Saturday, 4 April 2026

Blog

హైదరాబాద్

రేవంత్ రెడ్డి పాలనపై మహిళలే ప్రశ్నలు – పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపిన సీఎం పై మండిపడ్డ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

పున్నమి ప్రతి నిధి జూబ్లీహిల్స్ ఫ్రీ బస్సు ఎందుకు అని మహిళలే ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మూడు ఏళ్ళ తరువాత కే.సి.ఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే కేటీఆర్ మీద ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఏపీ ఎస్పీడీసీఎల్ సిఎండి గారు ఆదేశాలు

గౌరవ సీఎండీ గారి ఆదేశముల మేరకు ప్రజలలో విద్యుత్ సరఫరా మీద ఉన్న అభిప్రాయము మెరుగు పడేలా చేసే ప్రయత్నంలో భాగంగా కింద తెలిపిన ప్రణాళిక అమలు చేయవలెను 1.సోమవారం ప్రతి ఒక్క జూనియర్ లైన్ మెన్ వారం లో ప్రతి సోమవారం తన పరిధిలోని 10 మంది వినియోగదారులతో మొబైల్ ఫోన్ లో మాట్లాడవలెను 2.మంగళవారం అసిస్టెంట్ లైన్ మెన్ /లైన్ మెన్ 10 మందితో మాట్లాడవలెను 3.బుధవారం లైన్ ఇన్స్పెక్టర్ /సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ / ఫోర్ మెన్ 10 మందితో మాట్లాడవలెను 4.గురువారం ఏ యి గారు 20 మందితో మాట్లాడవలెను 5 శుక్రవారం DEE గారు 30 మంది తో మాట్లాడవలెను 6.శనివారం EE గారు 40 మందితో మాట్లాడవలెను 7.గౌరవ SE గారు వారంలో ఎదో ఒక రోజు 50 మందితో మాట్లాడవలెను. మాట్లాడేప్పుడు వారితో కింద తెలిపిన సమాచారం అడగవలెను A.విద్యుత్ సరఫరా సక్రమంగా ఉందా లేదా B.వోల్టెజ్ అప్ అండ్ డౌన్ ఉందా C.సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా ఇవ్వన్ని ఒక పుస్తకములో నమోదు చేయవలెను. పైన తెలిపిన సూచిక మనము అమలు చేసి వారంతమునకు రిపోర్ట్ ను పై అధికారులకు తెలుపవలెను.

హైదరాబాద్

రేవంత్ రెడ్డి పాలనపై మహిళలే ప్రశ్నలు – పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపిన సీఎం పై మండిపడ్డ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

పున్నమి ప్రతి నిధి జూబ్లీహిల్స్ ఫ్రీ బస్సు ఎందుకు అని మహిళలే ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మూడు నెలల తరువాత కే.సి.ఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే కేటీఆర్ మీద ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

హైదరాబాద్

బీజేపీ బైక్ ర్యాలీ – జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉత్సాహభరిత ప్రచారం

పున్నమి ప్రతి నిధి (జూబ్లీహిల్స్) జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌ కు మద్దతుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బోరబండ, ఎర్రగడ్డ డివిజన్‌లలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సాయిబాబా నగర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, ప్రతిభ కాలేజ్, మోతి నగర్ ఎక్స్ రోడ్, మిద్‌ల్యాండ్ చౌరస్తా మీదుగా రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. అడుగడుగునా జన ప్రభంజనం తోడవగా వేలాదిగా తరలివచ్చిన బీజేపీ మద్దతుదారులు ర్యాలీకి విశేష స్పందన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — గత పదేళ్లుగా బీఆర్ఎస్, రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తూ వచ్చాయని, మజ్లిస్ కనుసన్నల్లో అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ ఉపఎన్నికలో ప్రజలు ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే బీజేపీనే ఏకైక ప్రత్యామ్నాయమని, ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థి లంకల దీపక్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ర్యాలీలో గౌరవ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, గౌరవ నిర్మల్ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసేన అధ్యక్షులు శంకర్ గౌడ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం మరొక ముందడుగు – చిట్వేలు కొత్త ఆసుపత్రి ఆరంభం

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో పాత హాస్పిటల్ భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ కొత్త హాస్పిటల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ చిట్వేలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఏ సమస్యలైనా ఎదురైతే ప్రభుత్వం అండగా ఉంటుంది, అని పేర్కొన్నారు. చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతు చిట్వేలు ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యత. ఈ ఆసుపత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాం అన్నారు. డాక్టర్లు సూచించిన మరిన్ని వసతులను కూడా త్వరలో పర్మిషన్ చేయిస్తాం. చిట్వేలు నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగిన ప్రాంతం. కోడూరు – చిట్వేలు రోడ్డును కూడా త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తాం, అని తెలిపారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. చిట్వేలు హాస్పిటల్ ప్రారంభం వల్ల వేలాది మంది ప్రజలకు వైద్య సేవలు సులభతరం అవుతాయి, అని అన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్ నారాయణ మాట్లాడుతూ – “కొత్త హాస్పిటల్‌లో అన్ని సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయి. చిన్నచిన్న అవసరాలు డోనర్ల సహకారంతో తీర్చుకోవచ్చు. ఇక్కడ డెలివరీలు సహా అన్ని రకాల చికిత్సలు అందిస్తాం,” అని వివరించారు. ఈ కార్యక్రమంలో పాటూరు శ్రీనివాస్ రెడ్డి, టిడిపి యువనేత గుత్తి నరసింహ, రవి ప్రకాష్, జనసేన నాయకుడు మాదాసు నరసింహులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వరలక్ష్మి, తాసిల్దార్ స్పందన, సిఐ వెంకటేశ్వర్లు, డీఎంఎన్ఓ డాక్టర్ విష్ణు, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ శేఖర్, డాక్టర్ అబ్దుల్ వకీల్ అన్సారి, హెల్త్ ఇస్మాయిల్ భాష, అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

అన్నమయ్య

చిట్వేల్ అభివృద్ధి పథంలో మరో అడుగు – రూ.42 లక్షలతో కొత్త రహదారి పనులు ప్రారంభం

చిట్వేల్ పట్టణ అభివృద్ధికి మరొక శుభారంభం లభించింది. పట్టణంలోని సింగనమల వీధి నుండి గాజుల వీధి జంక్షన్ వరకు రూ.42 లక్షల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిమెంట్ రహదారి నిర్మాణ పనులకు గురువారం భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్‌, చైర్మన్‌ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “మేము మాటలతో కాదు, చేతలతో చూపించే నాయకత్వం అందిస్తున్నాం. ప్రజల సౌకర్యం కోసం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయి,” అని తెలిపారు. చిట్వేల్ పట్టణాన్ని మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడం తమ ప్రధాన లక్ష్యం అని ముక్కా రూపానంద రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పల్లెలో మట్టి రోడ్ల స్థానంలో సిమెంట్ రహదారులు నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాటల శ్రీనివాస్ రెడ్డి, యువనేత గుత్తి నరసింహ, మార్కెట్ యార్డ్ చైర్మన్ వరలక్ష్మి, బత్తిన వేణుగోపాల్ రెడ్డి, జనసేన నాయకులు మాదాసు నరసింహులు, మద్దూరు మన్మధ, బొంతల నాగేశ్వర, సాయి, మాదాసు శివ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

అన్నమయ్య

గుండాలకోనలో భక్తి జలధి – కార్తీక పౌర్ణమి వేళ ఘనంగా పూజలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా గుండాలకోనలో భక్తి జలధి అలముకుంది. తెల్లవారుజామున నుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు దీపాలు వెలిగించి భక్తి పారవశ్యంతో పాల్గొనగా, ఆలయ ప్రాంగణం వెలుగుల తారకలతో మెరిసిపోయింది. మండల పరిధిలోని పలు శివాలయాల్లో కూడా శివపార్వతులకు విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు చిట్వేల్ శివాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గుండాలకోన పరిసర ప్రాంతాలన్నీ భక్తి తరంగాలతో నిండిపోయాయి.

అన్నమయ్య

నారాయణ తపోవన ఆశ్రమంలో భక్తి సముద్రం – కార్తీక పౌర్ణమి వేళ అన్నదాన మహోత్సవం

అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలోని తిమ్మాయపాలెం క్రాస్ సమీపంలోని పవిత్ర పుణ్యక్షేత్రం నారాయణ తపోవన ఆశ్రమం భక్తి వాతావరణంతో కిక్కిరిసిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు వైభవంగా నిర్వహించగా, తెల్లవారుజామున నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చారు. నారాయణ స్వామివారి దర్శనార్థం క్యూల్లో నిలబడి భక్తులు నామస్మరణతో పరవశించగా, ఆశ్రమం అంతటా వేదమంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ సందర్భంగా కె.వి.పి. సుబ్బయ్య తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఘనమైన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తూ, పాలు – పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. ఆశ్రమ నిర్వాహణ బాధ్యతలు చేపట్టిన రాజుగుంట గ్రామానికి చెందిన కనకరాజు మాట్లాడుతూ – “నారాయణ తపోవన ఆశ్రమం మన ప్రాంతానికి ఆధ్యాత్మిక కాంతివంతమైన కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం,” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్ర, వెంకటసుబ్బయ్య, గణేష్, పసల ప్రసాద్ తదితరులు పాల్గొని సేవలు అందించారు. స్థానిక గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై భజనలతో, హారతులతో, నామసంకీర్తనలతో తపోవన ఆశ్రమాన్ని ఆధ్యాత్మికతతో నింపేశారు. కార్తీకమాసం చివరి పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి, సేవా భావాలతో చిట్వేల్ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతిని ప్రసరించింది.

అన్నమయ్య

కార్తీక పౌర్ణమి శోభలో భవానీ శంకరేశ్వర స్వామి ఆలయం వెలుగుల మేళా

కార్తీక మాస పుణ్యకాలంలో భక్తి భావం ఉరకలేస్తోంది. నక్కలపల్లి గ్రామంలోని శ్రీ భవానీ శంకర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణిమ సందర్భంగా నిర్వహించిన 15వ రోజు ప్రదోషకాల పంచామృతాభిషేకం, జ్వాలా దర్శనం, విశేషాలంకరణ భక్తులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం సమయంలో వేద మంత్రోచ్చారణల మధ్య పంచామృతంతో స్వామివారికి ఘనాభిషేకం నిర్వహించగా, ఆలయ ప్రాంగణమంతా భక్తి గీతాలతో మార్మోగింది. అనంతరం జరిగిన జ్వాలాదర్శన కార్యక్రమంలో భక్తులు స్వామి దివ్యరూపాన్ని దర్శించి పరమానందాన్ని పొందారు. కార్తీక దీపాల కాంతులతో దేవస్థానం వెలుగుల మేళాగా మారగా, భక్తులు “ఓం నమశ్శివాయ” నినాదాలతో ఆలయాన్ని మార్మోగించారు. ప్రత్యేకంగా చేసిన పుష్పాలంకరణ స్వామివారి శోభను మరింత పెంచింది. దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు – కార్తీక మాసంలో ప్రతిరోజూ జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని భవానీ శంకరుని కృపను పొందాలని ఆకాంక్షించారు.

విశాఖపట్నం

భీమిలి ప్రావీణ్యతను తెలియజేసే గాలిమేడను పునఃనిర్మించండి. ఎమ్మెల్యే గంటాను కోరిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

భీమిలి ప్రాంతానికి చోయగాలు పొలికించే పురాతన గాలిమేడను పునఃనిర్మించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేసారు. బుధవారం ఎంవిపిలో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. భీమిలికి ఆధ్యాత్మిక పరంగా, సాంస్కృతిక పరంగా ఎంతో ప్రావీణ్యత ఉందని అదేవిదంగా ఆంగ్లేయుల పాలనలో భీమిలి ప్రాంతంలో కొన్ని అదునాతన కట్టడాలు నిర్మించారని అన్నారు. అందులో ఒకటి గాలిమేడ అని వివరించారు. సముద్ర తీరంలో నిర్మించిన గాలిమేడ ఎంతో చక్కని ఆహ్లాదాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే గంటాకు ఇచ్చిన వినతిపత్రంలో తెలియజేసారు. భీమిలికే వన్నె తెచ్చే విధంగా గాలిమేడ ఉండేదని అన్నారు. రోజుకు కొన్ని వేలమంది పర్యాటకులు సందర్శించేవారని అన్నారు. పదుల సంఖ్యలో సినిమా షూటింగ్స్ గాలిమేడను ఆధారంగా చేసుకొని నిర్మించారని అన్నారు. అయితే పురాతన భవనం కావడం వలన రెండు దశబ్దాల క్రితం మొత్తం పడగొట్టాల్సి వచ్చిందని అన్నారు. కానీ నాటి గాలిమేడ తీపిగుర్తులు ఇంకా స్థానికులను, పర్యాటకులను అబ్బురపర్చే విధంగా ఉన్నాయని అన్నారు. దయచేసి పాత గాలిమేడ నమూనా ఆధారంగా నూతన గాలిమేడను పునఃనిర్మించినట్లయితే పర్యాటకంగా ఇంకా భీమిలి మంచి అభివృద్ధి చెందుతుందని, పర్యాటకులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. అదేవిదంగా భీమిలి చరిత్ర ఆధారంగా గోస్తనీ నది మధ్యలో భీముని యొక్క నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి చుట్టూ పార్క్ గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి ఇచ్చిన వినతిపత్రంలో గంటా నూకరాజు కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.