Sunday, 5 April 2026

Blog

విశాఖపట్నం

ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు. పెదగంట్యాడ వద్ద ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీ ఏర్పాటును కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రెండవ దఫా ప్రచారోద్యమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గాజువాక, మల్కాపురం ,స్టీల్ జోన్ కమిటీలు మూడు రోజులు పాటు, మూడు ఆటో జాతాలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం పాత గాజువాక జంక్షన్ లో జెండా ఊపి ఆటో జాతాలను ప్రారంభించారు. దానికి ముందు ఆయన మాట్లాడుతూ, ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలని, ఆదాని గంగవరం పోర్ట్ కాలుష్యం అరికట్టాలని , 10 లక్షల మంది ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని,గంగవరం పోర్ట్ లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖవెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, విశాఖ ఎంపీ భరత్ బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తో మాట్లాడి అదా నీ సిమెంట్ కంపెనీ ఏర్పాటును రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. మూడు రోజులపాటు ప్రజలను చైతన్యం చేయడానికి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. లక్ష వరకు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నామని తెలిపారు .గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముందు అదానికి వత్తాసు పలికి, ప్రజలు తిరుగుబాటు చూసి మాట మార్చారు అన్నారు. ప్రజలే సుప్రీం, ప్రజా నిర్ణయం ఫైనల్ అని చెప్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి చేత సిమెంట్ కంపెనీ రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సిమెంట్ కంపెనీ ప్రమాదం తక్కువ చేసి చూపించేందుకు కొందరు కూటమినేతలు ఆదానికి ఏజెంట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఆదాని గంగవరం పోర్ట్ నిర్మాణ సమయంలో కూడా కాలుష్యం తక్కువ వీరు చెప్పారు.ఇప్పుడు సింధియా మొదలుకొని గాజువాక మొత్తం గంగవరం పోర్టు కాలుష్యం వెదజల్లుతున్నదన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు అయితే గాజువాక అసెంబ్లీ నియోజవర్గం, విశాఖ వెస్ట్ పరిధిలో సింధియా నుండి జింక్ గేటు వరకు గల పది లక్షల మంది ప్రజల నరకం చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం గాజువాక ,మల్కాపురం జోన్ కార్యదర్శులు ఎం రాంబాబు, పి పైడిరాజు, స్టీల్ జోన్ నాయకులు నమ్మి రమణ మాట్లాడుతూ ఇటీవల ఎన్నికల్లో అదానీ గంగవరం పోర్టు యాజమాన్యంపై చర్యలు తీసుకొని కాలుష్యాన్ని అరికడతామని ప్రస్తుతం ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు ,గణబాబులు హామీ ఇచ్చారు. దీనిని నిలబెట్టుకొని కాలుష్యాన్ని ఆపించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఆదాని సిమెంట్ కంపెనీ ఏర్పాటు వద్దని ప్రజలు ముక్తకంఠంతో తెలియజేశారని, ప్రజాభిప్రాయం మీద కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్ను వెంటనే సిమెంట్ కంపెనీ ఏర్పాటును రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎల్. బంగారు నాయుడు,ఏ లోకేష్, యు సోమేశ్, అప్పల రెడ్డి,అదాని సిమెంట్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఎన్ రామారావు, యువజన సంఘం నాయకులు కే మహేష్, ఎన్ రాము తదితరులు పాల్గొన్నారు .

విశాఖపట్నం

కింగ్ జార్జ్ ఆసుపత్రికి (కేజిహెచ్) డివిస్ ల్యాబొరేటరీస్ వారు సామాజిక బాధ్యత కార్యక్రమం

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* కింగ్ జార్జ్ ఆసుపత్రికి (కేజిహెచ్) డివిస్ ల్యాబొరేటరీస్ వారు సామాజిక బాధ్యత కార్యక్రమం (CSR) లో భాగంగా రూ.2.50 లక్షల విలువైన 3 సీటర్ల 25 రో చైర్లు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, సిఎస్‌ఆర్‌ఎమ్‌ఓ డాక్టర్ ఉ. శ్రీహరి, రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. డాక్టర్ ఐ. వాణి గారు డివిస్ ల్యాబొరేటరీస్ వారి ఉదార సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చైర్లు ఆసుపత్రి రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు

విశాఖపట్నం

ఉద్యోగం ఇస్తామని చెప్పి 91లక్షలు మోసం – ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు*

*ఉద్యోగం ఇస్తామని చెప్పి 91లక్షలు మోసం – ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- గాజువాక పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువ దంపతులను మోసం చేసి కోట్లాది రూపాయలు తీసుకున్న కేసులో ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. కేసు వివరాలు: శ్రీమతి సినగం అలేఖ్య (24 సంవత్సరాలు), భర్త పేరు వినాయక రావు, గాజువాక చెట్టివాణిపాలెం రోడ్డులో ఉంటున్నారు. వీరు 30-09-2025న పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేశారు. ఎలా మోసం చేశారు: అలేఖ్య డయాలసిస్‌లో డిప్లొమా చేసింది, ఇప్పుడు నర్సింగ్ చదువుతోంది. ఆమె భర్త బి.టెక్ చదివి ఉద్యోగం కోసం చూస్తున్నాడు. ఈ దంపతులకి మంచి ఉద్యోగం కావాలన్న ఆలోచన ఉంది. వీళ్ళ బంధువులు మచ్చ సజిని, మచ్చ వెంకట నారాయణ దంపతులు శ్రీహరిపురం, మల్కాపురం నుండి వచ్చి, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. అంతేగాక నారాయణ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాననీ, తనకి మంచి కనెక్షన్లు ఉన్నాయనీ చెప్పాడు. ఒక్కో వ్యక్తికి 50 లక్షలు ఇస్తే ఒక సంవత్సరంలో ఉద్యోగం పక్కా, డబ్బు చాలా సేఫ్‌గా ఉంటుంది, ఉద్యోగం వచ్చేవరకు వడ్డీ కూడా ఇస్తాం అని చెప్పారు. పట్టుబడిన వాళ్ళు: 1) A1 – మచ్చ సజిని (37 సంవత్సరాలు), గృహిణి, శ్రీహరిపురం 2) A2 – మచ్చ వెంకట నారాయణ (40 సంవత్సరాలు), ట్రాన్స్‌పోర్ట్ సూపర్‌వైజర్, శ్రీహరిపురం 3) A3 – సీరాపు శన్ముఖ ఆదిత్య కుమార్ (20 సంవత్సరాలు), స్టూడెంట్, పెడగంట్యాడ, 4) A4 – సీరాపు రామ్‌ప్రసాద్ (24 సంవత్సరాలు), జొమాటో డెలివరీ బాయ్, పెడగంట్యాడ, 5) A5 – సీరాపు అనిత (41 సంవత్సరాలు), గృహిణి, పెడగంట్యాడ ఎంత డబ్బు తీసుకున్నారు: ఏప్రిల్ 2023 నుండి ఆగస్టు 2024 వరకు అలేఖ్య దంపతులు తమ దగ్గర ఉన్న డబ్బు, బంధువులు, స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని మొత్తం 91 లక్షల 36 వేల 500 రూపాయలు ఇచ్చారు. సజినికి (A1): 19 లక్షల 18 వేలు, నారాయణకు (A2): 6 లక్షల 2 వేలు, శన్ముఖకు (A3): 15 లక్షల 2 వేలు రామ్‌ప్రసాద్‌కు (A4): 6 లక్షల 43 వేల 500, అనితకు (A5): 6 లక్షల 96 వేలు. డబ్బు PhonePe, బ్యాంకు ట్రాన్స్‌ఫర్, CDM మెషిన్, నగదు ఇలా పంపించారు. ఎలా మోసం చేశారు : మొదట్లో బాగా మాట్లాడారు. తర్వాత ఉద్యోగం గురించి అడిగితే ఏదో సాకులు చెప్పి వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి ఆగస్టు 2024లో చివరి 30 వేలు తీసుకున్న తర్వాత అందరూ కలిసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు. సజిని (A1): శ్రీహరిపురం, పెడగంట్యాడలో రెండు ఇళ్ళు కొన్నారు. నారాయణ (A2): ఐదు లారీ ట్రైలర్లు కొన్నాడు. మిగిలిన వాళ్ళు: ఆస్తులు కొనడంలో సహాయం చేశారు Dt. 30-09-2025న ఫిర్యాదు వచ్చిన వెంటనే క్రైం నంబర్ 440/2025 పెట్టి కేసు నమోదు చేశారు. విచారణ చేసి నిందితులను గుర్తించారు. Dt. 04-11-2025న ఐదుగురిని పెడగంట్యాడ వద్ద పట్టుకున్నారు. వాళ్ళ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళే మోసం చేశామని ఒప్పుకున్నారు. ఈ కేసులో ఇంకా 8 మంది నిందితులు ఉన్నారు. వాళ్ళను కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు కొన్న ప్రాపర్టీలన్నీ గుర్తించి స్వాధీనం చేసుకుంటామని, అలేఖ్యకు డబ్బు తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు హెచ్చరిక: ఉద్యోగాలు ఇస్తామని చెప్పి లక్షల రూపాయలు అడిగితే జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగాలకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి మోసాలు జరిగితే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. గుర్తుంచుకోండి: సరైన ఉద్యోగాలకి ఎప్పుడూ లంచం అడగరు. అడిగితే అది 100% మోసమే!

విశాఖపట్నం

తుఫాను బాధిత మత్స్యకారులకు నిత్యవసర సరుకులు పంపిణీ — డాక్టర్ కందుల నాగరాజు

తుఫాను బాధిత మత్స్యకారులకు నిత్యవసర సరుకులు పంపిణీ — డాక్టర్ కందుల నాగరాజు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * తుఫాను బాధిత మత్స్యకారులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసినట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. సుమారు ఏడుగురు మత్స్యకారులకు నిత్యవసర సరుకులు అందజేసినట్లు వెల్లడించారు. 50 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పంచదారను తుఫాను బాధిత మత్స్యకారులకు అందజేసినట్లు వెల్లడించారు. ఇటీవల వచ్చిన మొందా తుఫాను సమయంలో 32 వ వార్డులో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. అవసరమైన వారికి సహాయం చేసినట్లు వెల్లడించారు. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల మంచి కోసం తాను ఏమి చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా అందరికీ తాను సహాయం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇటువంటి వారికి మానవతా దృష్టితో సహాయం చేయాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ పి వి రమణ, సిపిఐ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

కోటి సంతకాలు పేరిట వైకాపా కొత్త నాటకం – శ్రీకాళహస్తి తెలుగుతమ్ముళ్ళు

శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఓ ప్రకటన ద్వారా మాట్లాడుతూ.. వైకాపా కోటి సంతకాలు పేరిట మరో కొత్త రకమైన నాటకానికి తెరలేపిందన్నారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించి, పేదలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెస్తుంటే, వైసీపీ దీనిపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని పీపీపీ అంటే, ప్రైవేటుకి అమ్మేయటం కాదని…ప్రైవేటు, ప్రభుత్వం కలిసి అభివృద్ధి చేసేదిగా జగన్ క్లారిటీ తెచ్చుకోవాలని హితవు పలికారు. జగన్ రెడ్డి గ్యాంగ్ చేసేవి కల్తీ పనులు.. ఆడేవి తప్పుడు మాటలని, శ్రీవారి లడ్డూలో కల్తీ, జోగితో మద్యంలో కల్తీ చేసి, మెడికల్ కళాశాలల మీద దుష్ప్రచారం చేస్తూ కోటి సంతకాలు అనే కొత్త నాటకానికి తెరదీసి ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ, శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు విమర్శించారు. మెడికల్ కాలేజీల పై నువ్వు తెచ్చిన జీఓ నెం. 107, 108, 133 ల మీద, నువ్వే కోటి సంతకాలు చేస్తున్నావా జగన్ రెడదెనని ప్రశ్నించారు. పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీలను కడితే పేదలకు అన్యాయం జరిగి పోతుంది అని గగ్గోలు పెడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న జగన్… అసలు విషయాలని ఎలా దాచిపెడుతున్నాడో ప్రజలు తెలుసుకోవాలని పీపీపీ మోడల్ లో కడితే ఫ్రీ సీట్లు పెరగడమే కాకుండా… పేదలకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. పాత విధానంలో కట్టిన 5 మెడికల్ కాలేజీల్లో ఇప్పటివరకు 500 సీట్లు రాగా అందులో ఫ్రీ సీట్లు 213 (42.5%) మాత్రమే. అదే పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీలు కడితే 17 కాలేజీల్లో తక్కువలో తక్కువ 1700 సీట్లు వస్తాయి. వాటిల్లో ఫ్రీ సీట్లు 850 (50%) ఉంటాయి. అంటే పీపీపీ మోడల్ లో కడితే ఫ్రీ సీట్లు పెరగడమే కాకుండా… పేదలకు కార్పొరేట్ వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందని పీపీపీ మోడల్ లో కట్టిన మెడికల్ కాలేజీలలో ఫ్రీ సీట్లు పెరుగుతాయి దానర్ధం ఏమిటంటే ఎక్కువ మంది పేద విద్యార్థులు వారు డాక్టర్ కావాలన్న కలను నెరవేర్చుకోవచ్చు. అంతేకాకుండా పేదలకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందని తెదేపా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి.నారాయణ, 17 వ వార్డు ఇన్ చార్జి చాంద్ బాషా, బిసి విభాగం నాయకులు కిరణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాదు

స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాంప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమ్ అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ట్రైనింగ్ కలెక్టర్ సలోని చబ్రా హాజరై మాట్లాడుతూ NLM, PMEGP, PMFME పథకాల ద్వారా యువత స్వయం ఉపాధి పొందాలన్నారు. జిల్లా ఇండస్ట్రియల్ మేనేజర్ పద్మ భూషణ్ రాజు, ఎల్డిఎం ఉత్పల్ కుమార్ ధామ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ,MSME జిల్లా మేనేజర్ పృథ్వీరాజ్ లు వివిధ పథకాల గురించి తెలిపి సద్వినియోగం చేసుకోవాలన్నారు. రిసోర్స్ పర్సన్స్ డాక్టర్ విజయబాబు, వెంకటేశ్వర్లు, కమలాకర్ (FL) గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ అధికారి ఖలీం, సూపర్డెంట్ సత్యనారాయణ, డీఎల్సీ శివకుమార్, సిఎస్సి డిఎం రాహుల్, MMSME అసిస్టెంట్ మేనేజర్ ఆదర్శ్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ సత్యనారాయణ, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

*@వేలేరు మండలం 04.11.25* స్టే॥ఘనపూర్ నియోజక వర్గం,

*@వేలేరు మండలం 04.11.25* స్టే॥ఘనపూర్ నియోజక వర్గం, *గౌ॥ శ్రీ . స్టే॥ ఘనపూర్ నియోజక వర్గ MLA కడియం శ్రీహరి గారు ఇటీవల విడుదల అయిన నిధులనుండి త్వరలోనే వేలేరు మండల కేంద్రంలో రైతువేదిక వద్ద ఏర్పాటు చేయబోయే MRO MPDO కార్యాలయాల కోసం ఈ రోజు MLA గారితో కలిసి స్థల పరిశీలన చేయడం జరిగింది అదేవిధంగా BC కాలానికి అవసరమైన అంతర్గత CC రోడ్లు మరియు వేలేరు గ్రామంలోని ZPHS ప్రాథమిక పాఠశాలకు సైడ్ వాల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎస్టిమేషన్ వారం రోజుల్లో తీసుకొని రావాలని MLA గారు అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు…*

E-పేపర్

తెలంగాణాలో జాతకట్టిన రెండు పార్టీలు

తెలంగాణ రాష్టం లో జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ సూచన మేరకు జూబ్లీహిల్స్ లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు జనసైనికులు మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు మంత్రివర్యులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ కిషన్ రెడ్డి గారిని కలిసి జనసేన పార్టీ తరుపున జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ కి మద్దత్తు ప్రకటిస్తూ సంతోషవక్తం చేసింది..

తెలంగాణ

సిద్దిపేట హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం ఆర్డీవో రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య లతో కలిసి నిర్వహించారు.

సిద్దిపేట హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం ఆర్డీవో రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య లతో కలిసి నిర్వహించారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అధికారులందరితో కలిసి కొత్త బట్టల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అర్ అండ్ బి శాఖ హుస్నాబాద్ నుండి కొత్తపల్లి నాలుగు వరసల రోడ్ నిర్మాణ పనుల్లో 90 శాతం చెట్లు తొలగింపు పూర్తి, ఎలక్ట్రిక్ లైన్ తొలగించడం అన్ని జాగ్రత్తలు తీసుకుని తొలగించాలని ఆదేశించారు. కోహెడ నుండి సముద్రాల రోడ్ బి టి రోడ్ పనులు 15 రోజులు పూర్తి చెయ్యాలి. హుస్నాబాద్ నుండి రామవరం రోడ్ అక్కన్న పెట నుండి కొత్తకొండ రోడ్ పనులు మరియు ఇతర భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చెయ్యాలని అర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ ఇంజనీర్ శాఖలో ఏం జీ ఎన్ ఆర్ ఈ జీ ఎస్ కింద నిర్మాణం చేపడుతున్న గ్రామపంచాయతీ భవనాలు హుస్నాబాద్ మండలం లో కూచనపల్లి, మడత అక్కన్న పెట మండలంలో గొల్లపల్లి, గౌరవెల్లి, చౌటపల్లి, గుబ్బాలి, కట్కూరు, రేగొండ, శ్రీరామ్ తండా, పంతులు తండా, కుందన్వానీ పల్లి, రామవరం, మల్చెరువు తండా కోహెడ మండలంలో ధర్మారం, వరికోలు, నకిరేకొమ్ముల, పరివేద, నారాయణపూర్ గ్రామాల్లో గ్రామపంచాయతీ భవన పనులు జరుగుతున్నట్లు డిసెంబర్ చివరకల్ల నిర్మాణం పూర్తి చెయ్యాలి. గాంధీ నగర్, పొట్లపల్లి, బల్లునాయక్ తండా, మహమ్మదాపూర్, మీర్జాపూర్, బంజేరుపల్లి, చౌటాకుంట తండా, పెద్ద తండా, దుబ్బ తండాబత్తుని వాణి పల్లి భూమి కొరత భూమి కొరత భూమి కొరత ఉందని గ్రామాల్లో పాత జీ పి భవనం వేరొక స్థలం గూర్చి ఇంజనీర్ గ్రామపంచాయతీ అధికారులు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశించారు. అంగన్వాడి భవనాలు, కాంపౌండ్ వాల్ లు జనవరి లోపు పూర్తి అయ్యేలా పని చెయ్యాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్ డి ఎఫ్ కింద చేపట్టిన పనులు, పి ఎచ్ సి, సబ్సంటర్ భవన నిర్మాణాలు మరియు పి ఎచ్ సి, సబ్సంటర్ మేజర్ మైనర్ రిపేర్లు పనులను యుద్ధప్రాతిపదకన పూర్తి చెయ్యాలి. మున్సిపల్ లో జంక్షన్ డెవలప్మెంట్, ఎల్లమ్మచెరువు వెళ్ళేందుకు రోడ్ నిర్మాణం మరియు సుందరీకరణ పనులు ఇతరత్ర పనులు నిర్ణిత కాలం లో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ ఉపకేంద్ర పనులు పురోగతిలో ఉన్నవి పూర్తి చెయ్యాలని పూర్తి అయిన వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మండలాల్లో తాగు నీరు అందించే పనులు సైతం చేపట్టిన పనులు పూర్తి చెయ్యాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఆయిల్ ఫామ్ సాగులో వేగం పెంచాలని వరి కోతలు పూర్తి అవుతున్నాయి కావున ఇప్పుడే మంచి సమయం రైతులను కలిసి ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సహించాలని అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు.

భక్తి

కార్తీక పౌర్ణమి దీపాల వెలిగింపుకు శుభ సమయం

పున్నమి ప్రతి నిధి. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడానికి శుభప్రదమైన సమయం గురించి ఎన్నోమంది వేచిచూస్తూ ఉంటారు. ఈసారి కార్తీక పౌర్ణమి రోజున దీపం పెట్టడానికి శుభ సమయం సాయంత్రం 5:15 నిమిషాల నుండి 7:50 నిమిషాల వరకు ఉంది. ఈ సమయములో దీపాలు వెలిగించడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించి దీపం వెలిగించడం మంచిదిగా పరిగణిస్తారు. దీపం వెలిగించేటప్పుడు ‘ఓం నమో నారాయణాయ’, ‘ఓం నమశ్శివాయ’ మంత్రాలు జపించడం శ్రేయస్కరం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.