Sunday, 29 March 2026

Blog

అనకాపల్లి

వేచలం గ్రామం టిడిపి అధ్యక్షుడిగా రెడ్డి మల్లు నాయుడు ప్రమాణ స్వీకారం

ఉత్తరాంధ్ర ప్రతినిధి నవంబర్ 13 (దేవరాపల్లి) దేవరాపల్లి మండలం దేవరాపల్లి లో గురువారం టెలుగుదేశం పార్టీ గ్రామాధ్యక్షులు, ఇతర పదవిదారుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం కిలపర్తి భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించగా, మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని గ్రామాల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, యూనిట్ ఇన్‌చార్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. వేచలం గ్రామానికి టిడిపి అధ్యక్షునిగా రెడ్డి మల్లు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, సభా ప్రాంగణం జైజై అర్సతనాలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గ్రామాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రెడ్డి మల్లు నాయుడుకు పలువురు నాయకులు, అభిమానులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

కామారెడ్డి

కామారెడ్డి మాజీ ఫ్లోర్ లీడర్ నా.రెడ్డి మోహన్ రెడ్డి – ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి భేటీ

కామారెడ్డి, నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి ) : జిల్లా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతు న్న వేళ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమం లో గురువారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా.రెడ్డి మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు. బోధ న్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వ కంగా కలిశారు.పట్టణంలో విశ్రాంతి గృహంలో జరిగిన ఈ భేటీలో నా.రెడ్డి మోహన్ రెడ్డి నేతకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంలో పార్టీ బలోపేతంపై, ప్రభుత్వం చేపడుతున్న పథకా లు ప్రజలకు చేరే విధానంపై వారు చర్చించినట్లు సమాచారం. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగితేనే ప్రజాభిమా నాన్ని నిలబెట్టుకోవచ్చని సూచించారు.అర్హులకు ప్రభుత్వ పథకాలు న్యాయంగా అందేలా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పదని, పార్టీ అధిష్టానం నిబద్ధతతో పనిచేసే నేతలను తప్పక ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు.నా.రెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ పటిష్టానికి తాను సిద్ధంగా ఉన్నట్లు, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా సుదర్శన్ రెడ్డి ప్రోత్సాహం కీలకం అవుతుందని పేర్కొన్నారు. ఈ భేటీతో జిల్లా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలు మొదలైనాయి.

E-పేపర్

పురుగుమందులు మరియు కలుపు సంహారకాల విక్రయం మరియు వినియోగంలో భద్రత…వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎస్. మణి

పురుగుమందులు మరియు కలుపు సంహారకాల విక్రయం మరియు వినియోగంలో భద్రత – అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 13 పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్) రైల్వే కోడూరు డివిజన్‌లోని అన్ని ఎరువులు మరియు పురుగుమందుల విక్రయశాలల యజమానులకు తెలియజేయునది ఏమనగా, వ్యవసాయంలో కలుపు మరియు పురుగుమందుల,యొక్క సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడానికి, కీటకనాశక చట్టం, 1968 మరియు కీటకనాశక నియమాలు, 1971 ప్రకారం ఈ క్రింది మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎస్. మణి తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు *డీలర్లకు సూచనలు:* *వయస్సు ధృవీకరణ* : పురుగుమందులు లేదా కలుపు సంహారకాలు కొనుగోలు చేయడానికి వచ్చే వ్యక్తులు చట్టబద్ధమైన వయస్సు కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలి. కొనుగోలు దారు రైతా కాదా అని ధ్రువీకరించుకోవాలి. సంబంధిత పాస్ బుక్ మరియు ఆధార్ కార్డ్ వెరిఫై చేసుకుని అనుమానం ఉంటే తల్లిదండ్రులను సంప్రదించి అనుమానం నివృత్తి చేసుకొని మాత్రమే పురుగుమందు సేల్ చేయాలి * *భద్రతా సూచనలు* :* ప్రతి ఉత్పత్తి లేబుల్‌పై ఉన్న వినియోగ మోతాదు, పంట వివరాలు, మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొనుగోలుదారుకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. *రికార్డుల నిర్వహణ:* కొనుగోలుదారు పేరు, చిరునామా, విక్రయించిన పురుగుమందు రకం మరియు పరిమాణం, బ్యాచ్ నంబర్, మరియు గడువు తేదీ వివరాలను తప్పనిసరిగా రికార్డు పుస్తకంలో నమోదు చేయాలి. *చట్టపరమైన చర్యలు:* ఈ ఆదేశాలను ఉల్లంఘించిన డీలర్లపై కీటకనాశక చట్టం, 1968 ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి, ఇందులో లైసెన్స్ రద్దు మరియు జరిమానాలు ఉంటాయి.ఈ మార్గదర్శకాలన్నింటినీ తూచాతప్పకుండా పాటించి, వ్యవసాయ రంగంలో భద్రత మరియు బాధ్యతాయుతమైన పద్ధతులను ప్రోత్సహించాలని కోరుతున్నాము.

విశాఖపట్నం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గ్లోబల్ డెలిగేట్స్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలపై గ్లోబల్ ఇండస్ట్రీ జెయింట్ల చర్చ ఇటలీ రాయబారి, ఈస్ట్రన్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సీఎం ని కలిశారు రాష్ట్రంలో ఇటాలియన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదన తైవాన్ ప్రతినిధి బృందం – కుప్పంలో ఇండో-తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ స్థాపనపై ఆసక్తి విశాఖపట్నం: ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల దిగ్గజాలు, రాయబారులు నేడు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుని కలసి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ముఖ్యమంత్రిని కలిసి రక్షణ రంగం మరియు షిప్ బిల్డింగ్ రంగంలో సహకార అవకాశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రక్షణ రంగం, షిప్పింగ్ రంగానికి సేవలు అందించే స్టార్టప్‌లను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. స్వదేశీ నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ, సాంకేతిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖపట్నం ప్రపంచ సేవల ప్రధాన కేంద్రంగా ఎదగనుందని పేర్కొన్నారు.

నావీ కార్యకలాపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నేవీ మ్యూజియం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నావీ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. — తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసింది తైవాన్ ప్రతినిధి బృందం నేత ముమిన్ చెన్ ముఖ్యమంత్రిని కలసి, రూ. 400 కోట్ల వ్యయంతో కుప్పంలో ఇండో–తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఈవీ బ్యాటరీల రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తైవాన్ కంపెనీలు ఆసక్తి చూపిన ప్రాజెక్టులు: పౌచెన్ గ్రూప్ – కుప్పంలో ఫుట్వేర్ తయారీ యూనిట్ క్రియేటివ్ సెన్సర్స్ ఇన్‌క్. – ఒర్వకల్లో ఇమేజ్ సెన్సర్స్ యూనిట్ ఈ-సోల్ ఇండియా – ఒర్వకల్లో USD 2.2 బిలియన్ వ్యయంతో అధునాతన బ్యాటరీ తయారీ యూనిట్ ముఖ్యమంత్రిని సమక్షంలో తైవాన్ ప్రతినిధులు – ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం (MoU) కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపాదిత పార్కులకు ఉత్తమ కనెక్టివిటీ అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సెమీకండక్టర్ రంగానికి ప్రోత్సాహక ప్యాకేజీని త్వరలో ప్రకటించబోతోందని తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య ఉద్యోగులను తయారు చేయడానికి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని తైవాన్ బృందాన్ని కోరారు. — ఇటలీ రాయబారి ముఖ్యమంత్రిని కలిశారు ఇటలీ రాయబారి ఆంటోనియో హెన్రికో బార్టోలీ ముఖ్యమంత్రిని కలసి పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఆటోమొబైల్, ఆటో స్పేర్స్, మెషినరీ, ఫ్యాషన్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే అగ్రిటెక్, పునరుత్పత్తి శక్తి (రిన్యూవబుల్ ఎనర్జీ), షిప్ బిల్డింగ్ రంగాల్లో ఇటలీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఇటాలియన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేసే అవకాశంపై చర్చలు జరిగాయి.

కడప

మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్..

మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆరు మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు. వారి నుంచి ఒక టన్ను ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు

విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ కి విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఐపీఎస్ ఆత్మీయ స్వాగతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్, విశాఖపట్నం సిటీలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు (సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్) నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం గురువారం విశాఖపట్నం విచ్చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర డీజీపీని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. సదస్సు నిర్వహణలో తీసుకోవలసిన భద్రతా ఏర్పాట్లు, సమన్వయ చర్యలపై చర్చించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

రాఘవపురంలో కొత్త కేంద్రియ విద్యాలయానికి అప్రోచ్ రోడ్ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు

నందిగామ మండలంలోని రాఘవపురం గ్రామంలో కొత్తగా మంజూరైన కేంద్రియ విద్యాలయానికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులను ఎమ్.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ (MGNREGS) పథకం కింద విడుదల చేసినట్లు ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారా రాఘవపురం గ్రామం లోని కొత్త కేంద్రియ విద్యాలయా నికి సులభంగా చేరుకునే విధంగా డబ్ల్యూ.బి.ఎం (WBM) రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, “రాఘవపురంలో కేంద్రియ విద్యాలయం మంజూరైనది విద్యారంగానికి గొప్ప ప్రగతి. ఈ రోడ్డు నిర్మాణం వల్ల గ్రామస్తు లకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది,” అని పేర్కొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో పాస్టర్ కుమారుని వివాహం

జగ్గయ్యపేట పట్టణంలోని చిలకల్లు రోడ్డులోని శుభమస్తు కళ్యాణ మండపంలో పాస్టర్ మాదాసు సంసోను కుమారుని వివాహ వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కంచికచర్లలో టీడీపీ ఇన్చార్జిల ప్రమాణ స్వీకారం ఘనంగా ప్రజలతో మమేకమై పార్టీ బలపరచాలని ఎమ్మెల్యే సౌమ్య

కంచికచర్ల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో గురువారం మండల, గ్రామ పార్టీ క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు, పోలింగ్ బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఉద్యమం” అని పేర్కొన్నారు. తెలుగు వారి స్వాభిమానాన్ని ఢిల్లీకి చాటి చెప్పిన మహానీయుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సేవలను ఆమె స్మరించుకున్నారు. “పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పక లభిస్తుంది. పదవి పెద్దది, చిన్నది అనేది కాదు — అది దక్కడం స్వయంగా ఒక గౌరవం,” అని ఆమె అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ బలాన్ని పెంచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు, స్కీమ్ ప్రెసిడెంట్లు, మండల పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యాదవ వనబోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి*

“* *మర్రిపాడు నవంబర్ (పున్నమి ప్రతినిధి)* మర్రిపాడు మండలంలో ఈ నెల 16 వ తేదీన జరగబోయే యాదవ వన భోజనాలు కార్యక్రమంలో భాగంగా మర్రిపాడు లో PNR గార్డెన్ లో సభా వేదిక ఏర్పాట్ల గురించి & భోజన ఏర్పాట్ల గురించి మరియు మెడికల్ క్యాంప్ గురించి అతిథులకు ప్రత్యేక వసతుల గురించి జిల్లా యాదవ ట్రస్టు భవన్ చైర్మన్ నాగ కిశోర్ యాదవ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మర్రిపాడు మండలంలో ప్రతీ ఒక్కరు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశం సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ పద్మజ యాదవ్ గారు మాట్లాడుతూ మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తిని చాటి చెప్పాలి అని కోరారు. కార్యక్రమం లో గుర్రం శ్రీనివాసులు గారు కూడా మాట్లాడుతూ యాదవుల చైతన్యానికి వన భోజన కార్యక్రమం మన ఐక్యతకు పాటుపడుతుందని తెలియజేసారు.తెలుగుదేశం నాయకులు ఎలగాల వెంకటేశ్వర్లు, గుర్రం నాగేశ్వరరావు, యూత్ నాయకులు సన్ను వినీత్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.