Saturday, 4 April 2026

Blog

ఖమ్మం

కార్తిక పౌర్ణమి సందర్భంగా నింగిలో ప్రకాశవంతమైన చందమామ దర్శనం : శివ నామ స్మరణ తో మార్మోగిన శివాలయాలు:

పున్నమి ప్రతి నిధి: ఖమ్మం కార్తీక పౌర్ణమి పర్వదినం ని భక్తులు భక్తి శ్రద్ద లతో జరుపుకున్నారు. కార్తిక పౌర్ణమి వేళ నింగిలో చందమామ ప్రకాశవంతంగా దర్శనమిచ్చారు. పొద్దున్నుండి ఉపవాసం ఉన్న భక్తులు సాయంత్రం చందమామను దర్శించుకుని తమ ఉపవాసాన్ని విరమణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు శివాలయాల్లో దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణాల నుంచి గ్రామాల దాకా భక్తి వాతావరణం నెలకొంది.

విశాఖపట్నం

విపత్తులు, వైపరీత్యాల్లో చేతులెత్తేస్తున్న ప్రభుత్వం : మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- – విపత్తులు, వైపరీత్యాల్లో చేతులెత్తేస్తున్న ప్రభుత్వం : మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. – తుపాన్‌ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు – క్షేత్రస్ధాయిలో అంచనాలు కూడా వేయని ప్రభుత్వం – రూపాయి పరిహారం కూడా ప్రకటించని చంద్రబాబు – మరోవైపు ప్రతి వారం అప్పు. తాజాగా రూ.3 వేల కోట్లు – ఇప్పటి వరకు ఏకంగా రూ.2.27 లక్షల కోట్ల అప్పు – మరి తెస్తున్న ఆ అప్పు మొత్తం ఏమవుతోంది? : కూటమి ప్రభుత్వ తీరుపై బొత్స ఆగ్రహం – కాశీబుగ్గ దుర్ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత – ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఆలయంలో తొక్కిసలాట – శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే – కాశీబుగ్గ ఆలయం ప్రైవేటుదని ప్రభుత్వం కబుర్లు – దానిపై చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యలు దారుణం – ఆ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం రాష్ట్రంలో ఉంది – మరి భక్తుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిది కాదా? : సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ – విద్య, వైద్యం, వ్యవసాయం మా ప్రాధాన్యంశాలు – రైతు చేయి పెట్టేదిగా ఉండాలి. చేయి చాచే వాడిగా ఉండరాదు – ఇదే మా ప్రభుత్వ విధానం. ఆ దిశలోనే పని చేశాం – అందుకే విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలిచాం – రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం – మద్ధతు ధర కోసం రూ.7800 కోట్లు ఖర్చు చేశాం : ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ విశాఖపట్నం: ప్రజలు, రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది తలెత్తినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా చేతులెత్తేయం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాన్‌ ప్రభావంతో రైతులు నష్టపోతే, నష్టం అంచనాకు క్షేత్రస్ధాయిలో కనీసం పర్యటించలేదని ఆక్షేపించారు. పంటలు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి పరిహారం కూడా ప్రకటించలేదన్న ఆయన, తెస్తున్న అప్పంతా ఏమవుతోందని నిలదీశారు. కాశీబుగ్గ ఆలయ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమన్న బొత్స సత్యనారాయణ, శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..: ● రైతులకు అండగా వైయస్‌.జగన్‌ ప్రభుత్వం: అన్నం పెట్టే రైతన్న చేయి పెట్టేవాడిగా ఉండాలే తప్ప.. చేయి పట్టేవాడిగా ఉండదరాన్న స్వర్గీయ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆలోచనలే వైయస్సాస్‌ కాంగ్రెస్‌ పార్టీ విధానం. మా హయాంలో అదే తరహాలో రైతులకు అన్ని రకాలుగా అండగా ఉన్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి అడుగులో రైతుల చేయి పట్టించుకుని నడిపాం. విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు ఆర్బీకేలు రైతులకు తోడుగా నిలబడ్డాయి. ప్రతి ఎకరాకు పక్కాగా ఈ–క్రాప్‌ చేశాం. తద్వారా పంట పండించిన రైతులు అధిక వర్షాలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నష్టపోతే వారికి, ఆ సీజన్‌ ముగిసేలోగానే పరిహారం అందించే ఏర్పాటు చేశాం. ● ఇది విఫల ప్రభుత్వం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌ చెల్లించే విధానానికి స్వస్తి చెప్పి.. మరలా పూర్వపు పద్దతిలో పంట ఇన్సూరెన్స్‌ను రైతులే కట్టాలనే నిబంధన తీసుకొచ్చారు. ఒకవేళ రైతులు కట్టకపోతే వారిని ప్రోత్సహించి.. కట్టేలా చేయాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇవాళ తుపాన్‌ ప్రభావంతో అధిక వర్షాలు వల్ల రైతులు పంట నష్టపోయారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తుపాన్‌ ప్రభావం ఉంది. వరి, అరటి, ప్రత్తి, చెరకు, పూలతోటలు అన్ని రకాల రైతులు నష్ట పోయారు. వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులు మాటలు మాత్రమే చెబుతున్నారు. ఎక్కడా చేతలు కనిపించడం లేదు. పంట పొలాల్లో నుంచి నీరు పోయినా ఇప్పటి వరకూ పంట నష్టంపై ప్రకటన చెయ్యలేదు. నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇంత సాయం చేస్తామని భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ లేదు. రైతు శ్రేయస్సు గురించి ఆలోచించే మనస్సు ఈ ప్రభుత్వానికి లేదు. దీనిపై మాట్లాడితే మా మీద బురద జల్లుతున్నారు. ● ప్రశ్నిస్తూనే ఉంటాం: ప్రభుత్వం మాపై బురద చల్లినా మేం ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం. మా పరిపాలనలో గత ఐదేళ్లలో మేం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పుడూ అలాగే జరగాలని, రైతు నష్టపోకూడనన్నది మా విధానం. రైతులు కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు. మీరు కరపత్రాలు వేసి మరీ ఇచ్చిన హామీలనే ప్రశ్నిస్తున్నాం? రైతులకు మంచి చెయ్యండి. అది మానేసి విమర్శలు చేస్తే ఎలా?. ఇక ఎల్లో మీడియాను చూస్తుంటే నవ్వాలో ఏడాలో కూడా అర్ధం కావడం లేదు. చంద్రబాబు శక్తి ఉంటే తుపాన్‌ ను ఏపీ నుంచి దూరంగా విసిరికొట్టేవాడని మాట్లాడుతూ… చివరకు పాలనను అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో అధిక వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏ జిల్లాకు ఎంత నిధులిచ్చారు? రైతులకు ఏ మేరకు మేలు చేశారో ప్రభుత్వం ప్రకటించాలి. ఇన్సూరెన్స్‌ చేస్తే ఆ వివరాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తే ఆ వివరాలు వెల్లడించాలి? ● వ్యవసాయం, విద్య, వైద్యం మా ప్రాధాన్యతలు: వ్యవసాయం, విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు. అది మా పార్టీ విధానం. ఉచితంగా రైతుల ఇన్సూరెన్స్‌ ప్రభుత్వం కట్టాలనేది మా విధానం. కూటమి విధానం రైతులే ఇన్సూరెన్స్‌ కట్టుకోవాలి. ఏ వర్గానికి ఏమి వద్దు అనేది కూటమి విధానం. విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. అధికారం ఉంది కదా అని వైద్య విద్యను అమ్మేస్తామనడం సరికాదు. పేదవాడు వైద్యవిద్యను ఎలా అభ్యసిస్తాడు? ● కాశీబుగ్గ దుర్ఘటన ప్రభుత్వ వైఫల్యమే: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట అత్యంత దురదృష్టకరం. 15 నుంచి 20 వేల మంది భక్తులు వచ్చారు. కనీస పోలీసు భద్రత కల్పించలేదు. లా అండ్‌ ఆర్డర్‌ నిర్వహించే పరిస్థితి లేదు. ఇదేమని అడిగితే, ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతారాహిత్యంగా అది ప్రైవేట్‌ ఆలయం అంటున్నారు. ఇవేం మాటలు!. ఏకాదశి పర్వదినాన జనాలు పెద్ద ఎత్తున వస్తారన్న చోట రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వం కాదా? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతి, సింహాచలంలో ఇదే రకమైన ఘటనలు జరిగాయి. రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏమిటంటే, చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి ఘటనలే జరుగుతాయి. వైయస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో వైయస్‌.జగన్‌ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటన ఒక్కటైనా జరిగిందా? కారణం.. ఏ పండగలు, ప్రత్యేక సందర్భాలు వచ్చినా తగిన ముందస్తు ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టే ఇలాంటి ఘటనలు లేవు. ప్రజలు చనిపోయిన తర్వాత వచ్చి మాట్లాడుతున్నారు. ఇందుకేనా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది? ప్రజలు ఒకసారి ఓట్లేసి గెలిపించిన తర్వాత అందరికీ ముఖ్యమంత్రే. ఆ స్ధాయిలో ఉన్న వ్యక్తి అది ప్రైవేటు దేవాలయం అని మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం? తిరుపతి, సింహాచలంలో ఇలాంటి ఘటనలు జరిగితే వాటి నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఏదైనా నిర్దిష్ట విధానం (ఎస్‌ఓపీ) రూపొందించుకుందా? దాన్ని విడుదల చేసిందా?. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలి. అది కాకుండా రాష్ట్రంలో ఏం జరిగినా వైయస్సార్‌సీపీ వారిని ఎలా ఇరికించాలా అని ప్రభుత్వం పని చేస్తోంది. మొంథా తుపాన్‌లో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవడంతో పాటు, కాశీబుగ్గ దుర్ఘటనకు కారణాలు ఏంటో, బాధ్యులెవరో సమాధానం చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ● మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఎకరా ఇ–క్రాప్‌ చేయడంతో పాటు బీమా ప్రీమియం ప్రభుత్వం తరపున చెల్లించడంతో పాటు, రైతులు కట్టాల్సింది కూడా వారి తరపున మేమే చెల్లించాం. దాన్ని ఒక పాలసీగా రూపొందించాం. అది ఈ ప్రభుత్వంలో నిల్చిపోయింది. పొగాకు, మిర్చి, అరటి, మామిడి వంటి పంటలకు రైతులకు మద్ధతు ధర రాకపోతే ప్రభుత్వమే జోక్యం చేసుకుని మద్దుతు ధర ఇచ్చేది. అందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఆ దిశలో 5 ఏళ్లలో రూ.7800 కోట్లు ఖర్చు చేశాం. ఇ–క్రాప్‌ చేయకుండా నష్టపోయిన రైతులు వివరాలు ఈ ప్రభుత్వానికి ఎలా వస్తాయి. 80 లక్షల మంది రైతులు ఉంటే… కేవలం 19 లక్షల రైతులకే పంటల బీమా సదుపాయం ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి?. ఈ ప్రభుత్వం, పోలీసులు ఉన్నది వైయస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకా? తప్పు చేసిన వారిని శిక్షించడానికా? ఎన్నికల మందు రూ.25 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ కంటైనర్‌ దొరికిందని అంటే నేనే .. ఈ అంశంలో దర్యాప్తు చేయాలని సీబీఐకి లేఖ రాశాను. భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు 2014–19 మధ్య ఏ పనీ చేయలేకపోతే, మేం వచ్చాక అవసరమైన ల్యాండ్‌ పూలింగ్‌ చేసాం. శంకుస్థాపన చేసిన రోజే మొదటి విమానం రాక కోసం టార్గెట్‌ పెట్టుకున్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఊ అంటే భోగాపురం వెళ్తున్నాడు. నిజానికి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి, ఎయిర్‌పోర్ట్‌ ఆధారిటీ ఆఫ్‌ ఇండియాకు ఏ సంబంధం లేదు. మీరు కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందాన వ్యవహరిస్తున్నారు. మీకు చేతనైతే ఎయిర్‌పోర్టుకు అప్రోచ్‌ రోడ్స్‌ తేవాలి. విశాఖలో పెట్టుబడుల సదస్సుపై మాట్లాడుతూ, గత మా ప్రభుత్వంలో విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌) నిర్వహించాం. అప్పుడు అంబానీ, జిందాల్, ఆదానీ, మిట్టల్‌ వంటి వారు హాజరయ్యారు. మరి

కామారెడ్డి

రామారెడ్డిలో కాలభైరవ స్వామి దేవస్థానం వద్ద దుకాణాల బహిరంగ వేలం

కామారెడ్డి, 05 నవంబర్, (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఇ సన్న పల్లి గ్రామంలో శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం పరి ధిలోని దుకాణాల బహిరంగ వేలం పాట నిర్వ హిం చబడింది. వేదవిధానాలతో ప్రారంభమైన ఈ వేలం లో మొత్తం10 మంది డిపాజిట్లు చెల్లించారు. వేలం ప్రకారం కిరాణా, పూసవేర్లు, కూల్‌డ్రింక్స్, టెంకాయ ల దుకాణం మొదలైన వాటికి పోటీ పడి పాల్గొన్నా రు. చివరగా కిరాణ దుకాణం బండి జగన్నాథం (తండ్రి పేరు కిష్టయ్య, నివాసం రామకోండి) గారు సంవత్స రానికి రూ. 6,00,000/- (ఆరులక్షలు)కి కైవసం చేసుకున్నారు.అయితే ఆధ్యాత్మిక బుక్ స్టాల్, రుద్రాక్ష మాలల ఆర్టికల్స్ దుకాణం కోసం ఎవరూ వేలంలో పాల్గొనకపోవడంతో ఆ దుకాణం వేలం రద్దైంది.ఈ బహిరంగ వేలం దేవాదాయ శాఖ నిజామాబాద్ నుంచి వచ్చిన జూనియర్ అసిస్టెంట్ సుమన్ పర్య వేక్షణలో ప్రశాంతంగా పూర్తయింది. దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంపై స్థానిక భక్తులు స్పందిస్తూ, ఆదాయ వృద్ధికి అవి దోహదపడతాయని పేర్కొన్నారు.

రంగారెడ్డి

*కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా సిహెచ్ యాదయ్య ఇంటింటి

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్ కాలనీ పలు కాలనీల్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యం ఇంటింటి ప్రచారం నిర్వహిచారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

రంగారెడ్డి

*కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా సిహెచ్ యాదయ్య ఇంటింటి

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్ కాలనీ పలు కాలనీల్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యం ఇంటింటి ప్రచారం నిర్వహిచారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

ఖమ్మం

ప్రమాదపు అంచుల్లో ప్రయాణికులు

ప్రమాదపు అంచుల్లో ప్రయాణికులు నిద్రావస్థలో ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోని ప్రజా ప్రతినిధులు పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్ ఖమ్మం, 05 నవంబర్ 2025 ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోడ్లు అన్ని ధీనవస్థలో, ప్రమాదకరంగా దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ను, కొత్తగూడెం జిల్లాను కలిపే ప్రధాన రహదారి లో ఏన్కూర్ నుండి జూలూరుపాడు మధ్యలో ఉన్న రోడ్డు అడుగు లోతుల్లో పెద్ద పెద్ద గుంతలతో, రోడ్డు అంచులు పగిలిపోయాయి. కొన్ని చోట్ల అసలు రోడ్డు కనపడని పరిస్థితి. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వర్షపు నీళ్లతో నిండిపోయి, రోజుకి పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. స్థానిక శాసనసభ్యులు రోజు ఇదే రహదారిలో ప్రయాణిస్తున్న కూడా రోడ్డు దుస్థితి అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారు. వందల పెద్ద పెద్ద వాహనాలు రోజు ఇదే రహదారి మీద ప్రయాణం చేస్తాయి. మంత్రులు, ఎమ్మెల్యే లు కూడా ఇదే రహదారిలో ప్రయాణించిన కూడా నిమ్మకు నీరెతనట్టు పట్టించుకోని దుస్థితి. ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగి అందులో ఒక ప్రమాదంలో ఒక నిండు ప్రాణం పోయింది. ఇంకెన్ని ప్రమాదాలు జరగాలి. ఇంకెన్ని దారుణాలు చూడాలి. ప్రాణాలు పోతున్నా కూడా అధికారులు పట్టించుకోరా. మరో దారుణం జరిగి ఇంకో ప్రాణం చేజారి పోకముందే ఇకనైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, స్థానిక శాసనసభ్యులు ఈ విషయం గురించి పునరాలోచన చేసి తగిన న్యాయం జరిగేలా చూడాలని వాహనదారులు, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…

ఆంధ్రప్రదేశ్

కార్తీక పౌర్ణమి సందర్భంగా రద్దీగా మారిన రామలింగేశ్వర స్వామి

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం లో కూడవెల్లి గ్రామంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి రామలింగేశ్వర స్వామి గుడిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు రామలింగేశ్వర స్వామి గారిని దర్శించుకుని వారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకొని కార్తీక పౌర్ణమి శుభ ఘడియల్లో భక్తులు అసంఖ్యాకంగా దీపారాధన చేశారు ఈరోజు భక్తులతో రామలింగేశ్వర వారి స్వామివారి దేవాలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది

E-పేపర్

కార్తీక పౌర్ణమి భుజంగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల

కార్తీక పౌర్ణమి భుజంగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి కార్తీక మసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని రైల్వేకోడూరు పట్టణంలోని భుజంగేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటుచేసిన పౌర్ణమి వేడుకలకు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు. స్వామివారి దర్శనం అనంతరం బత్యాల (కార్తీకదీపం)జ్యోతి ప్రజ్వల చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు బత్యాల ని శాలువాలు పూలమాలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మెడికల్ కాలేజీల *ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాల్సిందే” – కాకాణి పూజిత*

*SPS నెల్లూరు జిల్లా *తేది:05-11-2025* *సర్వేపల్లి నియోజకవర్గం,మనుబోలు మండలం,పిడూరు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాణి పూజిత గారు*

విశాఖపట్నం

ప్ర‌జ‌లు ఆరోగ్యంగా.. ఆనందంగా ఉండాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం*

*ప్ర‌జ‌లు ఆరోగ్యంగా.. ఆనందంగా ఉండాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం* *దానిలో భాగంగానే డిజిట‌లైజ్ విధానంలో వైద్య సేవ‌ల‌ను అంద‌రికీ చేరువ చేస్తున్నాం.. *రూ.2 కోట్ల‌తో కేజీహెచ్ లో డ‌యాల‌సిస్ యూనిట్ పునఃప్రారంభించిన‌ మంత్రి డీవీబీ స్వామి *విశాఖ‌ప‌ట్ట‌ణం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ప్ర‌జ‌లు ఆరోగ్యంగా.. ఆనందంగా ఉండాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, దానిలో భాగంగానే వైద్య సేవ‌ల‌ను యూనివ‌ర్శ‌ల్ డిజిట‌లైజ్డ్ విధానంలో ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తున్నామ‌ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ‌బాల వీరాంజ‌నేయ స్వామి అన్నారు. సీఎస్సార్ కింద ఎన్టీపీసీ స‌మ‌కూర్చిన‌ రూ.2 కోట్ల ఆర్థిక స‌హాయంతో కేజీహెచ్ నెఫ్రాల‌జీ విభాగంలో ఆధునికీక‌రించిన హీమో డ‌యాల‌సిస్ యూనిట్ ను ఆయ‌న‌ బుధ‌వారం పునఃప్రారంభించి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్ర‌మంలో ముందుగా యూనిట్ లోప‌ల క‌లియ తిరిగిన ఆయ‌న రోగుల‌తో మాట్లాడారు. వారి యోగ క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం ప్ర‌భుత్వం ఎన్నో చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని దానిలో భాగంగా అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డేలా రూ.25 ల‌క్ష‌ల‌తో సార్వ‌త్రిక ఇన్సూరెన్స్ క‌ల్పించేందుకు మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింద‌ని గుర్తు చేశారు. కుప్పంలో సంజీవ‌ని పేరుతో పైల‌ట్ ప్రాజెక్టు అమ‌లు చేస్తున్నామ‌ని, ద‌శ‌ల వారీగా రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రికీ డిజిట‌లైజ్డ్ వైద్య సేవ‌ల‌ను చేరువ చేస్తామ‌ని చెప్పారు. కేజీహెచ్ నెఫ్రాల‌జీ విభాగంలో ఇప్ప‌టికే 13 స‌బ్ యూనిట్ల‌తో సేవ‌లు అందుతున్నాయ‌ని, అద‌నంగా ఎన్టీపీసీ సాయంతో మ‌రొక 10 కొత్త‌ స‌బ్ యూనిట్ల‌ను స‌మ‌కూర్చ‌గ‌లిగామ‌ని మంత్రి వివ‌రించారు. ప్ర‌మాద‌క‌ర‌ వ్యాధులున్న వారికి ఇక్క‌డ సేవ‌లందించేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేద‌లంద‌రికీ మెరుగైన‌ వైద్య సేవ‌ల‌ను అందిస్తున్నామ‌ని మంత్రి గుర్తు చేశారు. కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, ఎమ్మెల్యేలు వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీ‌నివాస్, మేయ‌ర్ పీలా శ్రీ‌నివాస‌రావు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ సీతంరాజు సుధాక‌ర్, ఏఎంసీ పూర్వ విద్యార్థుల సంఘం ఛైర్మ‌న్ డా. ర‌విరాజు, ఏఎంసీ ప్రిన్సిపాల్ డా. కేవీఎస్ సంధ్యాదేవి, కేజీహెచ్ అడ్మినిస్ట్రేట‌ర్ బీవీ ర‌మ‌ణ‌, సూప‌రింటెండెంట్ డా. ఐ.వాణి, ఆర్ఎంవో డా. శ్రీ‌హ‌రి, నెఫ్రాల‌జీ విభాగం ఇన్ఛార్జి హెచ్వోడీ డా. ర‌త్న‌ప్ర‌భ, ఎన్టీపీసీ ప్ర‌తినిధులు పాత్రో, ప్ర‌కాశ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.