Saturday, 4 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

కార్తీక పౌర్ణమి దీపోత్సవం

నెల్లూరు నవాబుపేట పశివాలయం టెంపుల్ లో కార్తీక దీపోత్సవం అతి వైభవముగా ఈ వైభముగా జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు దీపాలు వెలిగించి జనసంచారంతో బాగా జరిగింది గుడి చైర్మన్ గారు ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగా చూశారు పున్నమి దినపత్రిక చైర్మన్ గారికి శుభాకాంక్షలు Video: https://youtu.be/HT8j8uOztXA?si=J-9JZCSDCCO1Qcyr

నిర్మల్

గోపాల్ రావు పటేల్ డిగ్రీ కళాశాల బైంసా ను సందర్శించిన సీపీడీసీ కమిటీ

నేడు గోపాల్‌రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సీపీడీసీ కమిటీ సందర్శించింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ బుచ్చయ్య గారు, కళాశాల అధ్యక్షులు డా. నాగేశ్ గారు, సభ్యులు మనోజ్ గారు, మోసీన్ ఖాన్ గారు, వైస్ ప్రిన్సిపాల్ డా. రఘునాథ్ గారు, డా. భీమ్రావ్ గారు, డా. గంగారెడ్డి గారు తదితర లెక్చరర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కళాశాల అధ్యక్షులు డా. నాగేశ్ గారు మరియు ప్రిన్సిపాల్ బుచ్చయ్య గారు మాట్లాడుతూ — ప్రస్తుతం ప్రభుత్వం కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం దాదాపు ₹90 లక్షల విలువైన ఫర్నీచర్ ను అందజేసిందని తెలిపారు. అదేవిధంగా ₹30 లక్షల విలువైన డిజిటల్ బోర్డులు ప్రతి తరగతిలో ఏర్పాటు చేయడం విశేషమని అన్నారు. మన కళాశాలలో ఐఐటీ స్థాయిలో విద్యార్థులకు అందే సదుపాయాలన్నీ ఏర్పాటు చేయబడినట్లు పేర్కొన్నారు. అత్యంత అర్హత కలిగిన Ph.D. లెక్చరర్లు విద్యార్థులకు బోధన అందిస్తున్నారని, త్వరలోనే పీజీ కోర్సులు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అధ్యక్షులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ – “విద్యార్థులు రెగ్యులర్‌గా తరగతులకు హాజరై, క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుకుని మంచి అభివృద్ధి సాధించాలి. రాబోయే తరానికి మీరు ప్రేరణగా నిలవాలి. మీ భవిష్యత్తు మా ఆశయమూ, అభిలాషయూ,” అని అన్నారు. చివరిగా సీపీడీసీ కమిటీ సభ్యులు కళాశాల అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు

విశాఖపట్నం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమం

49వ వార్డు బూత్ నెం.245 పరిధిలో స్థానిక నాయకులు నిర్వహించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, జి.వి.ఎమ్.సి. డిప్యూటీ ఫ్లోర్ లీడర్, 49వ వార్డు కార్పొరేటర్ అల్లో శంకర రావు పాల్గొన్నారు. శంకర రావు ప్రతి గడపకు వెళ్లి ప్రజల నుండి ప్రైవేటీకరణ వ్యతిరేక సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ — ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తోందని, దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్‌కు తెలియజేసే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ప్రైవేటీకరణ వల్ల పేద, బడుగు, బలహీన వర్గాలకు వైద్య విద్య అందుబాటులో లేకపోవడమే కాకుండా, ప్రజలకు చవకగా వైద్యం అందకపోవడం, వైద్య విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు, జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శి రొంగళి చంద్రమౌళి, జిల్లా విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పల్లా చైతన్య, వార్డు జనరల్ సెక్రటరీ జి. వెంకటరావు, సెక్రటరీ జె.డి. ప్రశాంత్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు రిసు చిన్నరావు, యూత్ అధ్యక్షుడు యిగలపాటి రాజేష్, బి.సి. అధ్యక్షుడు కూన డిల్లీ రావు, గ్రీవెన్స్ అధ్యక్షుడు బోర సూరిబాబు, ఐటీ విభాగం అధ్యక్షుడు అత్తిలి నరేంద్ర కుమార్ (నందు), బి.సి. పబ్లిసిటీ విభాగ అధ్యక్షురాలు సోమరపాటి కనకమహాలక్ష్మి, వార్డు ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు కొణాతల అరుణ, సీనియర్ నాయకులు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ

పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలన్న : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) వివిధ ప్రాజెక్టు ల కింద మిగిలిపోయిన భూసేకరణ పనులు, పునరవాస కాలనీల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె తన ఛాంబర్ లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల కింద భూసేకరణ, పునరావాస పనుల పై సమీక్ష నిర్వహించారు. ఎత్తిపోతల పథకాల కింద భూసేకరణ, అవార్డుల జారీ, అటవీ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం చెల్లింపులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ

విద్యార్థులకు సృజనాత్మకత అవసరం అన్న: జిల్లా కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి) విద్యార్థులకు అకాడమిక్ విద్యతోపాటు, ఒకేషనల్ కోర్సులు, సృజనాత్మక ఆవసరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలో, 9, 10 తరగతి చదువుతున్నా విద్యార్థులకు ఒకేషనల్ కోర్సులలో శిక్షణ ఇవ్వడంలో భాగంగా ముందుగా వాటిపై అవగాహన కల్పించి,అనంతరం సెట్విన్ ఆధ్వర్యంలో స్వల్పకాలిక వృత్తులపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని రాంనగర్ లో ఉన్న అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో ఒకేషనల్ ట్రైనింగ్ పై విద్యార్థినులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రంగారెడ్డి

లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

పున్నమి నవంబర్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం: లక్ష్మారెడ్డి పాలెం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. నిన్న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తి క్యాండర్ షైన్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎన్.హెచ్.65 హైవే రోడ్డు దాటుతుండగా, ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా అతడిని నీలాద్రి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.ఆ వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో, పోలీసులు గుర్తింపు కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఆ వ్యక్తిని గుర్తిస్తే, హయత్ నగర్ పోలీసు స్టేషన్ ను సంప్రదించవచ్చు.

హైదరాబాద్

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి కార్మిక చట్టాలతో బతుకుతున్న కార్మిక వర్గం బహుజన ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్

పున్నమి నవంబర్ 05 ప్రతినిధి దూపం అంజనేయులు రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ ప్రతి మంగళవారం తెలంగాణ ఆర్టీసీ రాణిగంజ్ డిపోలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ కార్మికుల తలరాతను మార్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం రోజున జ్ఞాన పూలమాల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది బహుజన కార్మికులు ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది227వారం పూలమాలము ఇప్పిచ్చినవారు మరియు జీవన్ శ్రామిక్, బహుజన ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్, యం గోపి మరియు వెయ్యడం జరిగినది వారం వారం ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాన పూలమాల వేయవచ్చును జై భీమ్ జై జై భీ మా తలరాతలు మార్చిన పూలమాల నివాళులు అర్పించారు.

Blog

నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచిత వైద్య సేవలు.

నంద్యాల పట్టణం రైతుబజార్ సమీపంలోని నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు నెరవాటి అరుణకుమారి,వినోద్ కుమార్ లు పేర్కొన్నారు.రైతుబజార్ సమీపంలో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు ఉచిత వైద్య శిబిరం లయన్స్ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు.ఈ వైద్యశిబిరం ప్రముఖ వైద్యులు వినోద్ కుమార్,అరుణకుమారి,సుమన్ కుమార్,ఫాతిమాభి,దేవేంద్ర నాయక్ లు పాల్గొంటారు.నంద్యాల పట్టణంలో ఎన్నో ఏళ్లుగా నెరవాటి ఆసుపత్రి వైద్యులు మంచిపేరు సంపాదించారు.ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు ఫీజులు రాయితీ ఇస్తూ మంచి వైద్యం అందిస్తున్నారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచివైద్యసేవలు అందించడంతో ఆసుపత్రి పెట్టిన కొద్ది రోజుల్లోనే మంచిపేరు సంపాదించుకున్నారు.వ్యాపారాల్లో నెరవాటి బ్రాండ్ ఎలా ప్రాచుర్యం పొందిందో అలాగే వైద్యసేవల్లో నెరవాటి వినోద్ కుమార్,అరుణకుమారి లు మంచిపేరు సంపాదించారు.గతంలో గాంధీ చౌక్ లో ఉన్న ఆసుపత్రిని అన్ని హంగులతో పద్మావతి నగర్ సమీపంలో రైతుబజార్ వద్ద నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటుచేశారు.గతంలో చెవి,ముక్కు,గొంతు కు సంబంధించిన వైద్య సేవలు,ప్రసూతి,స్త్రీ వ్యాధి వైద్యసేవలు అందుబాటులో ఉండేవి.ప్రస్తుతం నూతన ఆసుపత్రిలో మరో ప్రసూతి వైద్యురాలతో పాటు ఎముకలు,కీళ్ల వ్యాధి నిపుణులు ఫాతిమాభి,సుమన్ కుమారులు సైతం మంచి వైద్యం చేయడంతో మంచిపేరు సంపాదించుకున్నారు.నెరవాటి ఆసుపత్రిలో ఎందరో చెవి,ముక్కు సమస్యలు ఉన్నవారు పూర్తిగా జబ్బు నయమైందని చెపుతున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ఖరీదుగా మారిపోయింది.కొన్ని ఆసుపత్రుల్లో ఓపీ తో పాటు పరీక్షలు వేలకు వేలు తీసుకుంటున్న విషయం విదితమే.ఎంత సంపాదించినా పేదవారికి చేసే సేవలు మరచిపోలేనివని భావించి ప్రతి ఏటా నెరవాటి ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉచితంగా ఓపీ ,వినికిడి పరీక్షలు,ఎముకల పటిష్ట పరీక్షలు,ఉచిత మందులను పంపిణీ చేస్తున్నారు.వినికిడి మిషన్ కొనుగోలుపై 30 శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తున్నారు.నంద్యాల పట్టణ,గ్రామీణ ప్రాంత ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

E-పేపర్

శ్రీ కొత్తూరు సుబ్బరాయుని సన్నిధిలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి ఎం.జావళి ఆల్ఫోన్స్

నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి ఎం.జావళి ఆల్ఫోన్స్ ఐపిఎస్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో యం.రామక్రిష్ణ, ప్రధాన అర్చకులు కంపమల్ల సురేష్ శర్మ, నారాయణ స్వామి ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి వారికి అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వ మంటపం నందు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి ఎం.జావళి ఆల్ఫోన్స్ ఐపిఎస్ కి స్వామివారి కంకణ ధారణ, పూలమాలలు, శాలువలు, శేష వస్త్రములతో ఘనంగా సత్కరించి, ఆశీర్వదించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు మిలిటరీ సుబ్బారెడ్డి, పురుషోత్తం మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Blog

భారత హాకీ చరిత్ర- ధ్యాన్ చంద్ జీవితం” వ్యాసరచన పోటీలు

భారత హాకీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో మంగళవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో “భారత హాకీ చరిత్ర – ధ్యాన్ చంద్ జీవితం” అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు పోటీల ప్రారంభోత్సవ సందర్భంగా హాకీ ఆంధ్రప్రదేశ్ సంఘం అధ్యక్షులు చాణక్య రాజు,ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ జాతీయ క్రీడ అయిన హాకీ క్రీడపై విద్యార్థులలో, యువతలో ఆసక్తి పెంచి,హాకీ క్రీడకు ప్రాచుర్యం కల్పించడం కోసం హాకీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఏడవ తేదీ ఎస్పీజీ మైదానంలో జరిగే హాకీ శతాబ్ది ఉత్సవాలలో, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో బహుమతులు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్,నంద్యాల హాకీ సంఘం ఉపాధ్యక్షులు జెడ్ ఎస్పీ దివాకర్, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి పత్తి రంగనాథ్ పాల్గొన్నారు. *వ్యాస రచన పోటీ విజేతలు* గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన నాగ శ్వేత,యశస్విని రెడ్డి,కరిష్మా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించగా,స్పెషల్ జ్యూరీ బహుమతులకు మనస్వి,అర్చన ఎంపికయ్యారు గురువారం ఆరవ తేదీ ఆంగ్ల వక్తృత్వ పోటీలు హాకీ చరిత్ర – ధ్యాన్ చంద్ జీవితం అంశంపై ఆంగ్లంలో వక్తృత్వ పోటీలు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గురువారం ఆరవ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు. ఆసక్తి గల హైస్కూల్ విద్యార్థులు పోటీ సమయంలో నేరుగా వచ్చి పాల్గొనవచ్చు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.