Saturday, 4 April 2026

Blog

E-పేపర్

పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

నంద్యాల జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS గల పాణ్యం పోలీస్ స్టేషన్ మరియు స్టేషన్ పరిధిలోని శాంతిరాం మరియు ఆర్జీఎం కళాశాల పరిసర ప్రాంతాలు, బలపనూరు గ్రామం మరియు పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు (బ్లాక్ స్పాట్స్) మరియు నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న పలు వెంచర్లు ఆకస్మికంగా సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పాణ్యం పోలీస్ అధికారులతో మాట్లాడుతూ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని చట్టపరిధిలో పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని హైవే అథారిటీ వారితో మాట్లాడి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరికే ప్రవేశాలలో (బ్లాక్ స్పాట్స్ ) వాహనాల వేగాన్ని నియంత్రించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నేరాలకు జరిగేందుకు అవకాశం ఉన్న వివిధ వెంచర్లను సందర్శించి నేరాలను నియంత్రించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి పలు సూచనలు చేయడం జరిగింది సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గ్రామాలలో ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా తీసుకునే శరీరం భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు.

Blog

నంద్యాల డివిజన్ స్థాయి బాలుర ఆటల పోటీల ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్

నంద్యాల నూనెపల్లె పురపాలక ఉన్నత పాఠశాల నందు ఎస్.జి.ఎఫ్ నంద్యాల డివిజన్ స్థాయి బాలుర ఆటల పోటీల ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహింపబడ్డాయి. పాఠశాల హెడ్మాస్టర్ ఏవీఎస్ చలపతి అధ్యక్షతన నంద్యాల జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి ఆశాజ్యోతి , డివిజన్ కార్యదర్శి వి శివకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడ్డాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి స్వతహాగా తను క్రీడాకారుడని నంద్యాలలో జరిగే ప్రతి ఆటల పోటీలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు, నంద్యాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కు రోడ్ మ్యాప్ తయారైందని త్వరలోనే దానిని అమలు చేస్తామని తెలియజేశారు, స్థానిక మున్సిపల్ పాఠశాలకు క్రీడా మైదాన అభ్యున్నతికి వెంటనే స్థానిక మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి డ్రైనేజీ వ్యవస్థను తక్షణం కల్పించాలని తెలియజేస్తూ క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో దాదాపుగా నంద్యాల డివిజన్లోని 13 మండలాల నుండి 700 మంది బాలురు పాల్గొన్నారు అని డివిజన్ కార్యదర్శి వి. శివ కుమార్ తెలియజేశారు అండర్ 14, అండర్ 17 బాలికల వాలీబాల్, కోకో, కబడి మరియు అథ్లెటిక్స్ నందు ఎంపికలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీకాంత్ నాయుడు, షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) , వ్యాపాధ్యాయ సంఘం కార్యదర్శి బత్తుల రవి వ్యాయామ ఉపాధ్యాయులు ముజహిద్, శ్వేత బయ్, శ్రీనివాసరెడ్డి, బాబు, విజయ్ భరత్, రవి, రాణెమ్మ, శశికళ, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

ఆంధ్రప్రదేశ్

స్వదేశీ వస్తువులనే వాడుదాం: బీజేపీ నేత బీఎస్ మూర్తి

ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అయినవిల్లి మండలం బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ అధ్యక్షతన మంగళవారం ముక్తేశ్వరం పార్టీ బీజేపీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా బీజేపీ అమలాపురం నియోజకవర్గ పూర్వపు కన్వీనర్ అయినవిల్లి మండల ఇంచార్జి బీఎస్ మూర్తి పాల్గొన్నారు. ముందుగా ఆత్మ నిర్భర భారత్ సంకల్ప అభియాన్ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రతీ ఇంట స్వదేశీ ఇంటింటా స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్బర్ భారత్ సంకల్ప అభియాన్ లో గ్రామాలు పేదలు అన్నదాతలు మహిళలు మరియు యువత ద్వారానే స్వాలంబన భారత్ సిద్ధిస్తుందని అన్నారు. అనంతరం మండల కమిటీ బూత్ కమిటీ శక్తి కమిటీలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయినవిల్లి మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ మాట్లాడుతూ స్వదేశీ వస్తువులను వాడడం ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్రాభివృద్ధికి పునాది వేయడం జరుగుతుందని, విదేశీ వస్తువులను బహిష్కరిద్దాం అని అన్నారు. అనంతరం మండల ఇన్చార్జిగా నియమితులైన బీఎస్ మూర్తి ని శాలువా తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మహిళా మోర్చా స్పెషల్ ఇన్వైట్ యనమదల రాజ్యలక్ష్మి, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొప్పనాతి శ్రీరామచంద్ర మూర్తి, యువమోర్చా నాయకులు భరత్ శ్రీ వర్మ, జిల్లా ఓబీసీ నాయకులు మరియు పీఏసీఎస్ డైరెక్టర్ మిద్దె రవి రాజ్, మండల ప్రధాన కార్యదర్శి మొగలి దుర్గారావు, మండల సీనియర్ నాయకులు ముద్రగడ రామకృష్ణ, ముసిని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ న‌గ‌రంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విద్యాధరపురం స్టేడియం, మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వ‌హించేందుకు వీలుగా ఆధునీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టే కార్య‌క్ర‌మానికి సంబంధించిన స‌మీక్షా సమావేశం

విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో జ‌రిగిన ఈ స‌మీక్షా స‌మావేశంలో కమిషనర్ ధ్యానచంద్ర, శాప్ చైర్మన్ ఏ. రవి నాయుడు, యం.డి ఎస్ భరణి ల‌తో పాటు ఇతర అధికారుల‌తో క‌లిసి పాల్గొన్నాను. న‌గ‌రంలోని క్రీడా ప్రాంగణాలను జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చ‌ర్చించ‌టం జ‌రిగింది. స్టేడియాల‌ పునరుద్ధరణకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రతిపాదనలు, ఆధునిక సదుపాయాల ఏర్పాటు, క్రీడాకారులకు అవసరమైన వసతుల విస్తరణ, స్థానిక క్రీడా కార్యకలాపాల ప్రోత్సాహంపై విస్తృతంగా స‌మీక్షించాము. న‌గ‌ర‌వాసుల‌తో పాటు క్రీడాకారుల‌కు మెరుగైన క్రీడా వసతులు అందించడానికి విజయవాడను రాష్ట్రంలోని ప్రముఖ క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాము. ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ పి.సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీనాధ్, ల‌తో పాటు శాప్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు…

విశాఖపట్నం

పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రాస్నానాలు చేసే భక్తులకు విన్నపం

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రాస్నానాలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని బంగాళాఖాతం బీచ్ లకు చాలా మంది భక్తులు, సందర్శకులు వచ్చే సందర్భంగా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఇంచార్జి ఉన్నత అధికారి మరియు విశాఖపట్నం రేంజ్ డిఐజి గారు అయిన శ్రీ గోపినాథ్ జట్టి, ఐ.పి.ఎస్ గారు రాష్ట్ర వ్యాప్త మెరైన్ పోలీస్ అధికారులందరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా జరుగుటకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మెరైన్ పోలీస్ అధికారులు అందరూ వారి వారి సిబ్బందితో రేపు తెల్లవారుజామున 3 గంటల నుండే తమ తమ బీచులలో బందోబస్తు విధులలో ఉండాలని, అన్నిరకాల ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని, భక్తులకు, సందర్శకులకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా తగిన అన్ని చర్యలు తీసుకోవాలని, అలాగే స్థానిక పోలీసు శాఖ, రెవిన్యూ శాఖ, మత్స్యకార శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక మత్స్యకారులు, స్వచ్చంద సంస్థలు మొదలైన వారు అందరితో మంచిగా అనుసంధానం చేసుకొని భక్తులు, సందర్శకులు అందరికీ ఎలాంటి అసౌకర్యం, ప్రమాదం కలుగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే భక్తులు, సందర్శకులకు కూడా క్రింది సలహాలు, సూచనలను ఇవ్వడం జరిగింది. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చే సందర్శకులకు మెరైన్ పోలీసు వారి విజ్ఞప్తి* 1. సందర్శకులు పోలీసు వారి సూచనలను తప్పకుండా పాటించి, ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలి. 2. పోలీసులు విధుల్లో ఉన్న ప్రదేశంలో, వారి సూచనలను అనుసరించి మాత్రమే సముద్ర స్నానాలకు దిగాలి; ఎక్కువ దూరం లోపలకు పోకుండా, అలలకు ఎదురు పోకుండా జాగ్రత వహించాలి. 3. ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావం వల్ల సముద్రంలో కొన్ని చోట్ల గుంతలు ఏర్పడి దిగబడే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సముద్రం బయటకు ప్రశాంతంగా ఉన్నట్లు కన్పిస్తుంది. కానీ లోపల చాలా ప్రమాదకర గుంతలు, సుడిగుండాలు ఉండవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 4. చిన్న పిల్లలను అన్ని సమయంలో మీ దగ్గర ఉంచుకొని మాత్రమే స్నానాలు చేయచేయించాలి మరియు ఒడ్డుకు తీసుకొచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. 5. స్నానాల సమయంలో మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. 6. సముద్ర తీర ప్రాంతంలో మద్యం సేవించడం, గందరగోళం సృష్టించడం లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయకూడదు. 7. ఎవరైనా ప్రమాదంలో పడ్డారు అనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న మెరైన్ పోలీస్ సిబ్బంది లేదా లైఫ్ గార్డులకు తెలియజేయాలి. 8. సముద్ర అలలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు స్నానాలకు దిగకూడదు. 9. బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు మరియు పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ సూచనలు తప్పకుండా పాటించాలి. 10. వృద్ధులు, గర్భిణి స్త్రీలు మరియు చిన్న పిల్లలు సముద్రంలో లోతుగా దిగకూడరు. 11. ఏదైనా అనుమానాస్పద వస్తువు, వ్యక్తి లేదా పరిణామం గమనించిన, వెంటనే మెరైన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌ 1093 కు సమాచారం ఇవ్వాలి. 12. మీ వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలిపి ఉంచాలి. 13. ఫోటో లేదా వీడియో తీసేటప్పుడు సముద్రానికి అత్యంత దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్త పడాలి. 14. సముద్ర స్నానానికి వెళ్ళే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అనారోగ్యంగా ఉంటే స్నానానికి దిగరాదు. 15. వర్షాకాలం లేదా తుఫాను హెచ్చరికలు ఉన్నపుడు వెంటనే బీచ్ ఖాళీ చేయాలి. 16. సముద్ర తీరానికి వచ్చే సందర్శకులు ఎప్పుడూ తమ కుటుంబ సభ్యులు/స్నేహితులతో సమూహంగా కలిసి ఉండాలి; దూరంగా ఉండకూడదు. 17. మీ భద్రత కోసం మెరైన్ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు లేదా హెచ్చరిక రోపులను దాటి వెళ్లకూడదు. 18. బీచ్ వద్ద తప్పిపోయిన వ్యక్తులు లేదా పిల్లలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి. 19. బీచ్ వద్ద అతి శబ్దకరమైన స్పీకర్లు, డీజే మొదలైనవి వినియోగించకూడదు. 20. సాయంత్రం 6 గంటల తర్వాత సముద్ర స్నానాలకు దిగకూడదు. 21. సముద్రంలో ఈత కొట్టడం, బోట్లు లేదా ట్యూబులు వినియోగించడం ప్రమాదకరం. 22. ఏదైనా గాయపడిన వ్యక్తి లేదా అత్యవసర పరిస్థితి అయితే వెంటనే 100 లేదా మెరైన్ పోలీస్ హెల్ప్‌లైన్‌ 1093 కు కాల్ చేయండి.

విశాఖపట్నం

విశాఖపట్నం లో జరిగిన వాల్తేర్ డివిజన్ పార్లమెంట్ సభ్యుల కమిటీ సమావేశం*

*విశాఖపట్నం లో జరిగిన వాల్తేర్ డివిజన్ పార్లమెంట్ సభ్యుల కమిటీ సమావేశం* *రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణే లక్ష్యం అని తెలిపిన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పార్లమెంట్ సభ్యుల కమిటీ సమావేశంమంగళవారం విశాఖపట్నం నోవోటల్ హోటల్ నందు జరిగింది.ఈ సమావేశానికి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ గారు ప్రధానంగా హాజరై మాట్లాడారు.సివిల్ ఏవియేషన్ శాఖా కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామమోహన్ నాయుడు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ పర్మేశ్వర్ ఫంక్వాల్, డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) శ్రీ ఈ. సంతరాం,అలాగే ఎంపీలు మరియు అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పది మంది గౌరవ సభ్యులు పాల్గొన్నారు.వారిలో రాజ్యసభ సభ్యులు శ్రీ గోల్ల బాబురావు, అరకు ఎంపీ డా. జి. తనుజా రాణి,విజయనగరం ఎంపీ శ్రీ కే. అప్పాలనాయుడు, కొరాపుట్ ఎంపీ శ్రీ సప్తగిరి శంకర్ ఉలక,బస్తర్ ఎంపీ శ్రీ మహేశ్ కాశ్యప్ గారు పాల్గొన్నారు. సమావేశంలో చైర్మన్ సి.ఎం. రమేష్ గారు మాట్లాడుతూ “వాల్తేర్ డివిజన్ పరిధిలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ, సేవల ప్రమాణం పెంపు అత్యంత అవసరం. కొత్త రైళ్లు, పెరిగిన డిమాండ్‌కి అనుగుణంగా ఫ్రీక్వెన్సీ పెంపు, స్టేషన్‌ల ఆధునికీకరణ, బ్రిడ్జ్‌లు, లైన్ల విస్తరణ వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకోవాలి. అభివృద్ధి పనులు సమయానికి పూర్తవుతూ ప్రజలకు నేరుగా ఉపయోగపడేలా ఉండాలి” అని తెలిపారు.అలాగే ఆయన, వాల్తేర్ డివిజన్ పరిధిలోని అనకాపల్లి, విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల్లో అమృత్ భారత్ స్టేషన్లు, నూతన లైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు (ROBs), రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు (RUBs) వంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఎంపీలు అందరూ రైల్వే అభివృద్ధి పట్ల తమ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వాల్తేర్ డివిజన్ ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అభినందిస్తూ, కొత్త సర్వీసులు ప్రారంభించడం, సౌకర్యాల పెంపు వంటి అంశాలపై చర్చించారు. *సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు* * అమృత్ భారత్ స్టేషన్‌ల నిర్మాణం* * అరకు, కొరాపుట్, జగదల్పూర్, రాయగడ, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి కొత్త రైలు సర్వీసుల ప్రారంభం * చెన్నై, బెంగళూరు, తిరుపతి వంటి నగరాలకు రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు * ఉన్న సర్వీసుల పొడిగింపు, కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, ఫోర్త్ లైన్ ప్రాజెక్టులు * కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు (ROBs), రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు (RUBs) నిర్మాణం సమావేశంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ పర్మేశ్వర్ ఫంక్వాల్ గారు రైల్వే పనితీరు, అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రయాణికుల సేవల మెరుగుదలపై సమగ్ర వివరణ ఇచ్చారు. డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా గారు డివిజన్ అభివృద్ధి కార్యకలాపాలు, ఆర్థిక సంవత్సరం ప్రగతి, అమృత్ భారత్ స్టేషన్ల పురోగతిపై వివరించారు.ఎంపీల సూచనలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని త్వరితగతిన అమలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

విశాఖపట్నం

మార్గశిర మాసోత్సవాల నిర్వహణా ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* *నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సన్నిధిలో జరిగే మార్గశిర మాసోత్సవాల నిర్వహణా ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులతో కలెక్టరేట్ మీటింగు హాలులో మంగళవారం సమీక్షించి సంబంధిత పోస్టర్ను ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్*

విశాఖపట్నం

కాంగ్రెస్ పై ప్రజల్లో అభిమానం చెక్కు చెదరలేదు : ప్రియాంక దండి*

*కాంగ్రెస్ పై ప్రజల్లో అభిమానం చెక్కు చెదరలేదు : ప్రియాంక దండి* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి మంగళవారం ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ” ఓట్ చోర్, గద్దె చోడ్ ” సంతకాల సేకరణ కార్యక్రమం చేసారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ రాహుల్ గాంధీ మీద యువతలో విశ్వాసం పెరిగిందని, యువత స్వచ్చందంగా వచ్చి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ వైపు యువత ఆకర్షతులవుతున్నారు, ఆంధ్ర విశ్వ విద్యాలయంలో త్వరలో ఎన్ ఎస్ యు ఐ కమిటీ వేస్తామని, ఓట్ చోర్ ఉద్యమానికి మంచి స్పందన వస్తోందని, కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని ఆమె అన్నారు, కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు జాన్ మాస్టర్ పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకప్పుడు కాంగ్రెస్ కంచు కోట అని మళ్లీ కంచు కోటగా తీర్చిదిద్దుతామని, కాంగ్రెస్ హయాంలోనే అందరికి యూనివర్సిటీలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని, ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగులు ఎప్పుడు కాంగ్రెస్ కి విశ్వాసంగా ఉంటారని,పార్టీకి మంచి రోజులు రాబోతునాయని, పాత కాంగ్రెస్ వాదులంతా మళ్లీ కాంగ్రెస్ జండా పట్టుకుంటారని ఆయన అన్నారు, కార్యక్రమంలో నాయకులు జగన్ మురారి, సూర్య, వార్డు అధ్యక్షులు వేమూరి సురేష్, గుర్రం కనకరాజు, భోగవరపు శ్రీనివాస్, ఈగల మోహన్ సాయి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

దక్షిణంలో దిగ్విజయంగా కోటి సంతకాల సేకరణ

దక్షిణంలో దిగ్విజయంగా కోటి సంతకాల సేకరణ * ఐదు వార్డుల నివేదికను వాసుపల్లికి అందజేసిన వార్డు అధ్యక్షులు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దక్షిణంలో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు 27, 29, 31, 33, 34 వార్డులలో పూర్తి చేసిన కోటి సంతకాల నివేదికను ఆయా వార్డుల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కలిస్ మాజీ ఎమ్మెల్యే, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పరిరక్షించాలంటూ స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో భాగస్వాములు అవుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజా ఉద్యమానికి గురికాక తప్పదని హెచ్చరించారు. భవిష్యత్తు తరాల కోసం జగనన్న వేసిన వంతెనే ఈ 17కాలేజీల నిర్మాణం అన్నారు. కానీ చంద్రబాబు పేదలు ఉన్నత చదువులు అభ్యసించ కూడదని, పేద వాళ్ళు పేద వాళ్లుగానే మిగిలిపోవాలనన్న కుట్ర ను వైఎస్సార్సీపీ తిప్పి కొడుతుందన్నారు. దక్షణ నియోజక వర్గంలో మిగిలిన 9 వార్డుల సంతకాల సేకరణ త్వరగా పూర్తి చేసి అధిష్టానం కి అందజేస్తామని వాసుపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగం ఛైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు, దక్షిణ వైఎస్ఆర్సిపి వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

శ్రీకాకుళం నుండి నేరుగా చర్లపల్లి కొత్త రైలు ఏర్పాటు చెయ్యాలి : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు*

*శ్రీకాకుళం నుండి నేరుగా చర్లపల్లి కొత్త రైలు ఏర్పాటు చెయ్యాలి : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ కమిటీ సమావేశంలో కేంద్ర పౌర విమానయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు, రైల్వే అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇటీవల చేపట్టిన పనుల పురోగతి, పార్లమెంట్ సభ్యులు ఇదివరకే చెప్పిన సమస్యలు, వాటి ప్రస్తుత స్థితి గురించి సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు కీలక సూచనలు చెయ్యగా.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. నూతన రైల్వే జోన్ గెజిట్ అంశాన్ని వేగవంతం చెయ్యాలని కోరిన రామ్మోహన్ నాయుడు.. డివిజన్ పరిధిలో స్పష్టమైన ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు నాణ్యతతో పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు. నిర్ధేశిత సమయంలోనే వాటిని పూర్తి చెయ్యాలని ఆదేశించారు. అమృత్ భారత్ స్టేషన్ లలో అభివృద్ధి పనులు ఆలస్యం పట్ల రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చెయ్యమని తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల లోగా.. స్థానిక పార్లమెంట్ సభ్యులతో కలసి రైల్వే అధికారులు అమృత్ భారత్ ప్రతిపాదిత స్టేషన్ లను సందర్శించాలని.. పురోగతిపై క్షేత్ర స్థాయి పరిశీలన చెయ్యాలని కోరారు. బ్రిటిష్ కాలం నాటి రైల్వే భవనాలు.. అమృత్ భారత్ పథకం ద్వారా పునరుద్ధరించుకునే అవకాశం ఉందని.. స్థానిక ఎంపీలను సమన్వయం చేసుకుంటూ వాల్తేర్ డివిజన్ లో పనులు వేగవంతం చెయ్యాలని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లకు, స్పోర్ట్స్ పర్సన్స్ కు టికెట్ ఛార్జీలు తగ్గింపు కోసం ఇప్పటికే అనేక వినతులు అందాయని.. సమావేశంలో కూడా ఇదే విషయం చర్చకు వచ్చిన నేపథ్యంలో.. తాను ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్లాట్ ఫాంల ఎత్తు పెంచే కార్యక్రమం సక్రమంగా, వేగంగా జరుగుతుందని ఆనందం వ్యక్తం చేసిన రామ్మోహన్ నాయుడు.. సబ్ వే ల నిర్మాణం కూడా వేగవంతం చెయ్యాలని స్పష్టం చేశారు. సబ్ వే లను నిర్మించే కాంట్రాక్టర్లు స్ధానికంగా జవాబుదారిగా ఉండకపోవడం సరైన విధానం కాదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి.. సబ్ వే ల నిర్మాణం లో నాణ్యతపై పలు ఆరోపణలు వస్తున్నట్టు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. నీటి నిల్వలు ఉండిపోవడం, పై నుండి వాటర్ లీకేజీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై దృష్టి సారించాలని కోరారు. ఇంకోవైపు తన పార్లమెంట్ పరిధిలో పలు సమస్యలను సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చేరు. కరోనా అనంతరం ఆగిపోయిన కామేశ్వరి పేట రిక్వెస్ట్ ట్రైన్ స్టాప్.. మళ్ళీ పునరుద్ధరించాలని.. ఇరవై ఐదు గ్రామాలను వీటి సేవలు కోల్పోయారని తెలిపారు. గునుపూరు తిరువల్లి రైల్వే లైన్ పనులు కూడా వేగవంతం చెయ్యాలని, టెక్కలిలో ఆర్.ఓ.బి అత్యంత అవసరమని గుర్తు చేసిన రామ్మోహన్ నాయుడు.. టెక్కలి పట్టణం మధ్యలో ఈ గేటు వల్ల ముప్పై, నలభై నిమిషాల వ్యయం పడుతోందని తెలిపారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ ను మరింతగా అభివృద్ధి చెయ్యాలని, లోడింగ్, అన్ లోడింగ్ సదుపాయాలను కల్పిస్తే అభివృద్ధికి మరింత వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో పాసింజర్ రైల్వే సర్వీసులలో సరైన సమయానికి స్టేషన్లకు చేరుకోవడం లేదనే సమస్య ప్రధానంగా వేధిస్తోందని.. దీన్ని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అలాగే పాసింజర్ రైళ్లలో నిబంధనలకు లోబడి స్టాప్స్ ను పెంచాలని తెలిపారు. శ్రీకాకుళం నుండి చర్లపల్లికి, శ్రీకాకుళం నుండి తిరుపతికి నూతన ట్రైన్ సర్వీసుల అవశ్యకత కూడా ఎంతో ఉందని తెలిపిన రామ్మోహన్ నాయుడు.. వీటిపై కూడా దృష్టి సారించాలని కోరారు. అరకు రైలుకు మరిన్ని కోచ్ లను అనుసంధానం చెయ్యాలని కూడా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై త్వరలోనే ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇంకోవైపు ఇలాంటి సందర్భాల్లో శబరిమల లాంటి ప్రాంతాలకు అధికంగా ప్రత్యేక రైళ్ళను నడపాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల పరిధిలో ఉన్న ఛాలెంజింగ్ డివిజన్ లో అద్భుతమైన పనితీరును రైల్వే అధికారులు కనబరుస్తున్నారని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు.. ప్రధాని మోదీ సహకారంతో మరింత వేగంగా రైల్వే వ్యవస్థ దేశంలో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ను ఐకానిక్ స్టేషన్ గా తీర్చిదిద్దాలని.. ఇప్పటికే 492.69కోట్ల కేటాయింపులు అభివృద్ధి కోసం జరిగినట్టు గుర్తు చేశారు. అతి త్వరలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయనగరం రైల్వే స్టేషన్ పై కూడా కనెక్టివిటీ రద్దీ పెరిగే అవకాశం ఉందని, ఆ దిశగా విజయనగరం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరిచాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, పార్లమెంట్ సభ్యులైన సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, గుమ్మ తనూజ రాణి, సప్తగిరి శంకర్ ఉలక, మహేష్ కశ్యప్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.