Sunday, 22 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

శ్రీ భువనేశ్వరి శ్యామలాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారిని దర్శించిన ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్

మూడవ కార్తీక సోమవారం శుభసందర్భంగా చిట్వేల్ పట్టణంలోని శ్రీ భువనేశ్వరి శ్యామలాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ మరియు భక్తుల ఆహ్వానం మేరకు ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన తీర్థప్రసాదాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు మరియు స్థానిక నాయకులు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

అన్నమయ్య

నక్కలపల్లిలో భక్తి పర్వం: మూడవ కార్తీక సోమవారం వైభవం

భవాని శంకర స్వామికి రుద్ర హోమం, విశేషాలంకరణ – ప్రధాన ఆకర్షణగా అన్నదాన కార్యక్రమం కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా నక్కలపల్లి గ్రామంలో వెలసిన ప్రసిద్ధ భవాని శంకర స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోయింది. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, విశేష అలంకరణలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్త జన సందోహంతో నిండిపోయది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి, స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఆలయ ఆర్చకులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పంచామృత స్నానం, లింగాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.ముఖ్యంగా, రుద్ర హోమం నిర్వహించడం ద్వారా భక్తి వాతావరణం పతాక స్థాయికి చేరింది.అనంతరం స్వామివారికి సింధూరంతో విశేషంగా అలంకరణ చేసి, సుగంధ పుష్పాలతో సత్కరించారు. భక్తులందరూ “ఓం నమశ్శివాయ”నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. సాయంత్రం వేళ ఆలయంలో దీపారాధన, శివ స్తోత్ర పారాయణం, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేయగా, స్థానిక దాతలు, సేవా సంస్థలు దానికి సహకరించాయి.ఈ కార్యక్రమంలో చంద్ర మౌళి ప్రత్యేక అతిథిగా హాజరై భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, “కార్తీక మాసం భక్తికి, సేవకు ప్రతీక. భవాని శంకర స్వామి కృపతో గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. గ్రామ యువకులు, మహిళా భక్తులు స్వచ్ఛందంగా పూనుకుని సేవా కార్యక్రమాలను నిర్వహించారు, ఇది వారి సేవాభావాన్ని చాటింది. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కార్తీక మాసం ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, గ్రామ పెద్దలు, యువతీ యువకులు కలిసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.మొత్తం మీద, భక్తుల భక్తి, సేవాభావం, స్వామివారి విశేష అలంకరణ ఈ అంశాలన్నీ కలసి నక్కలపల్లి గ్రామంలో మూడవ కార్తీక సోమవారం ఒక గొప్ప భక్తి పర్వంగా మారిపోయింది.

భద్రాద్రి కొత్తగూడెం

ఇసుక దందా కోసం కొత్త ఊరునే సృష్టించారు

మణుగూరు మండలంలో గుండ్ల సింగారం గ్రామం ఉందా లేని ఊరు పేరుతో అక్రమ ఇసుక రవాణా దందా దీని వెనుక ఏ రాజకీయ నాయకుని పాత్ర ఉంది పున్నమి ప్రతినిధి- భుక్యా వినోద్ కుమార్ 10-11-2025, మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుండ్ల సింగారం అనే యొక్క గ్రామం పేరుతో ఇసుక సొసైటీ లు చేసుకొని ఆదివాసీ సమాజాన్ని , ఏజన్సీ చట్టాలను మోసం చేస్తూ ఇసుక సొసైటీ లు ఎలా చేస్తున్నారు,దీని వెనుక కుట్ర దారులు, సూత్ర దారులు, కర్త, కర్మ, క్రియ ఏ సామాజిక వర్గానికి చెందినవారు, దీనిపై ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేయాలని మణుగూరు గ్రామవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు, మణుగూరు మండలం గుండ్ల సింగారం అనే గ్రామం 20 సంవత్సరాల క్రితమే సింగరేణి ఓసి ల క్రింద తీసుకొని ల్యాండ్ లుసర్స్ క్రింద ప్యాకేజీ కూడా ఇవ్వడం జరిగిందని. అయితే ఈ రోజు గుండ్ల సింగారం పేరుతో ఊరు లేని చోట ఊరి పేరు చెప్పుకొంటూ కొన్ని వేల క్యూబిక్ మీటర్ల భారీ యంత్రాలతో ఇసుకను డంపింగ్ చేస్తున్నారు, అసలు దానికి టీ.జి. ఎండిసి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చింది, 1996 అమైండ్మెంట్ యాక్ట్ 2011 పీసా చట్టం ప్రకారంగా ఆ గ్రామాన్ని సందర్శించారా, పీసా గ్రామ సభ పెట్టరా, కొన్ని అనుమానాలు కూడా మణుగూరు మండల ప్రజలకు వ్యక్తమవుతున్నాయి, ఇట్టి ఇసుక ర్యాంపు పై అధికారులు ఏ రకంగా గుడ్డిగా సంతకం పెట్టారు, మైనింగ్ , డి ఎల్ సి, ఎమ్మార్వో , ఇరిగేషన్ రకరకాల డిపార్ట్మెంట్ అధికారులు ఎలా సంతకాలు చేసి పర్మిషన్ లు ఇచ్చారు, గుండ్ల సింగారం ఊరు మాకు చూపించాలి అంటూ మణుగూరు చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధికారులకు హెచ్చరించారు.

-శ్రీ భవాని శంకర స్వామికి రుద్ర హోమం, విశేషాలంకరణ – ప్రధాన ఆకర్షణగా అన్నదాన కార్యక్రమం చిట్వేల్, నవంబర్ 10: పున్నమి ప్రతినిధి కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా నక్కలపల్లి గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ భవాని శంకర స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోయింది. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, విశేష అలంకరణలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్త జన సందోహంతో నిండిపోయింది. -పూజా కార్యక్రమాల వైభవం: తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి, స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఆలయ ఆర్చకులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పంచామృత స్నానం, లింగాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.ముఖ్యంగా, రుద్ర హోమం నిర్వహించడం ద్వారా భక్తి వాతావరణం పతాక స్థాయికి చేరింది.అనంతరం స్వామివారికి సింధూరంతో విశేషంగా అలంకరణ చేసి, సుగంధ పుష్పాలతో సత్కరించారు. భక్తులందరూ “ఓం నమశ్శివాయ”నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. -అన్నదానం – అతిథి గౌరవం: సాయంత్రం వేళ ఆలయంలో దీపారాధన, శివ స్తోత్ర పారాయణం, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేయగా, స్థానిక దాతలు, సేవా సంస్థలు దానికి సహకరించాయి.ఈ కార్యక్రమంలో శ్రీ చంద్ర మౌళి ప్రత్యేక అతిథిగా హాజరై భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, “కార్తీక మాసం భక్తికి, సేవకు ప్రతీక. భవాని శంకర స్వామి కృపతో గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. -సేవాభావం: గ్రామ యువకులు, మహిళా భక్తులు స్వచ్ఛందంగా పూనుకుని సేవా కార్యక్రమాలను నిర్వహించారు, ఇది వారి సేవాభావాన్ని చాటింది. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కార్తీక మాసం ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, గ్రామ పెద్దలు, యువతీ యువకులు కలిసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.మొత్తం మీద, భక్తుల భక్తి, సేవాభావం, స్వామివారి విశేష అలంకరణ ఈ అంశాలన్నీ కలసి నక్కలపల్లి గ్రామంలో మూడవ కార్తీక సోమవారం ఒక గొప్ప భక్తి పర్వంగా మారిపోయింది.

E-పేపర్

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ… ఈనెల 12వ తేదీ చేపట్టనున్న ప్రజా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా,వైసీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలను పిపిపివిధానంలో నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 12వ తేదీ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రజా ఉద్యమ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష, వైసిపి నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రజా ఉద్యమ ర్యాలీ యొక్క ఉద్దేశాలను, లక్ష్యాలను ఈ సందర్భంగా వైసీపీ నేతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష, వైసిపి నేతలు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ఆలోచనతో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ విధానంలో నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వైసిపి ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద , మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు , ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులను తీసుకువచ్చి తొలి దశలో ఐదు మెడికల్ కళాశాలలను దిగ్విజయంగా ప్రారంభించారన్నారు. ఈ మెడికల్ కళాశాలలు విజయవంతంగా మూడవ విద్యాసంవత్సరాన్ని కొనసాగిస్తున్నాయని, ఈ ఘనచరిత్ర వైఎస్ఆర్సిపి పార్టీ దేనిని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్మార్గపు దురుద్దేశపు ఆలోచనలతో మెడికల్ కళాశాలలను పిపిపి విధానంలో ప్రవేట్ చేసేందుకు చేస్తున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు పిలుపుమేరకు ఈనెల 12వ తేదీ నంద్యాలలోని ఉదయానంద రెసిడెన్సీ నుండి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమ ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఉన్నత అధికారులకు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రజా ఉద్యమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణను చేపడుతున్నామని తెలిపారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమ ఉద్దేశాలను రాష్ట్రపతికి తెలియజేయడం జరుగుతుంది పేర్కొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రజా ఉద్యమం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ రద్దు చేసేంతవరకు కొనసాగుతుందని పోరాటానికి ప్రజలు పూర్తి మద్దతును ఇవ్వాలని కోరారు. మెడికల్ కళాశాలల నిర్వహణను ప్రవేట్ యాజమాన్యం తీసుకుంటే వారు నష్టపోక తప్పదని హెచ్చరించారు. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా అధికారం చేపడుతుందని, పిపిపి విధానాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మి అమీర్, రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రెటరీ శశికళ రెడ్డి, వైసిపి గోస్పాడు మండల అధ్యక్షుడు పి పి రాజశేఖర్ రెడ్డి, నంద్యాల మండలం ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైసిపి జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడురసూల్ ఆజాద్, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు పివి రమణ, వైసిపి జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా సెక్రెటరీ దేవనగర్ భాష, జిల్లా సెక్రెటరీ శివ నాగిరెడ్డి, అసెంబ్లీ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు మనోజ్, కౌన్సిలర్స్ భాస్కర్, చంద్రశేఖర్ రెడ్డి, మేసా చంద్రశేఖర్, సర్పంచ్ కోటిరెడ్డి, వైసిపి నాయకులు జాకీర్ హుస్సేన్, సాయిరాం రెడ్డి, రత్నబాబు చౌదరి, సోహెల్ రానా, అభిబ్, శంకర్ రెడ్డి,తిమ్మరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు

అన్నమయ్య

అరుంధతి వాడ పాఠశాలను తనిఖీ చేసిన జనసేన నాయకులు కొట్టే శ్రీహరి

నందలూరు గత వారంలో నందలూరు అరుంధతి వాడలో పాఠశాల సర్పాలు నిలయమని దినపత్రికలో పచురితం అయినది.అందులో భాగంగా నందలూరు మండల జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు జనసైనికులు అరుంధతి వాడలోని పాఠశాలను తనిఖీ చేయడం జరిగినది.ఈ సందర్భంగా జనసేన నాయకులు కొట్టే శ్రీహరి మాట్లాడుతూ ఈ పాఠశాల ప్రహారి గోడ అన్నమయ్య వరదల్లో కొట్టుకోపోయింది అని గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పాఠశాలలోని సమస్యపై జనసేన నాయకులుగా మేము స్పదించం కాని‌ గత వైకాపా ప్రభుత్వం కాని అప్పటి వైకాపా నాయకులు కాని అస్సలు పట్టించుకొలేదు.కాని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజ ప్రభుత్వం అధికారంలో వుంది.ఇక్కడ పాఠశాల ప్రహరీ నిర్మాణం కొరకై సంబంధిత విద్యాశాఖ అధికారులతో మాట్లడతాం ఈ ప్రహరి గొడ నిర్మాణం జరిగేలా తమవంతు కృషి చేస్తామని అరుంధతి వాడలోని విద్యార్థుల తల్లిదండ్రులకు హామి‌ కొట్టే శ్రీ హరి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ ఉపేంద్ర జనసేన నాయకులు డాల,ఎద్దుల నరసింహ,భాస్కర్,హరి, నాగరాజు,రమేష్,సుధాకర్, తదితరులు జనసైనికులు యువకులు పాల్గొన్నారు

Blog

DCM inauguration on

https://www.youtube.com/post/UgkxwU1uGAwR2nnCdNGI7M7YtD0S8O-R8RsF?lc=UgynfDRXpNv6bhlyYRZ4AaABAg&si=GETzJEuUGW_xCDYW Video: https://www.youtube.com/post/UgkxwU1uGAwR2nnCdNGI7M7YtD0S8O-R8RsF?lc=UgynfDRXpNv6bhlyYRZ4AaABAg&si=GETzJEuUGW_xCDYW

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.