Friday, 3 April 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి భరోసా – పార్టీ అండగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్

మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రేరితంగా అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన ఘటనపై, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. పార్టీ ఎల్లప్పుడూ జోగి రమేష్ కుటుంబానికి అండగా ఉంటుందని, న్యాయపోరాటం లో పూర్తి సహకారం అందిస్తా మని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వేలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, డాక్టర్ మొండి తోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ ఎం.డి.రూహుల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, అలాగే రాష్ట్ర మరియు జిల్లా స్థాయిపలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ, “జోగి రమేష్ పై పెట్టిన కేసు పూర్తిగా రాజకీయ కక్షతో నిండినది. ప్రజల కోసం నిరంతరం సేవ చేసిన నాయకు డిని ఇలా టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి హానికరం. ప్రజలు ఈ అక్రమ చర్యలకు తగిన గుణపాఠం చెబుతారు,” అని అన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ పట్టణంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న గాంధీ సెంటర్‌లో, నియోజకవర్గ ఎస్‌.సి.సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పాల్గొని, ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహనరావు మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం సామాన్య విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్‌.సి.సెల్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హైదరాబాద్

అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లు*

*అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లు* గూగుల్ సంచలన ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ ప్రకటన! పున్నమి స్టాప్ రిపోర్టర్ : యామల రామమూర్తి ; ​కృత్రిమ మేధస్సు (AI) కోసం భూమిపై విద్యుత్ భారాన్ని తగ్గించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ (Google) మరో వినూత్నమైన ముందడుగు వేసింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్… ఏకంగా అంతరిక్షంలోనే ఏఐ డేటా సెంటర్లను నిర్మించే ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ (Project Suncatcher) పరిశోధన కార్యక్రమాన్ని ప్రకటించారు. భూమికి సమీప కక్ష్యలో సౌరశక్తితో పనిచేసే ఉపగ్రహాల ద్వారా ఈ ఏఐ వ్యవస్థలను నిర్మించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ​సూర్యరశ్మిని పట్టుకునే యత్నం ​కృత్రిమ మేధస్సు అల్గారిథమ్‌లను నిర్వహించడానికి భారీ స్థాయిలో విద్యుత్ శక్తి అవసరం. దీనివల్ల భూమిపై పర్యావరణ భారం పెరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగానే గూగుల్ **’ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’**కు శ్రీకారం చుట్టింది. అంతరిక్షంలో లభించే అపారమైన సౌరశక్తిని వినియోగించుకుని ఏఐ కంప్యూట్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ​ఎనిమిది రెట్లు ఎక్కువ సామర్థ్యం ​గూగుల్ పరిశోధనల ప్రకారం, భూమిపై ఉండే సోలార్ ప్యానెల్‌ల కంటే అంతరిక్షంలోని సరైన కక్ష్యలో ఉండే ప్యానెల్‌లు ఎనిమిది రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేయగలవు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, గూగుల్‌కు చెందిన ప్రత్యేక ఏఐ చిప్‌లు (Tensor Processing Units – TPUs) అమర్చిన చిన్న ఉపగ్రహాల సమూహాన్ని భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ లింక్‌ల (లేజర్ కిరణాల) ద్వారా కమ్యూనికేట్ చేసుకుని, భారీ మెషిన్ లెర్నింగ్ (ML) పనులను ప్రాసెస్ చేయనున్నాయి. ​సుందర్ పిచాయ్ ప్రకటన: “మా టీపీయూలు (TPUs) అంతరిక్షానికి వెళ్తున్నాయి! క్వాంటం కంప్యూటింగ్ నుంచి ఆటోనమస్ డ్రైవింగ్ వరకు మా ‘మూన్‌షాట్’ (Moonshot) చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని, ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ ద్వారా ఒకరోజు అంతరిక్షంలో స్కేలబుల్ ML కంప్యూట్ వ్యవస్థలను ఎలా నిర్మించవచ్చో అన్వేషిస్తున్నాం. ఇందుకోసం సూర్యుడి శక్తిని మరింతగా ఉపయోగించుకుంటాము.” ​2027 నాటికి తొలి ప్రయోగాలు ​ప్రాజెక్ట్ తొలి మైలురాయిగా, 2027 ప్రారంభంలో ‘ప్లానెట్’ (Planet) సంస్థ భాగస్వామ్యంతో రెండు ప్రొటోటైప్ (ప్రయోగాత్మక) ఉపగ్రహాలను ప్రయోగించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉపగ్రహాలు అంతరిక్షంలోని రేడియేషన్‌ను, ఇతర ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఏఐ చిప్‌ల పనితీరును అంచనా వేస్తాయి. ​సవాళ్లు లేకపోలేదు ​అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు అనేది ఒక విప్లవాత్మకమైన ఆలోచన అయినప్పటికీ, ఇందులో సాంకేతిక సవాళ్లు చాలా ఉన్నాయి. ఉపగ్రహాల మధ్య అత్యంత వేగంతో డేటాను పంపే వ్యవస్థను అభివృద్ధి చేయడం, అంతరిక్షంలో చిప్‌లను రేడియేషన్ నుండి రక్షించడం, ఉష్ణోగ్రత నియంత్రణ (Thermal Management) వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉందని గూగుల్ ఇంజనీర్లు తెలిపారు. ​ఏదేమైనా, ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ ప్రకటనతో, ఏఐ మరియు అంతరిక్ష సాంకేతికత రంగాల్లో గూగుల్ మరోసారి తన సత్తా చాటుకుంది. భవిష్యత్తులో డేటా సెంటర్ల అవసరాలను అంతరిక్షం ద్వారా తీర్చడానికి ఈ ప్రయత్నం ఒక బలమైన పునాది వేయనుంది. ​మీరు ఈ కథనానికి తగిన ఫోటో లేదా గ్రాఫిక్‌ను జతచేయాలనుకుంటున్నారా?

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, NCC యూనిట్ 7/11/2025న కళాశాల ప్రాంగణంలో గొప్ప ఉత్సాహంతో మరియు దేశభక్తి ఉత్సాహంతో వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన జాతీయ గీతం వందేమాతరం వారసత్వాన్ని గౌరవించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ గారు మరియు NCC అధికారి బి. కోమలి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు, తరువాత బంకిం చంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ ఒక సంక్షిప్త ప్రసంగం చేశారు. ఈ ముఖ్యమైన సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి, రెండు పోటీలు నిర్వహించబడ్డాయి: 1. సామూహిక పాటల పోటీ – ఇక్కడ NCC క్యాడెట్లు వందేమాతరంతో సహా దేశభక్తి గీతాలను పాడారు, వారి ఐక్యత మరియు క్రమశిక్షణను ప్రదర్శించారు. 2. పోస్టర్ తయారీ పోటీ – దేశభక్తి, స్వేచ్ఛ మరియు వందేమాతరం యొక్క కీర్తి ఇతివృత్తాల ఆధారంగా పోస్టర్లను రూపొందించడం ద్వారా క్యాడెట్లు తమ కళాత్మక ప్రతిభను వ్యక్తం చేశారు. ఈ వేడుకలు ప్రతి క్యాడెట్‌ను మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుంచుకోవడానికి మరియు వందేమాతరం ఆదర్శాలైన భక్తి, ధైర్యం మరియు మన మాతృభూమి పట్ల ప్రేమను కలిగి ఉండటానికి ప్రేరేపించాయి.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి భవన్ పై ఉన్న విద్యుత్ తీగలు క్రిందకు ఉండటం తోనే ఈ ప్రమాదం జరిగింది అంటున్న స్థానికులు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అంటూ ధర్నా చేపట్టిన బంధువులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

జోగులాంబ గద్వాల

ఐజ పట్టణ కేంద్రంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

ఐజ పట్టణ కేంద్రంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు గద్వాల్ నవంబర్ 8 (పున్నమి ప్రతినిధి) ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ SA సంపత్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు ఐజ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు ఉత్తనూర్ జయన్న అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ *ఎనుముల రేవంత్ రెడ్డి గారి* జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ⚡రేవంత్ రెడ్డి గారి వేడుకలను పురస్కరించుకొని ఐజ మండల మరియు పట్టణంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకొని కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని , ఆయన అనుసరిస్తున్న ప్రజా పాలన విధానాన్ని నినాదాలతో కొనియాడారు. ⚡ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ సంకాపురం రాముడు సీనియర్ ఎక్స్ ఎంపిటిసి R శ్రీధర్, , SC సెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మద్దిలేటి , మాజీ కౌన్సిలర్లు గిత్తల దేవరాజు ,ఆంజనేయులు,అధికార ప్రతినిధి మైనర్ బాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాలి రెడ్డి భూమి పురం నరసింహారెడ్డి, తిమ్మారెడ్డి , ఉప్పల తిప్పన్న, దేవేంద్ర,మహేష్ , సోషల్ మీడియా ఇంచార్జ్ లాల్ గౌడ్ ,రవీందర్ , శంకర్ గౌడ్ ,మాజీ సర్పంచ్లు భాస్కర్ గౌడ్ ,లక్ష్మన్న, నాయకులు కృష్ణారెడ్డి ,రఘు గౌడ్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కనిగిరి కొండపై కార్తీక జ్యోతి వెలిగింపు: భక్తితో పరమశివుడికి ఆంజనేయుల నివాళి

కనిగిరి కొండపై కార్తీక మాసం సందర్భంగా, పట్టపురాజు ఆంజనేయులు స్వామి ప్రతిరోజూ సాయంత్రం కొండపైకి వెళ్లి కార్తీక జ్యోతిని వెలిగిస్తున్నారు. 17వ రోజు శుక్రవారం సాయంత్రం, ఆయన స్వామివారికి నైవేద్యం సమర్పించి, శివ స్మరణ చేసి జ్యోతిని వెలిగించారు. కనిగిరి మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ జ్యోతిని దర్శించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్

పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమా నాయక్ కు ఘన వీడ్కోలు

కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) భీమా నాయక్ బదిలీ సందర్భంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి,కనిగిరి డి.ఎస్.పి తో కలిసి బిజెపి కనిగిరి అసెంబ్లీ కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమా నాయక్ సేవలను కొనియాడుతూ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఆంధ్రప్రదేశ్

కనిగిరి బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెండ్

శుక్రవారం, కనిగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహం వార్డెన్ చంద్ర కుమారిని విధుల పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా కలెక్టర్ రాజాబాబు సస్పెండ్ చేశారు. విద్యార్థినులను సెలవులపై పంపించే సమయంలో ఒంటరిగా పంపిస్తున్నారనే ఆరోపణలపై విచారణ అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్ వెల్లడించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాదాల నాగభూషణమ్మను మోసగించిన వి ధనలక్ష్మి

నెల్లూరులోని పొదలకూరు నేతాజీ నగర్ నందు నివసిస్తున్న నాగభూషణమ్మ ఇంటి వద్ద ఉన్న వి ,ధనలక్ష్మి అనే ఆమె ఓల్డ్ ఏజ్ హోమ్ పెడదామని మాదాల నాగభూషణమ్మకు తమకు చెప్పగా తమ అందుకు ఒప్పుకున్నారు ఆమె దగ్గర సుమారు ఐదున్నర సేవర్ల బంగారం నగదు 7,30,000 తీసుకున్నారు అనే అడిగినప్పుడల్లా అదిగో ఇదిగో అని బ్యానర్లు ఫొటోస్ చూపించడం మొదలు పెట్టింది ఈ విషయం తెలిసే ఆమె నిలదీయగా ఈరోజు రేపు అని కాలం గడిపింది అని ఆమె శనివారం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బాధను ఆమె చెప్పగా నాకు ఎక్కడ ఇటువంటి న్యాయం జరగలేదు నా నగదు నాకు ఇప్పించండి అని బోరున విలపించారు నగదు కొన్ని రోజులకి మాదాల నాగభూషణ్ అమ్మ తన ఇంటి వద్దకి వీ ధనలక్ష్మి కుమారుడు సూరజ్ అతని శ్నేహీతులు చంపేస్తామని బెదిరించారు తమకు ప్రాణహాని ఉంది ప్రాణాలను రక్షణ కల్పించాలని ఆమె కోరుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.