Thursday, 19 March 2026

Blog

E-పేపర్

రైతులు తాగుబోతులు ! తాగొచ్చి.. నా కాన్వాయ్‌కి అడ్డు పడతారా ? అంటూ రైతులపై రెచ్చిపోయిన మంత్రి సీతక్క

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 రైతులు తాగుబోతులు ! తాగొచ్చి.. నా కాన్వాయ్‌కి అడ్డు పడతారా ? అంటూ రైతులపై రెచ్చిపోయిన మంత్రి సీతక్క బోనస్‌ ఇవ్వాలని, పంట కొనుగోళ్లు చేయాలని అడిగిన పాపానికి రైతులపై అక్రమ కేసులు మంత్రి సీతక్క కాన్వాయ్‌ను రామారెడ్డి కొనుగోలు కేంద్రం వద్ద అడ్డుకున్న రైతులు సకాలంలో బోనస్‌, రైతు భరోసా ఇవ్వాలని, పంట కొనుగోళ్లు చేయాలని రైతుల విన్నపం సమస్యలు వివరిస్తున్న రైతులపై ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క అసలు మీరంతా రైతులేనా ? తాగి వచ్చారా ? అంటూ పోలీసులతో రైతులపై దాడి మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుల నిరసన

E-పేపర్

విజయోత్సవాలు సరే ..గ్యారంటీల జాడేది ? కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలపై భగ్గుమంటున్న తెలంగాణ ప్రజలు

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 విజయోత్సవాలు సరే ..గ్యారంటీల జాడేది ? కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలపై భగ్గుమంటున్న తెలంగాణ ప్రజలు మహాలక్ష్మి ఫ్రీ బస్సు మినహా ఇంత వరకు పూర్తిగా నెరవేరని ఆరు గ్యారంటీలు అరకొరగా కూడా అందని రూ. 500 సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఆసరా పెన్షన్లు రూ. 4000కు ఎప్పుడు పెంచుతారని నిలదీస్తున్న వృద్ధులు తులం బంగారం, రూ. 2500 ఆర్థిక సహాయంపై మండిపడుతున్న మహిళలు రైతులకు మూడు దఫాలు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిన రేవంత్ సర్కారు బోనస్ పేరిట బోగస్ మాటలు, రెండు దఫాలు బోనస్ పైసలు పెండింగ్ ఎరువుల కొరతతో క్యూ లైన్‌లోనే ప్రాణాలు పోయే స్థితికి వచ్చిన రైతన్నలు రెండేళ్లుగా కాలేజీలకు రూ.10,000కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్

విశాఖపట్నం

విశాఖలో మూడోవా ఉద్యోగ మేళా.

(పున్నమి ప్రతినిధి విశాఖ జిల్లా తేదీ 22-11-2025) *ఈ నేల 21 తేదీ విశాఖలో మల్కాపురం మరిడిమాంబ కళ్యాణ మండపం, మల్కాపురం నందు నిర్వహించడం జరిగింది. 25 పైగా కంపెనీలు 800 పైగా ఖాళీలు నిరుద్యోగులకి ఒకా మాంచి ఉద్యోగ అవకాశమ్ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులు భారీగా రావటంతో మద్యనం భోజనం వసతి కూడా కలిపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, విశాఖ వెస్ట్ నియోజకవర్గం ఎం ఎల్ ఎ గణబాబు ఆద్వర్యంలో ఈ ఒక ఉద్యోగమేలా నిర్వహించడం జరిగింది.

అన్నమయ్య

గ్రామీణ ఉపాధిపై ఉన్నత స్థాయి సమీక్ష

-ఖాదీ గ్రామోద్యోగ్‌పై స్పెషల్ సీఎస్ సిసోడియా దృష్టి – సీబీఎన్ విజన్ గ్రూప్స్‌పై చర్చ చిట్వేల్, నవంబర్ 21 పున్నమి ప్రతినిధి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధి, ఉద్యోగాల కల్పన కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ కమిషనర్ ఆర్.పి. సిసోడియా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.మంగళగిరి, ఎర్రబాలెంలో ఉన్న ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ (కేజీఎంవీ)కార్యాలయంలో ఏపీ ఖాదీ & గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కె.కె. చౌదరి కలిసి ఆయన ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు. -ముఖ్యాంశాలపై సమీక్ష గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతో పలు ముఖ్యాంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ప్రధానంగా కింది అంశాలపై సమీక్ష జరిగింది స్వయం ఉపాధి కల్పన గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు. సబ్సిడీ రుణాలు గ్రామీణ పరిశ్రమల కోసం అందించే సబ్సిడీ రుణాలు, లబ్ధిదారులకు వాటిని మరింత వేగంగా చేరవేయడంపై చర్చ.పీఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ అమలు తీరు, లక్ష్యాల సాధనపై సమీక్ష.సీబీఎన్ విజన్ గ్రూప్స్ ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయం (కేజీఎంవీ) ద్వారా నూతనంగా ప్రారంభించబోతున్న సీబీఎన్ విజన్ గ్రూప్స్ యొక్క కార్యక్రమాలపై, వాటి అమలు వ్యూహాలపై ప్రత్యేకంగా చర్చించారు. -అధికారుల భాగస్వామ్యం ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ సిసోడియా పాటు ఏపీ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు సీఈవో కట్టా సింహాచలం (ఐఏఎస్) పాల్గొన్నారు. అలాగే, ఏపీ ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ (కేజీఎంవీ) ప్రిన్సిపాల్ మరియు ఎఫ్‌ఏ&సీఏఓ రవి కుమార్, డిప్యూటీ డైరెక్టర్ వి. రమేష్ బాబుమరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని క్షేత్రస్థాయి నివేదికలను సమర్పించారు. గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అధికారులు చైర్మన్‌కు హామీ ఇచ్చారు.

రంగారెడ్డి

*త్రాగునీరు సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోండి – ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 21 : మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జలపల్లి మున్సిపాలిటీ, తుక్కుగూడ మున్సిపాలిటీ, పరిధిలో త్రాగునీటి సరఫరా సమస్యలపై హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవలి కొన్ని రోజులుగా పలు కాలనీల్లో త్రాగునీరు అనుకున్న స్థాయిలో అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే చర్యలు తీసుకొని తక్షణమే ఆయా ప్రాంతాలకు త్రాగునీరు అందించాలని ఆమె ఆదేశించారు. ప్రజలకు నిరంతరంగా సరిపడినంత మంచి నీరు అందించేందుకు అదనపు పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. నీటి సరఫరాను మరింత బలోపేతం చేసి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఎస్ టి పి పనులకు కూడా ఆరా తీశారు ఎమ్మెల్యే స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో హెచ్ఎండబ్ల్యూఎస్ డైరెక్టర్ సుదర్శన్, సుజాత, చీఫ్ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ నిసార్ అహ్మద్, సిజిఎం సంతోష్ కుమార్, కోడి, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్, మణికొండ శ్రీనివాస్ రెడ్డి సిజిఎం తదితర అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

రేపటి నుంచి సాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రారంభం*

నాగార్జున సాగర్-శ్రీశైలం మధ్య లాంచ్ సర్వీసులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పెద్దలకు టికెట్ రేట్లు ఒకవైపు ప్రయాణానికి రూ. 2,000, రెండు వైపులా ప్రయాణానికైతే రూ.3,250గా టికెట్ రేట్లు ఖరారు చేశారు. పిల్లలకు(5-10) వన్ వే అయితే రూ.1,600, రెండు వైపులా ప్రయాణానికి రూ.2,600గా నిర్ణయించారు. టికెట్ బుకింగ్ కోసం https://tgtdc.in/home వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

E-పేపర్

సిఐని సన్మానించిన బిజెపి మండలాధ్యక్షుడు సాయం శ్రీధర్ బిజెపి నాయకులు

సిఐని సన్మానించిన బిజెపి మండలాధ్యక్షుడు సాయం శ్రీధర్ బిజెపి నాయకులు రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా భాద్యతలు స్వీకరించిన సి-చంద్రశేఖర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సాయం శ్రీధర్ మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ తోట శ్రీనివాసులు , స్టేట్ కౌన్సిల్ మెంబర్ వాకచర్ల సుబ్బారావు,మండల ప్రధాన కార్యదర్శి కుప్పాల కిరణ్,సొషల్ మిడియా కన్వీనర్ కుంభకోణం సాయి ఆచారి, మాజీ మండల ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య, మరియు బాబు ఆచారి, మహిళా నాయకురాలు శ్రీమతి కుప్పాల జ్యోతి మరియు మరికొందరు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని, నూతన CI గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

కడప

సొంత నిదులతో ఏర్పాటు చేసిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్ ప్రారంభం..

మైదుకూరు పట్టణంలో MLA పుట్టా సుధాకర్ యాదవ్ గారి సొంత నిదులతో ఏర్పాటు చేసిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్ ప్రారంభం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 77 CC కెమెరాలు పట్టణంలో ఏర్పాటు .. మైదుకూరు డి.ఎస్.పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్’ ను ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మైదుకూరు ఎం.ఎల్.ఏ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు, కర్నూల్ రేంజ్ డి.ఐ.జి శ్రీ డా.కోయ ప్రవీణ్ ఐ.పి.ఎస్ గారు, జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐ.పి.ఎస్ గారు పట్టణంలో నిరంతరం నిఘా ఉంచేందుకు, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు, దొంగతనాలు, ఈవ్ టీజింగ్, తదితర నేరాల కట్టడిలో కీలక పాత్ర పోషించనున్న ‘పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్’.. పట్టణంలో ఏర్పాటు చేసిన 77 సి.సి కెమెరాలు సెంటర్ కు అనుసంధానం.. ఈ సందర్బంగా కర్నూలు రేంజ్ డి.ఐ.జి శ్రీ డా. కోయ ప్రవీణ్ ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ టెక్నాలజీ వాడడంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నదన్నారు. డిపార్ట్మెంట్ నినాదం “ఇన్విసిబుల్ పోలీస్ – విసిబుల్ పోలీసింగ్” అంటే పోలీస్ కనిపించకున్న తన డ్యూటీ కనిపిస్తే చాలు అని ఆ విధంగా కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుండి పట్టణం మొత్తాన్ని డేగ కళ్ళతో పహారా కాస్తుంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన 20 లక్షల నిధులను తన కష్టార్జితాన్ని కేటాయించి పోలీస్ డిపార్ట్మెంట్ కు సహకరించినందుకు గౌరవ శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల పనితీరును గమనించి ఈ మొత్తం కార్యక్రమాన్ని దగ్గరుండి పూర్తి చేసిన డిఎస్పీ రాజేంద్రనాథ్, పట్టణ సి ఐ కె. రమణారెడ్డి, ఎస్సై చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖకు మౌళిక వసతుల కల్పనలో కొన్ని పరిమితులు పరిధులు వుంటాయని అటువంటప్పుడు గౌరవ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ లాంటి వారు విధి నిర్వహణకు అవరమయ్యే వాటిని సమకూర్చడం గొప్ప విషయమని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం తమ ఉన్నతాధికారి కర్నూల్ రేంజ్ DIG శ్రీ డా. కోయ ప్రవీణ్ ఐ.పి.ఎస్ గారి చేతులమీదుగా జరగడం అందులో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక శాసనసభ్యుల గురించి జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రజల భద్రత పట్ల బాధ్యత తీసుకుని పోలీస్ సిబ్బందికి విధుల నిర్వహణలో ఒక అజేయ అస్త్రం లా ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటుకు సాయం చేయడం….పోలీస్ శాఖకు నేరస్థుల ఆట కట్టించడానికి అదనపు శక్తి ఇచ్చినట్లే అని పేర్కొన్నారు. సెంటర్ ఏర్పాటుకు పోలీస్ శాఖకు సహకరించి స్వంత నిధులు సమకూర్చిన మైదుకూరు ఎం.ఎల్.ఏ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారితో పాటు కర్నూలు రేంజ్ డి.ఐ.జి శ్రీ డా.కోయ ప్రవీణ్ ఐ.పి.ఎస్ గారిని, జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐ.పి.ఎస్ గారిని, అడిషనల్ ఎస్.పి (అడ్మిన్) శ్రీ కె.ప్రకాష్ బాబు గారిని, మైదుకూరు మునిసిపల్ కమిషనర్ రంగ స్వామి గారిని డి.ఎస్.పి శ్రీ జి.రాజేంద్రప్రసాద్ గారు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందచేశారు. కార్యక్రమంలో మైదుకూరు సబ్ డివిజన్ లోని సి.ఐలు, ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కడప

హ్యాపీ బర్త్డే ఎం ఏల్ ఏ గారు ….

జన్మదిన శుభాకాంశాలు మా మైదుకూరు నియోజకవర్గ టీడీపీ శాసన సభ సభ్యులు బి . సి ముద్దు బిడ్డ , ఎక్స్ టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ గారు .

విశాఖపట్నం

శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం

విశాఖపట్నం: నవంబర్ 21, 2025 పోలిపాడ్యమి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం కొండ దిగువన గల పవిత్ర వరాహ పుష్కరిణిలో. ​పవిత్రమైన పోలిపాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని, వరాహ పుష్కరిణిలో భక్తులు మరియు స్థానిక గ్రామస్తులచే దీపాల వెలిగింపు కార్యక్రమం అంబరాన్నంటింది. తెల్లవారుజాము నుండే భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో అధిక సంఖ్యలో పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. ముఖ్యంగా మహిళలు, ఉత్సాహంగా తమ వెంట తెచ్చుకున్న దీపాలను, మొక్కుబడులను చెల్లించుకుంటూ, పవిత్ర పుష్కరిణి నదిలో వదిలారు. ​ ​భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, దేవస్థానం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ​ పుష్కరిణి చెరువు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు బారికేడింగ్‌ ఏర్పాటు చేయబడింది. ప్రత్యేకంగా ఈతగాళ్ళ కమ్యూనిటీ గార్డులు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. వరాహ పుష్కరిణి మార్గంలో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ, భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.