Thursday, 19 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

*ఘనంగా ప్రారంభమైన జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు*

*డాక్టర్ యశస్వీ రమణకు సత్కారం* *విజయవాడ : మల్లె తీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మల పల్లి కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు జరిగే జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కలిమి శ్రీ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏడాది కాలం పదవీ బాధ్యతలను పూర్తి చేసుకున్న రచయితడాక్టర్ రమణ యశస్విని ముఖ్య అతిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు గోళ్ళ నారాయణ రావు, శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ , కలెక్టర్ లక్ష్మి షా , నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ, డాక్టర్ ఇండ్ల రామ ,సుబ్బా రెడ్డి, ఆకాశవాణి డైరెక్టర్ కృష్ణ కుమారి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర్ రెడ్డి, ఏపీ సృజనాత్మక సీఈఓ ఆర్. మల్లికార్జున రావు, చిన్ని నారాయణ రావు, రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీ.వీ పూర్ణచంద్, సీనియర్ జర్నలిస్టులు నిమ్మరాజు చలపతి రావు, యేమినేని వెంకట రమణ, ఘంటా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.*

కడప

ప్రొద్దుటూరులో కిడ్నాప్ కలకలం

కడప జిల్లా పొద్దుటూరు మండలం లో గల తనికంటి జ్యువెలర్స్ అధినేత తనికంటి శ్రీనివాసులు అనే వ్యక్తిని తన భార్య స్కూటీపై వెళ్తుండగా ప్రొద్దుటూరు సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి ఒక కేసు విచారణ నిమిత్తమై తీసుకెళ్తున్నామని ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్కు రావాలని అతని భార్యకు చెప్పి కిడ్నాప్ చేశారు సదరు మహిళ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్లగా అక్కడ అటువంటి వారు ఎవరూ లేరని చెప్పగా ఆమె మిగతా పోలీస్ స్టేషన్లన్నీ తిరిగి ఎక్కడ తన భర్త కనిపించకపోవడంతో కన్నీటి పర్యంతమయింది తన భర్త కనిపించడం లేదని చెప్పినా కూడా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని వాపోతోంది వెంటనే తన భర్త ఆచూకీ తెలపాలని కోరుతోంది

మహబూబ్ నగర్

*ఎన్ఎంఎంఎస్ పరీక్షకు వెళుతున్న విద్యార్థులను అభినందిస్తున్న ఎమ్మెల్యే

*విద్యార్థులను అభినందిస్తున్న ఎమ్మెల్యే* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 22 /11 /2025* *మహబూబ్నగర్ ఫస్ట్ అనే కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ మరియు జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా స్థానిక ఎమ్మెల్యే తన సొంత నిధులతో విద్యా హబ్బుగా పాలమూరు మహబూబ్నగర్ జిల్లాలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని నిర్వాహకులు అభినందించారు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రేపు జరగబోయే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షల్లో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన విద్యార్థులకు రావాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రవీందర్ సార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా మెలగాలని అప్పుడే ఇలాంటి శిక్షణ కార్యక్రమాల్లో విజయవంతమవుతాయని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, నిర్వాహకులు రవీందర్ రెడ్డి ,ఎంఈఓ మంజుల దేవి మరియు ఉపాధ్యాయ బృందం ఎమ్ ఎన్ విజయకుమార్, చాంద్ పాషా తదితరులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు*

మహబూబ్ నగర్

*ఎన్ఎంఎంఎస్ పరీక్షకు వెళుతున్న విద్యార్థులను అభినందిస్తున్న ఎమ్మెల్యే

*విద్యార్థులను అభినందిస్తున్న ఎమ్మెల్యే* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 22 /11 /2025* *మహబూబ్నగర్ ఫస్ట్ అనే కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ మరియు జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా స్థానిక ఎమ్మెల్యే తన సొంత నిధులతో విద్యా హబ్బుగా పాలమూరు మహబూబ్నగర్ జిల్లాలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని నిర్వాహకులు అభినందించారు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రేపు జరగబోయే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షల్లో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన విద్యార్థులకు రావాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రవీందర్ సార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా మెలగాలని అప్పుడే ఇలాంటి శిక్షణ కార్యక్రమాల్లో విజయవంతమవుతాయని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, నిర్వాహకులు రవీందర్ రెడ్డి ,ఎంఈఓ మంజుల దేవి మరియు ఉపాధ్యాయ బృందం ఎమ్ ఎన్ విజయకుమార్, చాంద్ పాషా తదితరులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు*

కడప

ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గా:వీఎస్ ముక్తియార్

పొద్దుటూరు టిడిపి సీనియర్ నాయకులు వి ఎస్ ముక్తియర్ గారికి. వరదరాజుల రెడ్డి గారి ఆశీస్సులతో ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గా పదవి ఇచ్చారు. 💐✌️

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో పచ్చదనానికి పలుకరింపు టెర్రస్ గార్డెన్స్‌ పరిశీలించిన ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య

నందిగామ పట్టణంలో పచ్చదనాన్ని ప్రోత్సహించేం దుకు ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్స్‌ను శనివారం ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. పట్టణం 15వ మరియు 16వ వార్డుల్లో ఏర్పాటు చేసిన ఈ తోటలను మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు ఎన్డీయే కూటమి నేతలతో కలిసి ఆమె పరిశీలించారు. ఇంటింటా ఏర్పడుతున్న టెర్రస్ గార్డెన్స్ పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంటి పైకప్పులపై చిన్నతరహా తోటలు ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన కూరగాయ లను సాగుచేసుకోవడంతో పాటు పట్టణాల్లో వాతావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద టెర్రస్ గార్డెన్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 15వ వార్డు కు చెందిన షేక్ షకీరా అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. పచ్చదనం పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని వార్డుల్లో కూడా విస్తరించేలా చర్యలు తీసుకోవా లని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కామారెడ్డి

కొనుగోలు ప్రక్రయ సకాలంలో జరగాలి – సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి

కామారెడ్డి, 22 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం వరి కొనుగోలు కేంద్రం సందర్శన కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామ్మోహన్ , సొసైటీ చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి, వైస్ చైర్మన్ పశుపతి, ఇతర సిబ్బంది సమకూరారు. వెనుకబడిన లారీల కారణంగా ధాన్య సరఫరాకు అడ్డంకులు తలెత్త కుండా, డీసీవో స్పందించి సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌ ను వెంటనే లారీల పంపిణీకి ఫోన్ చేశారు. ఈ చర్య రైతులకోసం వరి కొనుగోలును వేగవంతం చేయడానికి ఉపకరిస్తుందని అధికారులు తెలిపా రు.ఈ అంశం మీద స్థానిక ఆరోపణలు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం రైతుల నియ మిత కొనుగోలును సులభతరం చేస్తుంది అని తెలిపారు.

నారాయణపేట

జాబ్ క్యాలెండర్ ఒసేది

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ సంవత్సరంనర అవుతున్న ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులతో చలగాటమాడుతుందని కృష్ణ మండలం వీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మ్యకల్ భీమ్ ఆరోపించారు, నిన్నటికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పి ఏడాది అవుతున్న ఇంకా జాబ్ క్యాలెండర్ ఉసే లేకుండా పోయింది అన్నారు, ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని అన్నారు.

కామారెడ్డి

రామారెడ్డిలో గొడవ – స్థానికులపై కేసు నమోదు

కామారెడ్డి, 23 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో చోటుచేసుకున్న గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. రామారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ భీమ వరం పోలీసులు మద్దికుంట గ్రామానికి చెందిన రమేష్‌ను అదుపులోకి తీసుకుని రామారెడ్డి పోలీ స్ స్టేషన్ కు తరలిస్తుండగా, గ్రామస్థులు వారిని వెంబడించి రామారెడ్డి పోలి స్టేషన్ వద్ద వాగ్వాదా నికి దిగారు.వాగ్వాదం తీవ్రరూపం దాల్చి పోలీసు ల విధులకు ఆటంకం ఏర్పడటంతో, రామారెడ్డి పోలీస్‌లు మద్దికుంట పది మంది గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపా రు.ఈ ఘటనతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరి స్థితులు నెలకొన్నాయి. పోలీస్ భద్రతను బలోపే తం చేసినట్లు వివరించారు.

విశాఖపట్నం

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి*

*రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *నక్కపల్లిలో 69వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల స్కూల్ గేమ్స్ ప్రారంభించిన హోం మంత్రి అనిత* నక్కపల్లిలో అండర్–19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజులపాటు బాల, బాలికల జట్ల మధ్య ఆసక్తికర పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం మంత్రి అనిత విద్యార్థులను పరిచయం చేసుకుని వారి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల ఆకర్షణీయ నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆటలు జీవితంలో ఒక ముఖ్య భాగమని మంత్రి అనిత పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెడతున్నారని, మార్కులు ముఖ్యంకాదని, క్రీడలు ముఖ్యం అని ఆమె స్పష్టం చేశారు. ఉమెన్ క్రికెట్‌కు పెరుగుతున్న గుర్తింపును ప్రశంసిస్తూ, బాలికలకు క్రికెటర్ చరణ్ శ్రీ ఆదర్శమని పేర్కొన్నారు. నక్కపల్లిలోనే 40–50 మంది హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని తెలిపారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలను ప్రోత్సహించడంలో మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. ఆటల్లో గెలుపు–ఓటములు సహజమని, క్రీడల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరూ విజేతలే అని అన్నారు. Ncc, Nss కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. త్వరలో నక్కపల్లిలో హాకీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.