Thursday, 19 March 2026

Blog

అన్నమయ్య

గుంజునేరులో మహిళ మృతదేహం లభ్యం

చిట్వేల్‌ సమీపంలో కలకలం – నాలుగు రోజుల క్రితం మృతి జరిగి ఉండవచ్చని పోలీసుల అనుమానం చిట్వేల్‌, నవంబర్ 22: పున్నమి ప్రతినిధి చిట్వేల్ పట్టణానికి సమీపంలో ఉన్న గుంజునేరు వాగులో శనివారం ఉదయం ఒక మహిళ మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది.ఉదయం వాగు వైపు వెళ్లిన స్థానికులు నీటిలో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు.మృతదేహం పరిస్థితిని బట్టి చూస్తే, సుమారు నాలుగు రోజుల క్రితమే మహిళ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈమె ఆత్మహత్యకు పాల్పడిందా, ప్రమాదవశాత్తు జారిపడిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి వివరాలు, మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు.

గూడూరు

షటిల్ బ్యాట్మెంటన్ కప్పు గెలుచుకున్న ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాల విద్యార్థినిలు

స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు బి. ముని లక్ష్మి థర్డ్ బిఎస్సి మరియు బి శ్రావణి థర్డ్ బిఎస్సి ఇటీవల జవహర్ భారతి డిగ్రీ కళాశాల కావలిలో జరిగిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల ఆటల పోటీలలో రన్నర్ అప్ కప్పు గెలుచుకొని విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణ రాజు మరియు అధ్యాపక సిబ్బంది విద్యార్థినిలను అభినందించారు.

E-పేపర్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.

అన్నమయ్య జిల్లా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. నేటి నుండి అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్ లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వెంటనే రద్దు చేయాలని ఏఐటియుసి జాతీయ కౌన్సిల్ పిలుపులో భాగంగా ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఓబులవారిపల్లిమండలం మంగంపేట లో ఏఐటీయూసీ కార్మికసంఘాల తో నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ మాట్లాడుతూ కార్మికులకు తీవ్ర నష్టం కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్ (2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ (2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక వర్గం గత ఆ ఐదు సంవత్సరాల నుంచి అలుపెరిగిన పోరాటాలు సాగిస్తున్న, కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం సరైనది కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్పొరేట్ యాజమాన్యాలు చెప్పింది వేదం కానున్నది. కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక హక్కులపై కోతపడుతుంది. మహిళా కార్మికులను నైట్ షిఫ్ట్ లు పని చేయించడం వల్ల వారికి భద్రత కరువు అవుతుంది. పని గంటల పెంపు వల్ల ఇండస్ట్రీలలో కర్మాగారంలో పనిచేసే కార్మికులు తీవ్ర అలసటకు గురై, అనారోగ్యానికి గురి అవుతారు. ఈ లేబర్ కోడ్లు అమలువైతే కార్మికుల జీవితాలు, జీవనోపాధి ని చంపేయడమే అవుతుంది. కార్పొరేట్లు, పెట్టుబడిదారుల చేతుల్లోకి కార్మిక వ్యవస్థ వెళుతుంది. అందుకని ఈ నాలుగు లేపల కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ త్రివేణి కార్మిక సంఘం అధ్యక్షులు నాగరాజు కోశాధికారి వరప్రసాద్ పూర్ణ కుమార్ రాజు కార్మికులు పెంచలయ్య రమణ భాష వెంకటరమణ చిన్నయ్య సుబ్రహ్మణ్యం రెడ్డయ్య రామకృష్ణ, నరసింహమూర్తి, రవి, వెంకటేశ్వరరావు, శ్రీను, రాహుల్, ప చంటి, శ్రీనివాసరావు, నారాయణ, కృష్ణ, ,తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామనీ ప్రభుత్వాలకు హెచ్చరిక చేశారు మాదరాజు గంగాధర్ ఏఐటియుసి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు చేరువ—మార్చిలో నోటిఫికేషన్ అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగం పెంచుకుంటోంది. ఫిబ్రవరి నెలాఖరుకే రిజర్వేషన్ల పనిని పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తవుతే, మార్చి నెలలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుందని సమాచారం. తదనంతరం ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి మరింతగా పెరిగే అవకాశముంది.

నారాయణపేట

డిసెంబర్ 1వ తేదీన మక్తల్ నియోజక వర్గం లో సీఎం పర్యటన

మక్తల్ నియోజకవర్గంలో డిసెంబర్ ఒకటవ తేదీన సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,మరియు ఉన్నత అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి గారు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం పర్యటనలో ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా ఇబ్బందులు కలవకుండా సజావుగా జరిగేలా విజయవంతం చేయాలని కలెక్టర్ మరియు ఎస్పీలకు ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

*అయ్యప్ప పడిపూజాకార్యక్రమం ఘనంగా* *లింగాలపాడు గ్రామంలో భక్తుల ఉత్సాహం*

నందిగామ మండలం లింగాల పాడు గ్రామంలో శుక్రవారం జరిగిన అయ్యప్ప పడిపూజా కార్యక్రమం భక్తులతో కళకళ లాడింది. గ్రామంలోని శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో, వైఎస్సార్సీపీ నాయకులు పారుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది అయ్యప్ప మాలధారులు పాల్గొని భజనలతో భక్తిరసాన్ని పంచారు. ముఖ్య అతిథిగా హాజరైన నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పూజల్లో పాల్గొని,తీర్థప్రసాదాలు స్వీకరించారు. అయ్యప్పస్వామి కటాక్షం సర్వభక్తులపైనిలవాలని కోరుకున్నారు. దీక్షా స్వాములు నియమనిష్టలతో చేసే పూజలు ఫలించాలని ఆయ‌న అయ్యప్పను వేడుకున్నారు. అయ్యప్ప మాలధారులను భక్తిపరవశంలో ముంచెత్తుతూ గజ్జల శ్రీను స్వామి అందించిన భజనపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ నాయకులు పారుపల్లి హరిబాబు మరియు అయ్యప్ప పీఠం స్వాములు ఈ కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధగా నిర్వహించారు. కార్యక్రమం కన్నులపండువగా సాగింది.

E-పేపర్

కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వై ఎస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి

కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వై ఎస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు:మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రాఘవరాజపురం గ్రామపంచాయతీ హరిజనవాడ నందు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైష్ ఎంపీపీ రామిరెడ్డి ద్వాజారెడ్డి. ఈ కార్యక్రమం లో రాఘవరాజుపురం సర్పంచ్ ఆర్వి రమణ,వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు రమేష్ బాబు , జడ్పీటీసీ రత్నమ్మ, సిద్దయ్య,మాజీ మార్కెట్ చైర్మన్ సుబ్బరామరాజు , సర్పంచులు హరికృష్ణ రెడ్డి, రామకృష్ణ , గోపి, దార్ల చంద్రశేఖర్,ఎంపీటీసీలు మహేశ్వర్ రెడ్డి, ,లత, ప్రతాప్ రెడ్డి, కొప్పల శంకరయ్య , ఇరగబోయిన నాగేశ్వరరావు, భూంపల్లి నాగరాజు, కృష్ణ రెడ్డి,బత్తల సుబ్రహ్మణ్యం, మాజీ సర్పంచ్ శంకర్ రెడ్డి, రాజారావు, బత్తల మని,షఫీ , శ్రీనివాసులు రెడ్డి, అనిల్ రెడ్డి,శ్రీరాములు, మహేష్,మని యాదవ్ , మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు:మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రాఘవరాజపురం గ్రామపంచాయతీ హరిజనవాడ నందు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైష్ ఎంపీపీ రామిరెడ్డి ద్వాజారెడ్డి. ఈ కార్యక్రమం లో రాఘవరాజుపురం సర్పంచ్ ఆర్వి రమణ,వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు రమేష్ బాబు , జడ్పీటీసీ రత్నమ్మ, సిద్దయ్య,మాజీ మార్కెట్ చైర్మన్ సుబ్బరామరాజు , సర్పంచులు హరికృష్ణ రెడ్డి, రామకృష్ణ , గోపి, దార్ల చంద్రశేఖర్,ఎంపీటీసీలు మహేశ్వర్ రెడ్డి, ,లత, ప్రతాప్ రెడ్డి, కొప్పల శంకరయ్య , ఇరగబోయిన నాగేశ్వరరావు, భూంపల్లి నాగరాజు, కృష్ణ రెడ్డి,బత్తల సుబ్రహ్మణ్యం, మాజీ సర్పంచ్ శంకర్ రెడ్డి, రాజారావు, బత్తల మని,షఫీ , శ్రీనివాసులు రెడ్డి, అనిల్ రెడ్డి,శ్రీరాములు, మహేష్,మని యాదవ్ , మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

Featured

బోలా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

బోలా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ రైల్వే కోడూరు పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు అంకమ్మ నగర్ కు చెందిన నాగరాజ,జ్యోతి లా కుమార్తే షానవిక పుట్టినా రోజు సందర్బంగా ఎవరైనా నిరుపేదలుఉంటె మావంతు సహాయ సహకారలు అందిస్తమణి మా బోలా శంకర్ సేవా సమితి ని కోరగా మేము మా సమస్త ద్వార శ్రీనివాసనగర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మస్తానమ్మ అన్నేనిరూపెద మహిళాకు నాగరాజ జ్యోతి వారి కుమార్త్ ద్వారా భోలా శంకర్ సేవా సమితి అధ్యక్షడు. మండల నాగేంద్ర ద్వార నిత్య అవసరసరుకులు మరియు బియ్యము మస్తానమ్మకు గొప్ప మనసుతో పంపిని చెయ్యడం జరిగింది.అలాగే శానవిక కు పుట్టినరోజు శుభాకాంక్షలు తేలియాచేస్తుఆబోలా శంకరుడు మంచి విద్యను ప్రసాధించలని కోరుకుంటుఅలాగే వారి కుటుంబనికి ఆ బోలా శంకర్ ని ఆస్విసులు యెల్లా వేలలా ఉండాల్ని కోరుకుంటున్నాము, ఈకార్యక్రమములో పాలగొన్నవారు భోళా శంకర్ సేవా సమితి సభ్యులు, చెన్నం శెట్టి .రమేష్ బాబు,వాస.బాబు, భూంపల్లి.నాగరాజు,కోపల.శంకరయ్య,పెనుకొండ.సుబ్బరాయుడు,చింతకాయల, నరసింహులు శేఖర్, బాబ్జీ, కె.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

అదురు లక్ష్మి నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు సనిసెట్టి నవీన్ కుమార్ రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్. అద్యక్షుడు..

అదురు లక్ష్మి నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు సనిసెట్టి నవీన్ కుమార్ రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్. అద్యక్షుడు.. రైల్వే కోడూరు పున్నమి ప్రతినిధి మాకు అత్యంత ఆప్తులు ఆర్యవైశ్య సీనియర్ నాయకులు శ్రీ వాసవీ కోదండరామస్వామి ఆర్యవైశ్య నిత్య అన్నసత్రం ఒంటిమిట్ట ఉప అద్యక్షుడు మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్రస్మృతి పరిరక్షణ అన్నమయ్య జిల్లా మాజీ అద్యక్షులు శ్రీ అదురు లక్ష్మి నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సనిసెట్టి నవీన్ కుమార్ రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్. అద్యక్షుడు.. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ వాణిజ్య విభాగం.

కడప

CC రోడ్డు పనులకు భూమి పూజ

*CC రోడ్డు పనులకు భూమి పూజ చేసిన మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి గారు,మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు,,* *ప్రొద్దుటూరు మండలం లోని గోపరం పంచాయతీ పరిధి లోని గోకుల్ నగర్ నందు MGNREGS నిధులు 20 లక్షల వ్యయంతో CC రోడ్డు పనులకు భూమి పూజ చేసిన మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు , నరసింహులు యాదవ్ గారు, యువ నాయకుడు బచ్చల వీర ప్రతాప్ గారు ,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారు* *ఈ కార్యక్రమలో మాజీ ఎంపీటీసీ ఓబులరెడ్డి, కుళ్ళు శ్రీను, ధోడియం సుబ్బా రెడ్డి, ఈశ్వరరెడ్డి , తిరుమల రెడ్డి, సునీల్, అల్తాఫ్,కాలే, D.గంగ సుధాకర్ యాదవ్,కొండయ్య,ఆదిరెడ్డి, వెంకట రాముడు, ఓబులేష్ ధనుంజయ ఆచారి,పెండేకంటి ఆచారి, నక్కల దీన్నే సుబ్బారెడ్డి, ధనియాల్, కృష్ణ రెడ్డి, రవి శంకర్ రెడ్డి, అంగడి శ్రీను,సుబ్బారావు శెట్టి , మధు, సిమెంట్ చంద్ర,టీడీపీ నాయకులు, కార్యకర్త స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.