Wednesday, 1 April 2026

Blog

E-పేపర్

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న భోళాశంకర్ సేవా సమితి మందల నాగేంద్ర

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న భోళాశంకర్ సేవా సమితి రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలంలో భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షులు మందల నాగేంద్ర ఆధ్వర్యంలో నిరుపేదల ఆకలి తీర్చడానికి శివ పరమాత్మని ఆశీస్సులతో భోళా శంకర్ సేవాసమితి ద్వారా నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదే కోవలో గురువారం ఎన్నారై మందల పాలకొండ్రాయుడు దాతృత్వంతో భోళా శంకర్ సేవా సమితి ద్వారా పట్టణంలోని నిరుపేద కుటుంబీకురాలు, వృద్ధురాలు షేక్ ఫాతిమా మరియు రోడ్డు ప్రమాదంలో చేతులు కోల్పోయిన ఆమె కుమారుడు కి రోజు గడవడమే కష్టమవుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షులు, సభ్యులు కలిసి ఆ నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువులు మరియు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మందల నాగేంద్ర మాట్లాడుతూ ఎన్ఆర్ఐ మండల పాలకొండ్రాయుడు దాతృత్వంతో మన సేవా సమితి ద్వారా ఆ నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువులు, బియ్యం పంపిణీ చేసి వారి కాస్తయినా కష్టాలను తీర్చినవారిగా మనస్తృప్తిగా ఉందని, అలాగే మేము చేసేటువంటి సహాయ కార్యక్రమాలకు దాతృత్వం చేస్తున్న దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని, ఇదేవిధంగా రైల్వే కోడూరు మండలంలో నిరుపేద కుటుంబీకులకు సహాయ సహకారాలు అందించాలన్న సంకల్పం ఎవరికైనా కలిగితే మీరు స్వయంగా అయినా చేయగలరు లేనిపక్షంలో మన సేవా సమితి ద్వారా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోలా శంకర్ సేవాసమితి సభ్యులు సిహెచ్ రమేష్, బైసాని కిరణ్ కుమార్ ,ఉత్తరాది శివకుమార్, వాసా బాబు, పోలశెట్టి రాజేశ్వరి, కొప్పాల శంకరయ్య, మల్లెల మణి, మహంకాళి సుబ్రమణ్యం, పెనుగొండ సుబ్బరాయుడు, యనమాల చైతన్య, శేఖర్, యనమల రత్తయ్య, కంభంపాటి వెంకటరమణ, టంగుటూరి వెంకటకృష్ణ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మద్దిపాడు యువకుడిపై.. మార్కాపురంలో పోక్సో కేసు

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్సై సైదుబాబు తెలిపారు. మార్కాపురానికి చెందిన బాలికను మద్దిపాడుకు చెందిన ఓ యువకుడు రెండు రోజుల కిందట తీసుకువెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

జోగులాంబ గద్వాల

ఛలో ఢిల్లీ 17న దళితుల ఆత్మగౌరవ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

*ఛలో ఢిల్లీ 17న దళితుల ఆత్మగౌరవ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం* *సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన – న్యాయవాది రాకేష్ ను అరెస్టు చేసేదాకా ఉద్యమిద్దాం* *మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేసిన – తెలంగాణ రాష్ట్ర మాదిగ హక్కుల దండోరా వర్కింగ్ ప్రెసిడెంట్ మేడికొండ సామేలు గద్వాల నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి ) ఐజ మండలకేంద్రం లోని స్థానిక మేడికొండ చౌరస్తా నందు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేడికొండ సామేలు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ తలపెట్టిన చలో 17న ఢిల్లీ దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమం విజయవంతం చేయుటకై కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్.గవాయ్ పై దాడి జరిపిన న్యాయవాది రాకేష్ ను అరెస్ట్ చేయకపోవడం బాధాకరమని అన్నారు.మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేపట్టిన చలో ఢిల్లీ 17 న దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమం విజయవంతం చేయుటకై తెలంగాణ మాదిగ హక్కుల దండోరా తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. జిల్లాలోని ప్రతి దళిత సోదరుడు ఢిల్లీలో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అయిజ జానయ్య,సురేష్,బాల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

ఇస్సన్నపల్లిలో కాలభైరవుని బ్రహ్మోత్సవం : అగ్నిగుండాల పాదయాత్రలో భక్తి జ్వాలలు.

– ధర్మబోధతో మంత్రముగ్ధులైన భక్తులు రామారెడ్డి మండల ప్రజలు కామారెడ్డి, 13 నవంబర్, (పున్నమి ప్రతినిధి) : ఇస్సన్నపల్లి గ్రామం ఉదయం వెలుగు రాకముందే భక్తి తరంగాల్లో తేలింది. కామారెడ్డి జిల్లా, రామారె డ్డి మండలం,ఇస్సన్నపల్లి గ్రామంలో శ్రీ కాలభైరవ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రారంభమైన బ్రహ్మో త్సవ వేడుకలు, భక్తుల ఆరాధనతో ఒక ఆధ్యాత్మి క ఉత్సవమైమారాయి. ఘంటానాదాల మధ్య స్వామి రథం ఆలయ ఇరు గ్రామాల పురవీధుల గుండా తిరుగుతుండగా, “భైరవ శరణం.. ఓం ఓం భైరవ ” అంటూ ప్రతిధ్వనించిన నినాదాలు గాలిని మంత్ర ముగ్ధం చేశాయి. వీరశైవుల ఆధ్వర్యంలో అగ్నిగుండాల గుండా భగభగ కాల్ నిప్పులపై పాదలతో నడుచుకుంటూ వెళ్లిన భక్తులు అందరి దృష్టినీ ఆకర్షించారు. అగ్ని మీద నిరభయంగా వేసిన ప్రతి అడుగు భైరవునిపై ఉన్న అచంచల నమ్మకానికి ప్రతీకగా నిలిచింది. నిప్పుల మీద నడిచిన ఆక్షణం భయం కరిగిపోయి విశ్వా సం వెలిగిన క్షణమైంది. గ్రామస్తులు అగ్నిగుండాల చుట్టూ వాల్మీకి శ్లోకాలు, భజనలు ఆలపించారు. ఆ అనంత భక్తిభావంలో తేలారు. స్వామీజీ ప్రవచ నాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని రేపాయి. “భైరవుడు భయాన్ని గెలిపించే శక్తి కాదు, భయాన్ని తొలగించే దైవ తత్త్వం” అంటూ ఆయన వివరించగా, భక్తులు కళ్లలో తళుకులు మెరిశాయి. ధర్మం, భయరహిత జీవనం, భక్తి వినమ్రత వంటి విలువలను స్వీకరిం చాలని ఆయన సందేశం ఇచ్చారు.సాయంత్రం ఆలయంలో దీపారాధనతో చీకట్లు కరిగిపోయా యి. సువాసనతో నిండిన అన్నదాన సత్కారాలు జరిగి, గ్రామమంతా విశ్వా స సుగంధంతో తేలింది. ప్రతి భక్తుని చేతిలో ప్రసా దం మాత్రమే కాదు, హృదయంలో ఒక కాంతి వెలిగింది. రాత్రి వేళలో వేల దీపాలతో మెరిసిన కాలభైరవ ఆలయం, ఇస్సన్నపల్లి ఆత్మను ఆశీర్వ దించినట్లు కనిపించిం ది.ఆ ఒక రాత్రి భక్తి రూపం లో దేవుడు మనమధ్య నడిచిన అనుభూతిని అందించింది.ఈ కార్యక్రమం లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, ఆలయ ఈవో ప్రభు స్వామి, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ పంతులు, వీరశైవులు జంగం ప్రభు స్వామి,జంగం కుమారస్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్త లు దాతలు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.

తెలంగాణ

మత్తు ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమం

మేడ్చల్–మల్కాజ్గిరి, నవంబర్ 13 : శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల (SNIST)లో నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) యూనిట్ మరియు Eagle Force సంయుక్త ఆధ్వర్యంలో మత్తు ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. యువతలో మత్తు ద్రవ్యాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ Dr. టి. చి. శివారెడ్డి గారు, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ Dr. ప్రీతి జీవన్ గారు మరియు Eagle Force బృందం సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ప్రధాన అతిథులుగా శ్రీ సైదులు గారు (డీఎస్పీ), శ్రీ పి. శ్రీనివాస్ గారు (ఇన్స్పెక్టర్), శ్రీమతి కె. మాధవి గారు (నేషనల్ ప్రెసిడెంట్ – ఇంపాక్ట్ ఇంటర్నేషనల్), శ్రీ రామచంద్రుడు గారు (నేషనల్ సెక్రటరీ – ఇంపాక్ట్ ఇంటర్నేషనల్), శ్రీ పర్షురామ్ బింగి గారు (ఆంటీ డ్రగ్స్ సోల్జర్), శ్రీ ఎల్. రమేష్ గారు, మరియు శ్రీ తులసీకుమార్ గారు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు విద్యార్థులకు మత్తు ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, కుటుంబం మరియు సమాజంపై వాటి దుష్ప్రభావం గురించి వివరించారు. “మత్తు ద్రవ్యాలు మన భవిష్యత్తును చీకటిలోకి నెడతాయి – వాటికి దూరంగా ఉండటం మన బాధ్యత” అని యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా Eagle Force ప్రతినిధులు తమ సంస్థ దేశవ్యాప్తంగా చేపడుతున్న Anti-Drug Awareness కార్యక్రమాల గురించి వివరించారు. వారు మత్తు ద్రవ్యాల వ్యసనాన్ని పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా తీసుకుని, ప్రతి జిల్లాలో యువతలో చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమాజంలో మత్తు ద్రవ్యాల వ్యతిరేక పోరాటం కొనసాగిస్తూ, ప్రభుత్వ సంస్థలతో పాటు విద్యాసంస్థల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా Eagle Force బృందం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, బాధ్యతా భావం పెంచడంలో కీలకపాత్ర పోషించింది. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో NSS యూనిట్ ముఖ్యపాత్ర పోషించింది. సామాజిక సేవా దృక్పథంతో ప్రతి కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తూ, సమాజ అభివృద్ధికి NSS వాలంటీర్లు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా కూడా NSS తమ సేవాతత్వాన్ని మరొకసారి ప్రతిఫలింపజేసింది.

విశాఖపట్నం

ఈ నెల 14 తేదీన విడుదల కానున్న *రోలుగుంట సూరి* సినిమా.. చిత్రం విడుదల సందర్భంగా ‘రోలుగుంట సూరి’ మూవీ ప్రెస్ మీట్ గాజువాక ప్రజల మద్దతు కోరిన మూవీ టీం…

విశాఖపట్నం, నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి): గాజువాక ప్రాంతానికి చెందిన యువ హీరో ప్రధాన పాత్రలో నటించిన ‘రోలుగుంట సూరి’ సినిమా ప్రెస్ మీట్‌ నిన్న గాజువాకలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, అభిమానులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హీరో మాట్లాడుతూ — “నేను గాజువాక ప్రాంతానికి చెందిన వాడిని. నా ఊరి ప్రజల ప్రేమ, ప్రోత్సాహం ఎప్పుడూ నాకు బలం. మా సినిమా రోలుగుంట సూరి లో మన ప్రాంతానికి చెందిన , మనుషుల జీవితం ప్రతిబింబిస్తుంది. అందరూ సినిమా థియేటర్‌కి వెళ్లి సపోర్ట్‌ చేయాలి” అని కోరారు. దర్శకుడు మాట్లాడుతూ — “సూరి కథ ఒక సాధారణ మనిషి అసాధారణ ప్రయాణం. రియలిస్టిక్ టచ్‌తో ప్రతి సీన్‌ను తీర్చిదిద్దాం. ఈ సినిమా యాక్షన్‌తో పాటు భావోద్వేగాల సమ్మేళనం అవుతుంది” అన్నారు. నిర్మాతలు — “గాజువాకలోంచి వచ్చిన యువ హీరో ప్రతిభను పెద్ద స్థాయిలో చూపించాలన్న ఆలోచనతో ఈ సినిమా తీశాం. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం” అన్నారు. సినిమా ట్రైలర్‌కి ఇప్పటికే యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌ రావడం, పాటలు మంచి స్పందన పొందడం ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ‘రోలుగుంట సూరి’ — యాక్షన్‌, భావోద్వేగాలు, స్థానికత కలగలిసిన సినిమా ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తప్పకుండా ప్రజలందరూ థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడాలని మూవీ టీం కోరారు.

ఆంధ్రప్రదేశ్

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

గత కొంతకాలంగా మద్యానికి బానిసై విపరీతంగా మద్యం తాగుతున్న ఓ వ్యక్తి బుధవారం హనుమంతునిపాడు మండలంలో మృతి చెందాడు. నీలకంఠాపురం గ్రామానికి చెందిన ఆదినారాయణ అతిగా మద్యం తాగుతూ ఇంటికి వెళ్లడం లేదు. బుధవారం మద్యం దుకాణం వద్ద మద్యం తాగేందుకు వెళ్లి ఆదినారాయణ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.

భక్తి

వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి పున్నమి న్యూస్ ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. అనపర్తి మండలం సోమేశ్వరంలొ బాలా త్రిపుర బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, శాంతి కళ్యాణం అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ఈ కోటి దీపాల కాంతులతో వెలిగిపోయాయి. వేదమంత్రాలు, భక్తి గేయాలతో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది కందర్ప కామేశ్వరరావుగారు (గ్రామ పురోహితులు) మరియు వేద పండితుల సమక్షంలో జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. దీపకాంతులతో దేవీప్యమానంగా సోమేశ్వరం ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతులు ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా, ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేశారు. End

అన్నమయ్య

కూటమి ప్రభుత్వ మరో హామీ అమలు – 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు శ్రీకారం మేడా విజయ శేఖర్ రెడ్డి

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మరో ముఖ్య హామీని అమలు దిశగా నేడు ముందడుగు వేసింది.అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసిన 3 లక్షల 192 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించి, ఒకేసారి గృహప్రవేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అని. పేదలకు సొంతిల్లు కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం నిరంతర కృషి చేసింది అని. ఆ ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 నెలల్లో 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగలిగాం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేడు ఈ భారీ గృహప్రవేశ కార్యక్రమం జరిగిందని.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పేద కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది అని తెలిపారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది అందులో పీఎంఏవై-బీఎల్సీ కింద 2,28,034 ఇళ్లు,పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై-జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లు,మొత్తం 3,00,192 ఇళ్ల నిర్మాణం పూర్తయింది అని తెలిపారు. మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వ సంకల్పబలం,ప్రజా సంక్షేమానికి అంకిత భావానికి నిదర్శనం.ప్రతి పేద కుటుంబానికి గృహ భద్రత కల్పించడం ద్వారా కూటమి ప్రభుత్వం నిజమైన సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది” అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేసారి జరిగే ఈ గృహప్రవేశాల ద్వారా ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని మరోసారి నిలబెట్టుకుంది అని.పేదల సంతోషం కుటుంబాల స్థిరత్వం ఇదే కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.

అన్నమయ్య

మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట — పఠాన్ మెహర్ ఖాన్

2025–26 బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం రూ.5,434 కోట్లు కేటాయించడం పట్ల టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగంలో విశ్వమానవతా మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.రెసిడెన్షియల్ స్కూళ్లలో మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడం యువతకు ఉద్యోగావకాశాలు, ఉపాధి ఆకాంక్షాల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు.వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ,పిఎం విఖ్యాస్ పథకం కింద నైపుణ్య శిక్షణ, ఇమాములకు రూ.10,000, మౌజనులకు రూ.5,000 గౌరవ వేతనం,హజ్ యాత్రికులకు ఒకొక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సాయం వంటి పథకాలు ముస్లిం సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దూరదృష్టి ఫలితంగా మైనార్టీ సంక్షేమం దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని, టీడీపీ ప్రభుత్వం ముస్లిం సమాజ అభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని పఠాన్ మెహర్ ఖాన్ తెలిపారు.ఈ దిశగా నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రివర్యులు లోకేష్ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.