Friday, 3 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వందేమాతరం గీతాలాపన

డాక్టర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పున్నమి ప్రతినిధి స్వాతంత్ర్య సముపార్జనలో సామాన్య ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమకారులుగా తయారుచేసేలా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు,కవి శ్రీ బంకించంద్ర ఛటర్జీ రచించి, ఆలపించిన వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సూచనమేరకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మలికిపురం ఎంవిఎన్,జెఎస్ & ఆర్వీ ఆర్ డిగ్రీ కళాశాలలో వందేమాతరం గీతం సామూహిక గీతాలాపన కన్నులపండువగా జరిగింది..ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దేవ వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే శ్రీ మానేపల్లి అయ్యాజీ వేమా,కళాశాల కరస్పాండెంట్ శ్రీ ఎం వి.సత్యనారాయణ మూర్తి, ప్రిన్సిపాల్ శ్రీమతి ఆనంద్ మహానీ కళాశాల పాలకవర్గ సభ్యులు రుద్రరాజు పద్మరాజు, మలికిపురం మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు మేడిచర్ల సత్యవాణి, డిగ్రీ, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు,హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ శ్రీ నల్లి శివకుమార్, స్టూడెంట్ యూనియన్ తరపున పోలిశెట్టి గణేష్,మానవతా మూర్తులు – సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు బోనం రాజు మరియు కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు…

E-పేపర్

శ్రీ ధనలక్ష్మి జ్యూవెలర్స్” నూతన ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల రాయుడు

శ్రీ ధనలక్ష్మి జ్యూవెలర్స్” నూతన ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల రాయుడు రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు పట్టణం మార్కెట్ వీధిలో కామిశెట్టి బద్రీనాథ్ కుమారుడు వెంకటేష్ నూతనంగా “శ్రీ ధనలక్ష్మి జ్యూవెల్లర్స్”ను శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యాజమాన్యం ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి యజమాని “కామిశెట్టి వెంకటేష్”ని శాలువతో ఘనంగా సత్కరించి మీ షాప్ కు విచ్చేయు కస్టమర్ల మన్నలను పొంది దిన దినాభివృద్ధి చెందాలని వారిని వారి కుటుంబసభ్యులను బత్యాల ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఎస్. హెచ్. జి మహిళా కుటుంబ సభ్యులకు జాబ్ మేళా

ఎస్. హెచ్. జి మహిళా కుటుంబ సభ్యులకు జాబ్ మేళా విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మిస్సన్ డైరెక్టర్ మెప్మా, జీవీఎంసీ యు సి డి ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.ఎం సత్యవేణి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘం సభ్యుల కుటుంబ సభ్యులలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా కార్యక్రమాన్ని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి విశాఖ ను అభివృద్ధి పథంలో ఉంచేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఈ నెల 14, 15 తేదీల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించి అనేక కంపెనీలు తో ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే స్వయం సహాయక సంఘం కుటుంబ సభ్యులలో నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ జాబ్ మేళాకు టాటా ఎలక్ట్రానిక్స్, పేటియం, ఎల్ & టి ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, భారత్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, ఐ ప్రోసెస్, సంగీత మొబైల్స్ మొదలైన 21 కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళ లో పాల్గొన్నారని తెలిపారు. ఈ జాబ్ మేళాకు ఆన్లైన్ లో 2328 మంది రిజిస్ట్రేషన్ చేసుకొనగా జాబ్ మేళాకు 831 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారని, వారిలో 282 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని మేయర్ తెలిపారు. అనంతరం తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించి నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు ద్వారా అనేక కంపెనీలు విశాఖ వస్తున్నాయని, తద్వారా దాదాపు ఏడు లక్షల 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. నేడు నిరుద్యోగులైన స్వయం సహాయక సంఘం కుటుంబ సభ్యులకు మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని, ఈ జాబ్ మేళా ద్వారా దాదాపు 282 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని శాసనసభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఎం సత్యవేణి, యు సి డి ప్రాజెక్ట్ ఆఫీసర్ సూర్య కళ, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు కార్తీక్, ఏపీడీలు, డీఎంసీలు, ఏడిఎంసీ లు, సి డి సి లు, పిఓలు, రిసోర్స్ పర్సన్ తదితరులు హాజరయ్యారు

విశాఖపట్నం

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా (4,59,394) రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా (4,59,394) రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- సీఎం సహాయనిది పేదలకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.ఈరోజు శివాజీపాలెం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 4 గురు లబ్ధిదారులకు నాలుగు లక్షల 59 రూపాయల (4,59,394) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , డిప్యూటీ CM శ్రీ పవన్ కళ్యాణ్ సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు . *31 వార్డు* : 31 వ వార్డు చెందిన సింగంపల్లి పద్మ కి 1,07,233 చెక్కును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అందజేశారు. కార్యక్రమంలో స్టేట్ ఆర్యవైశ్య డైరెక్టర్ శ్రీమతి రూప , టిడిపి సీనియర్ నాయకురాలు శ్రీమతి గాయత్రి , సీనియర్ నాయకులు రాజేష్ గారు, చందు , కూటమి వార్డు ఇంచార్జ్ డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ , నాని పాల్గొన్నారు. *39 వార్డు* : 39వ వార్డు కు చెందిన చెందిన పర్వీన్ సుల్తానా 67, 983/- రూపాయలు మరియు బుడ్డేడ వెంకట రావు కి 1,34,018/- రూపాయల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివప్రసాద్ రెడ్డి , ఎస్ కే ఎమ్ ఎల్ మాజీ చైర్మన్ శ్రీమతి సింహాచలం , కూటమి సీనియర్ నాయకులు దానేష్ , శ్రీను , రాజు, కోటమ్మ , సింగ్ , హీరా , హరి , సింగ్ , ఇతర నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా నగర పరిధిలో ఉన్న బండి హరీష్ కి 1,50,160 చెక్కును ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు అందజేశారు .కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 33 వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి వసంత లక్ష్మి జీకే దంపతులు, మాజీ కార్పొరేటర్ శ్రీ ఉమామహేశ్వర , జనసేన సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త శ్రీ చీకటి రమేష్ , సీనియర్ నాయకులు తేజ , శ్రీధర్ , సురేష్ , ఇతర నాయకులు పాల్గొన్నారు..

ఖమ్మం

రఘునాథపాలెం మండలంలో ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహం – గోద్రెజ్ కర్మాగారం ప్రారంభం రైతులకు సువర్ణావకాశం: తుమ్మల యుగంధర్

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతినిధి) ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండల రైతు వేదికలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సులో డ కాంగ్రెస్ యువ నేత యుగంధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆయిల్ ఫామ్ పంట సాగుకు ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. గోద్రెజ్ కర్మాగారం త్వరలో ప్రారంభమవుతుందని, దీంతో రైతులకు పెద్ద ఎత్తున లాభాలు దక్కనున్నాయని పేర్కొన్నారు. మండలంలోని రైతులందరూ ఆయిల్ ఫామ్ పంటను వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గోద్రెజ్ మేనేజర్, మార్కెట్ యార్డ్ చైర్మన్, రైతు సంఘం నాయకులు, మండల నాయకులు, రైతు సోదరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పార్టీని నిర్లక్ష్యం చేయొద్దు – నారా లోకేష్

పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొనాలని, ప్రజలకు దగ్గర కావాలని నారా లోకేష్ సూచించారు. పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత అని అన్నారు. “మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాం, కానీ వాటిని చెప్పకపోవడం వల్లే ప్రజలు గుర్తించలేకపోయారు. కియా మోటార్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తెచ్చినా ప్రచారం చేయకపోవడం ఓటమికి కారణమైంది,” అని అన్నారు. పార్టీ శాశ్వతమని గుర్తు చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని నిర్లక్ష్యం చేయరాదని, ప్రజలతో నిత్యం అనుబంధం, ప్రేమ అనురాగం కొనసాగించాలని, పార్టీని నిర్లక్ష్యం చేయవద్దు అని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశంలో వీధి కుక్కలు, పశువుల సమస్యపై సుప్రీంకోర్టు గంభీరంగా స్పందించింది. జాతీయ రహదారులు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై తిరుగుతున్న నిరాశ్రయ జంతువులను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. తరలించిన జంతువులకు తగిన సంరక్షణ, ఆహారం, ఆశ్రయం కల్పించడం తప్పనిసరిగా చూడాలంటూ స్పష్టం చేసింది. అధికారులు ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే వ్యక్తిగత చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఎనిమిది వారాల్లోగా అమలు విధానం, తీసుకున్న చర్యలపై వివరణాత్మక రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ నిర్ణయం పౌర భద్రతతో పాటు జంతు సంక్షేమాన్ని కాపాడే దిశగా తీసుకున్న కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.

తెలంగాణ

పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్న : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి) నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఎస్ఎల్ బి సి కాలనీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.శుక్రవారం ఆమె యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు.

తెలంగాణ

శాస్త్ర స్కూలు లో వందేమాతర గేయం

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) ఈరోజు నల్గొండ జిల్లా నకిరేకల్ లోని శాస్త్ర స్కూల్లో వందేమాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందేమాతరం గేయ రచనకు బంకించంద్ర చటర్జీ భావావేశం, సామాజిక పరిస్థితులు, జాతీయగీతంగా, గుర్తింపును, శాస్త్ర స్కూల్ విద్యార్థులకు వివరించడం జరిగింది. భరతమాత పూజ మరియు పూర్తి వందేమాతరం గీతాలాపన, దాని భావం, భరతమాతకు హారతి ఇవ్వడం, చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతృ శక్తి, నల్గొండ విభాగ్ సంయోజక సత్యవతి, పాఠశాల డైరెక్టర్ శ్రీమతి సరిత, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు గార్లు, పరిషత్ మాతృ శక్తి కల్పన, సులోచన, శ్రీదేవి,స్వర్ణ, సరస్వతి,రాణి,శిరీష,లక్ష్మమ్మ, మరియు చిన్నారులు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు.

అన్నమయ్య

శ్రీ సద్గురు సాయినాథ్ మందిరం 26వ వార్షికోత్సవంలో స్కౌట్ సభ్యుల సేవా కార్యక్రమం

శ్రీ సద్గురు సాయి నాథ్ మందిరం,సాయి నగర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో 26వ వార్షికోత్సవ వేడుకలు శ్రద్ధాభక్తులతో నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమం, భక్తులకు స్వామి వారి దర్శన ఏర్పాట్లు, అనంతరం అన్నదానం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో స్వర్ణేంద్రా మదర్ విక్టరీ స్కౌట్ గ్రూప్, నందలూరు సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు.స్కౌట్ మాస్టర్ వేపగుంట సాంరాజ్ ఆధ్వర్యంలో 18 మంది స్కౌట్ సభ్యులు భక్తుల దర్శన క్యూలైన్ వ్యవస్థాపన, నీరు, ప్రసాదం పంపిణీ వంటి సేవల్లో పాల్గొన్నారు.గత 15 సంవత్సరాలుగా సాంరాజ్ మరియు వారి బృందం నిరంతరంగా సాయినాథ్ స్వామి సేవలో పాల్గొంటున్నారని ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు.ఈ సందర్భంగా స్కౌట్ బృందాన్ని సన్మానించి ₹3,000/- ఆర్థిక సహాయం అందజేశారు.ఈ వేడుకలకు గౌరవ ముఖ్య అతిథిగా కె.సుబ్బరామి రెడ్డి, దేవస్థానం అధ్యక్షులు కె. కృష్ణమూర్తి,సభ్యులు ఎన్. శివరాజు తదితరులు హాజరై భక్తులతో కలిసి స్వామి వారి ఆశీర్వచనాలు పొందారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.