Saturday, 4 April 2026

Blog

విశాఖపట్నం

ఉత్తర నియోజకవర్గంలో రహదారి సమస్య పరిష్కార దిశగా

ఉత్తర నియోజకవర్గం 50వ వార్డు అధ్యక్షులు సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో సాయిరాం నగర్, సత్యనగర్ ప్రాంతాల్లో గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న రహదారి సమస్యపై ఈరోజు ప్రజా ప్రతినిధులు ప్రత్యక్షంగా స్పందించారు. ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యుడు పెనుమత్స కుమార్ రాజు గారు, విశాఖ నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రణవ గోపాల్ గారు స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి సమస్య పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్యపురి శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు వెంకటరావు, సనపల రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ ఎడ్ల మర్యాదస్, బంగారయ్య, శేఖర్, కూర్మా రావు, స్థానిక నాయకులు రామారావు మరియు నగరాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ప్రజల దీర్ఘకాల స్వప్నమైన రహదారి సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు.

విశాఖపట్నం

ఎపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సేవలు అభినందనీయం!* *ఘనంగా 19వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు* *నిరుపేదలకు అన్నదానం వస్త్రదానం పంపిణీ*

ఎపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రముఖ సంఘ సేవకులు..ఎఎన్ బీచ్ ఆసుపత్రి అధినేత, ప్రముఖ వైద్యులు, డాక్టర్ సిఎంఎ జహీర్ అహ్మద్ కొనియాడారు. బుధవారం ఎపిడబ్ల్యూజెఎఫ్ 19వ వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలోని వివేకానంద అనాధ.. వృద్ధుల ఆశ్రమంలో యూనియన్ నేతలు వస్త్ర దానం, అన్నదానం తదితర పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జహీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అతి పెద్దదైన జర్నలిస్ట్ సంఘంగా గుర్తింపు తెచ్చుకున్న ఎపిడబ్ల్యూజెఎఫ్ సభ్యులందరూ సమైక్యంగా ఉంటూ పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గత 19 సంవత్సరాలు నుంచి జర్నలిస్టుల సమస్యల సాధన పట్ల చిత్త శుద్ధితో పనిచేస్తూ మెజారిటీ జర్నలిస్టుల ఆదరణ పొందడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ పరిధి మేరకు నిరంతరం కృషి చేస్తున్నా మన్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం మంత్రులకు, ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు… జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇస్తున్న విధంగా 60 సంవత్సరములు నిండిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, హెల్త్ కార్డులు ద్వారా ఆరోగ్య పరిరక్షణ కల్పించాలని తదితర 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేశామన్నారు.. అలాగే రాష్ట్ర మంత్రులకు, ప్రభుత్వ పెద్దలకు ఇప్పటికే వినతులు అందజేస్తామన్నారు. ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఆర్ధికంగా నిలద్రొక్కు కునేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా తన తోడ్పాటును అందించాలని కోరారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పేదలకు అన్నదానం, వస్త్రదానం తదితర సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించా మన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నా యన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి. రవికుమార్, పి.ఎస్.ప్రసాద్ ఉపాధ్యక్షులు బి.శివప్రసాద్, ఎన్ రామకృష్ణ, జాయింట్ సెక్రెటరీ నగేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆనంద్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్మోహన్, కే. శ్రీనివాస్, ప్రతినిధులు కే.డి.చక్రధరరావు, హరి, కె.వి.శర్మ , రాజశేఖర్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు

విశాఖపట్నం

సీ.ఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి

సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని సీ.ఎం రిలీఫ్‌ ఫండ్‌ లబ్ధిదారులకు 63.59.60, 57 వార్డులో గణబాబు చెక్కులను పంపిణీ చేశారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీ.ఎం రిలీఫ్ ఫండ్ ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు . పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీ.ఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు అందిస్తున్నామని గణబాబు అన్నారు . ఈ నేపథ్యంలో పేదలకు చెందిన పట్నాల గోవిందు- రూ.71,664/-, 57వార్డ్ సురకత్తుల జ్యోతి- రూ. 25,000/-, 63 వార్డ్. రామస్వామిఉమాపతి- రూ.74,605/-, 58 వార్డ్. గీసాల అప్పలరాజు- రూ.55,180/-, 57వార్డ్ బొల్లప్రగడ త్రినాధ రావు- రూ.1,57,978/-, 58 వార్డ్ డోక్లా ధనుశ్రీ సి/ఓ రామలక్ష్మి- రూ.30,000/-, 59 వార్డ్ పిళ్ళిచాతుర్య- రూ.20,000/-, 57వార్డ్ దండ్రురమేష్- రూ.52,660/-, 58 వార్డ్. చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు అందజేశారు. చెక్కులు అందుకున్న వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన గణబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ అంగ దుర్గా ప్రశాంతి, 63 కార్పొరేటర్ గల్లా చిన్న, శిరం. ఉమా మహేశ్వరి, రామ్మోహన్ నాయుడు,పోతబత్తుల శ్రీను, 57వార్డ్ అధ్యక్షుడు పెంటకోట అజయ్, 57వార్డ్ కార్పొరేటర్ మురు వాణి టీడీపీ జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఉదయగిరి విద్యార్థి ఎంపిక

ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9 తరగతి విద్యార్థిని షేక్ ఆలియా రాష్ట్ర స్థాయి అద్లేతిక్సు ఎంపికైంది నెల్లూరు లోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో బుదవారం జరిగిన పోటీల్లో ఆ విద్యార్ది ప్రతిభా చాటింది రాష్ట్ర స్థాయి 400 మీటర్లు పోటీలకు ఎంపికైనట్లు హెచ్ యం శ్రీనివాసు రావు తెలిపారు ఆమె విజయంతో కీలక పాత్ర పోషించిన పీ డి ఓ నారాయణను అభినందించారు

విశాఖపట్నం

విశాఖలో అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం – విద్యా రంగానికి కొత్త దిశ

దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, వైద్య విద్య ప్రవేశ పరీక్షల తయారీలో ప్రముఖ స్థానం కలిగిన అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు విశాఖపట్నంలో తన శిఖరాన్ని విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విశాఖలో తరగతులను ప్రారంభిస్తున్న సందర్భంగా బుధవారం బీచ్ రోడ్‌లోని 101 ప్రాంతంలో వైజాగ్ బ్రోచర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఇలాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ విశాఖలో స్థాపించబడటం గర్వకారణం. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తును మలుచుకోవాలి” అని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, విద్యావేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

స్వదేశీ వస్తువులనే వాడుదాం: గనిశెట్టి

ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అయినవిల్లి మండలం బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ అధ్యక్షతన బుధవారం అయినవిల్లి మండలం కె.జగన్నాధాపురం గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని ఆత్మ నిర్భర భారత్ సంకల్ప అభియాన్ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రతీ ఇంట స్వదేశీ ఇంటింటా స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్బర్ భారత్ సంకల్ప అభియాన్ లో గ్రామాలు పేదలు అన్నదాతలు మహిళలు మరియు యువత ద్వారానే స్వాలంబన భారత్ సిద్ధిస్తుందని అన్నారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ‘ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ’ స్టిక్కర్లను అంటించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సొసైటీ డైరెక్టర్ మిద్దే నూతన రవరాజ్, సీనియర్ నాయకులు మల్లాది మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అనకాపల్లిలో విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ – కొత్త సబ్ స్టేషన్లకు మంత్రి గొట్టిపాటి శ్రీకారం

అనకాపల్లి జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఈపీడీసీఎల్ పరిధిలోని చౌడువాడ, కింతలిలో కొత్త విద్యుత్ ఉపకేంద్రాలను ప్రారంభించారు. రూ.3.65 కోట్ల వ్యయంతో చౌడువాడలో, రూ.3.37 కోట్లతో కింతలిలో సబ్ స్టేషన్లు నిర్మాణం పూర్తయాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు కొణతల, బండారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏపీఈపిడిసిఎల్ పరిధిలోని 11 జిల్లాలలో రూ.250 కోట్లతో మొత్తం 69 సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ప్రతీ జిల్లాకు కొత్తగా 10 సబ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే సరికి స్థానికంగా విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో 20 వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి వినియోగదారుడు ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. తక్కువ ధరలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం విధించిన 40 పైసల ఎఫ్‌పిపిపి చార్జీలలో 13 పైసలు తగ్గించి వినియోగదారులకు నేరుగా లాభం చేకూర్చుతున్నామని వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రూ.35 వేల కోట్లతో 65 లక్షల మందికి ప్రతి నెలా పెన్షన్లు అందిస్తున్నామని, రూ.10 వేల కోట్లతో ‘తల్లికి వందనం’ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. నర్సీపట్నం, మాడుగులను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి స్పష్టం చేశారు.

విశాఖపట్నం

విశాఖలో సిఐటియు 18వ అఖిల భారత మహాసభ సన్నాహకాలు ఉత్సాహంగా

అఖిల భారత సిఐటియు 18వ మహాసభను పురస్కరించుకొని నిర్వహించబోయే శ్రామిక సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశం బుధవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగింది. సమావేశాన్ని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు జి.రమణ అధ్యక్షతన నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చి.నర్సింగరావు, మాజీ మేయర్ దాడి సత్యనారాయణ, సినీ దర్శకుడు యాద్ కుమార్, వైజాగ్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు నరవ ప్రకాశరావు, వంగపండు దుష్యంతు, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు మంగరాజు, ఐఎన్టీయూసీ నాయకుడు నాగభూషణం, లీడర్ పత్రిక రమణమూర్తి, కేరళ కళా సమితి ఉపాధ్యక్షుడు పీకే జోస్ తదితరులు డంకా మ్రోగించి ఉత్సవాల సన్నాహక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ — నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్మిక హక్కులను హరించే విధంగా విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. కార్మికుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తూ, సహజ వనరులను పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. విశాఖలో జరుగనున్న మహాసభలు శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని సూచించారు. దాడి సత్యనారాయణ మాట్లాడుతూ — ఇంతటి మహా కార్యక్రమం విశాఖలో జరగడం నగర గౌరవాన్ని పెంచుతుందని, సిఐటియు పోరాటాలు కార్మిక హక్కుల పరిరక్షణకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఐఎన్టీయూసీ నాయకుడు నాగభూషణం మాట్లాడుతూ — సిఐటియు ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఎన్నో పోరాటాలు జరిపిందని, తాను కూడా కళారంగం ద్వారా సహకరిస్తానని తెలిపారు. సినీ దర్శకుడు యాద్ కుమార్ మాట్లాడుతూ — సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. నరవ ప్రకాశరావు మాట్లాడుతూ — విశాఖ ఖ్యాతిని ప్రపంచస్థాయిలో చాటేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించాలని సూచించారు. వంగపండు దుష్యంతు మాట్లాడుతూ — కార్మిక సమస్యలపై ఎర్రజెండా నాయకత్వంలో సాగిన పోరాటాలను ప్రజా కళారూపాల ద్వారా ప్రతిబింబించాలని కోరారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు మంగరాజు మాట్లాడుతూ — ప్రైవేటీకరణ, కార్మిక హక్కుల పై జరుగుతున్న దాడులను ప్రతిబింబించే పాటలు, వీధినాటకాలు, నిశ్చరూపకాలు ప్రదర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి కళాకారులను ఆహ్వానిస్తామని తెలిపారు. జనవరి 2న కామ్రేడ్ సఫ్దర్ హస్మి స్మారకంగా వీధి నాటకోత్సవాలు కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. నాటకరంగ దర్శకుడు చలసాని కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ — సుందరయ్య గారు సైకిల్‌పై తిరిగి పేదల పక్షాన పోరాడిన మహానేత అని, అటువంటి ఆలోచనల వారసత్వం సిఐటియు ద్వారా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.కె.రమాప్రభ, ఎం.చంటి, దండు నాగేశ్వరరావు, గౌరీశంకర్, వై.అప్పారావు, క్రితా కరుణి, లోకేష్, రమణమూర్తి, ఆర్.కె.ఎస్.వి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖలో భారీ సంస్కరణలు

▪️ *పంచాయతీ సెక్రటరీ పదవికి కొత్త పేరు: “పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ (PDO)”* *13351 గ్రామపంచాయతీలను కొత్తగా 4 గ్రేడ్లుగా వర్గీకరించారు:* ▪️రూర్బన్ పంచాయతీలు – 359 ▪️గ్రేడ్-I – 3082 ▪️గ్రేడ్-II – 3163 ▪️గ్రేడ్-III – 6747 👉 ఇప్పటి వరకు ఉన్న 7244 క్లస్టర్లను రద్దు చేసి 13351 గ్రామపంచాయతీలను స్వతంత్ర యూనిట్‌ లుగా ప్రకటించారు. 👉 సిబ్బంది మూడు గ్రేడ్లలో పునర్విభజన: గ్రేడ్-I : ₹44,570 – ₹1,27,480 గ్రేడ్-II : ₹32,670 – ₹1,01,970 గ్రేడ్-III : ₹28,280 – ₹89,720. 👉 359 రూర్బన్ పంచాయతీల్లో గ్రేడ్1 పంచాయితీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ గా అప్ గ్రేడ్ చేశారు. (Deputy MPDO స్థాయి జీతశ్రేణితో). 👉 ప్రతి గ్రామపంచాయతీకి కొత్త సిబ్బంది నిర్మాణం. ▪️Sanitation Wing (శుభ్రత విభాగం) ▪️Water Supply Wing (నీటి సరఫరా) ▪️Country Planning Wing (గ్రామ ప్రణాళిక) ▪️Street Lighting & Engineering Wing (వీధి దీపాలు, ఇంజినీరింగ్) ▪️Revenue Wing (ఆదాయం & పన్ను వసూళ్లు). ▪️వీరి జీతాలు గ్రామపంచాయతీ జనరల్ ఫండ్‌ నుంచి చెల్లించాలి. 👉 IT విభాగం ఏర్పాటుకు నిర్ణయం: గ్రామ పంచాయతీల మొత్తం డిజిటలైజేషన్‌కి ప్రత్యేక వింగ్ ఏర్పాటు. 👉 అన్ని ఖాళీ PDO పోస్టులు 2025-26లో నింపాలని ఆదేశాలు.

విశాఖపట్నం

నేడు జెడ్పీ స్థాయీ సంఘ స‌మావేశాలు జిల్లా ప‌రిష‌త్ సీఈవో పి.నారాయ‌ణ‌మూర్తి

జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అధ్యక్షతన ఈనెల 6న ( గురువారం) ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నం వరకు జ‌డ్పీ స్థాయీ సంఘ స‌మావేశాలు నిర్వ‌హించనున్న‌ట్లు జిల్లా ప‌రిష‌త్ సీఈవో పి.నారాయ‌ణ‌మూర్తి బుధవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జ‌డ్పీ ఛైర్ పర్శ‌న్ జె.సుభ‌ద్ర‌ అధ్య‌క్ష‌త‌న ఆమె ఛాంబ‌ర్ స‌మీపంలోని వి.సి.హాలులో అలాగే జ‌డ్పీ స‌మావేశ మందిరంలో 1 నుంచి 7 వ‌ర‌కు గ‌ల స్థాయీ సంఘ స‌మావేశాలు వేర్వేరుగా ఉద‌యం 10.00 నుంచి 12.30గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు.ఉద‌యం 10.00 గంట‌ల‌కు 2,వ స్థాయీ సంఘ సమావేశం, ఉదయం 10.30గంటలకు 3వ స్థాయీ సంఘ సమావేశం, 11:00 గంట‌ల‌కు 4వ స్థాయి సంఘ సమావేశం, 11:30 గంటలకు 5వ స్థాయీ సంఘ సమావేశం, 12.30 గంట‌ల‌కు, 6వ స్థాయి సంఘ సమావేశం 1,7వ సాయి సంఘ సమావేశములు 12:00 జ‌రుగుతాయ‌ని వివ‌రించారు. సంబంధించిన ప్రగతి నివేదికలతో అధికారులు స‌మావేశాల‌కు హాజ‌రుకావాల‌ని, ప్రాదేశిక నియోజ‌క‌వ‌ర్గ స‌భ్యులు, ఎంపీపీలు, హాజరుకావాలని ప్ర‌క‌ట‌న ద్వారా కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.