Sunday, 22 March 2026

Blog

హైదరాబాద్

ప్రతి మంగళవారం ఘనంగా పూల మాలలు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి 228వ వారం బహుజన ఆర్టిసి యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్

పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయులు రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ తార్నాక చింతల్ బస్తీలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం రోజున జ్ఞానమాల వేయడం జరిగింది ఇది 228వ వారం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా నేను మీకు కత్తులు ఇవ్వలేదు ఓటును మాత్రమే ఇచ్చాను ఈ ఓటు వల్ల మీ తలరాతలు మార్చుకోండి మీరు గౌరవంగా సూటు బూటు వేసుకొని అందరిలాగా ఉండాలని రిజర్వేషన్ వల్ల మీకు చదువు వచ్చింది ఉద్యోగాలు వచ్చినాయి ఈరోజు మీకు విలువలు పెరిగినయ్ కాబట్టి మీరు అదే సాయిలు ఇచ్చినటువంటి హక్కులని సద్వినియోగం చేసుకొని పాలకులు కావాలని కులాలకు మతాలకు దూరంగా ఉంటూ మనుషులంతా ఒకటే అనే భావన మనం ముందుకు తీసుకుపోతామని తెలియజేయడం జరిగింది యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్లు పరిస్థితి పెద్దలు ఎం రాజయ్య, ఎండి అప్సర్వై, టీ నర్సింగ్ రావు, టీ లక్ష్మణ్, బహుజన ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ తెలిపారు.

అన్నమయ్య

ఏపీ ఆర్‌డీసీ డైరెక్టర్‌గా గరికపాటి శివశంకర్ బాధ్యతలు స్వీకారం

-గన్నవరం జనసేన నేతకు అరుదైన గౌరవం – నియామకానికి అంకితభావమే కారణం: నేతలు చిట్వేల్, నవంబర్ 9: పున్నమి ప్రతినిధి గన్నవరం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ (ఆదివారం) ఉదయం ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. -వైభవంగా కార్యక్రమం: ఈ సందర్భంగా జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జ్ బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అభినందనలు కార్యక్రమంలో పాల్గొన్న అతిగారి కృష్ణ, జోగినేని మనీ, ఆనాల సునీల్ కుమార్ తదితర జనసేన నాయకులు శివశంకర్‌కు హార్దిక అభినందనలు తెలియజేశారు.నియామకానికి కారణంపార్టీ కార్యకలాపాల్లో గరికపాటి శివశంకర్ చూపిన అంకితభావ సామాజిక సేవ పట్ల నిబద్ధత, మరియు గ్రామీణాభివృద్ధిపట్ల ఆయనకున్న దృష్టి కారణంగానే ఈ నియామకం జరిగిందని నేతలు అభిప్రాయపడ్డారు. -అభివృద్ధిపై విశ్వాసం: గన్నవరం ప్రాంత అభివృద్ధి దిశగా శివశంకర్ కీలక పాత్ర పోషిస్తారనే విశ్వాసం స్థానిక నాయకులలో బలంగా వ్యక్తమైంది. జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగా, ఈ ఆత్మీయ వేడుక ఉత్సాహభరితంగా సాగింది.

రంగారెడ్డి

* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా * –జూబ్లీహిల్స్ లో చివరి రోజు ప్రచారంలో పాల్గొన్న మహేశ్వరం కాంగ్రెస్ నాయకులు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 09 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ లో చివరి రోజు ప్రచారంలో పాల్గొన్న మహేశ్వరం కాంగ్రెస్ నాయకులు మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య మన్సపల్లి మాజీ సర్పంచ్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా.. 282 బూత్ లో పలు కాలనీలోని ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి యువ నాయకుడు నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా.. మహేశ్వరం నియోజకవర్గం నాయకులతొ కలసి ప్రభుత్వ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ నాయకులు మహేశ్వరం శివగంగ దేవాలయం కమిటీ చైర్మన్ అల్లే కుమార్, మంత్రి బాలరాజ్,బిసి సెల్ మహేశ్వరం మండల్ అధ్యక్షులు బొల్లు కుమార్ యాదవ్,మహేశ్వరం మండలం ఎస్టి సిఎల్ అధ్యక్షులు రాజు నాయక్,మాణిక్యమగుడ గ్రామ శాఖ అధ్యక్షులు లోకేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎర్ర నవీన్ కుమార్, మాణిక్యమగుడ మాజీ ఎంపీటీసీ వడ్డేమోని దాసు, మండల్ యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలకృష్ణ, తోపాటు కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

రంగారెడ్డి

* జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి చేసే నాయకులను గెలిపిస్తారు.సబితా ఇంద్రారెడ్డి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 09 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా నల్ల పోచమ్మ దేవాలయం, నాగార్జున నగర్ కాలనీ, ఎల్లారెడ్డి గూడ పరిసర కాలనీల్లో సబితా ఇంద్రారెడ్డి ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా స్థానిక ప్రజలు, మహిళలు, యువత కారు గుర్తు నినాదాలతో నీరాజనాలు పలికారు.పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి జూబ్లీహిల్స్ ప్రజలు ఎల్లప్పుడూ అభివృద్ధి, సంక్షేమం పట్ల నిబద్ధత గలవారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కారు గుర్తుకు ఓటు వేయండి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచండి మా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ని భారీ మెజార్టీతో గెలిపించండిఅని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ నవీన్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా విభాగం సభ్యులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నమయ్య

ప్రతి ఇంట స్వదేశీ వస్తువులు – బీజేపీ పిలుపు

దేశంలో స్వావలంబనను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రాజంపేట అసెంబ్లీ కో కన్వీనర్ డాక్టర్ అరిగే రాంప్రసాద్ స్వగృహం నందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు “ప్రతి ఇంట స్వదేశీ వస్తువులు” ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ – విదేశీ వస్తువుల బదులు భారతీయంగా తయారైన ఉత్పత్తులను వినియోగించాలని, దీని ద్వారా దేశీయ పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, కూలీలు బలోపేతం అవుతారని తెలిపారు.మన దేశంలో తయారైన వస్తువులు ఉపయోగించడం అంటే కేవలం దేశభక్తి మాత్రమే కాదు, ఆర్థిక స్వావలంబనకు దారి తీసే మార్గం కూడా” అని బీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు.స్వదేశీని వాడండి దేశాన్ని బలపరచండి అనే నినాదంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది అని తెలిపారు.పార్టీ నాయకులు,కార్యకర్తలు నందలూరు మండలంలో పలు పంచాయతీల్లో స్వదేశీ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించి,ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామీణ స్థాయిలోనూ ఈ కార్యక్రమాన్ని విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ, రాష్ట్ర దళిత మోర్చ్ రమణయ్య ,జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ విఠలాచార్య స్వామి,మాజీ మండల అధ్యక్షుడు ఆండ్ర శివారెడ్డి,తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మహర్ ఖాన్,మండల ఉపాధ్యక్షుడు సివి,సుబ్బయ్య, మండెం నాగేంద్ర,ప్రధాన కార్యదర్శులు రాజబోయిన మహేష్, కొండపల్లి గంగయ్య,బీజేపీ పార్టీ యువనాయకులు వీరబల్లి జయకుమార్ రెడ్డి,రాచూరి మురళి,తదితరులు పాల్గొనడం జరిగినది.

అన్నమయ్య

గరికపాటి శివశంకర్ ఏపీ ఆర్‌డీసీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకారం

గన్నవరం నియోజకవర్గానికి ఇన్చార్జిగా పనిచేస్తున్న ప్రముఖ జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఈరోజు ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (AP RDC) డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా పార్టీ సమన్వయకర్త అతిగారి కృష్ణ, జోగినేని మణి, ఆనాల సునీల్ కుమార్ తదితర జనసేన నాయకులు పాల్గొని శివశంకర్‌కు హార్దిక అభినందనలు తెలిపారు.పార్టీ కార్యకలాపాల్లో చూపిన అంకితభావం, సామాజిక సేవ పట్ల నిబద్ధత, గ్రామీణాభివృద్ధి పట్ల దృష్టి గరికపాటి శివశంకర్ నియామకానికి ప్రధాన కారణమని నేతలు అభిప్రాయపడ్డారు. గన్నవరం ప్రాంత అభివృద్ధి దిశగా శివశంకర్ కీలక పాత్ర పోషిస్తారనే విశ్వాసం స్థానిక నాయకులలో వ్యక్తమైంది.ఈ సందర్భంగా జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆత్మీయతతో కూడిన ఈ వేడుక స్ఫూర్తిదాయకంగా, ఉత్సాహభరితంగా సాగింది.

అన్నమయ్య

20 ఏళ్లుగా నిరుపయోగంగా ప్రభుత్వ భవనం -రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కోసం నిర్మించిన భవనం మూత – శిథిలమవుతున్న ఆస్తిని పునరుద్ధరించాలని స్థానికుల డిమాండ్

చిట్వేల్ మండలంలో ప్రభుత్వ నిధులతో సుమారు 20 ఏళ్ల క్రితం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) కోసం ప్రత్యేకంగా నిర్మించిన భవనం ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. ఈ సుదీర్ఘ కాలంలో ఒక్క రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కూడా ఈ భవనాన్ని వినియోగించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాత్కాలిక వినియోగం:ఈ భవనాన్ని కొద్దికాలం పాటు గ్రామ రెవెన్యూ అధికారులు మాత్రమే అనధికారికంగా ఉపయోగించారు. ఆ తర్వాత భవనం పూర్తిగా మూసివేయబడింది శిథిలావస్థ: ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంటుంది. ప్రభుత్వ ఆస్తి వృథాగా పోతుండటంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆదివారం నాడు స్థానిక ప్రజలు స్పందిస్తూ, నిరుపయోగంగా ఉన్న ఈ భవనాన్ని అధికారులు తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. ఆ భవనాన్ని రెవెన్యూ కార్యకలాపాల కోసమైనా, లేదా ఇతర అత్యవసర ప్రభుత్వ అవసరాల కోసమైనా వినియోగించాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ నిధులు వృథా కాకుండా, ప్రజల సౌకర్యార్థం ఈ భవనానికి వెంటనే మరమ్మతులు చేసి, వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

కాకినాడ

అవయవ దానమే – జీవదానం : ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.

పున్నమి న్యూస్,కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ: నవంబర్ 9: జీవనదాన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో “అవయవ దానం అవగాహన కార్యక్రమం” ఆదివారం కాకినాడలో విజయవంతంగా నిర్వహించబడింది. ఉదయం అపోలో హాస్పిటల్, కాకినాడ వద్ద వందలాది మంది వైద్యులు, నర్సులు, విద్యార్థులు, సామాజిక సేవకులు, మరియు ప్రజలు పాల్గొని వాక్‌థాన్ నిర్వహించారు. ఈ వాక్‌థాన్ ఫాబిన్ కన్వెన్షన్ హాల్ వరకు సాగి, ప్రజల్లో అవయవ దానం ప్రాముఖ్యతపై విశేష అవగాహన కలిగించింది.తదుపరి జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (ఎంపీ, కాకినాడ) పాల్గొన్నారు. అవయవదానం ద్వారా మరొకరి జీవితాన్ని కాపాడటం అత్యున్నతమైన సేవ అని అన్నారు. గౌరవ అతిథులుగా కె. పద్మశ్రీ (ఎంఎల్‌సి) పాల్గొని అవయవదానం యొక్క సామాజిక ప్రాధాన్యతను వివరించారు.ప్రత్యేక ఆహ్వానితులుగా డా. లవణ్య కుమారి (సూపరింటెండెంట్, జిజిహెచ్), డా. ఏ. విష్ణువర్ధన్ (ప్రిన్సిపల్, రంగారాయ మెడికల్ కాలేజ్), డా. కె. బాబ్జీ మాజీ సంచాలకులు మరియు వైద్య విద్యా రంగ ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డా. రామకృష్ణ మరియు డా. సోమయాజులు (ట్రస్ట్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్), సుభాకర్ (మెడికవర్ హాస్పిటల్స్), మరియు డా. జి.వి. రావు (అపోలో హాస్పిటల్స్) కూడా పాల్గొని అవయవదానంపై విలువైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. డా. కె. రాంబాబు, డైరెక్టర్, వీఐఎంఎస్ మరియు సీటీసీ జీవనదాన్ ఏపీ, ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, అవయవదాత కుటుంబాలకు సన్మానాలు, మరియు అవగాహన ప్రసంగాలు జరిగాయి. పాల్గొన్నవారందరూ “అవయవ దానం – జీవదానం” అనే నినాదంతో ప్రేరణ పొందారు. జీవనదాన్ ఏపీ తరపున అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు మరియు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కామారెడ్డి

కాలభైరవస్వామి ఆలయంలో కార్తీక మహోత్సవాలు ప్రారంభం కాలభైరవ భక్తి రంజకంగా ఉత్సవాలు

కామారెడ్డి, 9 నవంబర్ (పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలో ఉన్న దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీ కాలభైరవస్వామి దేవాలయం తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో ప్రంగణం కార్తీకమాసం సందడి మధ్య ఆధ్యాత్మి కతతో కిటకిటలాడింది.కార్తీకమాసం కారణంగా రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుం దనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి వచ్చి ఆలయ ప్రాంగణం వెలుగొందింది. కార్తీక పౌర్ణమి అనంతరం ప్రారంభ మైన భైరవుని జన్మదిన మహోత్సవాలు వచ్చే ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగ నున్నాయని ఆలయ ఈఓ ప్రభు స్వామి తెలిపా రు.నవంబర్ 09 నుంచి 13 వరకు జరగ నున్న ఈ మహోత్సవాల్లో డోలారోహణం (తొట్టె), భజన మండళ్లు, రథోత్సవం, అగ్నిగుండాల కార్య క్రమాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ సమితి ఆధ్వర్యంలో వసతి గదులు, స్నానాల గదులు, నిత్య అన్నదానం వంటి సదుపాయాలు విస్తృతంగా కల్పించబడ్డాయి. ఈ మాసంలో చేసే పూజలు ఆధ్యాత్మిక శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తాయని పురాణాలు సూచిస్తున్నాయని తెలిపారు. ప్రతి మంగళవారం, పౌర్ణమి రోజుల్లో భక్తజనం రద్దీ మరింత పెరుగు తున్నట్లు వెల్లడిం చారు.స్థానిక విశ్వాసాల ప్రకారం ఆలయంలోని మూలబావి వద్ద స్నానం చేసి, స్వామి వారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం ఇక్కడి ప్రజలకు ఉంది. ఆలయం పరిస రాల్లో శనేశ్వరాలయం, బద్దిపోచ మ్మ దేవాలయం, నవగ్ర హ మండపం, సంతాన నాగదేవత విగ్రహా లుండటం ఈ ప్రాంత ఆధ్యాత్మి కతకు మరింత వైభవం చేకూరుస్తోంది. ఉత్సవాలు భాగంగా మొదటి రోజు బాగా మొదటి రోజు బద్ది పోచమ్మకు బోనాల సమర్పణ ఘనంగా నిర్వహించారు. నిర్వ హించారు.ఈ మహోత్సవాల్లో ఆలయ కమిటీ, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక మాజీ సర్పం చ్‌లు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈనెల 12వ తారీఖున జరగబోవు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం నియోజకవర్గ స్థాయి ర్యాలీ”

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం:మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్ సూర్యారావు గారు ఈరోజు సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు మండలాల మండల పార్టీ అధ్యక్షులు, కుమారుడు గొల్లపల్లి శ్రీధర్ తో సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమావేశం లో భాగంగా పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల 12వ తారీఖున జరగబోవు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం నియోజకవర్గ స్థాయి ర్యాలీ” కార్యక్రమం గురించి చర్చించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు: కుసుమ చంద్రశేఖర్, అడబాల బ్రహ్మాజీ, కట్టా శ్రీనివాస్, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.