కామారెడ్డి
– ఆరు నెలలుసాగు సీజన్ దరిదాపుల్లోనే రైతు నిరాశ ముద్రణ ఆగింది, రైతు ఆగిపోయాడు పాస్‌బు క్ లేకపోవడంతో సాగు సీజన్ ఆపరాటం లోపాస్ బుక్ లేదు… పంట ఎక్కడ? ఆరు నెలల జాప్యం.. రైతులు రుణాలు లేక ఆకలి ఎదుర్కొంటున్నరు రిజిస్ట్రేషన్ పూర్తయినా ఆశ లేకపోతే పంటలు వదిలేయొద్దని రైతులు ఆందోళనలు కామారెడ్డి, నవంబర్ 10 (పున్నమి ప్రతినిధి): శ్రీమంతుడు వెండి పళ్లెంలో అన్నం తింటే, నిరుపే దలు స్టీల్ పాత్రల్లో తింటారు. కానీ రైతన్న మట్టిలో నే జీవనం సాగిస్తాడు. ఇప్పుడు ఆయనే పెంచిన భూమి పచ్చటి పంట ఇవ్వకముందే ప్రభుత్వం “పాస్‌బుక్ లేని రైతు”గా గమనిస్తోంది. భూమాత సిస్టమ్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయినా, వేలాది మంది రైతులకు ఇప్పటికీ పట్టాదారు పాస్‌బుక్‌లు అందని స్థితి నెలకొంది.గత ఆరు నెలలుగా ఈ సాంకేతిక ఆటంకం రైతు జీవనాధారాన్ని కుదిపేస్తోంది. ప్రతి నెలా వందల లావాదేవీలు పూర్తవుతున్నా, పాస్ బుక్ ముద్రణకి సంబంధించిన ఫైళ్లు హైదరాబా ద్‌లోని ముద్రణ కేంద్రాల్లో పేరుకుపోయాయి. రెవె న్యూ అధికారులు కొత్త పాస్‌బుక్ డిజైన్ డెవలప్ మెంట్ కారణంగా ఆలస్యం జరుగుతోందని చెబు తున్నారు. కానీ ఈ వివరణ రైతులకు ఉపశమనం ఇవ్వడంలేదు.“పట్టా పేర్లు స్క్రీన్‌లో కనిపిస్తున్నా యి కానీ చేతిలో పాస్‌బుక్ లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదు. విత్తనాలు కొనడానికి, నీటిపారుదలకి ఖర్చు తేలడం లేదు,” అని కామా రెడ్డికి చెందిన ఒక రైతు పొలంలో కూర్చుని ఆవే దన వ్యక్తం చేశాడు. మిగతా రైతులు కూడా “ఆరు నెలల వాయిదా చాలా ఎక్కువ కాలం. పాస్‌బుక్ లేకపోతే మన పంటలు కూడా నిలవవు” అంటూ నిరాశను వెల్లగక్కుతున్నారు.రైతు సంఘాలు ఇప్పటికే రెవెన్యూ, తపాలా కార్యాలయాల చుట్టు పాదయాత్రలు, ధర్నాలు ప్రారంభించాయి. “ముద్ర ణ సాంకేతికత పేరుతో రైతుల భవిష్యత్తు ఆగిపో వడం విచారం. ప్రభుత్వం వెంటనే తేలికత తీసుకో వాలి” అని రైతు సంఘం నాయకులు తెలిపారు. పాస్‌బుక్‌లు లేకపోవడం ప్రత్యక్షంగా రుణాల జారీపై ప్రభావం చూపుతోంది. రుణాలు లేకపోవ డం వల్ల విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయ లేకపోతున్నారు. దీనివల్ల రాబోయే పంట సీజన్ ఆలస్యమవుతోంది. వ్యవసాయ కార్యకలాపాలు దెబ్బతింటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిం టుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.“ఈ సమ స్యను ప్రభుత్వం ప్రాథమిక ప్రాధాన్యతగా తీసుకో వాలి. పాస్‌బుక్ జారీ ప్రాసెస్‌ను వేగవంతం చేయకుండా రైతు భరోసా కేవలం కాగితం మాటగా మిగిలిపోతుంది,” అని తహసీల్దారు కార్యాలయం ముందు ఆందోళన చేస్తామంటున్న రైతులు