Friday, 3 April 2026

Blog

ఖమ్మం

_నా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా ఇది.. పరిహారం అందుకున్న తండ్రి ఆవేదన_*

*_నా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా ఇది.. పరిహారం అందుకున్న తండ్రి ఆవేదన_* చేవెళ్ల బస్సు ప్రమాదంలో ముగ్గురు ఆడబిడ్డలను కోల్పోయిన కుటుంబం ఆవేదన వర్ణనాతీతం. ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికీ కోలుకోలేక పోతున్నారు._ కను మూసినా తెరిచినా వారి జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఏడ్చి ఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయినా.. గుండెల్లో నుంచి వచ్చే వేదనతో ఆ ఇల్లు ఇప్పటికీ కన్నీటి సంద్రంలోనే మునిగిపోయింది. గురువారం (నవంబర్ 06) పరిహారం అందుకుంటూ ఆ తండ్రి రోధించిన తీరు అక్కడున్న గ్రామస్తులను, అధికారులను భావోద్వేగానికి గురిచేసింది._ చనిపోయిన ముగ్గురు అమ్మాయిల్లో.. ఒకమ్మాయి ఉద్యోగం చేస్తూ నెలనెలా ఇంటికి జీతం పంపిస్తూ ఉండేది. మిగతా ఇద్దరు చదువుతున్నారు. ప్రతినెలా తన కూతురు జీతం పంపే సమయానికే.. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందడంతో ఆ తండ్రి ఎల్లయ్య గౌడ్ ఆవేదనను మాటల్లో చెప్పలేం. అధికారులు ఇచ్చిన చెక్కును తీసుకుంటూ.. నా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా ఇది.. అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు._ బస్సు ప్రమాదంలో చనిపోయిన ముగ్గురికి.. ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున మొత్తం 21 లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందించింది. గురువారం (నవంబర్ 06) ఉదయం ఎల్లయ్య గౌడ్ ఇంటికి వెళ్లిన అధికారులు.. పరిహారాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా నా కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60 వేలు సంపాదించేది. ఇప్పుడు ముగ్గురు కలిసి నాకు పంపించిన జీతమా ఇది అంటూ తీవ్రంగా గుండెలు కరిగేలా రోదించాడు తండ్రి. ఎల్లయ్య గౌడ్ హృదయ విదారక పరిస్థితి చూసి అధికారులు, గ్రామస్తులు కలత చెందారు. ఈ దయనీయ పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదని నిట్టూర్చారు._ తాండూరు నియోజకవర్గం యాలాల మండలం పెర్కంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్ చాలా ఏండ్ల కింద తాండూరు టౌన్‌కు వలస వచ్చారు. ఆయనకు నలుగురు కూతుళ్లు. ఒక కొడుకు ఉన్నారు. ఎల్లయ్య గౌడ్ ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తున్నాడు. ఇటీవల పెద్ద కూతురు అనూష పెండ్లిని ఘనంగా చేశాడు. రెండో కూతురు తనూష ఎంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తున్నది. మూడో కూతురు సాయిప్రియ హైదరాబాద్‌లోని కోఠి విమెన్స్కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్, నాలుగో కూతురు నందిని అదే కాలేజీలో డిగ్రీ ఫస్టియర్, కొడుకు తాండూరు టౌన్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. అక్టోబర్ 15న జరిగిన అక్క అనూష పెండ్లికి తనూష, సాయిప్రియ, నందిని వచ్చారు. సోమవారం పరీక్షలు ఉండడంతో ముగ్గురూ తాండూరు బస్టాండ్‌ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సెక్కారు._ అంతలోనే మృత్యువు కబళించి ఆ ముగ్గురినీ తీసుకెళ్లింది. చేవెళ్ల దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన 19 మందిలో ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు యవతులు చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఆవేదనకు గురిచేసిన విషయం తెలిసిందే._ _సోమవారం (నవంబర్ 03) ఉదయం చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్, డ్రైవర్ వెనక కూర్చున్న వాళ్లలో చాలా మంది చనిపోయారు. మొత్తం 19 మంది చనిపోయినట్లుగా పోలీసులు నిర్ధారించారు.__నిర్మాణ పనుల కోసం పటాన్ చెరు నుంచి వికారాబాద్ కు కంకర లోడ్ తో టిప్పర్ వెళ్తున్న క్రమంలో రాంగ్ రూట్ లో వెళ్లి బస్సును ఢీ కొట్టింది టిప్పర్. తాండూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఈ బస్సులో ప్రమాద సమయంలో 72 మంది ప్రయాణికులు ఉన్నారు._

అల్లూరి సీతారామరాజు

గూడెం కొత్తవీధికి అభివృద్ధి బాట, ఎంపీ నిధులతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం మండల పరిషత్ నిధులతో జీకే వీధిలో పోలీస్ స్టేషన్ నుంచి ఎంపీయూపీ పాఠశాల వరకు సీసీ రోడ్డు నిర్మాణం.

జి. కె. వీధి పున్నమి న్యూస్ ప్రతినిధి నవంబర్ 07: గూడెం కొత్తవీధి: గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో ప్రజల చిరకాల కోరిక అయిన సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మండల పరిషత్ (ఎంపీ) నిధులను వినియోగిస్తూ, పోలీస్ స్టేషన్ గేటు నుంచి ఎంపీయూపీ పాఠశాల వరకు ఈ రోడ్డు పనులను ఎంపీటీసీ రీమల రాజేశ్వరి ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ కుమారి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ రీమల రాజేశ్వరి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులకు వేగంగా నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా, మండల పరిషత్ నిధులతో రాబోయే కాలంలో గ్రామాభివృద్ధికి దోహదపడే మరిన్ని ముఖ్యమైన పనులు చేపట్టనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు.ఈ ప్రారంభోత్సవంలో జనసేన ఎగ్జిక్యూటివ్ నెంబర్ గోర్లే వీర వెంకట్, స్థానిక ప్రెసిడెంట్ కోర్ర సుభద్ర, ఇతర ఎంపీటీసీలు నాగమణి, రాజులమ్మ, టిడిపి మాజీ మండల అధ్యక్షులు ముక్కలీ రమేష్, టిఎన్ఎస్ కార్యదర్శి ముక్కలి కళ్యాణి, టిడిపి మాజీ జెడ్పిటిసి గంట నలిని, జనసేన నాయకులు సుర కత్తి నాగేష్, గబులంగి శివ, వైసీపీ నాయకుడు వంతల అరుణ్, బిజెపి నాయకుడు రిమల పాల్, గడుతూరి పరమేష్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం

*🇮🇳వందే మాతరానికి 150 ఏళ్లు ఒక సామాజిక పౌరుడిగా నా సందేశం

*🇮🇳వందే మాతరానికి 150 ఏళ్లు ఒక సామాజిక పౌరుడిగా నా సందేశం* ఈరోజు మన దేశానికి ఎంతో గౌరవదాయకమైన రోజు. మన స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తి ఇచ్చిన, మన హృదయాల్లో దేశభక్తిని వెలిగించిన “వందే మాతరం” గేయానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ గేయాన్ని 1875లో బంకించంద్ర ఛటర్జీ గారు రాశారు. ఆ రోజుల్లో ఈ పాటను పాడటం అంటే బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలబడటం. మన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వీరులు ఈ గేయాన్ని గట్టిగా పాడుతూ, దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించారు. అందుకే ఈ రెండు పదాలు వందే మాతరం మనకెప్పుడూ గర్వకారణం. ప్రభుత్వం ఈ శతాబ్ది వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈరోజు ఉదయం 9:50కు మనమందరం ఒకేసారి వందేమాతరాన్ని పాడి, మన దేశానికి గౌరవం తెలియజేస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా ప్రతీ కార్యాలయం, ప్రతీ పాఠశాల, ప్రతీ గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మన గ్రామం నుండి మనమూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నాము అనేది చాలా ఆనందకరం. మన భారత దేశం మన తల్లి. ఆమె మనకు అన్నీ ఇచ్చింది నేల, నీరు, గాలి, సంస్కృతి, గౌరవం. అలాంటి తల్లికి వందనము చేసే పుణ్యక్షణం ఇది. వందే మాతరం అంటే “ఓ తల్లీ, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాల, కార్యాలయాల్లో తెలంగాణవందేమాతరం గీత ఆలాపన. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వందేమాతరం గీతాన్ని ఆలపించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

సీతారామపురం నవంబర్ (పున్నమి ప్రతినిది) స్కిల్ టెక్నాలజీకి సంబంధించి దుత్తలూరు లోని ఆదర్శ పాఠశాల విద్యార్థుల విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. దుత్తలూరు ఆదర్శ పాఠశాల ఐటి విద్యార్థులు అబ్దుల్ అజీజ్ నజీర్ , ఉస్మాన్ గని లు ఒకేషనల్ ట్రైనర్ నరేష్ సూచనలు సలహాల తో జిల్లాస్థాయిలో స్కిల్ కాంపిటీషన్ కు అర్హత సాధించి శుక్రవారం నెల్లూరులోని సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్కిల్ కాంపిటీషన్ కార్యక్రమంలో దుత్తలూరు లోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారని ప్రిన్సిపాల్ సైమన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పాల్గొంటే విద్యార్థుల యొక్క నైపుణ్యాలు మెరుగుపడటంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెంపొందించుకోవచ్చన్నారు.

E-పేపర్

ఘనంగా వందేమాతరం గీత ఆలాపన,బంకిం చంద్ర ఛటర్జీ స్మారకోత్సవం

అల్లూరి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి నవంబర్ 07: భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆవిర్భవించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా, గీత రచయిత బంకిం చంద్ర ఛటర్జీ ని స్మరించుకుంటూ అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం, తాజంగి గ్రామం పరిధిలో ఘనంగా వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి దేశభక్తిని చాటుతూ వందేమాతరం గీతాన్ని భక్తిశ్రద్ధలతో ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారిలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్య కమిటీ చైర్మన్ శెట్టి మోహనరావు,కూటమి నాయకులు బోనంగి బాలయ్య పాడాల్,బోనంగి లింగమూర్తి,మొస్య నారాయణ రావు ఉన్నారు.వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి అందించిన స్ఫూర్తిని, బంకిం చంద్ర ఛటర్జీ సాహిత్య సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. విద్యార్థులు, నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులందరూ కలిసి దేశభక్తిని ప్రదర్శిస్తూ ఈ చారిత్రక వేడుకను విజయవంతం చేశారు.

ఖమ్మం

టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్ యజమానులు సంక్షేమ సంఘం లో నాయకుల కామెంట్స్…*

ఖమ్మం జిల్లా… టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్ యజమానులు సంక్షేమ సంఘం లో నాయకుల కామెంట్స్…* మహాలక్ష్మి పథకం వచ్చిన నాటి నుండి బస్ లలో కెపాసిటీ కి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాం ప్రమాదాలు ఏమైనా జరిగిన కూడా ప్రయాణికులకు నష్టపరిహం ఇస్తున్నారు, బస్ లకు ఇన్సూరెన్ ఇవ్వమని చెప్తున్నారు మీర్జాగూడ దగ్గర జరిగిన ప్రమాదంలో ప్రభుత్వం డ్రైవర్ పై, యజమాని పై చర్యలు తీసుకుంటాం అంటున్నారు ఈ సమస్యను ఈ నెల 24 వ తేదీ లోపు పరిష్కరించకపోతే బస్ లను నిలిపివేస్తాం రీజియన్ లో ఉన్న ప్రైవేట్ బస్ లు బస్టాండ్ లో నిలిపేవాళ్ళం, ఆర్ఎం సూచనలతో బస్టాండ్ లలో బస్ లను నిలపవద్దని చెప్తున్నారు అధికారులు మా డిమాండ్లూ నెరవేర్చకపోతే బస్ లను నిలిపివేస్తాం మహిళ పథకం గురించి ముందునుండి పోరాడుతున్నాం, ఈ పథకం వలన ఎక్కువమంది ప్రయాణికులు ఉండడం కారణంగా ఇన్సూరెన్ రావడం లేదు ఖమ్మం జిల్లా కు ప్రత్యేకత ఉంది, అందుకే మా సమస్య లపై పోరాటం మొదలు పెట్టాం, మా సమస్యలు పరిష్కరించండి

ఖమ్మం

రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు

డిప్యూటీ సీఎం భట్టితో ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల చర్చలు సఫలం… రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు… కాలేజీల యాజమాన్యాలు రూ.1500 కోట్లు అడిగాయి… ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశాం… మరో రూ.600 కోట్లు వెంటనే విడుదల చేస్తాం… త్వరలో మరో రూ.300 కోట్లు విడుదల చేస్తాం… ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై త్వరలో కమిటీ వేస్తాం… డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు

ఖమ్మం

స్వాత్రంత్రానికి ఊపిరి వందేమాతరం

సామూహిక వందేమాతరం గీతాలాపన లో పాల్గొన్న….. ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ డా. శ్రీజ ఖమ్మం 07 నవంబర్ 2025 పున్నమి ప్రతినిధి- భుక్యా వినోద్ కుమార్ శుక్రవారం వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ డా. పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్పూర్తి నింపిన వందేమాతరం గేయానికి నేటీతో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. వందేమాతరం గేయంలోని ప్రతి పదం దేశభక్తి భావనతో నిండి, భారతదేశం ఒకటే అని గర్వంగా చెబుతుందని అన్నారు. ఈ గీతం మన దేశ ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ ఈ భావనను మనసులో నిలుపుకోవాలని తెలిపారు. వందేమాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందని ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపిస్తున్నట్లు ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా స్థాయిట్లోఓ చాటిన విద్యార్దులు స్కిల్ నందు

ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయిలో జరిగిన స్కిల్ కాంపిటీషన్స్ లో విద్యార్దునిలు సత్తా చాటినట్లు హెచ్ యం శ్రీనివాసురావు తెలిపారు ఆటోమోటివ్ స్కిల్ నందు తొమ్మిదోవ విద్యార్థినిలు షేక్ శలేహా , సయ్యద్ అయేషా , కె నాగలక్ష్మి, షేక్ సునిద్ జిల్లా స్థాయిలో మొదటి బహుమతి సాధించగా , అపిరియల్ ట్రేడ్ స్కిల్ నందు పదోవ తరగతి విద్యార్థులు , మానసా, అలిశా, అంజలి ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు.

తెలంగాణ

ర్యాగింగ్ పై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు విద్యార్థుల నుండి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అయినప్పటికీ ఈ విషయంపై జిల్లా యంత్రాంగం విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. తమ చర్చల్లో సీనియర్ విద్యార్థులు,జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకమైన వాతావరణంలోనే మెలిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై జిల్లా కలెక్టర్ శుక్రవారం స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డిలతో కలిసి ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ,హెచ్ ఓ డి లు, అధ్యాపక బృందం, విద్యార్థి సంఘాల నాయకులు, మెంటర్లు, విద్యార్థులతో ఆమె విడివిడిగా చర్చించారు. మీడియాలో వచ్చిన వార్తల దృశ్య నిజంగా వైద్య కళాశాలలో జరిగిన సంఘటనలను వివరించాలని ఆమె విద్యార్థులను అడిగారు. తమను ఎవరు ర్యాగింగ్ చేయలేదని స్నేహపూర్వక వాతావరణం లోనే ఉన్నామని విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.