Sunday, 22 March 2026

Blog

జనగాం

*ఎలకంటి వీరస్వామి* కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేసిన BRS మారపాక రమేష్

తేది:09-11-2025 Neela Rakesh ఘనపూర్ పున్నమి ప్రతినిధి… *ఎలకంటి వీరస్వామి* కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేసిన భారత రాష్ట్ర సమితి నాయకులు మారపాక రమేష్ గారు *06-11-2025* రోజున పల్లగుట్టలోని *ఎలకంటి వీరస్వామి* అనారోగ్యంతో మృతిచెందారు ఈ విషయం తెలుసుకున్న *మారపాక రమేష్* గారు BRS పార్టీ గ్రామ నాయకుల ద్వారా *ఎలకంటి వీరస్వామి* కుటుంబాన్ని పరామర్శించి 50kgల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి శ్రీధర్ గారు మాజీ ఎంపీటీసీ కలుకొల్ల చొక్కయ్యగారు, కొంత రవీందర్ గారు, సీనియర్ నాయకులు వేల్పుల గట్టేష్ యాదవ్, కన్నెబోయిన రాజు, జీడి సంపత్ సాధం రాజు, కుంచాల యాదగిరి,కుంచాల రాజు, కొయ్యడ రమేష్, బండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

బస్టాండ్‌కు దగ్గరగా చెత్త దిబ్బ — ప్రజల ఆరోగ్యానికి ముప్పు

నందలూరు మండలం లోని ప్రధాన బస్టాండ్‌ సమీపంలో కూతవేటు దూరంలోనే చెత్తను పారవేస్తూ, ఆ ప్రదేశం పూర్తిగా డంపింగ్‌ యార్డ్‌గా మారిపోయింది. ఈ మార్గం గుండా వెళ్తున్నా ప్రజలకి,చెత్త దిబ్బల వల్ల దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఈ చెత్త కారణంగా దోమలు,పందులు,దుర్వాసనలు విస్తరిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చెత్త కుప్పల్లో కుళ్ళిపోతున్న వ్యర్థాలు పలు రకాల వ్యాధులకు కారణమవుతుండగా,పిల్లలు, వృద్ధులు తరచుగా జ్వరాలు,చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రజలు పంచాయతీ అధికారులను వెంటనే చర్యలు తీసుకుని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచాలని,చెత్త పారవేసే ప్రత్యేక ప్రదేశాన్ని గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు అదే దారిలో తరచూ వెళ్తున్న ప్రభుత్వ అధికారులు,ప్రజాప్రతినిధులు కూడా ఈ దృశ్యాన్ని చూసినా కనీసం స్పందించడం లేదు.

జనగాం

సీఎం రేవంతన్నకు ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు

పున్నమి న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలసి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు.

Blog

రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశాభివృద్ధి సాధ్యం!*

*రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశాభివృద్ధి సాధ్యం!* *ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాల అభివృద్ధి* *డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ వల్లే ఎపికి భారీ పెట్టుబడులు* *అవినీతిరహిత, కమిట్ మెంట్ లీడర్ షిప్ వల్లే బీహార్ అభివృద్ధి* *బీహార్ పారిశ్రామికవేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్* పాట్నా ( విశాఖ పున్నమి ప్రతినిధి):- రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…. దేశప్రజలు ప్రధానిగా సరైన సమయంలో సరైన నేతను ఎన్నుకున్నారు. దీంతో గత పదేళ్లుగా భారతదేశం అనూహ్యంగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా బీహార్ కూడా నితీష్ కుమార్ కు ముందు, తర్వాత అన్నవిధంగా అభివృద్ధి సాధించింది. సమర్థవంతమైన నాయకుడివల్లే బీహార్ అభివృద్ధి సాధిస్తోంది. లీడర్ షిప్ ట్రాక్ రికార్డుతోపాటు శాంతిభద్రతలు, మహిళల భద్రత, అవినీతి రహిత పాలనే ఇందుకు కారణం. కేంద్ర, రాష్ట్ర సత్సంబంధాల విషయంలో ఎపి, బీహార్ లకు సారూప్యతలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బులెట్ సర్కారు కారణంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది. చిన్న రాష్ట్రమైనప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్లే మా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. భారత్ లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎపికి రావడానికి ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీవైష్టవ్ ల సహకారం కూడా కీలకంగా ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పాజిటివ్ లీడర్ షిప్, టాక్సేషన్ లో మార్పుల కారణంగా కేవలం 12నెలల్లో ఎపికి గూగుల్ సంస్థను రప్పించగలిగాం. అలాగే దేశంలో అతిపెద్ద ఉక్కుపరిశ్రమను ఆర్సెలర్స్ మిట్టల్ ఎపిలో ఏర్పాటు చేయబోతోంది. వారిని రాష్ట్రానికి ఆహ్వానించినపుడు మూడు ప్రధాన సమస్యలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానితో మాట్లాడటంతో వెనువెంటనే ఆ మూడు సమస్యలు పరిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఇందుకోసం మా ముఖ్యమంత్రి విజన్ 2047 డాక్యుమెంట్ ను రూపొందించి, లక్ష్యాలను నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం పిపిఎలను రద్దుచేయడం వల్లే ఈసారి పెట్టుబడుల సాధనకు పదిరెట్లు కష్టపడాల్సి వస్తోంది. రాష్ట్రాలు వేగవంతమైన అభివృద్ధి సాధించాలంటే లీడర్ షిప్ ట్రాక్ రికార్డుతోపాటు ప్రభుత్వాల కొనసాగింపు కూడా ముఖ్యం. గుజరాత్, ఒరిస్సా రాష్ట్రాల ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాపై ఎంతో నమ్మకంతో 94శాతం సీట్లతో మమ్మల్ని గెలిపించారు. ఎపిలో యువతకు ఉద్యోగాలు కల్పించడం ప్రస్తుతం మా ముందున్న ప్రధాన లక్ష్యం. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. త్వరలో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా పార్టనర్ షిప్ సమ్మిట్ నిర్వహించబోతున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు రాంజీ, గోయంకా, మాజీ ఎంపి జివిఎల్ నరసింహారావు, రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు, బీహార్ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. *ఏపీలో వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ ప్రెన్యూర్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం* పాట్నాలో బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీహార్ లో మొదటిసారి పర్యటిస్తున్నానని, ఏపీ మంత్రిగా బీహార్ కు రాలేదని భారతీయుడిగా వచ్చానన్నారు. ప్రధాని మోడీ గారు, ముఖ్యమంత్రి నితీష్ గారి సమర్థ నాయకత్వంపై నమ్మకముందన్నారు. బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఇక్కడి ప్రజలను కోరేందుకు వచ్చాను. ఏపీలో అభివృద్ధి కోసం ఎన్డీయేను 94శాతం స్ట్రైక్ రేట్ తో ప్రజలు గెలిపించారు. బీహార్ లో కూడా ఇదే విధమైన ఫలితాలు పునరావృతం కావాలని కోరుకుంటున్నాను. ఎన్డీయే భాగస్వామిగా, దేశ పౌరుడిగా ఇది నా బాధ్యత. ఏపీలో వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ ప్రెన్యూర్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఇక్కడ ప్రతిపక్షం ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అని మాట్లాడుతున్నారు. ఇది సాధ్యం కాదు. బీహార్ లో మరోసారి ఎన్డేయే విజయం సాధిస్తుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్

మృతుడి వివరాలు గుర్తించుట పోలీసులు

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో అతిగా మద్యం సేవించి శనివారం ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని పాత మల్లాపురం గ్రామానికి చెందిన అంకయ్యగా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, అతిగా మద్యం సేవించడం వల్లే మృతి సంభవించిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు రూ. 72 లక్షలు పరిహారం: దామచర్ల సత్య

మంగళగిరిలోని మారిటైం బోర్డు కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో, అధికారులు గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిని వివరించారు. మొంథా తుఫాను వల్ల ఉప్పాడలో నష్టపోయిన మత్స్యకారులకు 26 బోట్లకు రూ. 72 లక్షల నష్టపరిహారాన్ని మారిటైం బోర్డు ఆమోదించినట్లు దామచర్ల సత్య తెలిపారు. మంత్రి జనార్దన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మృతుడి వివరాలు గుర్తించుట పోలీసులు

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో అతిగా మద్యం సేవించి శనివారం ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని పాత మల్లాపురం గ్రామానికి చెందిన అంకయ్యగా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, అతిగా మద్యం సేవించడం వల్లే మృతి సంభవించిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్

భైరవకోనలో ప్రత్యేక పూజలు

ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోనలో ఆదివారం పర్యాటకులు జలపాతం వద్ద పుణ్యస్నానాలు చేసి, శ్రీ భైరవేశ్వర స్వామిని, త్రీముఖ దుర్గాదేవిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్

కనిగిరిలో పండ్ల వ్యాపారికి సన్మానం

ప్రకాశం జిల్లా కనిగిరిలో పండ్ల వ్యాపారి షేక్ గౌస్ బాషా శనివారం తన నిజాయితీని చాటుకున్నారు. కూచిపూడి గ్రామానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తి గౌస్ బాషా దుకాణంలో పండ్లు కొనుగోలు చేస్తూ, బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును అక్కడే మర్చిపోయారు. గౌస్ బాషా ఆ బ్యాగును గుర్తించి, స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు బ్యాగు యజమానిని గుర్తించి, రూ. 7,00,000 విలువైన బంగారు ఆభరణాలు, రూ. 50,000 నగదుతో కూడిన బ్యాగును వారికి తిరిగి అందజేశారు. ఈ సంఘటనపై డీఎస్పీ సాయి ఈశ్వర యశ్వంత్ పండ్ల వ్యాపారి గౌస్ బాషా నిజాయితీని అభినందించారు.

ఆంధ్రప్రదేశ్

క్రైమ్ రివ్యూ నిర్వహించిన కనిగిరి డిఎస్పి

ప్రకాశం జిల్లా కనిగిరి డిఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ శనివారం డిఎస్పీ కార్యాలయంలో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించే విధంగా డివిజన్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, దొంగతనాలు అరికట్టే అంశంలో తీసుకోవాల్సిన చర్యలు తెలిపారు. మైనర్ల రాష్ డ్రైవింగ్ పై దృష్టి సారించాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.