Wednesday, 25 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం, జిల్లాలోని పెద్ద చెర్లో పల్లి మండలం పెద ఇర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి, 10:15 గంటలకు ఇర్లపాడు హెలిప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో 10:35 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని పార్కులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:15 గంటలకు ఉండవల్లికి తిరుగు ప్రయాణమవుతారు.

అనకాపల్లి

వేచలం శివాలయంలో కార్తీక మాసం మూడో సోమవారం అన్నసంతర్పణ ఘనంగా

వేచలం, నవంబర్ 10 (సోమవారం): కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా వేచలం శివాలయంలో భక్తిశ్రద్ధలతో అన్నసంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుని సేవలో తరించారు. ఉదయం ప్రత్యేక పూజలు, హరతులతో ప్రారంభమైన ఈ వేడుకల్లో భక్తులు “హర హర మహాదేవ” నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగించారు. అనంతరం సాయంత్రం శివుని పల్లకి ఊరేగింపు కార్యక్రమం మేళతాళాలతో, దీప కాంతుల నడుమ భక్తి ఉత్సాహంగా సాగింది. పల్లకిని మోసే అదృష్టం పొందిన భక్తులు ఆనందభాష్పాలు కార్చగా, చిన్నారులు శివాలయం వద్ద తుప్పలు పీకుతూ పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. మూడో సోమవారం అన్నసమారాధన దాతలు: 1. వేచలపు నరసింహమూర్తి – 1 బియ్యం సంచి, 1 నూనె డబ్బా 2. బత్తి నాయుడు రెడ్డి శేఖర్ – బంగాళదుంప 80 కిలోలు 3. రెడ్డి శ్రీను, లెక్కల పరమేష్ – సెనగపిండి 12 కిలోలు 4. మెడికల్ నాయుడు – 1 బియ్యం బస్తా 5. ఆర్.వి.కె. నాయుడు – అరటిగెల ₹1000 6. రెడ్డి బుల్లిబాబు – 1 బియ్యం బస్తా 7. వేచలపు అప్పలనాయుడు టక్కు – 1 బియ్యం బస్తా 8. కరక రాంబాబు – 1 బియ్యం బస్తా 9. పొన్న సాంబయ్య జ్ఞాపకార్థం పొన్న పరమేష్ – ₹516 10. బోడబల్ల దేముడునాయుడు – 1 బియ్యం బస్తా 11. పైడా వెంకటరావు – 10 లీటర్ల పాలు 12. రెడ్డి అప్పారావు – ₹1016 13. వేచలపు బలరాం నాయుడు – ₹500 14. రెడ్డి నాయుడు మాస్టర్ – ₹1116 15. బొడ్డు సత్యవమ్మ, చీడికాడ – 1 బియ్యం బస్తా 16. నాగిరెడ్డి నాయుడు తాత – ₹1000 17. వేచలపు చిట్టినాయుడు రంగారావు – ₹1000 18. రెడ్డి లఖుహోం నాయుడు – 1 నూనె డబ్బా 19. వేచలపు కుమార్ – 1 నూనె డబ్బా 20. రెడ్డి కాళిదాసు – ₹1000 21. నౌడు అప్పారావు – ₹500 22. రెడ్డి గోవిందమ్మ (జ్యోతమ్మ) – ₹500 భక్తుల సహకారంతో సాఫల్యవంతంగా సాగిన ఈ కార్యక్రమం గ్రామంలో భక్తి వాతావరణాన్ని నెలకొల్పింది.

అన్నమయ్య

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధుడు,బహుభాషా ప్రవీణుడు,భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని రాజంపేట జనసేన పార్టీ కార్యాలయం యల్లటూరు భవన్ లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత విద్యా రంగానికి పునాది వేసిన మహానుభావులు అని,దేశ అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు.దేశ ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూబకర్, కోడూరు మురళి ఆచారి, విశ్రాంత పోలీసు అధికారి కడిమల్ల శ్రీనివాసరాజు,బీజేపీ నాయకులు వినోద్ వర్మ,నీటి సంఘం అధ్యక్షులు నారదాసు రామచంద్ర,గాజుల కులాయప్ప,జనసేన యువ నాయకులు పెడకాల సుధాకర్ రాయల్,సారా రాజేష్,మౌలా, లక్ష్మీపతి రాజు,శివశంకర్ రాజు,సాయిరాజు,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

రైతు పాస్‌బుక్‌ల ముద్రణ నిలిచిపోవడంతో వ్యవసాయ రంగం అవస్థ …¡!

– పట్టా రిజిస్ట్రేషన్ దారులకు పట్ట పాస్బుక్కులు అందేన!! ఆరు నెలల సాగు సీజన్ సన్నాహాల్లోనే రైతు నిరాశ! పాస్‌బుక్ జారీ జాప్యం రుణాల ఆమోదం దెబ్బతిని, పంటలు ప్రమాదంలో కామారెడ్డి, 11 నవంబర్ (పున్నమి ప్రతినిధి) : భూమాత సిస్టమ్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయినా, వేలాది మంది రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందక సతమతమవుతున్నారు. గత ఆరు నెలలుగా పాస్‌బుక్ ముద్రణ ఆగిపోవడంతో రైతు జీవనం స్తంభించింది. సాగు సీజన్ అంచున ఉన్న ఈ సమయంలో పాస్‌బుక్ లేక బ్యాంకులు రుణాలు ఆపివే యడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం కష్టమైపోయింది.ప్రతి నెలా వందల సంఖ్యలో కొత్త రిజిస్ట్రేషన్లు పూర్తవుతు న్నా, హైదరాబాదులోని ముద్రణ కేంద్రాల్లో పాస్‌బుక్ ఫైళ్లు పేరుకుపోతున్నాయనే సమాచారం బయటికి వచ్చింది. రెవెన్యూ అధికారులు కొత్త పాస్‌బుక్ డిజైన్ తయారీ కారణంగా ఆలస్యం జరుగుతోందని తెలిపారు. కానీ ఈ వివరణ రైతులకు భరోసా ఇవ్వలేకపోతోంది.“నామాలు స్క్రీన్‌లో కనిపిస్తున్నాయి కానీ పాస్‌బుక్ చేతికి అంద డం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. సాగు ఎలా చేయాలి?” అని కామారెడ్డికి చెందిన ఒక రైతు బాధతో పేర్కొన్నాడు. మరో రైతు మాట్లాడు తూ, ఆరు నెలలు చాలా ఎక్కువ. ఇంత ఆలస్యం అయితే పంట కాలమే దెబ్బతింటుంది” అని ఆవేదన వ్యక్తం చేశాడు.రైతు సంఘాలు ఇప్పటికే రెవెన్యూ, తపాలా కార్యాలయాల వద్ద ధర్నాలు ప్రారంభించాయి. “ముద్రణ సాంకేతికత పేరిట రైతుల భవిష్యత్తు ఆగిపోవడం విచారం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి,” అని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.ఈ పాస్‌బుక్ జాప్యం ప్రత్యక్షంగా రుణాల విడుదలపై ప్రభావం చూపుతోంది. రుణాలు లేకపోవడం వల్ల విత్తనాలు, నీటిపారుదల సరఫరా నిలిచిపోగా, వ్యవసాయ కార్యకలాపాలు.ఆలస్యమవుతున్నా యి. విశ్లేషకుల అంచనా ప్రకారం, వీటితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉందం టున్నారు.రైతులు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోకుం డా ఉండాలంటే, పాస్‌బుక్ ముద్రణను అత్యవసర ప్రాధాన్యంగా తీసుకుని వేగవంతం చేయాలని రాష్ట్రస్థాయి వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తు న్నారు.లేదంటే రైతు భరోసా కేవలం కాగిత మాటగా మిగిలిపోతుందనే వాదనాలు వినిపిస్తు న్నాయి. రైతు పాస్‌బుక్‌ల ముద్రణ నిలిచిపోవ డంతో రైతులు తీవ్ర ఆందోళనకు దిగిపోయారు. ఈ నేపథ్యంపై ఇప్పటికీ రైతు సంఘాలు, శ్రామిక సంఘాలు ముందుకొచ్చి వివిధ ఆందోళన కార్యక్ర మాలను నిర్వహిస్తున్నారు. వారు వరుసగా రెవె న్యూ, తపాలా కార్యాలయాల చుట్టూ పాదయాత్ర లు, ధర్నాలు చేపట్టి ప్రభుత్వం వెంటనే పాస్‌బుక్ ముద్రణ చర్యలను వేగవంతం చేయాలని డిమాం డ్ చేస్తున్నారు. వారు రుణాలు సిద్ధంచేయ డానికి, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి పాస్‌బుక్ అనివార్యమే కావడం, పాస్‌బుక్ ఆల స్యం వల్ల రైతుల సాగు సీజన్ గడువు కోల్పోవడం, ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కోడం గురించి ప్రభుత్వానికి బహిరంగంగా అలర్ట్ ఇస్తున్నారు. రైతు సంఘాలు రైతుల తరపున శక్తివంతంగా పాటుపడటంతో పాషణి ముద్రణ ప్రక్రియపై ప్రభు త్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకూ పాస్‌బుక్ జారీ ఆలస్యం సమస్యపై అధికారుల ప్రతిస్పందన పరిమితమే. దీంతో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రైతుబంధు, రైతు భరోసా వంటి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందుతున్నప్పటికీ పాస్‌బుక్ లేకుండా ఆ పథకాల ప్రయోజనాలు రైతులకు సకాలంలో అందటం లేదు. పట్టాదారుల పట్టా పత్రాల జారీ సమస్య పరిష్కారమైతే, రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

మహబూబ్ నగర్

గౌరవ సలహాదారులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి మేనల్లుడు వివాహంలో సంఘ ప్రతినిధులు

💥 *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్(తేది.11.11.202* *రాష్ట్ర అధ్యక్షులు శానమోనినర్సిములుగారి నేతృత్వంలో* పండిత పరిషత్తు బృందము మన Recognised Upadhyaya Panditha Parishathu – TS సంఘం ప్రధాన సలహాదారులు శ్రీ *గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి* గారి మేనల్లుడు గారి రిసెప్షన్ కు పాలమూరు జిల్లా , అప్పన్నపల్లిలోని బృందావన్ గార్డెన్ లో కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. పై కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు *డా||ఎం.ఎన్. విజయకుమార్,* రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి *శాంతా రెడ్డి* గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ *లింగారం వీరేందర్ గౌడ్* గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు *రాచాల నవీన్ కుమార్* గారు, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి *శ్రీనివాస్* గారు, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి *కృష్ణయ్య* గారు, జిల్లా కార్యదర్శి *అశోక్ కుమార్* గారు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్

గౌరవ సలహాదారులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి మేనల్లుడు వివాహంలో సంఘ ప్రతినిధులు

💥 *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్(తేది.11.11.202* *రాష్ట్ర అధ్యక్షులు శానమోనినర్సిములుగారి నేతృత్వంలో* పండిత పరిషత్తు బృందము మన Recognised Upadhyaya Panditha Parishathu – TS సంఘం ప్రధాన సలహాదారులు శ్రీ *గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి* గారి మేనల్లుడు గారి రిసెప్షన్ కు పాలమూరు జిల్లా , అప్పన్నపల్లిలోని బృందావన్ గార్డెన్ లో కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. పై కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు *డా||ఎం.ఎన్. విజయకుమార్,* రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి *శాంతా రెడ్డి* గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ *లింగారం వీరేందర్ గౌడ్* గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు *రాచాల నవీన్ కుమార్* గారు, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి *శ్రీనివాస్* గారు, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి *కృష్ణయ్య* గారు, జిల్లా కార్యదర్శి *అశోక్ కుమార్* గారు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

*రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు ఎంపిక*

పున్నమి న్యూస్ నవంబర్ 10 (పామిడి) కృష్ణవేణి స్కూలు విద్యార్థులు టి. సత్య బ్రూస్లీ, తిరుపతి. అభిరామ్,హెచ్.నవనీత్, నేనావత్ కీర్తి వన్నె శ్రీ,ఎన్. జతిన్ రెడ్డి, ఎస్కే.షాకీర్, టి. సత్య గౌరవ్ లీ, వై. గోకుల్ కృష్ణ, బనావత్ ఉమామహేశ్వరి, బి.భవిష్య రెడ్డి, పి.అస్పియా ఐమాన్, వై. చరణ్ తేజ్ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 14 నుంచి 16 వరకు కాకినాడలో జరగనున్న 39వ సబ్- జూనియర్ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో ఈ చిన్నారులు పాల్గొంటారు.రాష్ట్ర స్థాయికి ఎంపికైన చిన్నారులను పాఠశాల కరస్పాండెంట్ ఆర్.అనురాధ రెడ్డి, ఇన్చార్జ్ కే.శశికళ, పిఈటి.వెంకటరమణ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.

నాగర్‌కర్నూల్

ఆ భూమి న్యాయంగానే కొన్నాం.. మాకు న్యాయం చేయండి

ఆ భూమిని న్యాయంగానే కొన్నాము. మాకు న్యాయం చేసి ఆక్రమణదారుల నుంచి మా భూమి దక్కేలా చూడండి అని బాధితురాలు మంచుకొండ హైమావతి కోరారు. సోమవారం మండల పరిధిలోని కొట్ర చౌరస్తా వద్ద దివంగత జైపాల్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ పరిధిలోని గొల్లోనిపల్లిలో సర్వేనంబర్లు 237, 238లోని 10 ఎకరాలు 6 గుంటల పొలాన్ని 2006లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. తప్పుడు పత్రాలు సృష్టించలేదని, తన భర్త పేరు పై ఉన్న అన్ని పత్రాలు, పాసుబుక్కులు సక్రమంగానే ఉన్నాయని వివరించారు. అయితే 2020లో తన భర్త వీరేశం గుండెపోటుతో మరణించాడని, ఆ తర్వాత కొన్నాళ్లకు తమ భూమిని రైతులు హద్దులు చూపించారని తెలిపారు. అప్పటి నుంచి ఆ పట్టా పొలాన్ని తన పేరు పై మార్పిడి చేయాలంటూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రైతులతో కలిసి తమ భూమి పై కన్నేశారని ఆరోపించారు. భర్త లేనందున తాను ఏమీ చేయలేనని భావించి భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆక్రమణకు పాల్పడుతున్న వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకుని, తమ భూమి తిరిగి తమకు దక్కేలా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని హైమావతి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆ గ్రామ రైతులు, నాయకులు మాట్లాడుతూ ఆ భూమి మంచుకొండ వీరేశం కొనుగోలు చేసినదే, అందువల్ల హైమావతికే చెందుతుందని పేర్కొన్నారు. ఆమెకు అండగా నిలబడి, న్యాయం జరిగేంత వరకు వెన్నంటి ఉంటామని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు నగర అభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోతున్న మంత్రి నారాయణ గారు -రూపు కుమార్ యాదవ్ గారు

నెల్లూరు నగరం లోని 4వ దివిసిన్ ధింధయాల్ నగర్ లో నారాయణ గారి అదేశాలకు పాలు అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపన చేసిన రూప్ కుమార్ యాదవ్ గారు. అమరావతి లో మంత్రి నారాయణ గారు ఎంత బిజీగా వునా మంత్రి నారాయణ గారు నెల్లూరు నగర అభివృద్ధి కి పటుధలతో క్రుషి చేస్తునారు అని రూప్ కుమార్ యాదవ్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మామిడాల మధు,మంజుల,అధినారాయణ రెడ్డి పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

జిగ్రిస్’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల

సినీ ప్రేక్షకులకు మత్తెక్కించే ఉత్సాహం రాబోతోంది. మౌంట్ మెరు పిక్చర్స్ సమర్పణలో రూపొందిన ‘జిగ్రిస్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ క్యాంపెయిన్‌లు ఇప్పటికే సోషల్ మీడియా వేదికలపై హల్‌చల్ సృష్టిస్తున్నాయి. “మూడురోజులు మాత్రమే మిగిలాయి… మాడ్‌నెస్ రాబోతోంది!” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో కృష్ణ బురుగుల, ధీరజ్ కెవి, మనివాక, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా నిర్మాణ బాధ్యతలు మౌంట్ మెరు పిక్చర్స్ నిర్వహించగా, హరీష్ ఉత్, కృష్ణ వాగల్, వినైచిట్టెం, సయ్యద్ కమ్రాన్, చాణక్య ఆర్ట్, వాసుదేవ మాక్, వంశీ శేఖర్ తదితరులు ఈ ప్రాజెక్ట్‌కి మద్దతు అందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.