Friday, 3 April 2026

Blog

E-పేపర్

తెలంగాణ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు, బిల్డర్లు అల్టిమేటం జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, లేదంటే డిసెంబర్ 1 నుండి అన్ని పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు

తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా కాంట్రాక్టర్లకు రూ.18 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఐఏ) తెలిపింది. కాంట్రాక్టర్లు, బిల్డర్లు తమ ఆస్తులను తాకట్టు పెట్టి, అధిక వడ్డీకి రుణాలు తెచ్చి నిర్మాణ పనులు చేస్తున్నారని, వారిని ఈ ప్రభుత్వం రోడ్డున పడేస్తుందని అసహనం వ్యక్తం చేశారు బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే, డిసెంబర్ 1వ తేదీ నుండి అన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ఆపేస్తామని హెచ్చరించింది బీఐఏ. తెలంగాణ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు, బిల్డర్లు అల్టిమేటం జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, లేదంటే డిసెంబర్ 1 నుండి అన్ని పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్

ఉమా రామలింగేశ్వర స్వామి సేవలో ” నేవీ ఫస్ట్ క్లాస్ అధికారి “(నరసన్నపేట – నవంబర్ పున్నమి ప్రతినిధి)

శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం, దేవాది గ్రామంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో, ఉత్తరప్రదేశ్ కు చెందిన నేవీ అధికారి బిజేందర్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస వైభవంలో భాగముగా, ఆలయ ప్రధాన అర్చకులు శైవ శ్రీ చదువుల నమశ్శివాయ స్వామి, శైవ శ్రీ చదువుల వాసుదేవరావు ఆలయ విశిష్టతను తెలియజెసి రుద్రాభిషేకం జరిపించారు. అనంతరం నేవీ అధికారి బిజేందర్ సింగ్ మాట్లాడుతూ శివుడు భోళాశంకరుడని, అభిషేక ప్రియుడని, శివానుగ్రహం పొందడానికి భగవంతునిపై భక్తితోపాటు, సేవాతత్వం కలిగిఉండాలని, పరులకు సేవ వృధాకాదన్నారు. ఆపదలో ఉండేవారికి తోచిన సాయం చేస్తే, భగవంతునికి సేవ చేసినట్లేనని, నిస్సహాయులకు చేసిన సేవే, మాధవసేవన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శైవ శ్రీ చదువుల నమశ్శివాయ స్వామి, శైవ శ్రీ చదువుల వాసుదేవరావు, బిజేందర్ సింగ్ దంపతులకు తీర్థప్రసాదాలను, వేద ఆశీర్వాదాలను అందించారు.

శ్రీకాకుళం 

గురజాడ విద్య సంస్థలతో, నాకు విడదీయరాని బంధం ఉంది – సుడా చైర్మన్ కొరికాన.రవి కుమార్ (శ్రీకాకుళం రూరల్ – నవంబర్ పున్నమి ప్రతినిధి)

గురజాడ విద్య సంస్థలతో, నాకు విడదీయరాని బంధం ఉందని, సుడా చైర్మన్ కొరికాన.రవి కుమార్ అన్నారు. మునసబుపేట గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజిమెంట్ కళాశాలలో, కళాశాల ప్రిన్సిపాల్ కే.వి.వి. సత్యన్నారాయణ సభాధ్యక్షతన జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలలో, ముఖ్య అతిధిగా పాల్గొన్న సుడా.చైర్మన్ కొరికాన.రవి కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితం ఒక అంతులేని ప్రయానమని, ఈ ప్రయానంలో ఎన్నో మైలు రాళ్ళు దాటి, సత్ప్రవర్తనతో తోటి విద్యార్థుల పట్ల స్నేహ భావంతో, సోదర బావంతో ఉంటూ, కళాశాల నిబంధనలను పాటిస్తూ, క్రమశిక్షణతో, ఉన్నతమయిన విద్యాబుద్దులు నేర్చుకోని జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. కొత్త విద్యార్థులకు సహాయపడటం, వారిని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా సీనియర్ విద్యార్థులు మెలగాలని, ఫ్రెషర్స్ డే నిర్వహించడం వల్ల కొత్త విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, వారి ప్రతిభను, సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఒక వేదిక లభిస్తుందన్నారు. కళాశాల డైరెక్టర్ జి.సంయుక్త, విశిష్ట అతిధి జివి.స్వామి నాయుడు, కరస్పాండెంట్ అంబటి.రాంబాబు విద్యార్థులనుద్దేసించి ప్రసంగించిన అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు, పాటలు, నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, డిగ్రీ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం 

భీమేశ్వర ఆలయంలో కార్తీక దర్శనం

శ్రీకాకుళం కొన్నవీధి లో వేంచేసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం లో కార్తీక మొదటి సోమవారం దినమున భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ దేవాలయం లో భక్తుల సౌకర్యార్థం షామియానాలు, మంచి నీటి సరఫరా, చక్రాల కుర్చీ మెడికల్ క్యాంప్, వయోవృద్ధులు మరియు వికలాంగులకు ప్రత్యేక దర్శనాలు మొదలగు ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పట్నాయిక్ ఆలయం సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఏర్పాట్లను ఎగ్జిక్యూటివ్ అధికారి మాధవి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ వంగ మహేష్, సభ్యులు పొన్నాడ సంజీవరావు, శ్రీరంగ మధుసూదన రావు, కర్రి సతీష్ రెడ్డి, ఉన్న ఉమాదేవి, బి అసిరమ్మ, సి హెచ్. రాజులు, ఆలయ అర్చకులు జి. చిన్నారావు పర్యవేక్షించారు.

తిరుపతి

📢 *సచివాలయాల పేర్లు మార్చలేదు: CMO స్పష్టత*

📢 *సచివాలయాల పేర్లు మార్చలేదు: CMO స్పష్టత* గ్రామ / వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’ గా మార్చారు అన్న వార్తలు అవాస్తవం అని సీఎంవో వివరణ ఇచ్చింది. ➥ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం దిశగా గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలి అని సీఎం సూచించారు మాత్రమే. ➥ పేర్లు మార్చడం జరగలేదు. ➥ సచివాలయాలు తమ యథావిధంగా కొనసాగుతాయి.

తిరుపతి

తిరుపతి కలెక్టర్ – ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్*

*శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం, శ్రీ కొట్టే సాయి ప్రసాద్ గారు మొదటిసారిగా తిరుపతి జిల్లా కలెక్టర్ గారిని మరియు జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ గారు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు మరియు స్వామివారి ఫోటోలను జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి అందజేశారు. ఈ భేటీలో ఆలయ అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాల మెరుగుదల, జిల్లా స్థాయి సమన్వయంపై చర్చించడం జరిగింది.

నిర్మల్

జాతీయ గేయం ‘వందేమాతరం’కు 150 ఏళ్లు – సామూహిక గీతాలాపనలో కలెక్టర్ అభిలాష అభినవ్.

నిర్మల్ నవంబర్ 07 (పున్నమి ప్రతినిధి) జాతీయ గేయం ‘వందేమాతరం’ రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల్లో దేశభక్తి భావాలను మేల్కొల్పడంలో వందేమాతరం గేయం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8 బోర్న్ కేర్ యూనిట్లు (SNCUs) ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8 బోర్న్ కేర్ యూనిట్లు (SNCUs) ఏర్పాటు : 📍 అమలాపురం 📍 కుప్పం 📍 గుంతకల్లు 📍 నూజివీడు 📍 కావలి 📍 కదిరి 📍 శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రులు 📍 ఎమ్మిగనూరు CHC 🩺 కొత్తగా పుట్టిన బిడ్డలకు అత్యాధునిక వైద్య సేవలు 🩺 తక్కువ బరువుతో పుట్టిన, కామెర్లు లేదా ఇతర సమస్యలున్న శిశువులకు ప్రత్యేక చికిత్స

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మహిళా క్రికెటర్ శ్రీ చరణికి సీఎం చంద్రబాబు నుండి రూ.2.5 కోట్లు, స్థలం, ఉద్యోగ ప్రోత్సాహకం

అమరావతి, నవంబర్ (పున్నమి న్యూస్): మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీ చరణికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ ప్రోత్సాహకం ప్రకటించారు. శ్రీ చరణి కృషి, ప్రతిభను గుర్తించి ఆమెకు రూ.2.5 కోట్ల నగదు నజరానా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అలాగే ఆమెకు కడపలో ఇల్లు నిర్మించుకునేందుకు 1000 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 అధికారిగా ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను శ్రీ చరణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పుష్పగుచ్ఛం అందించి శ్రీ చరణిని సాదరంగా స్వాగతించారు. ఉమెన్స్ వరల్డ్ కప్ విజయం నేపథ్యంలో టీమిండియా మహిళా జట్టు ప్రదర్శనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రశంసలు కురిపించారు. భారత మహిళల సత్తాను ప్రపంచానికి చాటిన శ్రీ చరణి కృషి అందరికీ ఆదర్శమని, యువతీ క్రీడాకారిణులకు ప్రేరణగా నిలుస్తారని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీ చరణి ఈ సందర్భంగా వరల్డ్ కప్ జట్టులోని సహచరుల సంతకాలతో కూడిన టీషర్ట్‌ను ముఖ్యమంత్రికి బహూకరించారు. దానిని ఆప్యాయంగా స్వీకరించిన సీఎం, భారత మహిళా జట్టు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, మంత్రి వంగలపూడి అనిత, మంత్రి సవిత, మంత్రి సంధ్యారాణి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తదితరులు హాజరయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో శ్రీ చరణికి ఘన స్వాగతం పలికిన మంత్రులు, క్రీడా అధికారులు ఆమెతో పాటు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.