Thursday, 19 March 2026

Blog

విశాఖపట్నం

కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం

సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ విశాఖపట్నం బురుజుపేటలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు శనివారంతో ప్రారంభమయ్యాయి. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని, గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపంలో మార్గశిర మాస పూజను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు, “కోరిన కోరికలు తీర్చే అమ్మవారి వేడుకను ప్రారంభించే అవకాశం దక్కడం నా పూర్వ జన్మ సుకృతం” అని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉందని, ప్రత్యేకించి పోలి పాడ్యమి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారని తెలిపారు. మార్గశిర మాసోత్సవాల కాలంలో దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో అదనపు ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని అన్నారు. అమ్మవారి అనుగ్రహం విశాఖపట్నం నగరంతో పాటు మొత్తం రాష్ట్ర ప్రజలపై ఉండాలని, అందరూ సుఖశాంతులతో, సకల ఐశ్వర్యాలతో ఉండాలని ప్రర్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి, ఏఈఓ ఆనంద్, రాజేంద్ర, ఈఈ రమణ మరియు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ప్రత్యేక సేవలు – భక్తుల కోసం ఆహ్వానం

శ్రీ శ్రీ శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో నవంబర్ 22, 2025 (శనివారం)న ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు. ఉదయం 5.30 గంటలకు స్వామివారికి సుప్రభాతం సేవ నిర్వహించబడుతుంది. అనంతరం 8.30 గంటలకు స్వామివారికి అర్చన కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 12.00 గంటలకు అన్నదాన భవనంలో అన్నదానం ఏర్పాటు చేయబడినది. సాయంత్రం 6.45 గంటలకు ప్రారంభమయ్యే విశేష హారతి రాత్రి 8.15 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి దయాకటాక్షాలు పొందాలని కార్యనిర్వాహణాధికారి తెలియజేశారు.

E-పేపర్

బేస్ బాల్ రాష్ట్ర జట్టుకు ఎంపికైన ఎస్.వి. కళాశాల విద్యార్థిని సాహితి

బేస్ బాల్ రాష్ట్ర జట్టుకు ఎంపికైన ఎస్.వి. కళాశాల విద్యార్థిని సాహితి రైల్వే కోడూరు పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు ఎస్వీ కళాశాలలో రెండవ సంవత్సరం బైపీసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని యు.సాహితి రాష్ట్ర బేస్ బాల్ జట్టుకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ ఎన్ శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోడూరులో ఈనెల 15, 16, 17 తేదీలలో రైల్వే కోడూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బేస్ బాల్ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని యు.సాహితి జనవరి మొదటి వారం ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటుందని ఎస్వీ జూని యర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఎన్. శ్రీనివాసులు, డైరెక్టర్ ఎస్.వసుంధర అండ్ పిఇటి పుల్లారావు తెలియజేశారు.

కామారెడ్డి

ఇసుక మాఫియాపై కఠిన చర్యలు… తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత లాగాల ప్రసాద్ డిమాండ్

రామారెడ్డి, నవంబర్ 21: రామారెడ్డి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లాగాల ప్రసాద్ మాట్లాడుతూ ఇసుక మాఫియాపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ పేరిట ఇసుక మాఫియా విచ్చలవిడిగా కొనసాగుతుందని, ఈ క్రమంలో కొందరు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ పేరును వాడుతూ, పార్టీ ఇమేజ్‌కి మచ్చ తెస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని కాపాడే బదులు, తమ వ్యక్తిగత లాభాల కోసం వర్గాలు సృష్టిస్తూ పార్టీకి నష్టం కలిగించే చర్యలు కొందరు నేతలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.ఇలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీరియస్‌గా పరిగణిం చాలని, వెంటనే విచారణ జరిపి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లాగాల ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రజలు, కార్యకర్తలు మదన్ మోహన్ నాయకత్వానికి అండగా నిలవాలని కోరుతూ “జై మదన్ అన్న – జై కాంగ్రెస్” నినాదాలు నినదించారు.

తెలంగాణ

భారత ఆహార సంస్థ డివిజన్ కార్యాలయాన్నీ ప్రారంభించిన : కేంద్రమంత్రి

నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి ) ఆహార భద్రతలో భాగంగా దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతినెల ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇస్తున్నట్టు కేంద్ర ఆహార పౌరసరఫరాలు, వినియోదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోవిడ్ విపత్తులో ఏ ఒక్కరు ఆకలితో చనిపోకూడదన్న ఉద్దేశంతో ఆహారభద్రత కింద పేదలందరికీ ఐదు కిలోలు చొప్పున 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నామని ఇది 2030 వరకు కొనసాగించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పేదలకు ప్రతి నెల 5 కిలోల బియ్యం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల నివేదికలో భారత దేశంలో అత్యంత ఎక్కువమందికి ఆహారభద్రత కింద ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్న విషయాన్ని పేర్కొన్నట్టు వెల్లడించారు. ధాన్యం సేకరణ పై కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రెండు కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని సేకరిస్తున్నామని, ప్రస్తుతం 915 లక్షల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం దేశంలో ఉందని, తెలంగాణతో కలిపి 2023 –24 సంవత్సరంలో 2.25 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతులకు ఖాతాలలో జమ చేసిందని తెలిపారు. ప్రతినెల తెలంగాణకు 1.11 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయిస్తున్నామని, ఒక లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3370 మెట్రిక్ టన్నుల గోధుమలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రత వ్యవస్థను పటిష్టం చేసేందుకు రేషన్ కార్డులు అన్నిటిని డిజిటలైట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అన్నమయ్య

నక్కలపల్లి శివాలయాన్ని దర్శించుకున్న జర్నలిస్టులు

చిట్వేల్ మండలంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ భవాని శంకర స్వామి వారి దేవస్థానం (శివాలయం) లో ఈరోజు పలువురు జర్నలిస్టులు స్వామి వారిని దర్శించుకున్నారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శివాలయాన్ని సందర్శించిన మీడియా ప్రతినిధులకు ఆలయ కమిటీ తరపున స్వాగతం లభించింది. జర్నలిస్టులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో కొంత సమయం గడిపిన జర్నలిస్టులు, ఆలయ అభివృద్ధి, కార్తీక మాసంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడారు. -సన్మానం కార్యక్రమం ఆలయ దర్శనం అనంతరం జర్నలిస్టులందరికీ ప్రత్యేక సన్మానం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రముఖుడు మద్దిన చంద్రమోహన్ నాయుడు ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో నిరంతరం కష్టపడుతూ, ప్రజలకు సత్యాలను తెలియజేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని చంద్రమోహన్ నాయుడు అన్నారు. ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మీడియా మిత్రులు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అనంతరం జర్నలిస్టులందరికీ శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదమును మద్దిన చంద్రమోహన్ నాయుడు స్వయంగా అందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోరుతూ చిట్వేల్‌లో ధర్నా

వేతనాలు, ప్రమోషన్లు, అదనపు పనుల భారం వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిట్వేల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల వీఆర్ఏలు గౌరవ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ, పని భారం ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో పోరాడి సాధించుకున్న డి.ఎ 300 రూపాయలను కూడా రికవరీ చేయడం వీఆర్ఏలపై భారమయ్యిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా వేతనాలు పెరగకపోవడం, వీఆర్ఏల అనేక సమస్యలు పెండింగ్‌లో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నైట్‌డ్యూటీలు, రీసర్వే వంటి అదనపు పనులు చేయించుకుంటూ రెవెన్యూ అధికారులు వీఆర్ఏలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. నెలకు వచ్చే రూ.10,500లోనే పెట్రోల్, భోజనం ఖర్చులు పెట్టి పని చేయాల్సి వస్తోందని చెప్పారు. తెలంగాణ మాదిరి పే స్కేల్ అమలు చేయాలని, వీఆర్వో, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, డ్రైవర్ పోస్టులకు వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 20 శాతం ప్రమోషన్ కోటాను 70 శాతానికి పెంచాలని కోరారు. మదనపల్లి డివిజన్‌లో వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇచ్చి రాజంపేట డివిజన్‌లో అమలు చేయకపోవడం సరికాదన్నారు. సబ్‌కలెక్టర్ ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదని గుర్తించారు. నామినీగా పనిచేస్తున్నవారిని రెగ్యులర్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. వీఆర్ఏ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరముట్ల సుధాకర్ మాట్లాడుతూ, పార్ట్‌టైమ్ వేతనంతో ఫుల్‌టైమ్ పని చేయించడం అన్యాయమని, అదన పనులకు తగిన వేతనం ఇవ్వాలని కోరారు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడం, అర్హులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంది కాళ్ల మణి, మల్లారపు గురయ్య, బి. సుబ్బరాయుడు, సంగటి, శంకర్, జె. రమణ, జి. నరేష్, మదన్ మోహన్, రామయ్య, పి. సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. తరువాత సంఘ ప్రతినిధులు తహసీల్దార్ స్పందనకు వినతి పత్రం అందజేశారు.

ఆంధ్రప్రదేశ్

కుష్టు వ్యాధి గుర్తింపుపై చిట్వేల్‌ కేజీబీవీ విద్యార్థినులకు అవగాహన

రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఆధ్వర్యంలో, మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో లెప్రసీ (కుష్టు) గుర్తింపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల అధ్యక్షురాలు జే. తులసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పీహెచ్‌సీ వైద్య అధికారి డాక్టర్ అన్సారీ మార్గదర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులకు కుష్టు వ్యాధి యొక్క లక్షణాలు, నివారణ చర్యలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూలంకషంగా వివరించారు. …లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు వైద్య సిబ్బంది విద్యార్థినులతో మాట్లాడుతూ, చర్మంపై స్పర్శలకు స్పందించని తెల్లటి మచ్చలు, చేతులు – కాళ్లలో కొరికినట్లు ఉండే పోడాలు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కుష్టు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని వారు తెలిపారు. అదనంగా, విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా వాతావరణం మారుతున్న నేపథ్యంలో చలికాలంలో తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలను తెలియజేశారు. చివరిగా, విద్యార్థినులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్న పక్షంలో వెంటనే పీహెచ్‌సీకి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తులసికి పీహెచ్‌సీ వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్య అధికారి డాక్టర్ అన్సారీ, కేజీబీవీ ప్రిన్సిపాల్ జే. తులసి, మండల ప్రజారోగ్య విభాగం అధికారి విజయ్‌కుమార్‌, ధనలక్ష్మి, ప్రజారోగ్య నర్స్‌ విజయకుమారి, ఆరోగ్య పర్యవేక్షకుడు ఇస్మాయిల్ బాషా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

గ్రామాల పరిశుభ్రత – పచ్చదనంపై దృష్టి పెట్టాలి: ట్రైనర్ రమేష్‌బాబు

గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్య రక్షణలో పరిశుభ్రత అత్యంత కీలకమని శ్రీకాళహస్తి ట్రైనింగ్ సెంటర్ రిసోర్స్ పర్సన్ కే. రమేష్‌బాబు అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ‘థీమ్ – 5 పచ్చదనం, పరిశుభ్రత’ పై చిట్వేల్ ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాసులు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ – ప్రతి గ్రామపంచాయతీ చెత్త రహితంగా, శుభ్రతతో ఉండేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలు బహిరంగ మలవిసర్జన పూర్తిగా మానుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. “స్వాతంత్ర పోరాటం కన్నా సంపూర్ణ పారిశుద్ధ్యం మిన్న” అన్న మహాత్మా గాంధీ మాటలు ప్రతి పంచాయతీ ప్రతినిధి గుర్తుంచుకోవాల్సినవని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే తడి చెత్త – పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, వాటిని హరిత రాయబారుల ద్వారా “చెత్త నుంచి సంపద” కేంద్రాలకు తరలించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పచ్చదనం, మొక్కల సంరక్షణ, పారిశుద్ధ్య చర్యలు గ్రామాల ఆరోగ్య పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తాయని వివరించారు. పల్లెలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందగలరని రమేష్‌బాబు పేర్కొన్నారు. అన్ని గ్రామపంచాయతీలు పరిశుభ్రతపై నిరంతరం పని చేయడం ద్వారానే శాశ్వత అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో నస్రీన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గిరిధర్, సర్పంచులు ఈశ్వరయ్య, బాలసుబ్రమణ్యం, ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అడ్డతీగల: కొనలోవ సచివాలయాన్ని సందర్శించిన ఎంపీడీఓ

అడ్డతీగల మండలం, కొనలోవ సచివాలయాన్ని ఎంపీడీఓ ఏవివి కుమార్ గురువారం సందర్శించారు. ఈ మేరకు సిబ్బందికి సచివాలయంలో నిర్వహించవలసిన రిజిస్టర్లు, సచివాలయ ఆవరణలో ప్రదర్శించవలసిన బేనర్ల గురించి సూచించారు. అనంతరం గ్రామ అంగన్వాడీని, ప్రాధమిక పాఠశాలను సందర్శించి మెనూ ప్రకారం ఆహార పదార్ధాలు పిల్లలకు అందించాలని ఎంపీడీఓ తెలిపారు. సబ్ సెంటర్ ను పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏఎన్ఎమ్ కు చెప్పారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.