Saturday, 21 March 2026

Blog

విశాఖపట్నం

విశాఖ సదస్సుకు 3,500 మందితో భారీ భద్రత.. వైసీపీ విష ప్రచారాన్ని సహించం: హోంమంత్రి అనిత

విశాఖ సదస్సుకు 3,500 మందితో భారీ భద్రత.. వైసీపీ విష ప్రచారాన్ని సహించం: హోంమంత్రి అనిత *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* విశాఖ పెట్టుబడుల సదస్సుకు కట్టుదిట్టమైన భద్రత సదస్సుపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ఉపేక్షించబోమన్న అనిత రాజకీయ ఉగ్రవాదం పైనా ప్రభుత్వం సీరియస్‌గా ఉందని వ్యాఖ్య విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. దాదాపు 3,500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రత విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడబోదని తేల్చిచెప్పారు. సదస్సుకు హాజరయ్యే ప్రతి వీఐపీ విమానాశ్రయంలో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వారి గమ్యస్థానాలకు చేరేంత వరకు పూర్తిస్థాయి రక్షణ కల్పించే బాధ్యతను పోలీసు శాఖ తీసుకుందని అనిత వివరించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి అప్రమత్తత ప్రకటించామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తీవ్రవాదంతో పాటు “రాజకీయ ఉగ్రవాదం” పైనా తమ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని మంత్రి అనిత వ్యాఖ్యానించారు. విశాఖ సదస్సుపై జగన్ బ్యాచ్ సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారాన్ని ఉపేక్షించేది లేదని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను కఠినంగా అణచివేస్తామన్నారు. గతంలో వలసలకు కేంద్రంగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు పెట్టుబడులతో వలస వచ్చేవారికి గమ్యస్థానంగా మారుతోందని మంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలు ఇప్పుడు తిరిగి వస్తున్నాయంటే దానికి “బ్రాండ్ సీబీఎన్”, మంత్రి నారా లోకేశ్ కృషి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పట్టుదలే కారణమని ఆమె కొనియాడారు. వారి సమష్టి కృషితోనే రాష్ట్రానికి మళ్లీ మంచిరోజులు వచ్చాయని తెలిపారు.

విశాఖపట్నం

చంద్రబాబు–లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కొత్త శకం ప్రారంభం*

*14, 15 తేదీల్లో జరగబోయే CII సదస్సు రాష్ట్ర ఆర్థిక దిశను మార్చబోతున్న చారిత్రాత్మక వేదిక* *చంద్రబాబు–లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కొత్త శకం ప్రారంభం* *2047 నాటికి విశాఖపట్నం – భారతదేశంలో నంబర్ వన్ ఐటీ హబ్‌గా అవతరించనుంది* *–రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు* *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి :* ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడుల కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగబోయే CII భాగస్వామ్య సదస్సు రాష్ట్ర ఆర్థిక దిశను మార్చబోతున్న చారిత్రాత్మక వేదికగా నిలవనుంది. పెట్టుబడుల ప్రవాహం, ఉపాధి అవకాశాల సృష్టి, పరిశ్రమల పునరుజ్జీవనం ఇవన్నీ చంద్రబాబు గారు విజన్, లోకేష్ గారి కృషి తోనే సాధ్యమవుతున్నాయి అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు తెలిపారు. *చంద్రబాబు దూరదృష్టి – లోకేష్ కృషితో పెట్టుబడుల వర్షం* 2014–19 మధ్య కాలంలో చంద్రబాబు గారి పాలనలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 5 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి లభించింది. అదే అభివృద్ధి శకం మళ్లీ ప్రారంభమైంది. కేవలం 17 నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. నిజమైన నాయకత్వం ఎలా ఉండాలో దేశానికి చూపించిన ఉదాహరణ అని ఆయన అన్నారు. మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఆయన శ్రమ, వ్యూహం వల్లే గూగుల్, టీసీఎస్, టాటా, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రపంచ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్నాయి అని పల్లా గారు వివరించారు. *2047 నాటికి విశాఖపట్నం – భారతదేశంలో నంబర్ వన్ ఐటీ హబ్‌గా అవతరించనుంది* ఈ వేగంతో అభివృద్ధి కొనసాగితే 2047 నాటికి విశాఖపట్నం భారతదేశంలోనే మొదటి స్థానం లో నిలుస్తుంది. ఏఐ, డేటా సెంటర్లు, ఐటీ, తయారీ రంగాల్లో విశాఖపట్నం ప్రపంచానికి కేంద్రంగా నిలవనుంది. ఇది చంద్రబాబు గారి విజన్, లోకేష్ గారి కృషి ఫలితం అని పల్లా గారు అన్నారు. గూగుల్ రూ.87,500 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తోంది. ఇది కేవలం ఒక పెట్టుబడి కాదు – ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు గేమ్ ఛేంజర్. గతంలో మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్కు తెచ్చిన చంద్రబాబు గారు ఇప్పుడు విశాఖను భారతదేశ ‘డిజిటల్ హబ్’గా తీర్చిదిద్దుతున్నారు. ‘సైబరాబాద్’ తర్వాత ఇది ‘సైబర్ విశాఖ’ శకం!” అని ఆయన అన్నారు. *పెట్టుబడిదారులను బెదిరించి, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం లో వైఎస్సార్సీపీ ముఠా* వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం నుంచి దాదాపు ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు పారిపోయాయి. పరిశ్రమలపై వేధింపులు, అధిక పన్నులు, రాజకీయ జోక్యాల వల్ల పెట్టుబడిదారులు వెనక్కు తగ్గారు. ఐదేళ్లలో ఒక్క కొత్త కంపెనీని కూడా రప్పించలేకపోయిన వారు, ఇప్పుడు పెట్టుబడులు వస్తుంటే కంపెనీలకు బెదిరింపు ఇమెయిల్లు పంపుతూ భయపెడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి భరించలేక పెట్టుబడులపై తప్పుడు ప్రచారం చేస్తూ, వాటిని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ దుష్టశక్తుల చర్యలను రాష్ట్ర ప్రజలే గట్టిగా తిప్పికొడతారు అని పల్లా శ్రీనివాసరావు గారు తీవ్రంగా విమర్శించారు. *కూటమి పాలనతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి జోరు* ఉత్తరాంధ్రను మళ్లీ అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కృషి చేస్తోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మెడికల్ డివైస్ పార్క్, ట్రైబల్ యూనివర్సిటీ, రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయి. టీసీఎస్ రూ.1,370 కోట్ల పెట్టుబడితో 12,000 ఉద్యోగాలు కల్పిస్తోంది. ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో అనకాపల్లిలో విస్తరణ చేపడుతోంది. గూగుల్, టాటా, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఇప్పటికే విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాయి అని ఆయన వివరించారు. చంద్రబాబు గారి దూరదృష్టి వల్ల ఆంధ్రప్రదేశ్ మరోసారి ప్రపంచ పెట్టుబడుల దృష్టిలో నిలిచింది. లోకేష్ గారి కృషి వల్ల యువతకు కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. స్థిరమైన పాలన, పారదర్శకత, సాంకేతికత ఆధారంగా నడుస్తున్న ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సంపాదించింది అని ఆయన అన్నారు.

విశాఖపట్నం

మెడికవర్ ఆసుపత్రిలో నొప్పిని సమర్ధవంతంగా ట్రీట్ చేసే విధానాలు లభ్యం.

మెడికవర్ ఆసుపత్రిలో నొప్పిని సమర్ధవంతంగా ట్రీట్ చేసే విధానాలు లభ్యం. *విశాఖ పట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:-* నగరంలోని మెడికవర్ ఆసుపత్రుల్లో నొప్పిని సమర్ధవంతంగా అదుపుచేసే చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సీనియర్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ కె.వి.డి.ప్రవీణ్ తెలిపారు. నగరంలోని అరిలోవ మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నొప్పి అనేది కేవలం శారీరక అసౌకర్యం మాత్రమే కాదని, అది మన మనసును, మన జీవనశైలిని పూర్తిగా ప్రభావితం చేసే సమస్యన్నారు. దీర్ఘకాలిక నొప్పి కారణంగా అనేక మంది తమ రోజువారీ పనులు, నిద్ర, కుటుంబ జీవితం అన్నీ కోల్పోతున్నా రన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ, నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా సరైన చికిత్స తీసుకోవాలనే సందేశంతో తాము ఆధునిక నొప్పి చికిత్సపై ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తున్నా మన్నారు. నొప్పి అనేది శరీరం పంపే హెచ్చరిక సంకేతమన్నారు. దాన్ని పట్టించుకోకపోతే అది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. సరైన వైద్య నిపుణుడిని సంప్రదిస్తే మళ్లీ సాధారణ జీవితాన్ని సులభంగానే పొందవచ్చన్నారు. పెయిన్ ఫిజీషియన్లు కేవలం మందులు మాత్రమే కాకుండా, నొప్పి మూలకారణాన్ని గుర్తించి, దానిని శాశ్వతంగా తగ్గించే ఆధునిక చికిత్సలు అందిస్తా రన్నారు. నడుం నొప్పి, ఆర్థరైటిస్, డయాబెటిక్ న్యూరోపతి, క్యాన్సర్ అనంతర నొప్పులు తదితర సమస్యలకు ప్రత్యేక చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయన్నారు. తమ మెడికవర్ ఆసుపత్రిలో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, నర్వ్ బ్లాక్స్, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్లు, టెండన్ బోటాక్స్ ఇంజెక్షన్లు తదితర ఆధునిక పద్ధతుల ద్వారా నొప్పిని సమూలంగా తగ్గించడం సాధ్యమన్నారు. సుమారు 80 శాతం నొప్పులను సరైన నిపుణులచే చికిత్స చేస్తే పూర్తిగా నియంత్రించ వచ్చన్నారు. నొప్పిలేని జీవితం కల కాదని, అది ప్రతి ఒక్కరి హక్కని అన్నారు. మూడు నెలలకంటే ఎక్కువ కాలం నొప్పి కొనసాగితే లేదా రోజువారీ పనుల్లో ఆటంకం కలిగిస్తే, వెంటనే పెయిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించా లన్నారు. ఈ మీడియా సమావేశంలో మెడికవర్ సెంటర్ హెడ్ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ కిషోర్, డాక్టర్ సృజన, డాక్టర్ రోజాలిన్, డాక్టర్ ఇంగే తదితర వైద్యులు పాల్గొన్నారు.

Blog

చిన్నారి ప్రాణం కాపాడిన జర్నలిస్టు సీఎం నాగేంద్ర

నంద్యాల పట్టణంలోని చెరువు కట్ట వద్ద గురువారం సాయంత్రం సంభవించిన ఘటన ఒక చిన్నారి ప్రాణాన్ని తృటిలో కాపాడింది. సకాలంలో స్పందించిన జర్నలిస్టు జాగ్రత్తతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే, స్థానిక చెరువు కట్టదగ్గర ముగ్గురు చిన్న పిల్లలు (సుమారు 5-6 ఏళ్ల వయసు) ఆటపాటలతో స్నానానికి దిగారు. కొద్ది సేపటికే ఇద్దరు పిల్లలు అక్కడి నుంచి వెళ్లిపోయి, ఒక బాలుడు ఒంటరిగా నీటిలో మిగిలిపోయాడు. ఆ సమయాన అటుగా వెళ్తున్న ‘న్యాయం’ పత్రిక రిపోర్టర్ సీఎం నాగేంద్ర బాలుడి పరిస్థితిని గమనించారు. వెంటనే బాలుడి వద్దకు చేరుకుని అతన్ని బయటకు తెచ్చి సురక్షిత స్థలానికి తరలించారు. నీటిలో తడిసి వణుకుతున్న చిన్నారిని గమనించిన నాగేంద్ర, సమీపంలో ఉన్న వారి స్నేహితులను పిలిపించి బట్టలు తెప్పించి ఆ బాలుడికి వేసి చల్లబడకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం వెంటనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే కానిస్టేబుల్ నాగన్న అక్కడికి చేరుకుని బాలుణ్ణి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్రమత్తంగా వ్యవహరించిన జర్నలిస్టు నాగేంద్ర తక్షణ ప్రతిస్పందనతో ఒక ప్రాణం రక్షించబడింది. ఈ ఘటన తల్లిదండ్రులకు మరొకసారి హెచ్చరికగా నిలిచింది. చిన్నారులను నీటిప్రాంతాల్లో లేదా రోడ్ల వద్ద ఒంటరిగా విడిచిపెట్టడం ప్రమాదకరమని అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం క్షణాల్లో సత్తువను తెగదెంపు చేయగలదని ఈ ఘటన స్పష్టంగా చాటి చెబుతోంది

విశాఖపట్నం

విశాఖపట్నంలో రహేజా ఐటీ స్పేస్ , లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు

విశాఖపట్నంలో రహేజా ఐటీ స్పేస్ , లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా మార్చే ప్రయత్నాల్లో…విశాఖ రియల్ఎస్టేట్ రంగానికి మరో దిగ్గజం తనదైన ముద్ర వేయనుంది. విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్స్‌లో K రహేజా కార్ప్ సంస్థ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ₹2,172 కోట్ల పెట్టుబడితో 27.1 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ మిక్స్డ్-యూజ్ ప్రాజెక్ట్, విశాఖను దేశంలోని తదుపరి పెద్ద టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 28.65 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రేడ్-A ఆఫీస్ స్పేస్‌లు, ప్రీమియం లగ్జరీ రెసిడెన్షియల్ యూనిట్లు, ప్రపంచస్థాయి సౌకర్యాలతో రూపొందిస్తారు. మధురవాడ ఐటీ SEZ హిల్ నెంబర్-3లో 15.51 ఎకరాలు కమర్షియల్ స్పేస్‌కు, మిగిలిన 11.59 ఎకరాలు రెసిడెన్షియల్‌కు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ గూగుల్ AI హబ్, TCS, కాగ్నిజెంట్, అక్సెంచర్ వంటి ఐటీ జెయింట్లు విశాఖలో పెరుగుతున్న డిమాండ్‌ ను తీర్చడానికి రూపొందించారు. విశాఖలో నాలుగు మేజర్ ఐటీ కంపెనీలు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తున్నార. WTC 7.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో యెండాడలో నిర్మిస్తున్నారు ఈ అన్ని ప్రాజెక్టులు విశాఖను భారతదేశంలోని తదుపరి ఐటీ హబ్‌గా మార్చడంలో కీలకమైనవి. విశాఖ రియల్ ఎస్టేట్ రంగం మరిన్ని దిగ్గజ సంస్థలను ఆకర్షించే అవకాశం ఉంది.

విశాఖపట్నం

పక్క రాష్ట్రాల్లో గూగుల్ ప్రకంపనలు: గంటా సరదా వ్యాఖ్య*

*పక్క రాష్ట్రాల్లో గూగుల్ ప్రకంపనలు: గంటా సరదా వ్యాఖ్య* _విశాఖపట్నం, నవంబర్ పున్నమి ప్రతినిధి:-_ విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ఖరారు చేయడం పొరుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రుషికొండ ఐటీ సెజ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఐటీలో ప్రముఖ స్థానంలో ఉన్న కర్ణాటకను.. గూగుల్ సీఈవో సుందర్ పిచ్చయ్ సొంత రాష్ట్రమైన తమిళనాడును కాదని రూ.1.3 లక్షల కోట్ల డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కావడం పట్ల దేశ వ్యాప్త చర్చ జరుగుతోందని చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో గూగుల్ డేటా సెంటర్ ప్రతిపక్షాలకు ప్రధానాంశం కానుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ ను ఖరారు చేయించి విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన సీఎం చంద్రబాబుకు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనుభవమున్న విజనరీ లీడర్ కు.. యువ నాయకత్వం తోడవడంతో జెట్ స్పీడ్ వేగంతో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో మటన్ మాల్స్, ఫిష్ సెంటర్లు, పచ్చళ్ల వ్యాలీలు, మామిడి తాండ్ర జోన్లు, అప్పడాల హబ్ లు, మసాల ఉత్పత్తుల కారిడార్ లు ఏర్పాటు చేస్తే.. 16 నెలల కూటమి హయాంలో గూగుల్, క్వాంటమ్ వ్యాలీ, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, సిఫీ వంటి అంతర్జాతీయ సంస్థలను తెచ్చామని పేర్కొన్నారు. అసమర్థ పరిపాలనకు.. సమర్ధమైన నాయకత్వానికి మధ్య తేడా ప్రజలు గమనించాలని కోరారు. విశాఖలో ఏర్పాటు కానున్న ఐటీ సంస్థలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించి.. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు లోకేష్ సూచించారన్నారు. సీఐఐ సమ్మిట్ లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగడం చరిత్రగా అభివర్ణించారు.

E-పేపర్

కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు , కష్టపడిన వారికి టీడీపీలో సముచిత స్థానం మండల , క్లస్టర్ ,యూనిట్ , గ్రామ బూతు కమిటీల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల … తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి పార్టీలో ఎల్లప్పుడూ సముచితమైన గుర్తింపు లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. నంద్యాల నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు మరియు మాజీ కౌన్సిలర్ మిద్దె చిన్న ఉసేని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఇటీవల టీడీపీ అధికారం లోకి రావడానికి పార్టీ అమలు చేసిన CUB (క్లస్టర్, యూనిట్, బూత్) వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. “క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ వ్యవస్థ చాలా బాగా పని చేసిందని. పార్టీ కోసం రోజువారీగా కష్టపడిన నిజమైన యోధులు ఈరోజు ఇక్కడ ప్రమాణస్వీకారం చేస్తున్నారని. ఇది కేవలం పదవి కాదు, పార్టీ పట్ల వారి నిబద్ధతకు దక్కిన గౌరవం” అని అన్నారు . పదవులు దక్కిన వారికే కాకుండా, పదవులు రాని కార్యకర్తలకు కూడా మంత్రి కీలక సందేశం అందించారు. “ఎవరికి పదవులు వచ్చినా, రాకపోయినా ఎవరూ నిరాశ పడకూడదని . పార్టీలో అందరూ సమానమే. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. మనందరి లక్ష్యం ఒకటే—రాష్ట్రాభివృద్ధి మరియు పార్టీ బలోపేతం” అని ఆయన అన్నారు. ప్రతి కార్యకర్త సహకారం పార్టీకి అత్యంత ముఖ్యమని తెలిపారు . అలాగే కార్యకర్తలందరూ తమ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి, రాబోయే ఎన్నికల కోసం సన్నద్ధం కావాలని మంత్రి ఫరూక్ సూచించారు. “మన ముందున్న తక్షణ లక్ష్యం రాబోయే స్థానిక ఎన్నికలన్నారు . టౌన్ మరియు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్‌లో మన అభ్యర్థులను గెలిపించడానికి అందరూ కలసికట్టుగా, సమన్వయంతో కృషి చేయాలని. స్థానిక ఎన్నికల్లో మన విజయం, భవిష్యత్తులో పార్టీకి మరింత బలాన్నిస్తుంది” అని దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నూతనంగా ఎన్నికైన మండల, క్లస్టర్, యూనిట్ మరియు బూత్ కమిటీ సభ్యుల చేత పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తామని ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ , మాజీ జెడ్పి వైస్ చైర్మన్ కొట్టాల శివ నాగిరెడ్డి , టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్ , ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు నంద్యాల పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్ , నంద్యాల మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి , గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి , నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్ , గోస్పాడు సొసైటీ చైర్మన్ వీర సింహారెడ్డి , కౌన్సిలర్ నాగార్జున , టిడిపి సీనియర్ నాయకులు బాలిశ్వర్ రెడ్డి మరియు నంద్యాల నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ మరియు యువ టీడీపీ నాయకులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

*రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రివర్యులు, జనసేన పార్టీ PAC ఛైర్మన్ గౌరవ పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విశాఖ విమానాశ్రయం కు విచ్చేసిన సందర్భంగా జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో గౌరవ మంత్రివర్యులు కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యే లు, వివిధ నియోజవర్గ ఇన్చార్జి లు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లు, ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్ లు, జిల్లా నాయకులు, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లు , మాజీ కార్పొరేటర్ లు ,వార్డ్ అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, వీర మహిళలకు, పార్టీ కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

రాష్ట్ర గవర్నర్ కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన నగర మేయర్

రాష్ట్ర గవర్నర్ కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన నగర మేయర్ విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ వేదికగా నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ కు విచ్చేసిన సందర్భంగా విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఆయనకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు

Blog

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈరోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ వేదిక ద్వారా పలువురు తమ సమస్యలను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మంత్రివర్యులు ఫరూక్ స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఆయన తక్షణమే ఆయా సమస్యలకు సంబంధించిన శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.