Sunday, 22 March 2026

Blog

తిరుపతి

శ్రీ కాళహస్తి జంగమ సంక్షేమ సంఘ ఆధ్వర్యలో కార్తీక మాస వనభోజనం

శ్రీకాళహస్తి నవంబర్ 09, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని భరద్వాజ తీర్థం (లోబావి) నందు శ్రీ కాళహస్తి జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో కార్తీక సమారాధన, వనభోజనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రముఖులు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందం, బి.జె. పి. రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్, దేవస్థాన చైర్మెన్ కొట్టే సాయిప్రసాద్, ధర్మ కర్తల మండలి సభ్యులు కోలా విశాలాక్షి, పాల్గొనడంతో ప్రముఖులందరికీ జంగమ కుల పెద్దలు పూర్ణ కుంభ తో ఆహ్వానం పలికారు. మొదటగా ప్రముఖులు త్రిమూర్తి స్వరూపమైన ఉసిరి చెట్టు ఆరాధన, శ్రీ స్వామి అమ్మవార్ల పూజలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు మాట్లాడుతూ…శ్రీ కాళహస్తిలోని జంగమ కులస్తుల సంక్షేమం కోసం కృషి తమ వంతు చేస్తామని పేర్కొన్నారు. తదుపరి వన భోజనం లో ప్రముఖులు స్వయంగా వడ్డన చేసి అనంతరం వనభోజనాన్ని సేవించారు. ఈ కార్యక్రమంలో జంగమ కుల పెద్దలు రవీంద్రబాబు తదితరులు జంగమ కమిటీ సభ్యులు, జంగమ కులస్తులు పాల్గొన్నారు.

Blog

నంద్యాల ఐఎంఏ అకడమిక్ విభాగం నూతన కార్యవర్గం అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ మల్లీశ్వరి, లలిత, కోశాధికారి గా డాక్టర్ శశికిరణ్.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ కు అనుబంధంగా ఉన్న అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ నంద్యాల శాఖకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా డాక్టర్ మల్లీశ్వరి, కార్యదర్శిగా డాక్టర్ జి. లలిత కుమారి, కోశాధికారిగా డాక్టర్ శశికిరణ్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ హిందూమతి,డాక్టర్ భారతి, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ గెలివి సిద్ధార్థ, డాక్టర్ మణిదీప్, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ పాండురంగారావు, డాక్టర్. ఎం.శ్రీనివాసులు,డాక్టర్ నాగరాజా రెడ్డి ,డాక్టర్ మహబూబ్ బాషా, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎన్నుకోబడ్డారు. ఈ విభాగానికి,నంద్యాల ఐఎంఏ కు కోఆర్డినేటర్ గా డాక్టర్ సుసుమ వ్యవహరిస్తారు ఈ సందర్భంగా నూతన అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ నంద్యాల శాఖ కార్యవర్గానికి ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి,డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ లక్ష్మీ సౌజన్య,డాక్టర్ వసుధ, డాక్టర్ హరిత అభినందనలు తెలిపారు అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ నంద్యాల శాఖ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డ డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ లలిత కుమారి మాట్లాడుతూ వైద్యులకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలు నిర్వహించి, వివిధ స్పెషాలిటీ విభాగాలలో వస్తున్న ఆధునిక వైద్య విధానాలు,నూతన పరికరాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.తద్వారా వైద్యులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్

ల్యాబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వన సమారాధన

అమలాపురంలో కొంకాపల్లి ఎత్తు రోడ్డులో కోనసీమ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్& రేడియోలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన ఆదివారం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముత్తా బత్తుల ప్రమోద్ కుమార్ మరియు సెక్రటరీ కాండ్రేగుల సోమేశ్ ఆధ్వర్యంలో ఈ వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మలేరియా అధికారి ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లా స్టాటిస్టికల్ అధికారి కె.వీరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ టెక్నీషియన్ తప్పనిసరిగా పారామెడికల్ బోర్డ్ లో రిజిస్టర్ అయి ఉండాలని అన్నారు. ఖచ్చితమైన ల్యాబ్ రిపోర్టు ఇవ్వాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ టెక్నీషియన్లు అందరు ఐక్యతగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ జి.చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ లు దాసం ప్రసాద్, జి.మొహన్ కృష్ణ, జి.రామస్వామి నాయుడు, జాయింట్ సెక్రెటరీ ఎం.సునీల్ శాస్త్రి, కో ట్రెజరర్ ఎం. శ్రీకృష్ణ, రాయుడు శంకర్ మరియు అసోసియేషన్ సభ్యులు, జిల్లాలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైసీపీ నేత బైరెడ్డి తో సీతారామపురం మండల వైసిపి యువత భేటీ

మాజీ రాష్ట్ర శాప్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అగ్ర నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తో ఆదివారం హైదరాబాదులోని ఆయన నివాసంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఊటుకూరు నాగార్జునతో కలిసి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ముందుగా బైరెడ్డి కి శాలువా కప్పి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా పాలగిరి ముద్దుకృష్ణమరాజు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువ నాయకుడు మేకపాటి అభినవ్ రెడ్డిల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ నిర్వహించబోయే సమావేశాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల ప్రణాళికల గురించి చర్చించామన్నారు. రాబోయే 2029 ఎన్నికలలో ఉదయగిరి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని భాగస్వామ్యం కావాలని, యువత ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనాలని కోరామన్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం, యువతలో ఉత్తేజం తీసుకొచ్చే అంశాలు అదేవిధంగా తదితర రాజకీయ అంశాలపై చర్చించామన్నారు. కార్యక్రమంలో మండల వైసీపీ యూత్ నాయకులు కప్ప ప్రదీప్, సురేంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

క్షత్రియ వనభోజన కార్యక్రమానికి రాజంపేటతరలి వెళ్లిన, రైల్వే కోడూరు క్షత్రియ సంఘం నాయకులు.

క్షత్రియ వనభోజన . అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నవంబర్ 09 ( పున్నమి న్యూస్ ప్రతినిధి/ సింగమాల వెంకటేష్ ) రాజంపేట డివిజన్ పొలపత్తూరులో టిడిపి రాజంపేట అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగే క్షత్రియ వనభోజన కార్యక్రమానికి రైల్వే కోడూరు క్షత్రియ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సంగరాజు రవికుమార్ రాజు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో, రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ సమీపాన ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, రాజంపేటకు వేలాదిగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రైల్వే కోడూరు నియోజకవర్గ క్షత్రియ సంఘం నాయకులు సంగ రాజకుమార్ రాజు మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన విప్లవ వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు దేశానికి గర్వకారకమని పేర్కొన్నారు. రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగే కార్తీక వనభోజన కార్యక్రమానికి రైల్వే కోడూరు నుంచి 2000 మందికి పైగా క్షత్రియులు రాష్ట్రం నాలుమూలల నుండి 20 నుండి 30,000 దాకా హాజరు కాబోతున్నారని క్షత్రియులమంతా ఒక తాటిపై నిలిచి జగన్మోహన్ రాజు నాయకత్వాన్ని బలపరుస్తామని క్షత్రియులమంతా ఐక్యంగా నిలబడి ముందుకు సాగుతామని తెలిపారు కార్యక్రమంలో పలువురు క్షత్రియ నాయకులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం 

రావులవలసలో కార్తీక దీపోత్సవం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం స్థానిక రావులవలస గ్రామంలో గల అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా కార్తీక దీపోత్సవం జరిగింది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం విశిష్టత,108 సంఖ్యా ప్రాముఖ్యత తదితర ముఖ్య అంశాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివ మాలధారులు, గ్రామ భక్త జనం, ఆలయ అర్చకులు, ధర్మకర్త తదితరులు పాల్గొన్నారు. Video: https://www.instagram.com/reel/DQ1vcJAEjCs/?igsh=MTFiZHZmdXN2M3UwMg==

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చింతారెడ్డిపాలెం ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం – నెల్లూరుకు శుభవార్త

మంత్రి నారాయణ గారి చొరవతో నెల్లూరు వాసుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. మంత్రి నారాయణ గారి చొరవతో నెల్లూరు సిటీలో ఫ్లైఓవర్ నిర్మాణానికి లభించిన ఆమోదం చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ వద్ద రూ. 121 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు, ప్రమాదాలు నివారించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం మంత్రి నారాయణ గారి చొరవతో నెల్లూరు ప్రజల సుదీర్ఘ కల సాకారం హర్షం వ్యక్తం చేస్తున్న నెల్లూరు ప్రజలు.

రంగారెడ్డి

* కౌండిన్య ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాలు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 09 : పవిత్ర కార్తీక మాసమును పురస్కరించుకొని వనస్థలిపురం కౌండిన్య ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆటో నగర్ జింకల పార్కులో కార్తీక మాస వన మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వనమహోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా బిఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ హాజరై కౌండిన్య కుటుంబ సభ్యులతొ సహాపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ యంపిపి లు ధనరాజ్ గౌడ్ అనంత రాజు గౌడ్ కౌండిన్య ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కాసానిసురేష్ గౌడ్ కూరెళ్ల వేములయ్య గౌడ్ రాఖీ గౌడ్ కొత్త మహేష్ గౌడ్ బొంగు వెంకటేష్ గౌడ్ నరేందర్ గౌడ్ యార్లగడ్డ వెంకటేశ్వర రావు శ్రీనివాస్ గౌడ్ రవీంద్ర బాబు రమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

ప్రతి మంగళవారం ఘనంగా పూల మాలలు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి 228వ వారం బహుజన ఆర్టిసి యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్

పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయులు రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ తార్నాక చింతల్ బస్తీలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం రోజున జ్ఞానమాల వేయడం జరిగింది ఇది 228వ వారం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా నేను మీకు కత్తులు ఇవ్వలేదు ఓటును మాత్రమే ఇచ్చాను ఈ ఓటు వల్ల మీ తలరాతలు మార్చుకోండి మీరు గౌరవంగా సూటు బూటు వేసుకొని అందరిలాగా ఉండాలని రిజర్వేషన్ వల్ల మీకు చదువు వచ్చింది ఉద్యోగాలు వచ్చినాయి ఈరోజు మీకు విలువలు పెరిగినయ్ కాబట్టి మీరు అదే సాయిలు ఇచ్చినటువంటి హక్కులని సద్వినియోగం చేసుకొని పాలకులు కావాలని కులాలకు మతాలకు దూరంగా ఉంటూ మనుషులంతా ఒకటే అనే భావన మనం ముందుకు తీసుకుపోతామని తెలియజేయడం జరిగింది యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్లు పరిస్థితి పెద్దలు ఎం రాజయ్య, ఎండి అప్సర్వై, టీ నర్సింగ్ రావు, టీ లక్ష్మణ్, బహుజన ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ తెలిపారు.

అన్నమయ్య

ఏపీ ఆర్‌డీసీ డైరెక్టర్‌గా గరికపాటి శివశంకర్ బాధ్యతలు స్వీకారం

-గన్నవరం జనసేన నేతకు అరుదైన గౌరవం – నియామకానికి అంకితభావమే కారణం: నేతలు చిట్వేల్, నవంబర్ 9: పున్నమి ప్రతినిధి గన్నవరం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ (ఆదివారం) ఉదయం ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. -వైభవంగా కార్యక్రమం: ఈ సందర్భంగా జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జ్ బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అభినందనలు కార్యక్రమంలో పాల్గొన్న అతిగారి కృష్ణ, జోగినేని మనీ, ఆనాల సునీల్ కుమార్ తదితర జనసేన నాయకులు శివశంకర్‌కు హార్దిక అభినందనలు తెలియజేశారు.నియామకానికి కారణంపార్టీ కార్యకలాపాల్లో గరికపాటి శివశంకర్ చూపిన అంకితభావ సామాజిక సేవ పట్ల నిబద్ధత, మరియు గ్రామీణాభివృద్ధిపట్ల ఆయనకున్న దృష్టి కారణంగానే ఈ నియామకం జరిగిందని నేతలు అభిప్రాయపడ్డారు. -అభివృద్ధిపై విశ్వాసం: గన్నవరం ప్రాంత అభివృద్ధి దిశగా శివశంకర్ కీలక పాత్ర పోషిస్తారనే విశ్వాసం స్థానిక నాయకులలో బలంగా వ్యక్తమైంది. జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగా, ఈ ఆత్మీయ వేడుక ఉత్సాహభరితంగా సాగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.