Sunday, 5 April 2026

Blog

విశాఖపట్నం

శ్రీకాకుళం నుండి నేరుగా చర్లపల్లి కొత్త రైలు ఏర్పాటు చెయ్యాలి : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు*

*శ్రీకాకుళం నుండి నేరుగా చర్లపల్లి కొత్త రైలు ఏర్పాటు చెయ్యాలి : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ కమిటీ సమావేశంలో కేంద్ర పౌర విమానయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు, రైల్వే అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇటీవల చేపట్టిన పనుల పురోగతి, పార్లమెంట్ సభ్యులు ఇదివరకే చెప్పిన సమస్యలు, వాటి ప్రస్తుత స్థితి గురించి సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు కీలక సూచనలు చెయ్యగా.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. నూతన రైల్వే జోన్ గెజిట్ అంశాన్ని వేగవంతం చెయ్యాలని కోరిన రామ్మోహన్ నాయుడు.. డివిజన్ పరిధిలో స్పష్టమైన ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు నాణ్యతతో పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు. నిర్ధేశిత సమయంలోనే వాటిని పూర్తి చెయ్యాలని ఆదేశించారు. అమృత్ భారత్ స్టేషన్ లలో అభివృద్ధి పనులు ఆలస్యం పట్ల రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చెయ్యమని తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల లోగా.. స్థానిక పార్లమెంట్ సభ్యులతో కలసి రైల్వే అధికారులు అమృత్ భారత్ ప్రతిపాదిత స్టేషన్ లను సందర్శించాలని.. పురోగతిపై క్షేత్ర స్థాయి పరిశీలన చెయ్యాలని కోరారు. బ్రిటిష్ కాలం నాటి రైల్వే భవనాలు.. అమృత్ భారత్ పథకం ద్వారా పునరుద్ధరించుకునే అవకాశం ఉందని.. స్థానిక ఎంపీలను సమన్వయం చేసుకుంటూ వాల్తేర్ డివిజన్ లో పనులు వేగవంతం చెయ్యాలని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లకు, స్పోర్ట్స్ పర్సన్స్ కు టికెట్ ఛార్జీలు తగ్గింపు కోసం ఇప్పటికే అనేక వినతులు అందాయని.. సమావేశంలో కూడా ఇదే విషయం చర్చకు వచ్చిన నేపథ్యంలో.. తాను ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్లాట్ ఫాంల ఎత్తు పెంచే కార్యక్రమం సక్రమంగా, వేగంగా జరుగుతుందని ఆనందం వ్యక్తం చేసిన రామ్మోహన్ నాయుడు.. సబ్ వే ల నిర్మాణం కూడా వేగవంతం చెయ్యాలని స్పష్టం చేశారు. సబ్ వే లను నిర్మించే కాంట్రాక్టర్లు స్ధానికంగా జవాబుదారిగా ఉండకపోవడం సరైన విధానం కాదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి.. సబ్ వే ల నిర్మాణం లో నాణ్యతపై పలు ఆరోపణలు వస్తున్నట్టు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. నీటి నిల్వలు ఉండిపోవడం, పై నుండి వాటర్ లీకేజీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై దృష్టి సారించాలని కోరారు. ఇంకోవైపు తన పార్లమెంట్ పరిధిలో పలు సమస్యలను సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చేరు. కరోనా అనంతరం ఆగిపోయిన కామేశ్వరి పేట రిక్వెస్ట్ ట్రైన్ స్టాప్.. మళ్ళీ పునరుద్ధరించాలని.. ఇరవై ఐదు గ్రామాలను వీటి సేవలు కోల్పోయారని తెలిపారు. గునుపూరు తిరువల్లి రైల్వే లైన్ పనులు కూడా వేగవంతం చెయ్యాలని, టెక్కలిలో ఆర్.ఓ.బి అత్యంత అవసరమని గుర్తు చేసిన రామ్మోహన్ నాయుడు.. టెక్కలి పట్టణం మధ్యలో ఈ గేటు వల్ల ముప్పై, నలభై నిమిషాల వ్యయం పడుతోందని తెలిపారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ ను మరింతగా అభివృద్ధి చెయ్యాలని, లోడింగ్, అన్ లోడింగ్ సదుపాయాలను కల్పిస్తే అభివృద్ధికి మరింత వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో పాసింజర్ రైల్వే సర్వీసులలో సరైన సమయానికి స్టేషన్లకు చేరుకోవడం లేదనే సమస్య ప్రధానంగా వేధిస్తోందని.. దీన్ని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అలాగే పాసింజర్ రైళ్లలో నిబంధనలకు లోబడి స్టాప్స్ ను పెంచాలని తెలిపారు. శ్రీకాకుళం నుండి చర్లపల్లికి, శ్రీకాకుళం నుండి తిరుపతికి నూతన ట్రైన్ సర్వీసుల అవశ్యకత కూడా ఎంతో ఉందని తెలిపిన రామ్మోహన్ నాయుడు.. వీటిపై కూడా దృష్టి సారించాలని కోరారు. అరకు రైలుకు మరిన్ని కోచ్ లను అనుసంధానం చెయ్యాలని కూడా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై త్వరలోనే ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇంకోవైపు ఇలాంటి సందర్భాల్లో శబరిమల లాంటి ప్రాంతాలకు అధికంగా ప్రత్యేక రైళ్ళను నడపాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల పరిధిలో ఉన్న ఛాలెంజింగ్ డివిజన్ లో అద్భుతమైన పనితీరును రైల్వే అధికారులు కనబరుస్తున్నారని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు.. ప్రధాని మోదీ సహకారంతో మరింత వేగంగా రైల్వే వ్యవస్థ దేశంలో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ను ఐకానిక్ స్టేషన్ గా తీర్చిదిద్దాలని.. ఇప్పటికే 492.69కోట్ల కేటాయింపులు అభివృద్ధి కోసం జరిగినట్టు గుర్తు చేశారు. అతి త్వరలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయనగరం రైల్వే స్టేషన్ పై కూడా కనెక్టివిటీ రద్దీ పెరిగే అవకాశం ఉందని, ఆ దిశగా విజయనగరం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరిచాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, పార్లమెంట్ సభ్యులైన సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, గుమ్మ తనూజ రాణి, సప్తగిరి శంకర్ ఉలక, మహేష్ కశ్యప్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కార్యకర్తలకు బీమా పత్రాలు అందజేసిన గంటా*

*కార్యకర్తలకు బీమా పత్రాలు అందజేసిన గంటా* *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:-, పద్మనాభం మండలాల్లో ప్రమాదవశాత్తు మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ తరపున బీమా పత్రాలు అందించారు. ఈమేరకు మంజూరైన రూ.15 లక్షల పత్రాలను మంగళవారం ఎం.వి.పి. కాలనీలోని క్యాంప్ ఆఫీస్ లో అందజేశారు. ఆనందపురం మండలం శిర్లపాలెం గ్రామానికి చెందిన కోరాడ సత్యవతి, వేములవలసకు చెందిన గెడ్డం సావిత్రి, పద్మనాభం మండలం బాందేవపురం గ్రామానికి చెందిన పొట్నూరు పైడిరాజు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా పత్రాలను ఇచ్చారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా నిలబడుతుందని తెలిపారు. ప్రపంచంలోనే కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ టీడీపీ మాత్రమేనని అన్నారు. కార్యక్రమంలో నాయకులు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, బి.ఆర్.బి. నాయుడు, గండ్రెడ్డి రమేష్, సాగి కృష్ణమూర్తి రాజు, కాళ్ల సత్యనారాయణ, బంగారు నాయుడు, అప్పలనాయుడు, అంగటి రాము, బమ్మిడి తారక్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ లోని కాకాని వెంకటరత్నం కళాశాలలో ఘన ఫ్రెషర్స్ డే కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ లోని కాకాని వెంకటరత్నంకళాశాలలో ఈరోజు ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించబడింది. ఈ ప్రత్యేక సందర్భంలో ఏర్పాటు చేసిన సభకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాయప్ప అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ ప్రసంగం లో, కొత్త విద్యార్థినీ విద్యార్థుల ను ఉద్దేశించి, “ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యంత విలువైన కళాశాల”గా కాకాని వెంకట రత్నం కళాశాలను గుర్తిస్తూ, ఈ కళాశాలలో చదివిన చాలా మంది విద్యార్థులు వివిధ ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారని తెలిపారు. కళాశాలలో ఉన్న అన్ని సమగ్ర సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. అంతేకాక, జిల్లా లోని అతి పెద్ద లైబ్రరీ, జిమ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విభాగాలు లభ్యమని, వీటిని ఉపయోగిం చడం ద్వారా విద్యార్థులు సులభంగా ఉద్యోగ అవకాశా లను పొందవచ్చనివివరించారు. అలాగే, అత్యంత నైపుణ్యం కలిగిన అధ్యాపకులు కళాశాల లో ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సభలో, కళాశాల లోని వివిధ విభాగాల అధ్యాప కులు మరియు విద్యార్థులు క్రమశిక్షణ, విద్యా విషయాలపై వివరాలు ఇచ్చారు. విద్యార్థులు క్రమపద్ధతిగా కళాశాలకు హాజరు కావడం, సబ్జెక్టులు సమయానికి పూర్తి చేయడం, అంకితభావంతో సామాజిక సంక్షేమానికి పాటుపడే విధంగా విద్యను అభ్యసించడం అవసర మని స్పష్టంగా సూచించారు. ప్రిన్సిపల్ విద్యార్జనతోపాటు విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, నైతిక విలువలను పాటిస్తూ, అసాంఘిక కార్యకలాపాల నుండి దూరంగా ఉండి కళాశాల పేరు మరియు తల్లిదండ్రుల ఆకాంక్షలను నిలబెట్టాలనని సూచించారు.భోజనానంతరం, విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అదరగొట్టారు. అలాగే ఈ కార్యక్రమంలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫేర్వెల్ కూడా నిర్వహించబడింది. ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు, కళా శాల వదిలి బయలుదేరే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు: తెలుగు శాఖ అధ్యక్షులు: డాక్టర్ చాట్ల కిషోర్ ఇంగ్లీష్ శాఖ అధ్యక్షులు: పాల్ బాబు, వాసుదేవరావు రసాయన శాస్త్ర విభాగాధ్యక్షులు: ఎం.ఎం.వి.వై. స్వామి వాణిజ్య శాస్త్ర విభాగాధ్యక్షులు: డాక్టర్ కొండ్రు రమేష్ బాబు భౌతిక శాస్త్ర శాఖ అధ్యక్షులు: డాక్టర్ పులి రజనీకాంత్ ఇంకా కిషోర్ బాబు, అప్పా రెడ్డి, మధుసూదన్ రావు క్రమవద్ధంగా సాగిన ఈ కార్యక్ర మం, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో ముగిసింది.

జనగాం

(CFLs) కౌన్సెలర్‌ల కోసం రిఫ్రెషింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ సొసైటీ (VIDS)చే నిర్వహించబడిన కేంద్రాల కోసం ఆర్థిక అక్షరాస్యత (CFLs) కౌన్సెలర్‌ల కోసం రిఫ్రెషింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జనగాం జిల్లా పాలకుర్తిలో జరిగింది. ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల (CFLs) కౌన్సెలర్‌ల కోసం రిఫ్రెషింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ సొసైటీ (VIDS), ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కేంద్రంగా ఉన్న NGO, జనగాం జిల్లా, పాలకుర్తిలో, క్షేత్ర స్థాయి ఆర్థిక విద్యను బలోపేతం చేయడం మరియు ఆర్థిక చేరికలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రిజ్వాన్ బాషా షేక్, IAS, గౌరవనీయమైన జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్, జనగాం జిల్లా, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్.వి.వి.ఎస్.ఎన్. మూర్తి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (LDM), మరియు జిల్లా పరిపాలనలోని వివిధ శాఖల అధికారులు. లాంఛనంగా స్వాగతించడం మరియు పాల్గొనేవారికి ప్రముఖుల పరిచయంతో సెషన్ ప్రారంభమైంది. శ్రీ రిజ్వాన్ బాషా షేక్, IAS ప్రారంభోపన్యాసం చేశారు, ఇందులో భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ప్రాధాన్యతలలో ఒకటైన ఆర్థిక చేరిక యొక్క విస్తృత లక్ష్యాన్ని సాధించడంలో ఆర్థిక అక్షరాస్యత యొక్క కీలక పాత్రను నొక్కిచెప్పారు. తన ప్రసంగంలో, శ్రీ రిజ్వాన్ ఆర్థిక అవగాహన యొక్క అనేక క్లిష్టమైన అంశాలను హైలైట్ చేశారు, వాటితో సహా: భీమా మరియు పెన్షన్ కార్యక్రమాలు వంటి సామాజిక భద్రతా పథకాల యొక్క ప్రాముఖ్యత; సైబర్ మోసాల నివారణ మరియు డిజిటల్ భద్రతా అవగాహన కోసం పెరుగుతున్న అవసరం; డిజిటల్ బ్యాంకింగ్ స్వీకరణను ప్రోత్సహించడం, ముఖ్యంగా గ్రామీణ మరియు సెమీ-అర్బన్ జనాభాలో; సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగుల కోసం బ్యాంకింగ్ సేవల ప్రాప్యతను నిర్ధారించడం; ప్రజా విశ్వాసాన్ని పెంపొందించడానికి ఫిర్యాదుల పరిష్కార విధానాలను బలోపేతం చేయడం; మరియు క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి అవగాహన కల్పించడం మరియు నిజమైన లబ్ధిదారులకు అటువంటి నిధులను తిరిగి పొందడంలో సహాయపడటానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చొరవ. పౌరులకు అవగాహన కల్పించడం, ప్రాథమిక ఖాతాలను తెరవడం మరియు నిర్వహించడం, KYC ఫార్మాలిటీలను పూర్తి చేయడం మరియు వివిధ ప్రభుత్వ మరియు ఆర్థిక రంగ పథకాల ప్రయోజనాలను పొందేందుకు వారికి మార్గనిర్దేశం చేయడం ద్వారా ఆర్థిక సమ్మేళన దృష్టిని సాధించడంలో CFL కౌన్సెలర్లు కీలకమైన సహాయకులు అని ఆయన నొక్కి చెప్పారు. ఆర్‌బిఐ సూచించిన మొత్తం 13 మాడ్యూల్స్‌తో తమను తాము పరిచయం చేసుకోవడం ద్వారా వారి పరిజ్ఞానాన్ని నిరంతరం అప్‌గ్రేడ్ చేయాలని మరియు సంఘం, ఆర్థిక సంస్థలు మరియు ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమర్థవంతమైన వారధిగా పని చేయాలని శ్రీ రిజ్వాన్ కౌన్సెలర్‌లను కోరారు. ఆర్థిక అవగాహన మరియు బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తన ద్వారా గ్రామీణ పౌరులను శక్తివంతం చేసే మిషన్‌లో చేరడానికి మరింత మంది వ్యక్తులను ప్రేరేపించి, ఉదాహరణగా నడిపించమని వారిని ప్రోత్సహించాడు. ఈ కార్యక్రమం ఇంటరాక్టివ్ సెషన్‌తో ముగిసింది, ఇక్కడ కౌన్సెలర్లు వారి ఫీల్డ్ అనుభవాలను పంచుకున్నారు మరియు అట్టడుగు స్థాయిలో ఆర్థిక అక్షరాస్యతను బలోపేతం చేయడానికి వినూత్న పద్ధతులను చర్చించారు. ఈ కార్యక్రమంలో VIDS ప్రాజెక్టు డైరెక్టర్ పార్థ సారథి రెడ్డి,VIDS ఏరియా కోఆర్డినేటర్ దయాకర్, ప్రదీప్, క్లస్టర్ కోఆర్డినేటర్ సంతోష్, రాజశేఖర్, నాగరాజు, గంగాధర్ VIDS కౌన్సిలర్స్ పాల్గొన్నారు….

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

షార్ట్ సర్క్యూట్ తో తాటాకు ఇల్లు దగ్దం

సఖినేటిపల్లి నవంబర్ 4 పున్నమి ప్రతినిధి మంగళవారం రాత్రి సఖినేటిపల్లి మండలం గొంది జై భీమ్ నగర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక తాటాకు ఇల్లు దగ్ధమైంది. స్థానికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి, ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ { AITUC అనుబంధం }*

*ఆంధ్రప్రదేశ్ వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ { AITUC అనుబంధం }* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* మధురవాడ జోన్ సిపిఐ కార్యాలయం పక్క రోడ్ నగర పాలెం వెళ్లే రోడ్డు జంక్షన్ వీధివిక్రయదారుల యూనియన్ స్థానిక కమిటీ సమీపన ముఖ్య కార్యకర్తల సమావేశం రాంపల్లి సన్యాసమ్మ .కనితి కనకమహాలక్ష్మి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు గారు పాల్గొని మాట్లాడుతూ మధురవాడ జోన్ సమావేశాలు జరగాలని వీధివిక్రయదారులకు పిలుపునివ్వడం జరిగింది వీధివిక్రయదారుల చట్టంలో 39 సెక్షన్లు 18 సౌకర్యాలు తో కూడి హాక్కులు ఉన్న ఒక విలువైన చట్టం జీ.వీ.ఎం.సీ అధికారి యంతరంగం అమలు చేయడంలో విఫలమయ్యారు పోరాటాల ద్వారా హాక్కులు సాధించుకోవాలని చెప్పండి జరిగింది నేడు గౌ!! రాష్ట్ర హైకోర్టులో ఉన్నతమైన ఏదైతే ఉందో దాన్ని జిల్లా అధికారి యంతరంగం కోర్టువారిచ్చిన ఆదేశాలను వీధివిక్రయదారుల అమల చేయడంలో ఎంత రంగం తప్పుదో పెట్టించింది ఉన్నతమైన ఆదేశాలని కోర్టు వారిచ్చిన హక్కులు కాపాడు కోవడం అందుకు అధికారుల వారుతో మన యూనియన్ నుంచి జాయింట్ సమావేశాలు వెయ్యాలి అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మధురవాడ ఏరియా యూనియన్ఆర్గనైజర్ వీ.సత్యనారాయణ జోన్ నాయకులు రాజకీయ రాజగిరి రమణ స్థానిక కమిటీ చిన్నారి.ఎన్ నర్సింగరావు.జి మహాలక్ష్మి లలిత దేవి రమాదేవి. రేవతి .కొండమ్మ. వీ రూపా పెద్ద ఎత్తున వీధి విక్రయదారులు పాల్గొన్నారు

విశాఖపట్నం

దక్షిణంలో దిగ్విజయంగా కోటి సంతకాల సేకరణ

దక్షిణంలో దిగ్విజయంగా కోటి సంతకాల సేకరణ * ఐదు వార్డుల నివేదికను వాసుపల్లికి అందజేసిన వార్డు అధ్యక్షులు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దక్షిణంలో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు 27, 29, 31, 33, 34 వార్డులలో పూర్తి చేసిన కోటి సంతకాల నివేదికను ఆయా వార్డుల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కలిస్ మాజీ ఎమ్మెల్యే, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పరిరక్షించాలంటూ స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో భాగస్వాములు అవుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజా ఉద్యమానికి గురికాక తప్పదని హెచ్చరించారు. భవిష్యత్తు తరాల కోసం జగనన్న వేసిన వంతెనే ఈ 17కాలేజీల నిర్మాణం అన్నారు. కానీ చంద్రబాబు పేదలు ఉన్నత చదువులు అభ్యసించ కూడదని, పేద వాళ్ళు పేద వాళ్లుగానే మిగిలిపోవాలనన్న కుట్ర ను వైఎస్సార్సీపీ తిప్పి కొడుతుందన్నారు. దక్షణ నియోజక వర్గంలో మిగిలిన 9 వార్డుల సంతకాల సేకరణ త్వరగా పూర్తి చేసి అధిష్టానం కి అందజేస్తామని వాసుపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగం ఛైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు, దక్షిణ వైఎస్ఆర్సిపి వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అమరావతి

అమల్లోకి వచ్చిన ఏపీ షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ సవరణ చట్టం*

*అమల్లోకి వచ్చిన ఏపీ షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ సవరణ చట్టం* అమరావతి:- *రాత్రి సమయాల్లో పనిచేసేందుకు మహిళలకు అనుమతి.* ఏపీ షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ సవరణ చట్టం అమలుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ చట్టం సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. వారానికి 48 గంటల పని విధానాన్ని కొనసాగిస్తూనే కార్మికుల రోజువారీ పని గంటలను 8 నుంచి 10కి పెంచారు. ప్రస్తుతం వారానికి 14గంటలు ఓవర్ టైం ఉండగా.. దీన్ని మూడు నెలలకు 144 గంటలుగా నిర్ణయించారు. రాత్రి సమయాల్లో పని చేసేందుకు మహిళలకు అనుమతించారు. మహిళా సిబ్బంది సమ్మతితో రాత్రి 8గంటల నుంచి ఉదయం 6గంటల వరకు పనికి అనుమతించేలా చట్ట సవరణ చేశారు. రాత్రి విధుల్లో వారికి అన్నిరకాల సదుపాయాలు కల్పించాలి. 20 మంది లోపు సిబ్బంది ఉన్న సంస్థలకు కొన్ని రిజిస్టర్ల నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చారు. సిబ్బంది రిజిస్ట్రేషన్, రెన్యూవల్, సెలవులు, తొలగింపు లాంటి రిజిస్టర్లను మాత్రం తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.

విశాఖపట్నం

భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్*

*భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్* *విశాఖ‌ప‌ట్ట‌ణం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * ఈ నెల 14, 15వ తేదీల్లో ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల మైదానంలో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ స్థాయి భాగస్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ప‌రిశీలించారు. జేసీ కె. మ‌యూర్ అశోక్ తో క‌లిసి మంగ‌ళ‌వారం ఉద‌యం వేదిక వ‌ద్ద‌కు వెళ్లిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. ఏర్పాట్ల‌పై సంబంధిత అధికారుల‌తో స‌మీక్షించి త‌గిన సూచ‌న‌లు చేశారు. గ్రౌండ్ లెవెలింగ్, జంగిల్ క్లియ‌రెన్స్, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, పార్కింగ్ వస‌తి, ప్ర‌వేశ ద్వారాలు, సుంద‌రీక‌ర‌ణ, డ్రెయిన్ల నిర్వ‌హ‌ణ‌ త‌దిత‌ర ఏర్పాట్ల‌పై అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. అంద‌రూ స‌మన్వ‌యం వ‌హించుకొని ప‌టిష్ఠ ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.

విశాఖపట్నం

విశాఖపట్నం లో జరిగిన వాల్తేర్ డివిజన్ పార్లమెంట్ సభ్యుల కమిటీ సమావేశం*

*విశాఖపట్నం లో జరిగిన వాల్తేర్ డివిజన్ పార్లమెంట్ సభ్యుల కమిటీ సమావేశం* *రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణే లక్ష్యం అని తెలిపిన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పార్లమెంట్ సభ్యుల కమిటీ సమావేశంమంగళవారం విశాఖపట్నం నోవోటల్ హోటల్ నందు జరిగింది.ఈ సమావేశానికి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ గారు ప్రధానంగా హాజరై మాట్లాడారు.సివిల్ ఏవియేషన్ శాఖా కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామమోహన్ నాయుడు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ పర్మేశ్వర్ ఫంక్వాల్, డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) శ్రీ ఈ. సంతరాం,అలాగే ఎంపీలు మరియు అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పది మంది గౌరవ సభ్యులు పాల్గొన్నారు.వారిలో రాజ్యసభ సభ్యులు శ్రీ గోల్ల బాబురావు, అరకు ఎంపీ డా. జి. తనుజా రాణి,విజయనగరం ఎంపీ శ్రీ కే. అప్పాలనాయుడు, కొరాపుట్ ఎంపీ శ్రీ సప్తగిరి శంకర్ ఉలక,బస్తర్ ఎంపీ శ్రీ మహేశ్ కాశ్యప్ గారు పాల్గొన్నారు. సమావేశంలో చైర్మన్ సి.ఎం. రమేష్ గారు మాట్లాడుతూ “వాల్తేర్ డివిజన్ పరిధిలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ, సేవల ప్రమాణం పెంపు అత్యంత అవసరం. కొత్త రైళ్లు, పెరిగిన డిమాండ్‌కి అనుగుణంగా ఫ్రీక్వెన్సీ పెంపు, స్టేషన్‌ల ఆధునికీకరణ, బ్రిడ్జ్‌లు, లైన్ల విస్తరణ వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకోవాలి. అభివృద్ధి పనులు సమయానికి పూర్తవుతూ ప్రజలకు నేరుగా ఉపయోగపడేలా ఉండాలి” అని తెలిపారు.అలాగే ఆయన, వాల్తేర్ డివిజన్ పరిధిలోని అనకాపల్లి, విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల్లో అమృత్ భారత్ స్టేషన్లు, నూతన లైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు (ROBs), రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు (RUBs) వంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఎంపీలు అందరూ రైల్వే అభివృద్ధి పట్ల తమ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వాల్తేర్ డివిజన్ ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అభినందిస్తూ, కొత్త సర్వీసులు ప్రారంభించడం, సౌకర్యాల పెంపు వంటి అంశాలపై చర్చించారు. *సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు* * అమృత్ భారత్ స్టేషన్‌ల నిర్మాణం* * అరకు, కొరాపుట్, జగదల్పూర్, రాయగడ, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి కొత్త రైలు సర్వీసుల ప్రారంభం * చెన్నై, బెంగళూరు, తిరుపతి వంటి నగరాలకు రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు * ఉన్న సర్వీసుల పొడిగింపు, కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, ఫోర్త్ లైన్ ప్రాజెక్టులు * కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు (ROBs), రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు (RUBs) నిర్మాణం సమావేశంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ పర్మేశ్వర్ ఫంక్వాల్ గారు రైల్వే పనితీరు, అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రయాణికుల సేవల మెరుగుదలపై సమగ్ర వివరణ ఇచ్చారు. డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా గారు డివిజన్ అభివృద్ధి కార్యకలాపాలు, ఆర్థిక సంవత్సరం ప్రగతి, అమృత్ భారత్ స్టేషన్ల పురోగతిపై వివరించారు.ఎంపీల సూచనలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని త్వరితగతిన అమలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.