనకెందుకులే అని ఉంటున్నారా అనేది అర్థం కాని పరిస్థితి మరి ఈ విధంగా అక్రమార్కుల ద్వారా జారీ అయిన రేషన్ కార్డులను ప్రత్యేక అధికారులను నియమించి అట్టి దొంగ రేషన్ కార్డులను వెంటనే తొలగించాలని నిరుపేద కుటుంబాల లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు కొన్నిచోట్ల చౌక ధరల దుకాణాల యాజమాన్యులు రేషన్ దందా అలాగే రేషన్ బియ్యం దందా నడుపుతున్నారు అనే విశ్వసనీయమైన సమాచారం వీటిపై డి సి ఎస్ ఓ లు జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టి మరింత లోతుగా ఆరా తీసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

వరంగల్

అకాల వర్షం కారణంగా వరంగల్ మార్కెట్లో పత్తి రైతుల ఆందోళన

పత్తి చేనులోనే పత్తి తడిసి ముద్దవుతుండగా., పంటకు ఈసారి దిగుబడి ఇక అతి కష్టమేనని పత్తి రైతులు దిగులు చెందుతున్నారు. ఈ క్రమం లోనే ఇప్పటికే తీసిన పత్తిని మంగళవారం ఉదయం కొందరు రైతులు వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు తీసుకు రాగా, వర్షంలోనే పత్తి బస్తాలు, మ క్కలు తడిసిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను చూసి.. రైతులు కలవర పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి.. ఎక్కువ ధరలకు కూలీలను తీసుకువచ్చి మరి.. పత్తినీ చేనులో నుంచి అతి కష్టం మీద తీసుకొచ్చి కొనుగోలుకు వెళ్లగా వరుణ దేవుడు ఈ విధంగా చేయడం తమ గుండెల్లో గాయాలను మిగిలి పోయేలా చేస్తుందని వాపోతున్నారు. మార్కెట్ కి తీసుకొచ్చిన పత్తి బస్తాల వద్ద వరదలు రావడం చూసి.. తమ హృదయాలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నాయని కొందరు రైతులు పేర్కొన్నారు. వరుణ దేవుడా ఇకనైనా కనికరించు కొంతకాలం పాటు వర్షాలను పడకుండా చూడు… మాపై దయ చూపు అని కొందరు రైతులు వేడుకుంటున్నారు.

హైదరాబాద్

ఆరోగ్యశాఖలో ముగ్గురు డిప్యుటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

ఆరోగ్యశాఖలో ముగ్గురు డిప్యుటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్

పామూరులో ప్రెవేట్ బస్సు సీజ్

పామూరులో దర్శి మోటారు వాహనాలు తనఖీ అధికారి పి. రవికుమార్ సోమవారం రాత్రి ప్రెవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనఖీలు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న పండిచెరి రిజిస్ట్రేషన్ ఉన్న బస్సు లో అత్యవసర ద్వారాం వద్ద ముందు బెర్త్ ఉండటంతో ఆ బస్సును సీజ్ చేసి పామూరు PS కు తరలించారు.

ఆంధ్రప్రదేశ్

పామూరులో ప్రెవేట్ బస్సు సీజ్

పామూరులో దర్శి మోటారు వాహనాలు తనఖీ అధికారి పి. రవికుమార్ సోమవారం రాత్రి ప్రెవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనఖీలు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న పండిచెరి రిజిస్ట్రేషన్ ఉన్న బస్సు లో అత్యవసర ద్వారాం వద్ద ముందు బెర్త్ ఉండటంతో ఆ బస్సును సీజ్ చేసి పామూరు PS కు తరలించారు.

ఆంధ్రప్రదేశ్

పామూరులో ప్రెవేట్ బస్సు సీజ్

పామూరులో దర్శి మోటారు వాహనాలు తనఖీ అధికారి పి. రవికుమార్ సోమవారం రాత్రి ప్రెవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనఖీలు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న పండిచెరి రిజిస్ట్రేషన్ ఉన్న బస్సు లో అత్యవసర ద్వారాం వద్ద ముందు బెర్త్ ఉండటంతో ఆ బస్సును సీజ్ చేసి పామూరు PS కు తరలించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.