Sunday, 5 April 2026

Blog

జయశంకర్ భూపాలపల్లి

జేడి మల్లంపల్లి బ్రిడ్జి మరమ్మత్తులు

ములుగు నుండి వచ్చే భారీ వాహనాలు అబ్బాపూర్ మీదుగా చిన్న వాహనాలు భూపాల్ నగర్ మీదుగా వెళ్లాలి హనుమకొండ నుంచి వచ్చే భారీ వాహనాలు వయా పరకాల చిన్న వాహనాలు శ్రీరామ్నగర్ మీదుగా రావాలి ఇది రేపు ఒక్కరోజు మాత్రమే

జయశంకర్ భూపాలపల్లి

జేడి మల్లంపల్లి బ్రిడ్జి మరమ్మత్తులు

ములుగు నుండి వచ్చే భారీ వాహనాలు అబ్బాపూర్ మీదుగా చిన్న వాహనాలు భూపాల్ నగర్ మీదుగా వెళ్లాలి హనుమకొండ నుంచి వచ్చే భారీ వాహనాలు వయా పరకాల చిన్న వాహనాలు శ్రీరామ్నగర్ మీదుగా రావాలి ఇది రేపు ఒక్కరోజు మాత్రమే

E-పేపర్

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని మార్నింగ్ వాక్ లో ప్రచారం నిర్వహించిన రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు, మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు…..

నేడు జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని కృష్ణకాంత్ నాగర్,శ్రీనగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని మార్నింగ్ వాక్ లో ప్రచారం నిర్వహించిన రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గార్లు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది పేదోడి ప్రజా ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలకు నిజమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అనేక సంక్షేమ ప‌ధ‌కాలు అమ‌లు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి న‌వీన్ యాద‌వ్ గారిని బారీ మెజార్టీతో గెలిపించలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి, కిషోర్ రెడ్డి,కార్పొరేటర్స్ లక్ష్మణ్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి,జితేందర్, ప్రేమ కుమార్, విజయ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనారు.

తిరుపతి

వాయులింగేశ్వరుని దర్శించుకున్న చీరాల ఎమ్మెల్యే

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్ధం చీరాల శాసనసభ్యులు మద్దలూరి మాల కొండయ్య కుటుంబ సభ్యులతో విచ్చేసి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. వీరికి ధర్మకర్తల మండలి సభ్యురాలు కె రజిని, ఆలయ అధికారులు, స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేయించి అనంతరం శ్రీ గురు మేధా దక్షణామూర్తి సన్నిధిలో వేద పండితులతో ఆశీర్వదించి శ్రీ స్వామి, అమ్మవార్ల శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలు, ఢిల్లీ బాబు, శ్రీకాళహస్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మండల స్థాయి లో చెకుముకి టాలెంట్ టెస్ట్

ఉదయగిరి బీసీ కాలనీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళ వారం హెచ్ యం నుర్జా హన్ ఆధ్యర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్ మండల స్థాయిలో నిర్వహించారు హెచ్ యం మాట్లాడుతూ ఈ పరీక్ష ద్వారా విద్యార్ధులలో విజఞానశాస్త్రం పట్ల అభిరుచి పెరుగుతుందన్నారు విద్యార్థుల తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక అవకాశం ఉంటుందన్నారు గత 35 సంత్సరా లుగా చెకుముకి సైన్స్ ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తామన్నరు

తిరుపతి

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారికి నివాళులర్పించిన బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి నవంబర్ 04 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదమలో మృతిచెందిన శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన 4వ వార్డు వాస్తవ్యులు (నక్క హరిజనవాడ) ఉలస సుబ్రహ్మణ్యం, ఉలస రూపేష్, వీరు ఇరువురు తండ్రి కొడుకులు పెళ్లకూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి స్థానిక వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి వారికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి తెలుగుదేశం పార్టీ తరఫున వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జి విజయ్ కుమార్ క్లస్టర్ ఇంచార్జ్ పేట బాలాజీ మూడో వార్డు గోవిందు, శివ, నిండ్ర సుధాకర్ రాంబాబు ,రామ్మూర్తి ,బాబు, మనీ, సన్నీ ,గుప్తా విజయ్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తిరుపతి

అంతిమయాత్రకు కూడా తప్పని అవస్తలు ..

తొట్టంబేడు నవంబర్ 04 , పున్నమి న్యూస్ : : శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని పెద్ద కన్నలి పంచాయతీ కొత్త కన్నలి గ్రామ సమీపంలోని స్మశాన వాటిక వర్షపు నీరు చేరి చెరువు లాగా మారింది. దీంతో ఎవరైనా మరణిస్తే ఇక్కడ అంతిమయాత్ర చేయడానికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రతికినన్నాళ్లు కష్టాలు తప్ప లేదంటే మరణించిన తర్వాత కూడా భౌతికకాయాన్ని దహన సంస్కారాలు చేయాలంటే అవస్తలు తప్పడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ స్మశానం రోడ్డుకి కింద ఉండడంతో వర్షం వస్తే మొత్తం నీటితో నిండిపోతుందని దీంతో మృతి చెందిన వారిని పూడ్చడానికి గుంత తీయాలన్నా కూడా అందులోకి వర్షపు నీరు చేరిపోవడంతో పూడ్చలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామములో ఆదివారం గ్రామంలో ఒక వ్యక్తి మృతి చెందితే మృతదేహాన్ని పూడ్చడానికి గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త కన్నలి సమీపంలోని ఎస్టీ కాలనీ వద్ద విశ్వ బ్రాహ్మణులకు సంబంధించిన స్మశానం పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయి ఉందని సంబందిత అధికారులు ఇకనైన స్పందించి స్మశాన వాటికలను బాగు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎంఈ రాష్ట్ర చైర్మన్ *తమ్మి రెడ్డి శివ శంకర్* గారి ని కలిసిన మర్రిపాడు జనసేన పార్టీ మండలాధ్యక్షురాలు *ప్రమీల ఓరుగంటి*

పార్టీ అంతర్గత వ్యవహారాల పరిశీలనకు నెల్లూరుకు విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ కలిసి మర్రిపాడు మండలంలోని పలు గ్రామాల్లో జనసేన పార్టీ తరఫున చేసిన కార్యక్రమాలను తెలియచేయశారు అనంతరం శాలువాతో సత్కరించారు ఆనంతరం చిన్నా జనసేన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యం ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు గురైన మర్రిపాడు మండలంలో జనసేన పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి నియోజకవర్గ స్థాయి భారత రాజ్యాంగం పోటీలు

ఉదయగిరి నియోజకవర్గ స్థాయి భారత రాజ్యాంగం పోటీలు మంగళవారం ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగాయి ఎం ఈ ఓ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో వ్యాస రచన , వృక్యత క్విజ్ పోటీలు నిర్వహించినట్లు ఈ పోటీల్లో సీ హెచ్ ధరణి , యన్ గురు విగ్నేష్ , జీ సంజన ఎంపికైనట్లు తెలిపారు.

సిద్ధిపేట

సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 07 మందికి ₹ 71,000/- రూపాయల జరిమానా

సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 07 మందికి ₹ 71,000/- రూపాయల జరిమానా* సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, చౌరస్తాలలో మరియు రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, 07 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా *ఈరోజు సిద్దిపేట 1st అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుమారి వి. తరణి, గారి ముందు హాజరుపరచగా విచారణ చేసి 07 మందికి ₹ 71,000/- రూపాయల జరిమాన విధించారు* ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడవదని, మరియు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. *మద్యం సేవించి వాహనాలు నడిపే ఒక్కొక్కరికి 10 వేల రూపాయల జరిమానా విధించడం అమల్లోకి రావడం జరిగిందని తెలిపారు* కె. ప్రవీణ్ కుమార్ సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.