Friday, 3 April 2026

Blog

విశాఖపట్నం

కాంగ్రెస్ సానుభూతిపరుల పై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కక్ష సాధింపు :

*కాంగ్రెస్ సానుభూతిపరుల పై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కక్ష సాధింపు : ప్రియాంక దండి* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * ఆంధ్ర విశ్వవిద్యాలయం కక్ష సాధింపుకి,అవినీతికి కేర్ అఫ్ అడ్రస్ గా మారిందని, కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి విమర్శించారు. యూనివర్సిటీ యాజమాన్యం కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల మీద వేధింపులు చేస్తున్నారని,కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఉద్యోగం నుండి తొలగిస్తామని హేచ్చరిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, వారికి కాంగ్రెస్ పట్ల సానుభూతి ఉంది,అలాంటి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు, ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సెలర్ ఆర్ ఎస్ ఎస్ కు చెందిన వ్యక్తి అని అతనికి కాంగ్రెస్ అంటే పడదని యూనివర్సిటీలో ప్రచారం నడుస్తోందని ప్రియాంక అన్నారు. ఏయూలో ఎస్ సి, ఎస్ టీ పోస్టులకు సంబంధించి అక్రమాలు జరిగాయి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ తరుపున వైస్ ఛాన్సెలర్ పై విచారణకు డిమాండ్ చేస్తున్నామని ప్రియాంక అన్నారు.

అమరావతి

48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వండి **

ఆ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వండి *అమరావతి* పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీ కార్యాలయ సిబ్బందితో శనివారం ఆయన సమావేశమయ్యారు. పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

అమరావతి

తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,

*అమరావతి (విశాఖ పున్నమి ప్రతినిధి)* * తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. * అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణం. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ . * * ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. * నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. * గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. * ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర తెలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు అరెస్ట్ ‌‌

*తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు అరెస్ట్ ‌‌ అమరావతి(పున్నమి ప్రతినిధి) తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు అజయ్‌కుమార్‌ సుగంధ్‌ (A16)ను సిట్ అరెస్ట్‌ చేసింది. ఆయన మోన్ గ్రీజరాయిడ్స్‌, అసటిక్‌ యాసిడ్‌ యాస్టర్‌ వంటి రసాయనాలను బోలేబాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. సిట్‌ నివేదిక ప్రకారం, లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90 శాతం పామాయిల్‌ కలిపినట్లు గుర్తించారు. దీంతో సుగంధ్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.

తిరుపతి

కళత్తూరులో బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు

శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్ : తిరుపతి జిల్లా, సత్యే వేడు నియోజకవర్గంలోని కె.వి.పురం మండలం పాతకాలంలో వున్న రాయలచెరువుకు గండి పడి సర్వం కోల్పోయిన బాధితులను శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు శనివారం పరామర్శించారు. అలాగే ప్రభుత్వం తరుపున సహాయం అందించెందుకు కృషి చేస్తామని బాదితులకు హామీ ఇచ్చారు. రాయలు చెరువుకు గండి పడటం పాతపాలెం,కళత్తూరు ఎస్సీ కాలనీ పాత పాల్యేం అరుంధతి వాడ లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురి అయ్యారని, పశువులు గొర్రెలు గేదలు మేకలు మూగజీవాలు కోల్పోయారని పెట్టుకున్న పంట వందల ఎకరాలలో పంట కోల్పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించేలా చూస్తామన్నారు. అదే విధంగా 2000 కుటుంబాలు వీధిదనపడ్డారని వారికి సహాయ సహకారం అందిస్తామన్నారు. ఈ ప్రమాదానికి గురి అయిన ప్రజలకు, మూగజీవాలకు ప్రభుత్వం సహాయ అందించేలా కృషి చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేవిబిపురం మాజీ ఎంపిపి సుబ్రహ్మణ్యం,టిడిపి నాయకులు జయరామి రెడ్డి, సుదర్శన్ నాయుడు, రమేష్, సురేష్ నాయుడు, గోగినేని భాస్కర్ నాయుడు, అంజూరు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

రోడ్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి*

*రోడ్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి* జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి * నగరంలో చేపడుతున్న రోడ్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కాన్వెంట్ జంక్షన్ నుంచి ఐ.ఎన్.ఎస్. డేగ, పోర్టు డాక్ ఏరియా వరకు చేపడుతున్న రోడ్డు పనులను జీవీఎంసీ, ఎన్.హెచ్. విభాగాల అధికారులతో కలిసి శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. పార్టెనర్షిప్ సమ్మిట్ నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని, వేగంగా వేయాలనే కారణంతో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. అన్ని ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేయాలని చెప్పారు. సంబంధిత విభాగాల అధికారులు పనులను నిత్యం పర్యవేక్షించాలని, నిర్ణీత సమయానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు జీవీఎంసీ సీఈ సత్యనారాయణ రాజు, ఎస్.ఈ., జాతీయ రహదారుల విభాగం అధికారులు ఉన్నారు.

అటవీ శాఖ మంత్రిని కలసిన ఎమ్మేల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో అటవీ శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ని కలసి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అటవీ శాఖకు సంబంధించి పలు అంశాలను ఎమ్మేల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వివరించడంజరిగినది.

అమరావతి

ఆపరేషన్ మొదలైతే ఆగదు… ఎర్రచందనం స్మగర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్*

*ఆపరేషన్ మొదలైతే ఆగదు… ఎర్రచందనం స్మగర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్* అమరావతి ( విశాఖ పున్నమి ప్రతినిధి):- *ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామన్న పవన్ కల్యాణ్* *నలుగురు కీలక స్మగ్లర్లను గుర్తించామని వెల్లడి* *తిరుపతిలో అటవీ ప్రాంతాలు, గోదాములను పరిశీలించిన అటవీశాఖ మంత్రి* *స్మగ్లింగ్ కట్టడికి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని వెల్లడి* *అక్రమార్కుల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని తీవ్ర హెచ్చరిక* *చెట్ల నరికివేతలో పాలుపంచుకోవద్దని స్థానికులకు విజ్ఞప్తి* ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని, ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురు కింగ్‌పిన్‌లను గుర్తించామని అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శనివారం తిరుపతి జిల్లాలో పర్యటించిన ఆయన, మామండూరు అటవీ ప్రాంతంతో పాటు మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “ఎర్రచందనం చెట్టుకు గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఇది సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి గాయం నుంచి పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రమైన సంపదను కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు దాదాపు 2 లక్షల చెట్లను నరికి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని, జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంపై సీఎం సిద్దరామయ్యను కోరినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. “ఇప్పటికే నలుగురు ప్రధాన స్మగ్లర్లను గుర్తించాం. వారిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒకసారి ఆపరేషన్ మొదలుపెడితే వెనుదిరిగే ప్రసక్తే ఉండదు. ‘ఆపరేషన్ కగార్‌’ను అమలు చేస్తున్న ఈ దేశంలో స్మగ్లర్ల ఆట కట్టించడం పెద్ద కష్టం కాదు” అని ఆయన స్పష్టం చేశారు. స్మగ్లర్లు స్వచ్ఛందంగా ఈ అక్రమ కార్యకలాపాలను ఆపకపోతే అటవీ చట్టం ప్రకారం వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ఈ అక్రమ నరికివేతలో స్థానిక ప్రజలు, తమిళనాడు కూలీలు భాగస్వాములు కావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎర్రచందనాన్ని కాపాడే బాధ్యత వేంకటేశ్వరస్వామి భక్తులపై కూడా ఉందని ఆయన గుర్తుచేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.